పుస్తకం.నెట్ యూట్యూబ్ ఛానల్

నమస్కారం!

గత పదమూడేళ్ళుగా ప్రధానంగా text-oriented సైటుగా ఉన్న పుస్తకం.నెట్ ని కొంత మీడియాల్లోకి తీసుకెళ్ళే ప్రయత్నంలో భాగంగా యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టాము. ఇంతకు ముందు ఎప్పుడన్నా వీడియో, ఆడియో కంటెంట్ ఉంటే అవి సైటులోనే పెట్టేవాళ్ళం. ఇప్పుడు వాటినీ, కొత్తగా క్రియేట్ చేయబోయే వీడియోలని ఈ ఛానల్‍లో పెట్టాలన్నది ప్లాన్.

పుస్తకం.నెట్ ఎప్పుడూ కమ్యూనిటిలో అందరూ తలా ఓ చేయి వేయడం వల్ల మాత్రమే ముందు కొనసాగిన, కొనసాగుతున్న వెబ్‍సైట్ కాబట్టి తెలుగు పాఠకులుగా మీరు కూడా ఈ యూట్యూబ్ ఛానల్‍కి కాంట్రిబ్యూట్ చేయవచ్చు. కొన్ని ఐడియాలు:

  1. పుస్తక సమీక్షలు, వీడియో లెక్చర్లు, వీడియో ఎస్సేస్:
    1. బొమ్మలు ప్రధానంగా ఉండే పుస్తకాలు (పిల్లల పుస్తకాలు, గ్రాఫిక్ నవలలు వగైరాలకి) వీడియో పరిచయాలు.
    2. ఏదన్నా సాహితీ ప్రక్రియపై, సబ్జెక్టుపై మీకు లోతైన అవగాహన ఉంటే (తెలుగు పద్యాలు, తెలంగాణ ఉద్యమం, అఫ్ఘనిస్తాన్ చరిత్ర) వాటి మీద లెక్చర్లు, ప్రెజెంటేషన్లు.
    3. పుస్తకాల్లో కొంత భాగాన్ని చదివి వినిపించడం.
    4. మొదలైనవి
  2. పుస్తకాలకి సంబంధించిన కబుర్లు:
    1. మీరు ఏదో టూర్ లో చుట్టుముట్టొచ్చిన లైబ్రరీలు, మ్యూజియం తదితరాల ఫోటోలతో పాటుగా మీ వ్యాఖ్యానం.
    2. మీ పర్సనల్ కలెక్షన్ లో అరుదైన పుస్తకాలు
    3. మొదలైనవి.
  3. రచయితలు/పుస్తకప్రియుల గురించి కుబుర్లు:
    1. మీరే వాళ్ళతో మాట్లాడించినా సరే, లేదూ మీరు వాళ్ళ గురించి అనుకుంటున్నవి పంచుకున్నా సరే

ఇవి ఉదాహరణలు మాత్రమే. ఇవి కాక, మీకింకేమన్నా ఐడియాలు వస్తే మాకు తెలియజేయండి. వీడియోలు తీసే పని పెట్టుకునే ముందు మాకో మాట చెప్తే అది పుస్తకం.నెట్‍కి సరిపోతుందా లేదా అన్నది చెప్తాము. వీడియోకి సంబంధించి గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని విషయాలు:

  1. ఇవేవీ ప్రోఫషనల్ వీడియోలు కానవసరం లేదు. మామూలుగా ఫోన్, లాప్‍టాప్ తో ఉన్న కెమరాలు చాలు. జూమ్, పవర్ పాయింట్ లాంటివి ఇచ్చే మీటింగ్ రికార్డింగ్ సరిపోతుంది.
  2. అయితే వీడియోని వీలైనంత బెటర్ క్వాలటితో రికార్డ్ చేసి (ముఖ్యంగా వెలుతురు, సౌండ్ బాగుండేలా) పంపిస్తే బాగుంటుంది.
  3. వీడియోల నిడివి ఐదు నిముషాల నుంచి గంటా గంటన్నర వరకూ ఉండచ్చు.
  4. దయచేసి చెప్పాలనుకుంటున్న పాయింట్‍ గురించి మాత్రమే మాట్లాడుతూ, అనవసరపు డైగ్రెషన్స్ (digressions) లేకుండా చూసుకుంటే మేలు. అప్‍లోడ్ చేయడానికి మాకు ఇబ్బంది ఉండదు, యూట్యూబ్ ఆంక్షలేవీ పెట్టదు, కానీ వినేవాళ్ళ సమయాన్ని గౌరవించాల్సిన బాధ్యత మనది.

మీ వీడియోలని రికార్డ్ చేసి google drive, onedrive, dropbox లాంటి వాటిల్లో పెట్టి, editor@pustakam.net కి షేర్ చేయవచ్చు. వీడియోలు కాబట్టి మామూలుగా వ్యాసాలు వేసినంత త్వరగా ఇవి పబ్లిష్ చేయలేము. కనీసం ఒక వారం వ్యవధి ఇవ్వమని మనవి.

మీకు వీడియోలో కనిపించడం ఇష్టం లేకపోయినా లేదా మీరు ఎనుకున్న టాపిక్‍కి వీడియో అనవసరం అనిపించినా ఆడియోని మాత్రమే మాకు పంపండి. మేం వాటిని యూట్యూబ్ ఛానల్‍లోనో మరెక్కడైనా హోస్ట్ చేయడానికి చూస్తాము.

దాదాపు పధ్నాలుగేళ్ళుగా పుస్తకం.నెట్‍ని ఆదరిస్తున్న మీరు అదే ఆదరణ చూపిస్తారని ఆశిస్తున్నాను.

యూట్యూబ్ ఛానల్ (pustakamdotnet) లింక్ ఇది. “లైక్-షేర్-సబ్‍స్క్రైబ్” మీరు చేసేస్తే మేము “మమ” అనుకుంటూ పనులు చేసుకుంటూ పోతాం. 🙂

https://www.youtube.com/channel/UCGsccP_GD6kprpiTGMp2PQw

You Might Also Like

Leave a Reply