మట్టీ, మనిషీ, ఆకాశం – సినారె

రాసిన వారు: చావాకిరణ్
*************

matti_manishi_aakaasam

మట్టీ, మనిషీ, ఆకాశం అని డాక్టర్ సి. నారాయణ రెడ్డి గారు వ్రాసిన కవిత. కవితంటే మామూలు కవిత కాదు. పొడుగు కవిత. ఇంకొంత మంది దీర్ఘ కవిత అని కూడా అంటారనుకుంటాను. ఓ చదువుతా ఉంటే వస్తా ఉంది. చదువుతూ ఉంటే వస్తా ఉంది. మొత్తం నూరు పేజీలు. ఫుల్ స్టాప్లు లేవు, కామాలు లేవు అలా చదివెయ్యాల్సిందే. అలా చదివెయ్యాల్సిందే. మధ్యలో ఐదారుసార్లు న్యూలైన్ ఎంటరయింది. మరి టైపింగ్ మిస్టేకో, సినారె గారు కావాలనే పాఠకులపై జాలి తల్చారో! మంచి ఘాడత ఉన్న కవిత. సినారె గారి సాహిత్యానుభవం ద్యోతమవుతుంది. ఏం వ్రాశారూ, చదువుతుంటే ఎక్కడా ఆపలేం. ఏమీ అర్థం కాదు. అక్కడక్కడా అర్థమయినట్టే ఉంటుంది, అక్కడక్కడా ఆహా ఏం వ్రాశాడు అనుకుంటాం, ఇంతలోనే టీవీ రిమోట్ పక్కోడి దగ్గరున్నట్టు చానల్ మారిపోతుంది. కవిత ఎక్కడికో జంపయిపోతుంది. అదో శైలి కాబోలు. ఒక్కసారి చదువుతాం, కొదిదగా ఎక్కినట్టే ఉంటుంది. కానీ ఏమీ ఎక్కదు. రెండో సారి చదువుతాం, కొద్దిగా ఎక్కినట్టే ఉంటుంది, కానీ ఏమీ ఎక్కదు. మూడోసారి చదువుతాం …. కొంత ఉహాలోకంలో ఉండి వ్రాసినట్టు తోచుచున్నది, కాని కొంత మాత్రం వార్తా పత్రికలు చదువుతూనో, టీవీ చూస్తూనో వ్రాసినట్టున్నది. ఈ పుస్తకాన్ని ఓ సారి తప్పకుండా చదవవచ్చు. నేర్చుకునేది చాలా ఉండొచ్చు.
విశాలాంధ్రలో లభిస్తుంది.
—-
కొన్ని పంక్తులు.

నెమలి పురులు ముడుచుకు కూచుంటే
అడివికి ఊపిరాడుతుందా
కాసేపు పడుకుంటామని కెరటాలు మొండికేస్తే
నది లెంపలు వాయించదూ.
క్షణాలైనా, హిమ కణాలైనా
కను రెప్పల ఆకుల అంచలాల నుంచి
బొట్లు బొట్లుగా జారి పడితేనే అందం
అంధకారం కూడా ఎప్పటికప్పుడు
తన పుటల్ని తనే తిప్పేసుకుంటుంది.
….
….
….
అభినయించేది శృంగారమా
ఆంగిక పైశాచిక క్రీడావికారమా
ఆవి జాలువారే వాలు చూపులు కాదు
కాటేసే ముందు కాలు దువ్వే పాముల నాల్కలు.
సంభాషణల మద్య ఉన్మాదం నుసి రాలుతుంది.
స్క్రిప్ట్ లేని పాత్రలొచ్చి
వేదికమీద ఓండ్ర పెడతాయి.
ఒకోసారి మనం చూసే జీవిత చిత్రానికి
నకలులా లేదూ యిది?
ఇంతటితే తెరదించకపోతే
ఈ రూపకం రసాభాసమవుతుంది.
….
….
….
పొద్దు పొడుపును చూడగానే
తూర్పుదిక్కు పట్టనంత పరవశించిపోయే తాను –
కిటికీలోనుంచి నెలవంక పలకరించగానే
రెండు కళ్లూ ఆ తునకకే అంకితం చేసే తాను-
కొండకొస నుంచి దూకే జలధారలో
గుండెలోని శ్రుతిని సరిచూసుకునే తాను-
తోటి మనిషి అలికిడి వింటేనే
తుళ్లిపడతాడెందుకని?
….
….

You Might Also Like

One Comment

  1. Srinivas

    ఇంతటితే తెరదించకపోతే
    ఈ రూపకం రసాభాసమవుతుంది.

    ఈ మాటలు మాత్రం ఆయన కవిత్వ జీవితానికి వర్తిస్తాయి.

    సినీ నటుడు కృష్ణ గుర్తొస్తుంటాడు. పాపం తలచాలో లేదో తెలియదు.

Leave a Reply