“Going to school in India”
వ్యాసం రాసిపంపినవారు: చంద్రలత
బడి కెళ్లాలి ..భలే..భలే !
1-1-10
*
బడికి వెళ్ళడం …అందులోనూ … మన దేశంలో ఎంత సరదా అనుభవమో మనకు తెలియదూ?
కాస్త ఆలస్యమైతే తప్పి పోయే బస్సు …తప్పని గోడకుర్చీ.
ఎక్కాల్సిన బెంచీ ..తీయాల్సిన గుంజిళ్ళూ..!
అబ్బబ్బ ..సమయానికి కనబడని నల్ల రిబ్బను..తెల్ల మేజోడు.
ఓహో … పర్ ఫెక్ట్ !
యూనిఫార్మ్ ..నున్నగా దువ్వి ..పైకి మడిచి కట్టిన పొట్టి జడలు.. బాగా పాలీషు దట్టించి రుద్ది రుద్ది మెరిపించిన నల్లబూట్లూ..!
అయ్యయ్యో.. అలా ఎలా మరిచిపోయావ్? ఇవ్వాళ శుక్రవారం ..తెల్ల డ్రస్సు.. పదపద గబ గబ మార్చు! అవతల బడికి వేళవుతుంది!
హమ్మయ్య ..శనివారం ..ఎన్ని రంగులో .. నచ్చిన బట్టలు...మెరిసే తలలో క్లిప్పులు.
సర్లేమ్మా ,ముందు నువ్వు నిద్రలేచి ..బడికి బయలుదేరు.
పద తల్లీ..పదమ్మా!
*
గబ గబ.. చక చక …గల గల..కిల కిల.. బడి కెళ్ళే పిల్లలను పరిచయం చేసే ఒక మంచి పుస్తకం ,”Going to School in India”
నిజమే, బడి కెళ్ళడం లో ఎంత సంతోషం ఉన్నదో అంత వైవిధ్యం దాగి ఉన్నది.
పర్వతాల్లో కొండల్లో … ఎడారుల్లో మైదానాల్లో …దీవుల్లో ద్వీపకల్పంలో..నదీతీరాల్లో బ్యాక్ వాటర్ లో ..ఇందు గలం అందులేమనకుండా ..ఎక్కడ చూసినా బడికి వెళ్ళే పిల్లలే.
బస్సుల్లో ఆటోల్లో రిక్షాల్లో సైకిళ్ళపై వెళ్ళే పిల్లలు మనకు తెలుసు.
ఏనుగెక్కి వెళ్ళే పిల్లలు ,ఎడ్ల బండి పై ఒంటె బండిపై ప్రయాణించే పిల్లలు ,రోప్ వే దాటొచ్చే వారు..సైనికుల వాహనాల్లో లిఫ్ట్ తీసుకొనేవారు ఈ పుస్తకంలో మనకు పరిచయం అవుతారు.
పడవల్లో “ఫటాఫట్” లలో…రోప్ స్వింగ్ లలో గాలిలో తీలుతూ వచ్చే వారు.. ..వెదురు వంతెన లు దాటొచ్చేవారు..చేపల పడవల్లో కదిలి వచ్చే వారు.. నవ్వుతూ పలకరిస్తారు.
*
“ భారద్దేశంలో బడికెళ్ళడం భలే ఉంటుందిలే ’‘ …అంటూ మొదలు పెట్టి.. మన దేశం లోనే బడి ప్రయాణాన్నీ .. బడి బాగోగులనూ… అందంగా కళాత్మకంగా రంగులురంగులుగా ..విశ్లేషించే ఒక ప్రయత్నం పుస్తక రూపంలో మన ముందున్నది.
పుస్తకం అని ఎందుకంటున్నానంటే , ఇదే పేరుతో ఒక సంస్థ ఉన్నదనీ.. వారు పిల్లలు బడికి వెళ్ళే క్రమాన్ని చిన్న చిన్న చిత్రాలు నిర్మించి అనేక అంతర్జాతీయ ఖ్యాతినీ అవార్దులనూ పొందారనీ!( “యూ ట్యూబ్” లో చూడగలరు)
*
ఈ సరదా వెనుక ఈ సంతోషం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో విజ్ఞులు ఇప్పటికే గ్రహించి ఉంటారు. బడికి వెళ్ళ లేని విషాదం.. బడిని కొనసాగించలేని అడ్డంకులు..వీటన్నిటినీ ..మించి ఎలాగైనా బడికి వెళ్ళాలన్న కోరిక …పట్టుదల … ఈ పుస్తకం చెప్పకుండా చెప్పే విషయాలు ఎన్నెన్నో. బాలల మౌలిక హక్కుల అమలు పై లేవ నెత్తే అంశాలెన్నో మరెన్నో.
మామిడి చెట్టు కింద పార్లమెంటు ,మదరస్సాలు కదిలించిన సైన్స్ ఎగ్జిబిషన్లు,మధ్యాహ్న భోజనాలు ,ఆటలు పాటలు,పణియా గిరిజనుల బడులు, ఏకలవ్య పాఠశాలు,రాత్రి బడులు, వీధి పిల్లల బడులు, బేర్ ఫుట్ బడులు,బస్సు బడులూ... ఎన్నెన్నో ..మన ముందు నిలిచి ..మనను ఆలోచనల్లో పడవేస్తాయి.
*
సరే నండి.. మీరు మీ పిల్లలను బడికి పంపే హడావుడిలొ ఉన్నారా ?
మరి అలాంటప్పుడల్లా ..ఈ పిల్లలు మీ మనసులో మెదలక పోతే అప్పుడడగండి!
*
“Going to school in India” By Lisa Heydlauff
Design by B.M.Kamath Photograps by Nitin Upadhye
Published by Random house India, Price:Rs.450
Going to School in India (2005) - Movie
Going to School in India (2005) – Movie…
Going to School in India is a Documentary, Short Movie of 2005 made in India. Director: Vinnil Markan, Anupam Misra…
పుస్తకం » Blog Archive » పుస్తకాభిమానం
[…] చంద్రలత గారు. ఆమే పరిచయం చేసిన “Going to School in India” పుస్తకం చదువుతుంటే నాకు […]
Telugu4Kids
ఈ పుస్తకం చదువుతుంటే మీ “పట్టుపువ్వులు” గుర్తుకు వస్తూ ఉంది చంద్రలత గారూ:-)
ఫోటోలు చాలా ఉన్నాయి, చాలా బావున్నాయి.
(అక్కడక్కడా background లో కలిసిపోయేలా అక్షరాలు ఉండడం కొంచెం ఇబ్బందిగా అనిపించింది.)
ఉదహరించిన ప్రాంతాలు, పిల్లలు, బడులు, వారి ఇబ్బందులూ, వాటిని ఎదుర్కొనే ప్రయత్నాల గురించి బాగా వివరించారు.
బడికి దూరమైన వారి దగ్గరికి బడిని తెచ్చేందుకు ఎంతమంది అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారో కూడా తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ లో బడుల గురించి ఉన్నట్లు లేదు:-( పిల్లల మాటలు కొన్ని “quote” చేశారు.
మన బడులలో, గ్రంథాలయాలలో అన్నిట్లో ఉండాల్సిన పుస్తకం.
బయటి దేశాల వారికి దేశంలోని పలు ప్రాంతాలనీ, అక్కడి పిల్లలనూ పరిచయం చెయ్యడానికి చాలా మంచి సాధనం.
సొంతగా కొని పెట్టుకోవడానికి ధర ఎక్కువనిపిస్తే, కొందరు తల్లిదండ్రులు కలిసి కొని, వారి పిల్లల బడికి బహుమతిగా ఇస్తే బావుంటుంది.
Telugu4Kids
The most important thing this review has done for me is to generate an interest in the organisation.
There are positive reviews on this book (from teachers) on Amazon.com.
I came to know that the organisation distributes their books free of cost to some government schools.
So, when you buy the book, I guess you are helping kids who cannot otherwise have an access to this and other exciting and useful books.
Thanks for raising curiosity about this book, the organisation and the spirit behind it.
Chandra Latha
నమస్కారం.
ఈ పుస్తక పరిచయం చదివిన వారు, బడికి వెళ్దామన్న బలీయమైన అభిలాష, దానిని అమలు చేసుకోవడానికి అంతే బలంగా ఆ పిల్లలు,వారి చుట్టూ ఉన్న పెద్దలు- చేస్తోన్న మానవ ప్రయత్నాన్ని …గమనించే ఉంటారు.
ఈ పుస్తకం పై వ్యాసంలో వివరించినట్లుగా,
భారతదేశంలో పిల్లలను బడిలోకి చేర్పించ వలసిన అవసరాన్ని బలంగా చెప్పి, అందుకు మన వంతు చేయ వలసిన ప్రయత్నాన్ని ప్రోద్బలించి, విధి విధాన ప్రక్రియలను ప్రభావితం చేయడమే కదా ఆ పుస్తకం అంతిమ లక్ష్యం…?
ఇక, మీరు ఆ పుస్తకం కొని చదవక్కరలేదు.
చక్కగా..going to school in india ను GOOGLE లో సందర్షించండి.
youtube లోనూ చూడండి.
ఒక మాట.
అన్ని రంగుల్లో, అంత మంచి కాగితంపై, అంత చక్కటి ముద్రణకు ..ఆ మాత్రం వెచ్చించడానికి నేను వెనకాడలేదు. మరో విషయం ఏమిటంటే, ఒక మంచి పని తలపెట్టిన వారు మనల్ని వేరే ఏమీ అడగలేదు.
ఒక పుస్తకం కొనడం ద్వారా వారి ప్రయత్నానికి ఒక నూలు పోగును అందించాననుకున్నా.
ఎవరి సంతోషం వారిది!
అలాగే, తక్కువ ధరకు లభిస్తే ఎక్కువ మందికి చేరే అవకాశం ఉంటుంది.ఇదీ నిజమే!
ధన్యవాదాలు.
Chandra Sekhar Nanduri
ఇలాంటి పుస్తకాలు రాసి వెల నాలుగు వందలు పెట్టడంలో ఏంటి అంతర్యం? గొప్పవాళ్ళ పుస్తక భాదగారాల్లో దాక్కోడానిక? పుస్తకం యొక్క ముఖ్య వుద్దేశ్యం బాగుంది ఎంతవరుకు అది నెరవేరుతుంది అనేది హైదరాబాద్లో నడిచి స్కూల్ కి వెళ్ళినట్లు.
పుస్తక పరిచయం శైలి మరియు ఎంపిక మాత్రం బాగుంది.
కె.మహేష్ కుమార్
కొత్త సంవత్సరంలో పుస్తకం కొత్తగా మొదలయ్యింది. బాగుంది. అభినందనలు.
సౌమ్య
Hmm…Interesting!
perugu
ఇలాంటి అరుదైన పుస్తకాల సమీక్ష
బావుంది..చంద్రలత కు అబినందనలు.