సరాగం vs పరాగం- మనోధర్మ పరాగం మీద ఒక నోట్
వ్యాసకర్త: సాయి పద్మ
మధురాంతకం నరేంద్ర గారు రాసిన “మనోధర్మ పరాగం” ఇప్పుడే పూర్తి చేశాను ఇవాళ ఎం.ఎస్.సుబ్బులక్ష్మి గారి పుట్టినరోజు కూడా..!! ఈ రెండు ఒకే సెంటెన్స్ లో చెప్తే తలతోక లేనట్టు ఇలా చెప్పింది ఏంటి అనుకుంటారు కానీ మనోధర్మ పరాగం పుస్తకం ఇండైరెక్ట్ గా రాసిన డైరెక్ట్ ఎమ్మెస్ సుబ్బలక్ష్మి గారి జీవిత చరిత్ర!!
నరేంద్ర గారు చాలా గొప్ప క్రాఫ్ట్ ఉన్న నవలాకారుడు, అందులో సందేహమే లేదు. దేవదాసీ చరిత్ర ఒక మూడు తరాలుగా ఎన్ని రకాలుగా మారిందో స్త్రీల ద్వారా వాళ్ల దృక్కోణం ద్వారా చెప్పించడం బాగుంది. నిజంగా చాలా గొప్ప ప్రక్రియ. సంగీతం కళలు వీటి ఆధారంగా నిలబడ్డ దేవదాసి వ్యవస్థని అందులో లోపాలను మారుతున్న పోకడలను పట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే తే.గీ ఇది నెమ్మదిగా ఎమ్మెస్ సుబ్బలక్ష్మి . కథలో సి కె నాగలక్ష్మి జీవితంగా మారడం ఒక దేవదాసు కులంలో పుట్టిన వ్యక్తి భారతరత్న స్థాయికి ఎదగడం మీదనే కథ నడక సాగింది.
నవల పూర్తి చేసిన దగ్గర నుంచీ ఆలోచిస్తూనే ఉన్నాను, ఎందుకు ఇంత వేదనగా ఉంది నాకు? రచయిత రాసిన వేవీ కొత్త విషయాలు కాదు. జరిగిన విషయాలే, జరుగుబాటు కోసం పిల్లల్ని పెంచుకుంటూ ఒక పోరాటాలు చేసిన మహిళల కథలు ఇవన్నీ.. కానీ.. ఎక్కడో.. ఒక అసంతృప్తి ఒక వేదన..!!
ఎంత పాండిత్యం ఉండనీ, అది నాట్యం కావచ్చు లేదా సంగీతం కావచ్చు ఒక పోషకుడు కోసం ఎదురుచూసే దేవాలయాల్లో నృత్యం చేసే ఒక దేవదాసి కావచ్చు… కులం , జెండర్ తప్ప వాళ్ళు చరిత్రకి contribute చేసింది ఏమీ లేదా? వాళ్ల బలహీనతల గురించి లౌక్యాల గురించి నవలలు కథలు వచ్చినట్టుగా వాళ్ల బలాల గురించి జీవితాన్ని నిర్మించుకోవడానికి, నిలువున వాళ్ళ జీవితాలని నాశనం చేసిన మనుషుల్ని కూడా క్షమించి వాళ్ళ పక్కనే జీవిత ప్రయాణం కొనసాగడానికి వాళ్లు కూడతీసుకుంటున్న శక్తి గురించి ఎవరు రాయరు ఏంటి ? అనిపిస్తోంది నాకు.
ఈ నవలలో అనేకమంది కళాకారులు ప్రాశస్త్యం పొందిన నిష్ణాతుల జీవితాలున్నాయి రుక్మిణీదేవి అరండేల్ కావచ్చు లేదా ఇంకా ఎవరైనా కావచ్చు. ఈ నవల చాలా తెలివిగా రాయబడింది.
చాలామంది చర్చల్లో మాట్లాడేటప్పుడు వారి జీవితం ప్రేరణగా తీసుకుని రాశాము ఆంటారు. ప్రేరణ లేదా ఇన్స్పిరేషన్ అనే పదం గురించి నేను చాలా ఆలోచిస్తూ ఉంటాను!!
గొప్ప కళాకారుడు గొప్ప నటుడు గొప్ప ప్రేరణ ఇచ్చే వ్యక్తి… వీటిల్లో లో ఈ గొప్ప అనే పదం తోనే నాకు వచ్చింది చిక్కంతా..!! ఎవరు గొప్ప అని ఎవరు నిర్ధారిస్తారు? ఏ రకంగా జడ్జిమెంట్ చేస్తారు??
ముఖ్యంగా ఈ కథలో ప్రధాన పాత్ర అయిన సి కె నాగలక్ష్మి పాత్రను మలచడంలో, రచయిత మంచి శ్రద్ధ తీసుకున్నారు. అదే విధంగా మిగతా పాత్రల విషయంలో కూడా… నేత చీర కింద ఆమె కాళ్ళు కుందేలు పిల్లల్లా కదులుతున్నాయని రాస్తారు ఒకచోట.. ఒక పాత్ర విషయంలో..!!
ప్రతి పాత్రకి తనదయిన కవిత్వ రీతిలో ఒక బొమ్మ కట్టే ప్రయత్నం చేశారు. కానీ అక్కడ కూడా అందచందాల వివరణ చాలా ఎక్కువగా ఉంది.
సి కె నాగలక్ష్మి తాను సంగీతాన్ని ఎంచుకున్న కారణం కేవలం దేవదాసి కులంలో పుట్టడం వల్ల ఒక పోషకుడి ప్రాపకం ఆశించే వ్యక్తి కాకుండా, సంగీతంలో తన సోల్ స్పేస్ ని వెతుక్కున్న కళాకారిణిగా ప్రాజెక్ట్ చేయడంలో మాత్రం, రచయిత న్యాయం చేయలేదు అని నాకనిపించింది.
పాడినప్పుడు ఆమె వేరే మనిషి అవుతుంది, ఆమెలో తెలియని అందం వస్తుంది ఆమె బ్రాహ్మణ స్త్రీలా కనబడుతుంది, ఆమె వేరే లోకంలో విహరిస్తూ ఉంటుంది అని అంటారు తప్ప… సంగీతంలో ఆమె పొందిన అలౌకిక ఆనందం ముందు ఆ ఆనందాన్ని ప్రపంచం అంతా కూడా పంచడంలో ఆమె పొందిన ఆత్మానందాన్ని పట్టుకున్నారా? అని బాధ వేస్తుంది.
ఏది మిస్ అయిందా? అని ఆలోచిస్తే సహానుభూతి కంపాషన్ లాంటి పదాలు గుర్తు వస్తాయి. ఒక కళాకారిణి ఈ వ్యవస్థలో భాగం అయినందుకు.. ముఖ్యంగా నిత్య విద్యార్థిగా ఉండి తన కళలో దైవత్వం సాధించినందుకు, ఆమె జీవితాన్ని శల్య పరీక్ష చేసే అధికారం ఎవరికైనా ఉందా అది నాకు విచిత్రం అనిపించింది..!!
జండర్ పరంగా మాట్లాడుతున్నాను అనుకోకపోతే… ఏ మంగళంపల్లి గురించో.. మధురై మణి అయ్యర్ గురించో.. ఇలాంటి పుస్తకాలు వచ్చాయా?
Of course.. ఇక్కడ దేవదాసీ వ్యవస్థ ఉంది. అందులోని విషాద రాగం ఉంది. అంతవరకు నవల అద్భుతంగా ఉంది.
ఐదు వందల పేజీలు నవలలో చాలాచోట్ల పాత్రలు గజిబిజిగా కనిపిస్తాయి. కనీసం వంద పేజీలు తగ్గించుకుంటే ఈ నవల ఇంకా గొప్పగా ఉండేది అనిపించింది.
కానీ… ఆమె పాషన్ లోని కంపాషన్ ని … ఆమె మనోధర్మం అంత సున్నితంగా, సునిశితంగా అర్థం చేసుకోవాలేమో..!!
పరాగం లోని వైరాగ్యం, కరుణ, జీవితపు పరాయితనం, రాగంతో పయనమయ్యే సూఫీతత్వం అర్థం చేసుకోవడానికి.
మళ్లీ ఆమెనే వినాలేమో..!!
Her divinity is inexplicable… Her transformation is a song, heavily legacy laced misery which she into a detached celebration of spirituality is something that can’t fit a mere body and a mortal life..!!
Siva
Can someone tell me the meaning of the title?
S. Narayanaswamy
బాగా చెప్పారు.
అయితే మీరు బాగానే ఉన్నాయి అనుకున్న అంశాలు కూడా నవలలో బాగలేవు. దేవదాసి వ్యవస్థ కి, ఆ వ్యక్తులకు, ఆ చరిత్రకి చాలా అన్యాయం జరిగింది ఈ నవలలో.
పవన్ సంతోష్ సూరంపూడి
నేను ఈ పుస్తకం చదివాను. నాకు సాధ్యమైనంత నిజాయితీతో 360 డిగ్రీల కోణంలో రాసే ప్రయత్నంగానే తోచింది. మీకు వీలైతే ఒకసారి మీరన్నట్టుగా నవలలో ఎక్కడెక్కడ, ఏయే కోణాల్లో ఆ అన్యాయం జరిగిందో ఒక వివరమైన వ్యాసంగా రాయమని కోరుతున్నానండీ.