Introduction to the constitution of india – Dr. Durga Das Basu

రాసిన వారు: Halley
************
ఈ పుస్తకం తెరవగానే ముందుగా నన్ను కట్టి పడేసింది రచయిత డి.డి.బసు గారి బయో-డాటా . అది ఉన్నది ఉన్నట్టుగా ఇక్కడ టైపు చేస్తున్నాను .
“ఆచార్య Dr.దుర్గా దాస్ బసు : (M.A , LL.D. ; D.Litt ; సరస్వతి , వాచస్పతి , విద్యావారిధి , ఫ్రజ్నభారతి , న్యాయరత్నాకర , నీతి భాస్కర , న్యాయభారతి , మానవరత్న , ఆనరరీ ప్రొఫెసర్ BHU , రిటైర్ద్ జడ్జి , హైకోర్టు కలకత్తా , ఫార్మర్ మెంబర్ యూనియన్ లా కమిషన్ , ఠాగూర్ ప్రొఫెసర్ , అశుతోష్ మెమోరియల్ , లెక్చరర్ కలకత్తా యూనివర్సిటి , పద్మభూషణ్ నేషనల్ రిసెర్చ్ ప్రొఫెసర్ ఆఫ్ ఇండియా , నేషనల్ సిటిజెన్స్ అవార్డ్ , ఆనరరీ ఫెల్లో ఏషియాటిక్ సొసైటీ కలకత్తా)”

ఇన్ని చదువులు , బిరుదులు కలిగిన వ్యక్తి రాసిన పుస్తకం అనగానే ఒక గౌరవం ఏర్పడిపొయింది తెలియకుండానే . పుస్తకం చాలా వరకు లా విద్యార్థులు , బి.ఎ , ఎం.ఏ , UPSC వగైరా ఎగ్జామ్స్ లకు చదివే వారికి చాలా ఉపయోగపడుతుంది . వీరు కాక పుస్తకం చివర రాసినట్టు “Politicians , Journalists , Statesmen , Administrative authorities” కి కూడా చాలా ఉపయోగపడే పుస్తకం . చిన్నపటి సోషల్ స్టడీస్ పుస్తకాలు నాకు అన్యాయం చేసాయి అని భావించే వాళ్ళు ఎవరన్నా ఉంటే కూడా ఈ పుస్తకాన్ని చదవచ్చు. ఇంచు మించు ఒక పాఠ్యపుస్తకం లాగా చదవాల్సిందే ఈ పుసకాన్ని .

మనలో చాలా మందికి రాజ్యాంగం గురించి చాలా తక్కువ తెల్సు . ఏదో చిన్నప్పుడు చదువుకున్న ఫండమెంటల్ రైట్స్ , డ్యూటీస్ వగైరా తప్ప అంత కంటే ఎక్కువ .. రాజ్యంగం గురించి చదివే అవకాశం మరియు అవసరం రెండూ రావు మనకి . స్టేట్ సిలబస్ పుస్తకాలలో ఐతే సాంఘిక శాస్త్రానికి ఎపుడూ అన్యాయమే ! అందునా సివిక్సు అంటే మరీ అత్తెసరుగా ఉండేవి మా పాఠాలు . నేను ఈ పుస్తకం అద్యంతం చదవటానికి అది కూడా ఒక కారణం .

అసలు బొత్తిగా ‘లా’ పుస్తకాలతో పరిచయం లేని నాలాంటి వాడికి ఈ పుస్తకంలో రచయిత పేర్కొన్న రకరకాల కేసులు వాటి వలన రాజ్యాంగంలో జరిగిన మార్పులు చదువుతూ ఉంటే .. ఔరా అని అనిపించింది. ఉదా : గోలక్నాథ్ vs స్టేట్ ఆఫ్ పంజాబ్ , కేశవానంద vs స్టేట్ ఆఫ్ కేరళ , మనేకా గాంధి vs యూనియన్ ఆఫ్ ఇండియా , మినర్వా మిల్స్ vs యూనియన్ ఆఫ్ ఇండియా . ఇది కాక ఇందిర గాంధీ ప్రభుత్వ కాలంలో ఎమర్జెన్సీ పీరియడ్ కేసులు, జనతా పార్టీ కాలంలో జరిగిన మార్పులు వాటి వలన జరిగిన పరిణామాలు ఇవన్నీ సవివరంగా రాసారు . ఎప్పుడూ భా.జ.పా వారి ఎన్నికల ప్రచారంలో చూచినదే కానీ కాశ్మీర్ రాష్త్ర్రానికి మాత్రమే ప్రత్యేక రాజ్యాంగం ఎందుకు ఉండవలసి వచ్చింది వగరా గురించి నేను పెద్దగా చదివింది లేదు . ఈ పుస్తకంలో కాశ్మీర్ గురించి ఒక ప్రత్యేక అధ్యాయం ఉంది , అందులో ఆ రాష్ట్ర రాజ్యాంగానికి మన దేశ రాజ్యాంగానికి గల తేడాలు వగైరా చాలా చక్కగా వివరించారు . ఇవన్నీ ఒక ఎత్తు ఆయితే చివరన “మన రాజ్యాంగం ఎలా పని చేసింది” (“how the constitution has worked”) అన్న అధ్యాయం ఇంకొక ఎత్తు.ఇందులో సెపరేటిస్టు ఫోర్సెస్ , అస్సామ్-బంగ్లాదేశ్ , కమ్యునలిజం , భాషా ప్రయుక్త రాష్త్రాలు వగైరా విషయాలు రాజ్యాంగాన్ని ఎలా ప్రభావితం చేశాయి అన్నది కూడా చక్కగా వివరించారు . ఇవన్ని కాక రాజ్యాంగంలో ఇంచు మించు అంగుళం అంగుళం గురించి చర్చించారు ( ఇంతా చేసి ఇది కేవలం “Introduction” మాత్రమే ) . ప్రతీ అధ్యాయం చివరన ఉన్న రెఫరెన్సెస్ విభాగం కుడా ఎన్నో కొత్త విషయాలని తెలుసుకోటానికి ఉపయోగపడుతుంది (ఇందులో చాలా వాటికి వికిపీడియా వాడుకోవలసి వచ్చింది) .

ఒక చక్కని రెఫెరెన్సు పుస్తకంగా దీనిని వాడుకోవచ్చు. అయితే ఒక్కసారి చదివేసి పక్కన పారేసే పుస్తకం కానే కాదు మరి !

వెల : 175/- పేజీలు : 506

You Might Also Like

2 Comments

  1. chitralekha45

    డి డి బాసు రాజ్యాంగం పుస్తకం మీరు బాగ పరిచయం చెసారు.

  2. తమ్మినేని యదుకుల భూషణ్

    భారత రాజ్యాంగం మీద ఇంత కన్నా మంచి పుస్తకం లేదు.
    నేను మొన్న ఇండియా వెళ్లి నా దగ్గర ఉన్న రాజ్యాంగం మీద
    ఉన్న పుస్తకాలన్నీ దుమ్ము దులుపుతున్నప్పుడు అందమైన
    డి.డి.బసు పుస్తకం (నీలం రంగు అట్ట)కనిపించింది .నేను కూడా
    మరో సారి ఆయన బిరుదులన్నీ చదివి ఆనంద పడ్డాను.

    రాజ్యాంగ చర్చ వచ్చింది కాబట్టి ఒక ముఖ్యమైన విషయం :
    చాలా మంది హిందీని జాతీయ భాష అనుకొంటూ ఉంటారు.
    అది శుద్ధ తప్పు. రూ.నోటు వెనుక ఉన్న భాషలన్నీ జాతీయ
    భాషలే. హిందీ /ఆంగ్లం కేంద్రం తన కార్యకలాపాలు సవ్యంగా
    నిర్వర్తించడానికి వాడే భాషలు.

Leave a Reply