స్త్రీ కథలు 50

తెలుగు కథలలో స్త్రీ వాద కథలు మొదలయినాక, ‘స్త్రీ వాదులంతా ఒక్కటే’ అన్న నినాదం ఉండేది. తరువాత అందులో దళిత, ముస్లిం వాదాలు ఇత్యాదివి చోటు చేసుకున్నాయి.
ఎన్ని వచ్చినా స్త్రీ సమస్యలు ఉన్నన్ని , కథలు రాలేదనే చెప్పాలి.
ఇవ్వన్నీ బలమైన కథలు.
సమస్యను తెలియని కొన్ని వర్గపు స్త్రీలకు కూడా కనువిప్పు ఈ కథలు.
ఈ కథలన్నీ ఒక ఎత్తు, ఆ కథలను సేకరించి, వాటిని పరిచయం చేసిన ముందుమాట మరో ఎత్తు. వివిధ కోణాలు ఆవిష్కరించిన 50 కథలు తప్పక చదవలసినదే!
అందులో ఓల్గా గారు రచించిన ‘తోడు’ నాకు బాగా నచ్చిన కథ. నచ్చటానికి కారణం అందులో పరిష్కారం ఆమె సూచించారు. ఏ మార్పు కోరుతూ ఒక కథ మొదలైందో, ఆ మార్పును చూపిస్తూ కథను ముగించటం బాగుంది.
కథలో భార్యను కోల్పోయిన ఒక పెద్దమనిషి తమ పక్క ఫ్లాట్ లో భర్తను కోల్పోయిన స్త్రీ ని చూస్తాడు. ఆమె వైయిలిన్ నేర్చుకుంటూ, పుస్తకం చదువుకుంటూ కనపడుతుంది.
ఆమె దుఃఖం గురించి అడుగుతాడు.
అలాంటి సంకెళ్ళను కొందరు తిరస్కరిస్తున్నారు. అది మారుతున్న సమాజానికి గుర్తు.
ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. మనం మన చుట్టూ ఉన్న ప్రజలను జడ్జిమెంటలాగా చూడటం మానివేస్తే, జీవితంలో మరో కోణం అర్థమౌతుంది.
స్త్రీ సమస్యలను కథలుగా చెప్పిన రచయితలు ఆదర్శవంతులు.
వాటిని సేకరించి అందించిన ఖదీర్ బాబుగారు కూడా అంతే ఆదర్శవంతులు. ఆయన తెలుగు కథ లో స్త్రీ సమస్యల గురించి ముచ్చటిస్తూ “ఎంత చైతన్యవంతంగా, సహజంగా, వికాసంగా, తిరుగుబాటుగా, తెలుగు స్త్రీ కథ ఉన్నదోనని గర్వ పడ్డాను” అన్నారు. అలాంటివి అందించి మనకు ఎంతో సాయం చేసిన ఆయనకి నా అభినందనలు.
Leave a Reply