పుస్తకం.నెట్ ఆరో వార్షికోత్సవం

పుస్తకం.నెట్ అనే ప్రయత్నాన్ని మొదలుపెట్టి ఈ రోజుకి ఆరేళ్ళు. పుస్తకాలకు మాత్రమే ప్రరిమితమైన వెబ్‌సైటును ఇన్నేళ్ళుగా ఆదరిస్తున్న, అభిమానిస్తున్న తెలుగు చదువరులకి మా ప్రత్యేక ధన్యవాదాలు. గత ఆరేళ్ళుగా ఈ ప్రయాణంలో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అభివందనాలు. అందరికి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు.

గడిచిన ఏడాదిని అంకెల్లో ఒకసారి చూసుకుంటే:

వ్యాసాలు: 279

వ్యాఖ్యలు: 701

హిట్స్: 2,17,247

మొత్తం ఆరేళ్ళల్లో:

వ్యాసాలు: 1617

వ్యాఖ్యాలు: 8830

హిట్స్: 12,49,659

గత ఏడాదిలో పుస్తకంలోని కొన్ని ముఖ్యమైన పేజీలు:

  • అంతర్జాలంలోని సాహిత్యపు విశేషాలను ఒకచోటకు తెస్తున్న వీక్షణం ఏడాది పొడువునా నిరాటంకంగా కొనసాగింది.
  • విశ్వనాథ సత్యనారాయణ నవలలను పన్నెండు వారాల పాటు శ్రీవల్లి రాధిక పరిచయం చేశారు.
  • దాదాపుగా, ఏడాది మొత్తం, వారానికి ఐదు వ్యాసాలు ప్రచురితమైయ్యాయి.
  • జాస్తి జవహర్ కళాపూర్ణోదయం గురించి రాస్తున్న వ్యాసాలు.
  • పుస్తకం.నెట్‌లో రచయిత పరంగా గానీ, భాషా పరంగా గానీ, జాన్రే ప్రరంగా గానీ వైవిధ్యమైన పుస్తకాల పరిచయాలు వచ్చాయి.

 

p6

 

ప్రత్యేక ధన్యవాదాలు:

  • శ్రీవల్లి రాధిక గారికి, విశ్వనాథగారి పుస్తకాలను పరిచయం చేసినందుకు
  • వంశీ మాగంటి గారికి, విశ్వనాథ సత్యనారాయణగారి పుస్తకాల కవర్ పేజీలు అందించినందుకు.
  • దేవినేని మధుసూదన్‌గారికి, మరికొందరి చేత వ్యాసాలను రాయించినందుకు
  • అనిల్ అట్లూరి గారికి, పుస్తకావిష్కరణ సభల వివరాలు ఎప్పటికప్పుడు తెలిపినందుకు.
  • చౌదరి జంపాల గారికి, పుస్తకం.నెట్‍ను ఆదరిస్తూ, అది ఇంకా ఎక్కువ మందికి చేరడానికి సాయపడుతున్నందుకు.
  • శిరీష్ గారికి, సాంకేతిక సహాయాన్ని అందించినందుకు.

పుస్తకం.నెట్ ప్రయాణం:

పుస్తకం.నెట్ మొదలైనప్పటి నుండి జరిగిన ప్రయాణాన్ని తెలిపే వార్షికోత్సవ టపాలు ఇవిగో..

  1. ఐదో సంవత్సరం
  2. నాలుగో సంవత్సరం
  3. మూడో సంవత్సరం
  4. రెండో సంవత్సరం
  5. మొదటి సంవత్సరం

ఈ ఏడాది కూడా:

పుస్తకం.నెట్ వెబ్‌సైట్లో వ్యాసాల సంఖ్య బానే పెరుగుతుంది. దాంతో పాత వ్యాసాలను వెతుక్కోవటంలాంటివి కష్టమైయ్యాయి. ఈ సాంకేతిక సమస్యలను వీలువెంబడి పరిష్కరించడానికి ప్రయత్నిస్తాము. అంతవరకూ, ఎప్పటిలానే పుస్తకం.నెట్‌ను ఆదరిస్తారని ఆశిస్తున్నాము.

ఇప్పటిదాకా వచ్చిన వ్యాసాలను ఒకచోటున, నెలవారిగా చూడ్డానికి ఖజానా పేజి చూడగలరు. మీ వ్యాసాలను, అభిప్రాయాలను editor@pustakam.net కు పంపగలరు.

అందరికి మరోసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు!

You Might Also Like

5 Comments

  1. bhanukemburi

    శుభాకాంక్షలు ఇందులో నేను భాగమైనందుకు ఇంకా ఆనందంగా ఉంది

  2. తృష్ణ

    Congratulations! Good going ..great job.

  3. vijaya

    అభినందనలు. ఈ ప్రయాణం ఇలాగే కొనసాగి నా లాంటి ఎంతో మందికి మంచి పుస్తకాలను పరిచయం చేస్తూ 100 సంవత్సరాల వార్షికోత్సవం జరుపుకోవాలని మనసారా కోరుకొంటున్నాను.

Leave a Reply