రావి రంగారావు మినికవితలు-పరిశీలన
వ్యాసం రాసినవారు: శైలజామిత్ర
మినీ కవిత్వం అనగానే “The terrible brevity of life could demand more brevity of language”,” Poets are men who refuse to utilize language” అనే మాటలు గుర్తుకొస్తాయి. వచనకవిత్వంలో అస్పష్టత, అనవసరమైన పొడిగింపు ఎక్కువ అవుతున్న ఈ రోజుల్లో మినీ కవిత్వం మనసుకు ఆహ్లాదాన్ని కలుగజేస్తోంది..కొందరు పత్రికల్లో స్పేస్ ఫిల్లింగ్ కు ఉపయోగపడుతుందని అభిప్రాయపడుతున్నా, మొత్తానికి మినికవిత కవిత్వానికే నేడు ఆదర్శంగా నిలిచింది. ఇక నేటి మినికవితా పితామహులు రావి రంగారావు గారు ఇటీవల రచించిన “మినికవితలు – ఒక పరిశీలన అనే సంపుటిలో సంక్షిప్తత, నవ్య బంధుర శైలి, చమత్కారం, కొత్తదనం, భావగాంభిర్యం, స్పష్టత, శీర్షికా ప్రాధాన్యం అన్ని కలిగి ఉండేలా రచించిన రావిరంగారావు కవితలు ఎంతో ఆశక్తికరంగా సాగాయి. ఎన్ని గజాలు రాసాడన్నది కాదు కవిత్వం… ఎన్ని నిజాలు రాసాడు అన్నదే కవిత్వం అన్నారు ఆరుద్ర గారు. “మినికవిత్వం ఆయుష్షు మేరుపంత.. కానీ అది ప్రసరిస్తుంది కాలమంతా” అన్నారు డాక్టర్ సి. నారాయణ రెడ్డి గారు. రావిరంగారావు గారు మినికవితను ఒక ప్రక్రియగా మలచి ఎందఱో మినీ కవితలకు ఆశీస్సులు అందించారు.
మినికవితను రావిరంగారావు గారు ” వామనకవిత’ అంటూ కొత్తగా అభివ్యక్తికరించారు. మినీ కవిత విధానాన్ని ప్రయోజనాన్ని ఇలా చెప్పారు. “ప్రజాకవి
మహాకవులకన్న
ఎపుడు తక్కువవాడే
సూర్యుడు నక్షత్రాలకన్న
చిన్నవాడే కదా..” అన్నారు..
వచనకవితలు పెద్దవి ఎన్ని వచ్చినా ప్రజలకు ఉపయోగపడేవి , మరింత దగ్గరయ్యేవి మినికవితలేనని, సూర్యుడిలాగా మినికవితలు కూడా బాగా ఉపయోగపడతాయని రంగారావు గారి ఉద్దేశ్యం.. వచనకవితలను సుర్యునికన్న పెద్దవైన నక్షత్రాలుగాను, మినికవితను సుర్యునిగాను వీరు చిత్రీకరించారు. “వెయ్యిన్నూట పదహార్లు ” మినికవితా సంకలనంలో ఏది ఉత్తమమయిన మినికవితా అనడానికి రంగారావుగారు అద్భుతమయిన ముల్యాంకన ప్రక్రియను తెలియచేసారు.. మినికవితలపై స్పష్టమయిన వివరణ తెలియజేసారు.
శ్రీ రావి రంగారావు గారు శ్రీమతి అచ్చమ్మ, శ్రీ వీరయ్య గార్లకు జూలై పదవ తేదీన 1952 సంవత్సరంలో అనంతవరప్పాడు, వట్టి చెరుకూరు మండలం, గుంటూరు జిల్లా లో జన్మించారు. గతంలో అంటే 1972 నుండి 78 వరకు టెలిగ్రాఫ్ డిపార్ట్మెంట్లో టెలిగ్రాఫిస్ట్ గా పని చేసారు. ప్రస్తుతం తెలుగు బోధనా పద్దతుల అధ్యాపకులుగా మచలిపట్నం ఆంధ్ర జాతీయ కాలేజీ ఆఫ్ ఎడ్యుకేషన్ లో పనిచేస్తున్నారు. కవిత్వం రాయడం, యువతను కవిత్వం రాయించడం, అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం, పాల్గొనడం వీరి ప్రవృత్తులు…అంతేకాకుండా యువ కవిత అనే త్రైమాసిక పత్రిక ను కూడా నడుపుతున్నారు.. వీరు కవిగా 1985 , 2004 లో రాష్ట్ర ప్రభుత్వ ఉగాది కవి సత్కారాలు, 2001 లో ఉత్తమ మినీ కవితల సంపుటిగా “అగ్గిపెట్టె” కు మచిలీపట్టణం ఆంధ్ర సారస్వత సమితి పురస్కారం, 2005 లో చెన్నై దక్షిణ హిందీ ప్రచార సభ తెలుగు విశిష్ట సాహిత్య పురస్కారం, 2006 లో పులికంటి సాహితీ సత్కృతి లాంటి ఉత్తమమైన పురస్కారాలు పొందారు. విద్యావేత్తగా యాన్.సి.ఆర్.టి. జాతీయ అవార్డ్ , 2003 లో రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ అధ్యాపక అవార్డు కూడా వీరు పొందారు. దాదాపుగా 20 కు పైగా గ్రంధాలూ రచించిన వీరు అనేక మినీ కవితా సంకలనాలకు సంపాదకత్వం కూడా నిర్వహించారు.
వీరు అవినీతి వ్యతిరేకతపై ” పాము
పబ్లిక్ గా తిరుగుతుంటే
కర్రెత్తుకు రాబోయాను
మధ్యలో
పెద్దమనుషులు అడ్డుపడి
గడ్డపలుగులు తెస్తామన్నారు
ఇంతలో అది తప్పించుకుని వెళ్ళిపోయింది..అంటూ ఈ కవితలో అవినీతిని పాముతో పోల్చారు.
దేశంలో
దొంగతనం జరుగుతుంటే
మొరగాల్సిన కుక్కలు
చూస్తూ ఉండిపోతున్నాయి
కారణం
దొంగలే యజమానులు కావడం అంటూ అవినీతిని నిరోధించే శాఖలపై అక్షర విల్లును సంధించారు.
మరోచోట ప్రజాచైతన్యాన్ని వివరిస్తూ ఇలా అంటారు
“డబ్బుకు
కులానికి
అధికారానికి
అమ్మలేను
ఓటనేది
నా కూతురు లాంటిది అంటూ ఏ విషయాలలో ఓటును అమ్మకూదద్ప్ సున్నితంగా వివరించారు.
ఇలా వీరి మినీ కవితల స్పూర్తితో అనేక లఘు కవితలు ఆవిర్భవించాయి.
హైకులు, నానీలు, తాతీలు,దాదీలు, చిట్టిలు,పోట్టీలు, రెక్కలు, చుక్కలు, అంటూ అనేక రకాల మినికవితలు ముందుకొచ్చాయి..
రావి రంగారావు గారు మినికవితల బలాన్ని గుర్తించారు. అందుకే దీనిని ఒక అలవాటుగా కాకుండా ఒక ఉద్యమంగా ముందుకు తీసుకుని వెళుతున్నారు. ఇందులో ఇంతమంది పాల్గొనడానికి కారణం ఇందులో చందో సంకెళ్ళు విధించకపోవడమే..స్పష్టంగా సూటిగా బలంగా చెప్పటమే ప్రాణంగా మినికవితను సమాజ రుగ్మతలను పోగొట్టే ఆయుధంగా చేపట్టరు రావి రంగారావుగారు.
వచన కవితను కుందుర్తి ఎంతగా నమ్మి గాడంగా రచనలు ప్రచారం చేయిన్చేరో అలానే నేడు మినికవితలకు రావి రంగారావు గారు వందలకొలది మినికవితలను వందలమంది కవులతో రాయించి ఒక ఉద్యమ రూపాన్ని తీసుకు వచ్చేరు కవిత్వ రచనలో, నమ్మకాలలో ఎంతో గొప్ప వ్యక్తిత్వం ఉన్న మహోన్నతులు వీరు. వచనకవిత పితామహుడు “కుందుర్తి ” అయితే.. మినీ కవిత పితామహులు రావి రంగారావు. అని చెప్పడంలో సందేహం, సంశయం అవసరం లేదు. తెలుగు సాహిత్యంలో సుస్థిర స్థానం కల్పించి సాహితీ చరిత్రలో సుస్థిర స్థానాన్ని సొంతం చేసుకున్న తెలుగుడం రావిరంగారావు అనడమే వాస్తవం.
మినీ కవిత్వ భవిష్యతు ఎలా ఉంటుందని భావిస్తున్నారని ఒక శిష్యురాలు పి. కిరణ్మయి అడిగితే “మినీ కవితలోని సమగ్రమైన సంక్షిప్తత పాటకుల్ని అలరిస్తుంది. పడాలో ఎంపికా గొప్పగా ఉన్నా మినీ కవితలు వస్తున్నాయి. యువతరం మంచి మంచి మినీ కవితలు రాయడానికి ప్రయత్నిస్తున్నారు . యువకవులలో ఇలా కనిపించే ఉత్చాహం , స్పూర్తి, పట్టుదలను చూసే చెబుతున్నా మినికవితలకు ఎంతో భవిష్యత్తు ఉందని, ఉంటుందని అన్నారు. వీరి ఆశ, ఆశయం నెరవేరాలని, నిరంతరం తెలుగు సాహిత్యం వీరిని ఆహ్వానిస్తూనే ఉంటుందని, ఉండాలని కోరుకుందాం…!!
—————————————————————————
పుస్తకం పేరు: రావి రంగారావు మినికవితలు-పరిశీలన (raavi ranga rao mini kavitalu – pariseelana)
రచయిత: శ్రీమతి పి. కిరణ్మయి ఎం.ఫిల్. సిద్దాంత గ్రంధం (Smt. P. Kiranmayi M.Phil)
మొదటి ప్రచురణ: జనవరి 2009
వెల: 100 రూపాయలు
పేజీలు: 68
పుస్తక కాపీల కోసం సంప్రదించాల్సిన చిరునామా: నర్ర ప్రభావతి, 4 – 290 , గోడుగుపేట, మచిలీపట్టణం -521001 ఫోన్ : 924781825
surya
ముందుగా మిని కవితలను ప్రపంచానికి పరిచయం చేసిన శ్రీ రావి రంగారావు గారికి నా ధన్యవాదాలు .
నేను కూడా ఆయన ఉరిలో పుట్టినందుకు గర్విస్తునాను .
కవి అంటే కనిపించనవి వినిపించనవి కళ్ళకు కనిపించేటట్లు మనసుకు వినిపించేటట్లు చేసేవాడే కవి .
రావి రంగారావుగారు గురించి నా కవిత
” ఆకాసంలో ఎన్ని నక్షిత్రాలు ఉన్న ప్రకశించేతి సూర్యుడు ఒక్కడే .
ప్రపంచంలో ఎందరు నేతలు ఉన్న , మన జాతి పిత ఒక్కరే
ఆలాగే కవిత్వంలో ఎన్ని ప్రక్రియలు ఉన్న, మిని కవితల రుచిని చూపించన మన రావి రంగారావు గారు ఒక్కరే”.
kopalle
i think the contact number of the book is 9247581825
… one number missed… now it is 9247581825…
Jahnavi
kavita kooda sarigga raani Mini kavita vraasaanante daanikkaranam Ravi Ranga Rao gaare.
aayana oka pustakam lo kavitvam lo prakriyala gurinchi bahu baaga varninchaaru. appude naaku mini kavita ante emito telsindi.
veyyi noota padahaarlu – Mini kavita pustakam lo nenu vraasina mini kavitalu kooda vachayi.
perugu
మినీ కవితా పితామహులు రావి రంగారావు కవితలపై
ఎం.ఫిల్.సిద్దాంత గ్రంధం మీద మంచి సమీక్ష..శైలజకి
అభినందనలు.మినీ కవితలు అని భాషల్లో ఇప్పుడు
వస్తున్నై.ఇటీవల కేరళ కవిమిత్రుని మినీ కవితలు
చదివి ఆనందించాను..వాటిలో ఒక దాని కి నా అనువాదం..
“మా మేనమామ
మంచి రైతు..!
ఆయనిప్పుడు లేరు ..
“వ్యవసాయం”..కూడా..?