2021 పుస్తక పఠనం

వ్యాసకర్త: లలిత స్రవంతి

మా బుడ్డోడి ముందు ఫోను తో అతి తక్కువ సేపు కనిపించాలి అన్న ఒకే ఒక కారణం వల్లే ఈ సంవత్సరం కొన్ని పుస్తకాలు చదవగలిగాను.ముఖ్యం గా early child education. అసలు పిల్లలతో, ముఖ్యం గా 3 ఏళ్ళ లోపు, పిల్లలతో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఏవి ఎప్పుడు ఎలా నేర్పాలి..ఇవన్నీ తల్లైనమొదటి రోజు నుంచీ నన్ను ఆలోచింప చేస్తున్నవే. అసలు మా బుడ్డోడు ఇంకో 30 ఏళ్ళ తరువాత ఎలా ఉండాలి అన్న ఆలోచన నన్ను child psychology books వైపు నడిపింది.ఎక్కువ ఇవే చదివాను.

  1. Don’t move the muffin tin(Bev Bos) – కత్తిరింపులు, అతికింపులు, బొమ్మలు వెయడం వగైరా లాంటి కళలు పిల్లలకు introduce చేసేటప్పుడు పెద్ద వాళ్ళ పాత్ర ఎంత ఉండాలో చెప్పే పుస్తకం. అలా కాదు ఇలా అని ఎన్నో సార్లు పిల్లలని సరిదిద్దుతూ, వెంటనే మేధావి ని చేసేయాలి అన్న తపన ఉంటే కచ్చితం గా చదవాల్సిన పుస్తకం. 
  2. Einstein never used flashcards(Roberta Michnick)– పిల్లలలు ఎప్పటి నుంచీ academics చెప్పాలి అని వెదుకుతున్నప్పుడు దొరికిన పుస్తకం ఇది. పిల్లలు ఎలా నేర్చుకుంటారు, age appropriate expectations, ఏంటి, ఆటల పాత్ర ఏంటి వంటివన్నీ scientific evidence తో  చెప్పిన పుస్తకం 
  3. Play = Learning, the power of play, play – రోజంతా ఆడుకునే మా బుడ్డోడిని చూసి ఒక భరోసా ఇచ్చిన పుస్తకాలు. ఈ పుస్తకాలన్నీ scientific studies. 
  4. The enchanted hour(Meghan Cox) – పిల్లలకు చెప్పే కథల ప్రభావం వాళ్ళ మీద ఎంత ఉంటుందో చెప్పే పుస్తకం. చాలా మంచి పుస్తకం.
  5. Breastfeeding made easy (Carlos González)- నాకు breast feeding పట్ల బోలెడు భయాలు, అనుమానాలు తొలిగించిన ఏకైక పుస్తకం. ఈ రచయిత ఇతర పుస్తకాలు ఇది వరకు చదివి, ఆయనకు అభిమాని కూడా అయ్యాను. 
  6. How to get your child to eat (Ellyn Satter) –  పిల్లలకు అన్నం పెట్టడం మొదలు పెట్టిన దగ్గరి నుంచీ బోలెడు సందేహాలు, సరిగ్గ తింటున్నారో లేదో, junk ఎక్కువ తినేస్తున్నారేమొ, అన్నం తినిపించడం ఒక పెద్ద యుద్దమో, యగ్ఙ్ఞమో కాకుండా హాయిగా ఉండాలంటే ఏమి చేయకూడదు, ఏమి చేయాలో చెప్పే పుస్తకం
  7. It’s ok not to share (Heather shumaker)- Gentle parenting గురించి ఒకే ఒక్క పుస్తకం చెప్పాలంటే ఇది చెప్పచ్చేమో. పిల్లలు కూడా మనకు మల్లే సంపూర్ణ వ్యక్తులని, వాళ్ళకు తగిన గౌరవం, ఎంత కోపం వచ్చినా , ఆ క్షణాన మన మానసిక స్థితి ఎలా ఉన్నా కూడా ఇచ్చి తీరలని చెప్పే పుస్తకం. నాకు ముఖ్యం గా limit setting కి చాలా ఉపయోగ పడిన పుస్తకం. ఈ రచయిత రాసిన ఇంకో పుస్తకం(it’s ok to climb up the ladder ) కన్నా ఇది బాగుంది అనిపించింది.
  8. How children learn( john halt)– నాలుగు భాగాలు ఒక సారైన చదివి తీరాలి. 1935 లో రాసినా చాలా విషయాలు ఇప్పటికీ applicable.
  9. నేను- నాన్న (బుజ్జాయి) – స్కూల్ కి వెళ్ళని, వెళ్ళనివ్వనంత తండ్రి ప్రేమ(?) ఉంటే ఆ మనిషి ఏమౌతాడు.. దేవులపల్లి వారితో పాటే ఎన్నొ సభలకు వెళుతు, Formal schooling లేక పోయినా సోంతం గా అక్షరం నేర్చుకున్న దగ్గరి నుంచీ గొప్ప కార్టూనిస్ట్ అవ్వడం గురించి పుస్తకం అంతా.ఈ ప్రయాణం లో అవమానాలు, achievements, మానసిక వేదన వంటివన్నీ చదివించి ఆలోచింపచేస్తాయి. 
  10. లెక్కలతో నా ప్రయోగాలు ,శైశవ గీతం, రామయ్య ఙ్ఞాపకాలు( చుక్కా రామయ్య)-ఇవన్నీ ప్రాథమిక విద్య విధానం లో రామయ్య గారి అనుభవాలు అని చెప్పచ్చు. ఆయన స్కూలు టీచరు గా జీవితం మొదలు పెట్టక ముందు కూడా గణితాన్ని ఆయన జీవితం లో ఒక భాగం గానే చూసారు. అదే దృష్టి ఆయనకు IIT coaching కి ఎలా ఉపయోగ పడిందో తెలుస్తుంది. ఈ పుస్తకాలన్ని లెక్కల టీచర్లకు ఒక దిక్సూచి గా పనికొస్తాయి.
  11. పగటి కల, మాస్టారు (గిజు భాయి) – 1935 లో గిజుభాయి అనుభవాలు ఇప్పటి విద్యా విధానానికి కూడా చాలా అవసరం.పరిస్థితులలో పెద్ద మార్పేమి రాలేదు. గిజు భాయి నడిపిన స్కూలు, ఆయన తెచ్చిన సంస్కరణలు మొత్తం ఈ పుస్తకాలలో చెప్పబడ్డాయి.
  12. Stepping beyond khaki (K Annamalai)- పోలీస్ అనగానే భయమనో, లంచమనో, సరిగ్గా పనిచేయరనో..వగైరా అభిప్రాయాలున్న ప్రతి ఒక్కరికీ ఇంకో కోణం పరిచయం చేసే పుస్తకం. నెలకుఒక రోజూ కూడా సెలవ ఉండదు, బోలెడు శారీరిక, మానసిక సమస్యలు, అన్నిటికీ మించి రాజకీయ నాయకుల interference… ఇవన్ని ప్రతి నిత్యం ఎదుర్కునే వ్యక్తే పోలీసు. ఆ వ్యవస్థలో రావాల్సిన సంస్కరణలు, ఆలోచనా విధానం లో మార్పు అన్నీ చర్చిస్తుంది ఈ పుస్తకం. 
  13. కృష్ణ వేణి (మాలతి చందుర్) – ఎక్కువ తెలుగు సినిమాలు చూసిన ప్రభావమేమో, పెద్ద ఆసక్తిగ అనిపించలేదు. సరదాగా చదవచ్చు.
  14. గర్భ గుడిలోకి( జనార్ధన మహర్షి) – బలవంతం గా భగవద్గీత ను కథలో చొప్పించారేమో అనిపించింది ఆఖరికి వచ్చేసరికి. ఒకే stretch లో చదివినా, ఆఖరున పేజీలు తిప్పేయాల్సొచ్చింది. సినిమా కన్నా నవల మేలు. 
  15. పొలమారిన ఙ్ఞాపకాలు (వంశీ)- వంశీ కథల్లనీ మన చుట్టు తిరుగుతాయి. ఈ పుస్తకం లో సినిమా అనుభవాలే కాదు, తనకు సినిమా తరువాత ఎంతో ఇష్టమైన తిండి గురించి కథలు,( నిజం గా, కొన్ని కథలు చదివాక వెంటనే  అక్కడికెళ్ళి పెసరట్టు తినొద్దం అనిపిస్తుంది), సాహిత్యం, బోలెడు. 
  16. పున్నాగ పూలు, మైత్రి (జలంధర)-చాలా రోజులు నన్ను ఆలోచింపచేసిన పుస్తకం. Healing మీద నాకు నమ్మకం ఇంకా కుదరక పోయినా, ఆలోచనల ప్రభావం గురించి చాలా లోతుగా చర్చించిన పుస్తకం. 
  17. ఆహర వేదం ( జి వి పూర్ణచందు) – తిండంటే ఇష్టమున్న ప్రతొక్కరు చదవాల్సిన పుస్తకం. మనం రోజూ తినే వంటల చరిత్రే కాదు, వండే పద్ధతుల్లో తప్పులు ..సమస్తం చెప్పే bible అనచ్చేమో

You Might Also Like

3 Comments

  1. Dathathreya

    Good collection of books Madam. i think, you got so much knowledge with the reading than a DIET student. if time permits you, please write elobarately on each book. it will be more helpful for parents and obvisouly for children’s future also.

  2. లియో

    మంచి పుస్తకాల గురించి తెలియచేశారు. ధన్యవాదాలు.

  3. Srinivas

    Nice compilation. Especially books about children. I will add to my list and go through. Sure, parents can and need to learn many things about parenting. Thank you for shring.

Leave a Reply