Fantastic night and other stories – Stefan Zweig
వ్యాసకర్త: Nagini Kandala
*********
Stefan Zweig.. ఈ మధ్యే మొదలైన కొత్త ప్రేమ. అసలీ పుస్తకం కళ్ళపడే వరకూ ఈయన గురించి తెలీదు. ఈ సంపుటిలో Fantastic Night, Letter from an Unknown Woman, The Fowler Snared, The Invisible Collection మరియు Buchmendel అనే ఐదు కథలుంటాయి. కానీ మొదటి రెండు కథలూ నిడివి ఎక్కువగా ఉండే నవలికలు. ఈ కథల్లో విశేషం ఏంటంటే పుస్తకం మొదలు పెట్టడం మాత్రమే గుర్తుంటుంది. మనం ఏదో చదువుతున్నామనే స్పృహ మధ్యలో ఊహామాత్రం కూడా రానివ్వని రచయిత Stefan Zweig. జ్యుయిష్ మతస్థుడైన ఈ ఆస్ట్రియన్ రచయిత కథల్లో హిట్లర్ శకంలో జరిగిన వినాశనం సాధారణ మనుషుల జీవితాల మీద చూపించిన ప్రభావం కనిపిస్తుంది.
మొదటి కథ Fantastic Night ఆస్ట్రియన్ లెఫ్టనెంట్ అయిన 36 ఏళ్ళ Baron Friedrich Michael von R కథ. ఈ కథలో ముఖ్యపాత్రధారిది చాలా విచిత్రమైన వ్యక్తిత్వం. జన్మతః ఏలోటూ లేకుండా సౌకర్యవంతమైన విలాస జీవితం గడుపుతూ, సమాజంలో గౌరవప్రదమైన స్థానంలో ఉన్న అతనిలో లోపం మనిషికి సహజంగా ఉండే భావోద్వేగాలు లేకపోవడం.. దీని కారణంగా అతనికి సంతోషం, దుఖఃం లాంటి వాటికి కనీస అర్థం తెలీకుండా తనలో ఏదో తెలియని ఖాళీ ఉందని మాత్రం అనుకుంటూ ఉంటాడు. Bourgeois comfort చట్రాన్ని దాటి వెళ్ళలేని అతనిలో ఒక రాత్రి వరుసగా జరిగిన సంఘటనలు పరివర్తన తీసుకొస్తాయి. ఆ రాత్రి అతని జీవితాన్ని సమూలంగా మార్చేసిన సంఘటనల తాలూకూ అనుభవాల్ని వివరిస్తాడు. ఆ క్రమంలో నిజమైన సంతోషం అంటే ఏమిటో తెలుసుకుని జీవిత పరమార్థం తెలుసుకునే దిశగా ప్రయాణిస్తాడు. ఈ కథ ముగింపు ఒక ఫీల్ గుడ్ అనుభవాన్నిస్తుంది.
At that moment I was fully aware for the first time how far advanced the process of paralysis already was in me—it was as if I were moving through flowing, bright water without being halted or taking root anywhere, and I knew very well that this chill was something dead and corpse-like, not yet surrounded by the foul breath of decomposition but already numbed beyond recovery, a grimly cold lack of emotion. It was the moment that precedes real, physical death and outwardly visible decay.
There was a kind of sheet of glass between me and my immediate surroundings, and my will was not strong enough to break it.
For this was the world in which I lived—the aura of perfume and elegance that wafted around the kaleidoscopic confusion.
I felt some relationship in myself with what was animal, instinctive, common.
I felt there must be something terribly strange about me that meant I could never mingle with anyone, but was separate from the dense mass, floating like a drop of oil on moving water.
రెండో కథ Letter from an Unknown Woman చాలా విశిష్టమైనది. ఇందులో ‘R’ అనే ఒక ప్రముఖ రచయిత తన సెలవు రోజుల్ని గడిపి వియన్నాకు తిరిగొచ్చాక రైల్వే స్టేషన్లో న్యూస్ పేపర్ కొంటాడు. అందులో యథాలాపంగా తారీఖు చూసి ఆరోజు తన 41 వ జన్మదినమని గుర్తు చేసుకుంటాడు. ఇంటికి చేరేసరికి తాను లేని సమయంలో వచ్చిన ఒక manuscript ని తలపించే ఉత్తరం చూసి ఎవరు రాశారా అని ఆసక్తితో చదవడం మొదలు పెట్టిన అతనికి ఆ ఉత్తరం ఒక అపరచితురాలు రాసిందని తెలుస్తుంది. “To you, who have never known me.” అనే వాక్యాలతో మొదలైన ఆ ఉత్తరాన్ని సిగరెట్ వెలిగించుకుని తాపీగా చదవడం మొదలుపెట్టిన అతనికి అందులో తన గురించి తనకు కూడా తెలీని నిజాలు బయటపడతాయి. ఈ కథ ఒక ఆణిముత్యం. ఇందులో ఒక స్త్రీ జీవితంలోని వివిధ దశల్లో మానసికపరమైన మార్పుల్ని (grotesque absurdities, extravagant fantasies) అత్యద్భుతంగా ఆవిష్కరించారు.
I realized that you are two people rolled into one: that you are an ardent, lighthearted youth devoted to sport and adventure; and at the same time, in your art, a deeply read and highly cultured man, grave, and with a keen sense of responsibility. Unconsciously I perceived what everyone who knew you came to perceive, that you led two lives. One of these was known to all, it was the life open to the whole world; the other was turned away from the world, and was fully known only to yourself.
I understand now (you have taught me!) that a girl’s or a woman’s face must be for a man something extraordinarily mutable. It is usually nothing more than the reflection of moods which pass as swiftly as an image vanishes from a mirror. A man can readily forget a woman’s face, because age modifies its lights and shades, and because at different times the dress gives it so different a setting. Resignation comes to a woman as her knowledge grows.
మూడో కథ The Fowler Snared లో ఒక వృద్ధుడు సరదాగా కాలక్షేపానికి మొదలుపెట్టిన ఆట విషమించి అతన్ని మానసిక సంక్షోభంలోకి ఎలా నెట్టేసిందో, ఆ క్రమంలో తన దృష్టిలో తానే ఒక దోషిగా ఎలా నిలబడ్డాడో చెప్పే కథ.
Was it the ardent but aimless yearning that was so plainly manifest in her expression, the yearning of those wonderful hours in a girl’s life when her eyes look covetously forth into the universe because she has not yet found the one thing to which in due time she will cling—to rot there as algae cling to and rot on a floating log?
“You seem to be hinting that I have the mannerisms of your German novelists, that I am lyrically diffuse, stilted, sentimental, tedious.
నాలుగో కథ Invisible Collection ఒక విలువైన వస్తువుల్ని సేకరించే వ్యాపారి కుటుంబంపై యుద్ధపరిణామాల తాలూకూ ప్రభావాన్ని గురించి చెప్తుంది. ఒకరిని సంతోషపెట్టడం కోసం అవసరమైతే అసత్యాన్ని ఆశ్రయించడంలో తప్పు లేదని చెప్తూ, ఊహలు వాస్తవాలకంటే అందమైనవి అని మరో మారు రుజువు చేస్తుంది.
An eerie business to watch the handling of these two or three hundred blanks, to chime in at appropriate moments with praise of merits which for the blind collector were so eminently real that again and again (this was my salvation) his faith kindled my own.
As he spoke, his fingers caressed the despoiled portfolios. It was horrible and touching. Not for years, not since 1914, had I witnessed an expression of such unmitigated happiness on the face of a German.
ఐదో కథ Buchmendel నాకు అన్నిటికంటే నచ్చిన కథ. ఇందులో హిట్లర్ శకాన్ని మరోసారి గుర్తు చేస్తారు. సెకండ్ హ్యాండ్ పుస్తకాల వ్యాపారి Jacob Mendel వియన్నాలో Cafe Gluck అనే చిన్న హోటల్ లో ఉదయం నుంచీ సాయంత్రం వరకూ ఒకే టేబుల్ వద్ద కూర్చుని తన పుస్తక ప్రపంచంలో గడుపుతుంటాడు. పుస్తకాల గురించి అణువణువూ తెలిసిన, అరుదైన పుస్తకాల వివరాలు కూడా పేజీలతో సహా ఠక్కున చెప్పగలిగిన Mendel లాంటి అసాధారణ ప్రతిభ ఉన్న వ్యక్తి ఆ చిన్న హోటల్ లో కూర్చోవడం ఆ హోటల్ కే గర్వకారణం. ఆ విధంగా ప్రక్కన ఎవరున్నా, చుట్టూ ఏం జరుగుతున్నా తన పుస్తకాల మాటున కళ్ళజోడు సవరించుకుంటూ తన లోకంలో తానుండే Mendel జీవితం ఒకరోజు హఠాత్తుగా మారిపోతుంది. అవధుల్లేని తన పుస్తక ప్రపంచం నుంచి, అడుగడుగునా పరిమితులు విధించే వాస్తవ ప్రపంచలోకి తన ప్రమేయం లేకుండానే వచ్చి పడ్డ Mendel ఆ లోకంలో ఇమడగలిగాడా లేదా అనేది కథాంశం. Buchmendel పాత్రలో పుస్తక ప్రేమికులు తమని తాము ఐడెంటిఫై చేసుకుంటారు.
This Galician second-hand book dealer, Jacob Mendel, was the first to reveal to me in my youth the mystery of absolute concentration which characterizes the artist and the scholar, the sage and the imbecile; the first to make me acquainted with the tragical happiness and unhappiness of complete absorption.
The man is a saurian of the book world, an antediluvian survivor of an extinct species.
Apart from books, he knew nothing of the world. The phenomena of existence did not begin to become real for him until they had been set in type, arranged upon a composing stick, collected and, so to say, sterilized in a book. Nor did he read books for their meaning, to extract their spiritual or narrative substance.
జర్మన్ కథల్లో మాత్రమే కనిపించే ఒక రకమైన మేజిక్ ఈ కథల్లో కూడా ఉంది. టాల్స్టాయ్ శైలిని ను ఇష్టపడేవారు Zweig ను కూడా నిస్సందేహం గా ఇష్టపడతారు. Sigmund Freud స్నేహితుడూ/అభిమానీ కావడం వల్లనేమో Zweig కథల్లో విపరీతమైన సైకో అనాలిసిస్ కనిపిస్తుంది. కానీ ఆ అనాలిసిస్ పైకి సరళంగా ఉంటూనే లోతుగా ప్రయాణిస్తుంది. ఈ కారణం వల్లనేమో ఈ కథలు మెదడుకి ఎక్కువ శ్రమ ఇవ్వకుండా, చదవడానికి చాలా హాయిగా అనిపిస్తాయి. కొంతమంది రచయితలు వాస్తవ పక్షపాతులైతే మరికొందరు కాల్పనికతకు దాసోహమంటారు. మరికొందరు ఆ చేదు నిజాలు మనకొద్దు, ఇదిగో ఊహాప్రపంచం అంటూ మనల్ని అబ్బురపరిచే లోకాలకు తీసుకు వెళ్తారు. కానీ వాస్తవాన్నీ,కాల్పనిక ప్రపంచాన్నీ ఏక కాలంలో అనుభవంలోకి తెచ్చే రచయిత Stefan Zweig. “ఇదిగో ఇది వాస్తవం, కానీ నాకది ఇష్టం లేదు, నా ప్రపంచం ఇలా ఉండాలి, ఇలా ఉంటుంది” అని శాంతిని కాంక్షిస్తూ మనకు తన పండోరా ప్రపంచాన్ని పరిచయం చేస్తారు. ఈ Zweig లోకంలో వ్యక్తులకు వాస్తవంతో పని లేదు. ఒకవేళ గమనించినా, తెలిసినా తెలియనట్లు ‘అజ్ఞానం ఆనందం’ అని తమ లోకంలో తాముంటారు. వారు కనిపిస్తే ఏదో ధ్యానంలో ఉన్నట్లో, నిష్ఠగా పూజ చేస్తున్నట్లో వారి కళ్ళు మనకి కనిపించని లోకాల్లో విహరిస్తున్నట్లు ఉంటాయి. For only he who lives his life as a mystery is truly alive అని నమ్మే వారి మనస్సుల్లో తమంతట తాము చెప్తే తప్ప తెలుసుకోలేని రహస్యాలు దాగుంటాయి, వాస్తవికతను ఎదుర్కోలేక తమ ప్రపంచాన్ని చేరుకోలేక ఒక విధమైన ద్వైదీభావంతో కొట్టుమిట్టాడుతుంటారు. Zweig పాత్రలు ముఖ్యంగా ఆదర్శవాదులు. పెర్ఫెక్షనిస్టుల్లా ప్రేమంటే ఇదీ,జీవితం అంటే ఇలా ఉండాలి, ఇలా బ్రతకకపోతే వృధా అన్నట్లు నిర్ధిష్టమైన అభిప్రాయాలు కలిగి ఉంటారు. వారి వ్యక్తిత్వాల్లో రిజిడిటీ,మచ్చలేని అమాయకత్వంతో పాటు అబ్సర్డిటీ కూడా కనిపిస్తుంది. ఈ కథల్లో ఆదర్శవాదం నాకెంతో ఇష్టమైన ఆదుర్తి సుబ్బారావు గారి బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో హై మెలోడ్రామాను తలపించింది. వరుస సీరియస్ రీడ్స్ తరువాత ఈ కథలు చదవడం ఒక ఆహ్లాదకరమైన అనుభూతిని మిగిల్చింది.
పుస్తకం నుండి మరికొన్ని:
He did not smoke; he did not play cards; one might almost say he did not live, were it not that his eyes were alive behind his spectacles, and unceasingly fed his enigmatic brain with words, tides, names. The brain, like a fertile pasture, greedily sucked in this abundant irrigation.
In the upper world of books, where Mendel lived and breathed and had his being, there was no warfare, there were no misunderstandings, only an ever-increasing knowledge of words and figures, of book-titles and authors’ names.
I, who at least should have known that one only makes books in order to keep in touch with one’s fellows after one has ceased to breathe, and thus to defend oneself against the inexorable fate of all that lives—transitoriness and oblivion.
Leave a Reply