పుస్తకం
All about books



వార్తలు

January 1, 2012

పుస్తకం.నెట్ మూడో వార్షికోత్సవం

జనవరి 1 – నూతన సంవత్సర ఆగమనోత్సవమే కాక, పుస్తకం.నెట్ వార్షికోత్సవం కూడా! నేటితో పుస్తకం.నెట్ మొదలుపెట్టి మూడేళ్ళు పూర్తయ్యి, నాలుగో సంవత్సరంలో అడుగిడుతున్నాము. ’పుస్తకం’ అభిమానులకు, వ్యాసకర్తలకు, చదువరులకు నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు, పుస్తకం.నెట్ వార్షికోత్సవ శుభాభినందనలూనూ.గడిచిన ఏడాదిలో ’పుస్తకం’ ప్రస్థానం గురించి చెప్పుకోవాలంటే:
సంఖ్యాబలం:

2011లో పుస్తక ప్రస్థానం, సంఖ్యల్లో:వ్యాసాలు: 268
వ్యాఖ్యలు: 3210
హిట్స్:  211049

మూడేళ్ళల్లో పుస్తకం సాధించుకున్న అంకెలు:వ్యాసాలు: 853
వ్యాఖ్యలు: 5660
హిట్స్:  557,800

వ్యాసపరంపర:

 • ప్రతి ఏడాదిలానే, చినుకు చినుకు రాలి సముద్రం అయినట్టు, ఒక్కోరు తలా ఓ చేయి వేయటం వల్ల దాదాపుగా  270 వ్యాసాలు ప్రచురితమయ్యాయి.
 • జంపాల చౌదరిగారు గడిచిన ఏడాదిలో నిరాటంకంగా యాభై రెండు వారాల పాటు, యాభై రెండు వ్యాసాలతో అనేకానేక పుస్తకాలను పరిచయం చేసారు.
 • మల్లిన నరసింహరావుగారుఅభినయ దర్పణం, ఆంధ్ర మహాభారతం పేరిట రెండు శీర్షికలు నిర్వహిస్తూ ప్రాచీన గ్రంథాలను పునర్పరిచయం చేస్తున్నారు.
 • గతంలో లాగానే 2011లో కూడా, పాత-కొత్త, సాహిత్యం-సాంకేతికం, కథ-వ్యాసం తెలుగు-ఇంగ్లీష్ అన్న భేదాలు లేకుండా అన్ని రకాల పుస్తకాల గురించి ఎన్నో వ్యాసాలు వచ్చాయి. కొన్ని ఇతర పత్రికల్లో వచ్చిన వ్యాసాలను, కొన్ని పుస్తకాల ముందు మాటలను కూడా ప్రచురించటం జరిగింది.
 • నండూరి, ముళ్ళపూడిగార్ల గురించి వచ్చిన అరుదైన వ్యాసాలు, వారి కుటుంబసభ్యుల ద్వారా!

ఒడిదుడుకులు:

 

 • అనూహ్యంగా సైట్‍ను ఒక పది రోజుల పాటు మూసివేయాల్సి వచ్చింది, సాంకేతిక ఇబ్బందుల వల్ల. పుస్తకం.నెట్ పాఠకులకు ఓ మాట చెప్పే వీలు కూడా లేని పరిస్థితుల్లో సైట్‍ను నిలిపివేయాల్సి పరిస్థితుల్లో కూడా మాకు అండదండగా ఉన్న పొద్దువారి గురించి, తమ తమ వ్యాసాల ప్రచురణలో జరిగిన జాప్యాన్ని సహృదయంతో అర్థం చేసుకున్న  వ్యాసకర్తల గురించి, అన్ని రోజులూ ఓపికతో వేచి చూసిన ’పుస్తకం’ చదువరుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి ఉంది.
 • దాదాపుగా మూడేళ్ళ తర్వాత ’పుస్తకం’కు ఒక కొత్త ఆకృతినీ, ఆకారాన్ని ఇవ్వదల్చి కొత్త థీం‍ను ప్రవేశపెట్టాము. కాకపోతే, పైన చెప్పిన సాంకేతిక కారణల వల్ల జరిగిన జాప్యానికి, ఈ థీం‍ పనులను కూడా చేర్చి మరింత ఆలస్యం చేయకూడదని, ఆ థీం‍ను ఆదరాబాదరగా పెట్టటం జరిగింది. సమయానుకూలంగా తగిన మార్పులూ, చేర్పులూ చేసి ఒక తీరైన సైట్‍ను మీ ముందు నిలిపాలన్నది మా అభిమతం. అంతవరకూ ఓపికతో భరిస్తున్నందుకు చదువురలకు ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే థీం మార్చగానే అందులోని లోటుపాటులని సవివరంగా చెప్తూ మెయిల్స్, కాల్స్ ద్వారా తెలిపినవారికి కూడా కృతజ్ఞతలు.
 • కొత్త థీం వల్ల “మీరేం చదివారు?”, “చెప్పాలని ఉందా?” పేజీలను తాత్కాలికంగా తీసివేయటం జరిగింది. త్వరలోనే పునఃప్రవేశపెట్టబడతాయి.
 • వ్యాసకర్తలకూ, వ్యాఖ్యాతలకూ అభిప్రాయభేధాలు కలిగే చెదురుమదురు సంఘటనలలో నిర్వాహకులను తప్పుబట్టటం పరిపాటిగా మారింది. పుస్తకంలో వచ్చే వ్యాసాల్లో వెలిబుచ్చిన అభిప్రాయాలు ఆయా వ్యాసకర్తలవే గానీ నిర్వాహుకలవి కావు. వ్యాసకర్తతో విభేధించదలచినవారు విషయపరంగా చర్చను లేవదీసి, అభ్యంతరకర, అసభ్యపదజాలాలు, వ్యక్తిగత దూషణలకు పోకుండా ఉండమని మనవి.


ఇక పై:

 • పుస్తకం థీం విషయంలో మార్పులూ చేర్పులూ చేసి చదువరులకు అనువుగా సైట్‍ను తీర్చిదిద్దాలన్నది ప్రథమ లక్ష్యం. వెనువెంటనే చేయలేకపోయినా, వీలైనంతగా దీన్ని సాధించటానికి ప్రయత్నిస్తాం.
 • పుస్తకం.నెట్‍లో పుస్తక పరిచయాలే ఎక్కువగా రాయబడుతున్నాయి. అవే కాక, మరేమేం రాయచ్చు అనే దాని గురించి మరొక్క సారి:
  • ఏ భాష పుస్తకమైనా, దేనికి సంబంధించిన పుస్తకమైనా : దానిపై మీ అభిప్రాయాలూ, మీ పఠనానుభవాలు, పరిచయాలు, విశ్లేషణలు, విమర్శలు ఏవైనా…
  • మీకు నచ్చిన రచయిత గురించి మ్యూజింగ్స్
  • పుస్తక ప్రదర్శనలలో మీ అనుభవాల గురించి
  • పుస్తక విక్రేతలతోనో, పుస్తక ప్రియులతోనో, రచయితలతోనో, ఇతర చదువరులతోనో : పుస్తకాల గురించిన మాటామంతీ
  • పుస్తకావిష్కరణ గురించో, పుస్తకాల అమ్మకం గురించో మరే పుస్తక ప్రపంచ సంబంధిత విషయం గురించైనా వార్తలు
  • ఆన్లైన్ లో చదివిన వ్యాసాల గురించి, ఈపుస్తకాల గురించి, ఆడియో పుస్తకాల గురించి
  • కాపీరైట్ల వంటి సమస్యలు లేని పాత తరం వ్యాసాలను యూనీకోడీకరించడం
  • …. ఇలా చెప్పుకుంటూ పోతే, పుస్తక ప్రపంచంతో సంబంధం ఉన్న ఏ అంశం గురించైనా, పుస్తకం.నెట్ లో ఉండదగ్గదే!


కృతజ్ఞతలు:

 • సైటు నిర్వహణ విషయంలో ఎప్పట్లాగే ఎంతో సహకరించిన “పొద్దు” బృందానికి ధన్యవాదాలు.
 • కొన్ని వ్యాసాలు పునర్ముద్రణకు అంగీకరించిన “వీక్షణం” పత్రిక వారికీ, డీటీఎల్సీ వారికి, “పెన్నాతీరం” రచయిత ఈతకోట సుబ్బారావు గారికి
 • మధ్యలో ఒక పదిరోజులు సైటు మూసివేయబడ్డా  కూడా విసుక్కోకుండా, కొత్త రూపును దిద్దడంలో మేము నెమ్మదిగా సాగుతున్నా కూడా మమ్మల్ని ఆదరిస్తూ, ప్రోత్సహిస్తూనే ఉన్న అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు.
 • ఏమాత్రం తరగని ఉత్సాహంతో క్రమం తప్పకుండా విభిన్నమైన పుస్తకాల గురించి రాస్తూ, ఎన్నో కొత్త విషయాలను తెలియజేస్తూ, మాకు ఎంతో స్పూర్తిని కలిగిస్తున్న జంపాల, మల్లిన గార్లకి ప్రత్యేకంగా ధన్యవాదాలు.
 • తమ తమ బ్లాగుల్లో ప్రచురించుకునే అవకాశం ఉన్నా,’ పుస్తకం’ ను పుస్తకాభిమానుల వేదికగా గుర్తించి తమ వ్యాసాలను పంపి ప్రోత్సహిస్తున్న ప్రతి వ్యాసకర్తకూ కృతజ్ఞతాభివందనాలు! వీరే లేకపోయుంటే పుస్తకం ఇంత నిరాటంకంగా నడవడం అసాధ్యమయ్యేది.

 

ఈ మూడేళ్ళలో లాగానే, మీరంతా సహాయసహకారాలు అందించి, విరివిగా వ్యాసాలు రాసి, మన పుస్తకం‍.నెట్‍ పురోగతికి తోడ్పడగలరని ఆశిస్తున్నాము.

అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు!

ఇవి గాక, మీ సలహాలూ, సూచనలూ ఇక్కడ వ్యాఖ్యల ద్వారానో, editor@pustakam.net కు వేగు ద్వారా తెలియజేయగలరు.



About the Author(s)

పుస్తకం.నెట్



9 Comments


 1. k.ravibabu

  belated congratulations on the eve of third anniversary. can you send the editorial of the first issue of pustakam .net for publication in our prajasahithi?readers linterested in telugu literary magazilne can visti us at www. prajaasaahilthi.com


 2. Gireesh K.

  Hearty congratulations! Excellent work! Kudos to the team!


 3. drsjatinkumar

  as i am not a regular net reader i did not know about pustakam.net , now i want to learn telugu type writing and participate in pustaka sameekshalu, iam also a regular reader of telugu books and like to express my opinions , how shud i become a part of your programmes


  • జంపాల చౌదరి

   జతిన్‌కుమార్ గారూ:
   http://pustakam.net/?page_id=333 చూడండి. మీరు వ్రాయదలచుకున్న పుస్తకం గురించి వ్రాసేయడమే. తెలుగులో వ్రాయడానికి చాలా పరికరాలున్నాయి. suravara.comవారు క్రిందటివారమే తెలుగు కీబోర్డును మార్కెట్లోకి తెచ్చారు. లేదంటే http://www.lekhini.org, ఇంకా ఇతర వెబ్‌సైట్లు ఉన్నాయి.


 4. Anil Reddy

  subhakankshalu…


 5. జంపాల చౌదరి

  హృదయపూర్వక శుభాకాంక్షలు!
  మొదటి రెండు సంవత్సరాలలో వచ్చిన కామెంట్లకన్నా ఒక్క మూడో సంవత్సరంలో కామెంట్లు ఎక్కువ వచ్చాయంటే ఆసక్తి పెరిగిందనే అనుకోవాలి కదా!
  ఎన్నో ఆసక్తికరమైన వ్యాసాలకోసం, విభిన్నమైన దృక్పథాలకోసం, కొత్త స్నేహాలకోసం ఎదురుచూస్తున్నాను.


 6. Great going! అభినందనలు, శుభాకాంక్షలు. 🙂
  Cute cartoon! 😀


 7. G.S.Lakshmi

  మూడవ వార్షికోత్సవ శుభాకాంక్షలు…


 8. మూడవ వార్షికోత్సవ శుభాకాంక్షలతో……
  2012 నూతన సంవత్సర ( ఆంగ్ల ) శుభాకాంక్షలతో…..
  నూతనోత్సాహం ( శిరాకదంబం )



  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *




 
 

 

Ngugi Wa Thingio’s “Education for a national culture”

Article By: Halley ఈ పరిచయం ప్రసిద్ధ ఆఫ్రికా రచయిత గూగి (Nguigi Wa Thiongio) రాసిన Education for a national culture అన్న వ్యాసం గు...
by అతిథి
0

 
 

నీల :: కె. ఎన్. మల్లీశ్వరీ

వ్యాసకర్త : జయశ్రీ నాయుడు దాదాపుగా ఆరు వందల పేజీల కథా గమనాన్ని సమీక్ష గా కుదించాలంటే ...
by అతిథి
0

 
 

గడ్డి పూలు – గుండె సందుక

వ్యాసకర్త: ఎ.కె.ప్రభాకర్ ************** పూల మనసుల్లోకి … శాంతి ప్రబోధ కథా సంపుటి “గడ్డి పూల...
by అతిథి
1

 

 

On Writing: Stephen King

Written by: K.S.M Phanindra Books that teach writing are often very dry and I deliberately avoid them. I have read a couple of them and liked some of them a lot. Two of my favorites are “Telling Writing” by Ken Macr...
by అతిథి
1

 
 

నా 2017 పుస్తక పఠనం

మరో ఏడాది ముగుస్తోంది. ఈ ఏడాదిలో చదివిన పుస్తకాల గురించి రెండు ముక్కలు చెప్పుకోవడాన...
by సౌమ్య
1

 
 

పుస్తకం.నెట్ తొమ్మిదో వార్షికోత్సవం

ఇవ్వాళ్టితో పుస్తకం.నెట్ మొదలుపెట్టి తొమ్మిదేళ్ళు పూర్తవుతుంది. ముచ్చటగా పదో ఏట అడ...
by పుస్తకం.నెట్
0