చదువు తీర్చిన జీవితం – ఒక సామాన్య మహిళ ఆత్మకథ

వ్యాసకర్తలు: జయశ్రీ దేవినేని & సి.వి. కృష్ణయ్య

********

  • నిదానమే ప్రధానం… అతి వేగం మరింత ప్రమాదకరం…
  • పరుగు పెరిగితే, అస్థిరత అధికమౌతుంది! మరి ఎక్కడ, ఎలా జీవన వేగానికి కళ్ళెం వేయాలి?
  • శిఖరాలు అధిరోహించిన వారి జీవన రసాయన మర్మమెరిగి మనం ఆ పాఠాలు గ్రహించాలి. అలా మెట్టు మెట్టు ఎక్కిన ఒక సామాన్య మహిళ ఆత్మకథ చదువు తీర్చిన జీవితం.
  • సర్వకాల సర్వావస్థలలో ఆమెలో… చూసినవి క్రమశిక్షణ, సంయనం! చూడనిది కోపం!
  • ఆచరించడానికి ఎంత ప్రయత్నించినా ఇంకొంత మిగిలి పోయినది – జీవితం పట్ల ఆశావహ దృక్పథం, తరగని ప్రేమ! సత్యమే మాట్లాడుతూ, బాధ్యతను శ్వాసిస్తూ నిరంతర అధ్యయనంతో ప్రయాణం చేసిన కాళ్ళకూరి శేషమ్మ వ్రాసిన. స్వీయచరిత్ర ఇది.బాధను ఆశతో, కలను దీక్ష తో మలచుకున్న ఏడు దశాబ్దాల అనుభవసారం ఈ పుస్తకం… చదువు తీర్చిన జీవితం ఒక సామాన్య మహిళ ఆత్మకథ.

ఈ ప్రపంచానికి ముఖ్యంగా సమాజానికి రథసారధులు సామాన్యులైన అసామాన్యులే.ఆత్మాభిమానంతో ఉన్నదానితోనే సర్ధుకొంటూ తమనుతాము అదుపులో పెట్టుకొని కుటుంబం కోసం పిల్లల కోసం అనేక ప్రణాకలువేసుకొంటూ సమిధలై కాలగర్భంలో కలిసి పోతున్నారు అనామకులుగా.ప్రపంచాన్ని చుట్టూ ఉన్న సమాజాన్ని అర్ధంచేసుకోవడంలో దాని గురించి చెప్పడం లో ఏగొప్ప తత్వవేత్త కంటే సామాజిక శాస్త్రవేత్తలకంటే తీసిపోయింది ఈసామాన్య మహిళా మణి. నిజంగా చదవాల్సింది ఇదిగో ఇలాంటి శేషమ్మల జీవితాలనే.మధ్యతరగతి గురించి, కుటుంబ జీవితాన్ని గురించి చివరకు చావుపుట్టుకల గురించి ఎంత గొప్పగా విశ్లేషించారో!

ఇలాంటి శేషమ్మలు సమాజంలో లక్షలాది మంది ఉన్నారు. వీళ్ళంతా తమ జీవితానుభవాలను రాయగలిగితే ఎన్నో పాఠాలు మనం నేర్చుకోవచ్చు. అనుభవం తో సంపాదించిన జ్ఞానం ఎంతగొప్పగా వుంటుందో ,దాన్ని ఎంత ఆత్మవిశ్వాసం తో చెప్పవచ్చో శేషమ్మ గారి “చదువు తీర్చిన జీవితం,”చదివితే చాలు. మనిషి ని కదిలించేదే నిజమైన జ్ఞానం. ఆకదిలించే శక్తి ఈ పుస్తకం లో ఉంది.జీవితం చివరి దశలో మహోపాధ్యాయురాలై, గొప్ప గురువై మహత్తరమైన పాఠాన్ని అందించారు.శేషమ్మగారికి ధన్యవాదాలు.

You Might Also Like

Leave a Reply