సాఫ్ట్ వేర్ ఇంజనీర్

spm_a0168ఆ మధ్య ఇంటికి వెళ్ళినప్పుడు, ఏవైనా పుస్తకాలు కొందామని విశాలాంధ్రకి వెళ్ళా..  అన్ని ర్యాకులు వరుసగా చూస్తూ వస్తున్నా.. అటు విశ్వనాధుల వారికి, ఇటు శ్రీశ్రీ కి మధ్యలో చిక్కుకుని కళ్ళు మిటకరించి చూస్తోంది ఈ పుస్తకం.. మొదట శీర్షిక చూడగానే, ఆ ఏముంది మన (సాఫ్ట్ వేర్ ఇంజనీర్ల) జీవితాల గురించి వెటకారం గా వ్రాసి ఉంటారు అని అనుకుంటూ ప్రక్కన పెట్టేయబోయా. ఎందుకో ఒక్కసారి వెనక్కి త్రిప్పి చూశా.. కొంచెం చదవాలనిపించేదిలా ఉంటుందనిపించింది.. సరే ఎలా ఉందో చూద్దాం, అదీనూ తక్కువలోనే లభిస్తోంది అని తీసుకున్నా.. ఇదీ ఈ పుస్తకానికి వెనక జరిగిన కధా-కమామిషున్నూ..

అమెరికా – The Land Of Opportunities  ఈ పదం వింటేనే, ఎక్కడలేని ఉత్సాహం, ఉల్లాసం కలుగుతాయి అందరికీ (ఇప్పుడంటే ఆర్ధిక మాంద్యం వల్ల తగ్గిందేమో!).. బహుశా చిన్నప్పటి నుండి, అమెరికా అంటే బాగా అభివృధ్ధి చెందిన దేశమని, డాలర్లు చెట్లకి కాస్తాయని వింటూ ఉండడం వల్ల, ఒక్కసారైనా అక్కడికి వెళ్ళి రావాలని ఉవిళ్ళూరే వాళ్ళు చాలా మందే ఉన్నారు. IT బూమ్ పుణ్యమాని, చాలా మందికి అమెరికా వెళ్ళగలిగే అవకాశం లభించింది… అలా అమెరికా వెళ్ళాలనుకుని, అక్కడికి వెళ్ళి వాళ్ళు చేసే పనులు, పడే పాట్ల గురించే ఈ నవల!

స్థూలంగా కధ విషయానికి వస్తే, సంధ్య అనే అమ్మాయికి అమెరికాలో ఉద్యోగావకాశం  రావడం, ఇక్కడకి (అమెరికాకి) వచ్చిన తరువాత ఆ సంస్కృతిని అర్ధం చేసుకునే క్రమంలో తను చేసే పనులు.. అప్పటి వరకు ఉద్యోగం ఇస్తామని చెప్పి రప్పించి, “బెంచ్” మీద కూర్చోపెట్టడాలు, కాన్ఫరెన్స్ కాల్స్ ఉపయోగించుకోవడాలు, డ్రైవింగ్ నేర్చుకోవడానికి పడే తిప్పలు.. ఇలా ఒకటేమిటి.. అన్నీ.. అమెరికాలో అన్ని కోణాలని స్పృశించారు.

కధ చదువుతున్నంతసేపు దానిలో లీనమైపోతాం.. ప్రారంభంలో మొదలైన కన్నీళ్ళు (ఇవి బాధతో — సంధ్య అమెరికాకి వెళుతున్నప్పుడు వాళ్ళ వాళ్ళు సెండాఫ్ ఇవ్వడం), చివరి వరకూ కొనసాగుతాయి (ఇవి నవ్వడం వలన 🙂 )  సంధర్భోచిత చెణుకులు బావున్నాయి. ఎక్కడ వెకిలితనం లేదు. మామూలుగా ఇలాంటి కధలలో అయితే అమెరికాని, కాకపోతే ఇండియాని కించపరుస్తూ ఉండే జోకులు ఉంటూ ఉంటాయి.. ఈ నవలలో మాత్రం అలాంటివి లేవు.. రెంటికి చక్కగా సమతూకం పాటించారు.. అదే సమయంలో హాస్యం రంగరించారు..

నవల ఇతివృత్తం అమెరికాదైనా, ఈ కధని ఏ దేశానికైనా అన్వయించుకోవచ్చు… ఎందుకంటే ఏ దేశమైనా విదేశమే కాబట్టి!.. బెంచ్ ఎక్కడైనా బెంచే కాబట్టి!! దీంట్లో చెప్పిన విషయాలన్నీ (అన్నీ కాకపోయినా చాలా వరకూ) విదేశాలకి వెళ్ళిన వారికి స్వీయానుభవాలే! అందుకే కొన్నిచోట్ల ఇది మన జీవితమేమో అనే సందేహం కూడా కలగచ్చు!!

కధలో ఓచోట వాషింగ్ మెషీన్ లో బట్టలు ఉతుక్కోవడానికి, క్వార్టర్స్ కావాలి… సంధ్య స్నేహితురాలి దగ్గర అవి రెండు/మూడు వారాలకి సరిపడా ఉండడం తో చాలా ఆనందంగా ఉంది అని చెబుతుంది.. ఈ పుస్తకం నేను కొరియాకి వెళ్ళకముందు చదివా.. అప్పుడు ఈ విషయానికి కూడా ఇంతా ఆనందమా అనుకున్నా!! కానీ కొరియాకి వెళ్ళిన తరువాత అనుభవంలో కి వచ్చింది!! అక్కడ రోజూ వారీ ఖర్చులకి, మిగతా వాటి కోసం.. 1000 డాలర్లని లోకల్ కరెన్సీ లో కి మార్చినప్పుడు, 11 లక్షల వాన్స్(లోకల్ కరెన్సీ) వచ్చాయి.. అంతే ఒక్కసారి వెర్రి ఆనందమేసింది..నేను లక్షాధికారినని తలుచుకోగానే…!!! నిజమేనేమో పరాయి ప్రదేశంలో ఉంటే ప్రతి చిన్న విషయం చాలా క్రొత్తగా/ఆనందంగా ఉంటుంది!

సాఫ్ట్ వేర్ ఇంజనీర్ జీవితం కాబట్టి, వాళ్ళకి మాత్రమే పుస్తకం నచ్చుతుంది అనుకోవడం కద్దు.. కానీ ఇతరులకి (మిగిలిన అందరికీ) నచ్చుతుంది.. ఈ రంగంలో జరిగేవి కాస్త అవగాహనకి వస్తాయి… అలానే అమెరికా వెళ్ళాలనుకుని ఆశపడి, వెళ్ళలేని వాళ్ళు కూడా ఈ అమెర్కాధని(అమెరికా + కధ) చదివి తృప్తి పడచ్చు, ఇక్కడకి-అక్కడికి ఆట్టే తేడా లేదని!!

ఏతావాతా చెప్పొచ్చేదేంటంటే, చదివి హాయిగా నవ్వుకోవచ్చు.. అమెరికాలో(విదేశాల్లో) ఉంటున్న వాళ్ళకైతే, ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ గిర్రున తిరగొచ్చు…

గమనిక: ఈ నవల కొన్నాళ్ళు ఆంధ్రజ్యోతి వీక్లీలో సీరియల్ గా వచ్చింది..

****************************************************************************************************
Software Engineer
రచన – కంఠంనేని స్వప్న తలశిల (Kanthamaneni Swapna Talasila)
పేజీలు – 175
వెల – 60
ప్రచురణ – నిహిల్ పబ్లికేషన్స్

ఈ వ్యాసాన్ని రాసిపంపిన వారు: మేధ

You Might Also Like

17 Comments

  1. Suchitra

    ప్లీజ్ ఈ బుక్ కాపీ ఉంటె నా ఇమెయిల్ ID కి పంపండి. థాంక్స్.

  2. paramesh

    సూపర్ గ వుంది ఇంకోసారి చదవాలి అన్పిస్తుంది
    థాంక్స్ స్వప్న

    1. Suchi

      Me deggara e book vunda

  3. sujalaganti

    ఈ నవల కావాల్సిన వాళ్ళు నాకుమైల్ చేస్తే నేను స్వప్నకు చెప్తాను స్వప్న నా పక్కింటి అమ్మాయి

    1. Sindoora

      సుజలగంటి, మీ mail ID ఏంటి. ఇక్కడ కనిపించలేదు.

    2. dvrao

      మీ మెయిల్ ఐడి ?

    3. Venkat

      Sujalaganti garu mail id lekunda mail cheyatam, ph number lekunda phone cheyadam anedhi sadhyam kadhemo andi. pls mentor ur mail id

    4. Raviteja

      హాయ్ సుజలగంటి,

      మీ ఈమెయిలు ఐడి చెప్పండి? మాకు ఆ బుక్ కావాలి.

      నా నెంబర్ – 7207660053

      రవి

  4. Sindoora

    నేను ఈ పుస్తకం కోసము చాలా రోజులుగా వెతుకుతున్నాను. కాని నాకు ఎక్కడ దొరకట్లేదు.
    మీ దగ్గర ఉన్న పుస్తకం లో పబ్లిషర్ ఫోను నంబరు ఉంటే ఇక్కడ పోస్ట్ చేయండి ప్లీజ్.

  5. D Siva Kumar

    ాయ్,
    నా పేరు శివ, నాకు ఈ పుస్తకం కావలెను దయచేసి మీరు నాకు పంపిస్తార. నాకు ఎంత ఖర్చు అవుతుందో చెపితే నేను మీకు పంపిస్తాను. నా ఫోన్ నెంబర్ :8686850080.

  6. uma

    five years ago I have read the software engineer book written by you. I was really impressed about you after reading and about novel as well. unfortunately i lost that book but i want to read that book again, i searched for that book but i could not find . If possible can you please send me softcopy or else the availability of that book(i.e.,name of library) in hyderabad.

  7. Sreelaxmi

    To Swanpna Thalasila,

    Three years ago I have read the software engineer book written by you. I was really impressed about you after reading and about novel as well. it was touching, when the time i was reading that book i really felt like all were our daily life incidents. By the way iam also software engineer and working in USA. unfortunately i lost that book but i want to read that book again, i searched for softcopy but i could not find . If possible can you please send me softcopy.

  8. Krishna

    చాలా సున్నితం గా చెప్పారండి పుస్తకం గురించి !
    ఈ సారి నేను విజయవాడ వెల్లినప్పుడు పుస్తకం కొని చదువుతా. ఏందుకంటే నాకు ప్రాయణం లో పుస్తకం చదవటం అంటే భలే ఇష్టం లెండి. ఆదీ కాక ఈ పుస్తకాన్ని నేను ఉంటున్న ప్లేసు లో వెతికి పట్టుకోవటం కొంచం కష్టమైన పనేలెండి.

  9. కొత్తపాళీ

    “1000 డాలర్లని లోకల్ కరెన్సీ లో కి మార్చినప్పుడు, 11 లక్షల వాన్స్(లోకల్ కరెన్సీ) వచ్చాయి”
    డాలర్లకీ జపనీస్ యెన్‌కీ ఇలాంటి సంబంధమే ఉంది. చాలా మంది సాధారణ అమెరికన్‌లకి ఈ సంగతి తెలీదు. ఈ పాయింటు ఆధారంగా ఒక సైంఫెల్డు ఎపిసోడు తీశారు. అదలా ఉండగా, వారానికి సరిపడా బట్టలుతుక్కోడానికి కావాల్సిన పావలా కాసులు దాచుకోడం ఇత్యాదివన్నీ నా స్నాతక విద్యార్ధి జీవితాన్ని గుర్తు చేశాయి.

  10. సౌమ్య

    యా! కథ చదువుతూ ఉంటేనే సీరియల్ గా వచ్చినట్లు ఉందే అనుకుంటూ ఉన్నాను. చాలా రోజుల క్రితం వచ్చింది కదూ…. ఒకట్రెండు సార్లు ఈ “సంధ్య” కథ ఎపిసోడ్స్ చదివాను…

Leave a Reply