శ్రీ రమణ “మిథునం” కథపై నా ఆలోచనలు

వ్యాసం రాసిన వారు:  విష్ణుభొట్ల లక్ష్మన్న

దాదాపు పదేళ్ళ క్రితం అనుకుంటా. అప్పుడు డేటన్, ఒహయ్యోలో (USA) ఉన్న చౌదరి జంపాల గారు బాపూ చేతి రాతలో ఉన్న శ్రీ రమణ రాసిన ఒక పెద్ద కథ (మిథునం) ప్రతిని ఒకటి కథలపై ఆసక్తి ఉన్న మిత్రులుకు పంపుతూ, నాకూ ఒకటి పంపించారు. అందరిలాగే నేనూ ఆ కథ చదివి అబ్బుర పడ్డాను. కొన్ని కథలను మనం కష్టపడి చదువుతాం! కొన్ని కథలు మనల్ని చదివిస్తాయి. ఈ చదివించే కథల్లో కొన్ని మాత్రమే మనల్ని ఆలోచింప చేస్తాయి. ఈ ఆలోచింపజేసే కథల్లో ఒకటో, రెండో మనల్ని వెంటాడే కథలుంటాయి. అదిగో! అలా వెంటాడే కోవకి చెందిందే “మిథునం” కథ.

ఈ కథపై చాలానే మంచి సమీక్షలు వచ్చాయి. తరవాత శ్రీ రమణ గారిని కలిసినప్పుడు మళయాళంలో “మిథునం” కథని సినిమాగా తీసారని చెప్పారు. అది నేను చూడలేదనుకోండి. కానీ కథలోని వర్ణనలు అతి మనోహరంగా చూపించటానికి కేరళ ప్రాతం భేషుగ్గా కుదురుతుందని నేను చాలా తేలికగా ఊహించుకోగలను.

తెలుగులో రాసిన కథలన్నీ తెలుగు కథలే కానక్కర లేదు. కానీ ఈ కథ అచ్చమైన తెలుగు కథ. ఒక తెలుగువాడు తప్ప ఇలాంటి కథ రాయలేడు. కథ ఇతివృత్తం చాలా సామాన్యమైనది. వృద్ధాప్యంలో ఉన్న దంపతులు (అప్పదాసు, బుచ్చిలక్ష్మి), వారి పిల్లలు తమ ఉద్యాగాల కోసం మరెక్కడో బతుకుతున్నపుడు, ఒకరికొకరు తోడుగా గడిపే దైనందిన జీవితంలో ఉండే విశేషాలు, వారి మధ్య ఉన్న అంతులేని అనురాగం, చిలిపి చేష్టలు, కోపతాపాలు, మాటల్లో అనురాగంతో కూడిన విసుర్లు, వారున్న ఇంటిలోని వాతావరణం, భోజన అలవాట్లు మొదలైన వివరాలతో కళ్ళకు కట్టినట్టుండే దృశ్యాలను అతి తేలికగా ఊహించుకొనేట్లు శ్రీ రమణ గారు అత్యద్భుతంగా రాసారు. కథ చివర్లో ఈ దంపతులకు వియోగం ఎలా వస్తుందో కూడా చిత్రిస్తూ కథ ముగిస్తారు రమణ గారు. కానీ ఈ కథలో ముగింపు కూడా ఒక కొసమెరుపే. ఈ కథను ఆన్‌లైన్‌లో చదవాలనుకొనేవారు ఇక్కడ నొక్కండి.

మిథునం కథలో కొన్ని పదాలు క్రమేణా తెలుగువారు మర్చిపోయారేమో అనిపిస్తుంది.  తెలుగు నుడికారం, కొన్ని ప్రాంతాలలో ఉన్న తెలుగువారి భోజన విశేషాలు, అలవాట్లు ఈ కథలో ప్రతి చోట కనపడుతూ ఉంటాయి. కథలోని అన్ని అంశాలు గొప్పవైనా, ఈ కథా కాలం నాటి మన రాష్టంలో కొన్ని ప్రాంతాల్లొ ఉన్న వాడుక భాష పదాలను తరవాతి తరాలకు అందించటం కోసమైనా ఈ కథను చదవాలి. గుర్తు పెట్టుకోవాలి!

ఈ కథలోని భాషా, శిల్పం, పాత్రల నిర్మాణం, కథ చెప్పే తీరు, వాడిన కంఠస్వరం మొదలైన అంశాలు అతి చక్కగా కుదిరాయి. చదువరలకి అతి సులభంగా “అనుభూతి ఐక్యత” ను అందిస్తుందీ కథ. కథా ఇతివృత్తం కూడా సార్వజనీయత ఉన్నదే. ఇటువంటి దంపతులు మనకి అనేక దేశాల్లో అన్ని కాలాల్లో కనిపిస్తారు. ఈ కథను గురించి నా ఆలోచనలు పచ్చిగా ఉండగా నేను చూసిన కొన్ని సంఘటనలు “మిథునం” కథకి సంబంధించినవే! ఈ నేపధ్యంలో అమెరికాలో నేను దగ్గరగా చూసిన రెండు కుటుంబాల (ముసలి దంపతుల) కథలకి “మిథునం” కథలో వర్ణించిన దంపతుల కథకి కొన్ని పోలికలు, తేడాలు మీ ముందుంచటానికి ప్రయత్నిస్తాను.

గత కొన్నేళ్ళుగా అమెరికాలో జీవితం గడుపుతున్న నాకు “మిథునం” కథ ఒక కొత్త దృష్టితో ఆలోచనలకు దారి తీసే అవకాశం కల్పించింది. మా కుటుంబానికి తెలిసిన ఒక భారతీయ వృద్ధ దంపతుల పిల్లలు పెరిగి పెద్దవాళ్ళై వారి కాపరాలు వాళ్ళు చేసుకుంటూ (మిథునం కథలోని ముసలి దంపతుల్లాగే) అప్పుడప్పుడు తల్లి, తండ్రులని చూస్తూ ఉంటారు. ఈ ముసలి దంపతులకి ఏమీ తోచదు. ఎప్పుడూ ఎవరైనా  తమ ఇంటికి వస్తారా లేదా తమనే ఎవరైనా వాళ్ళింటికి పిలుస్తారా అని చూస్తూ ఉంటారు. మా ఊళ్ళో జరిగే పార్టీలకి ఎప్పుడైనా వెడితే మొదట కనిపించేది ఈ వృద్ధ దంపతులే. అందరికన్నా ముందు వచ్చి, అందిరికన్నా ఆఖర్న వేళ్ళేదీ ఈ దంపతులే. ఇంత గందరగోళంలోనూ అందరూ తమని గుర్తించి గౌరవించాలనే ఆరాటం బాగా ఉన్న దంపతులు వీరు.

ఇంకో కుటుంబంతో మా కుటుంబానికి పరిచయం కాస్త ఎక్కువే! వారికి పెద్ద వయస్సు కూడా కాదు. బహుశా అరవయిల్లో ప్రవేశించారేమో ఆ మొగుడూ, పెళ్ళాలు ఇద్దరూ! వారికున్న ఒకే ఒక అబ్బాయి పదేళ్ళ క్రితం అకస్మాత్తుగా ఒక కారు ప్రమాదంలో చనిపోవడం వారి జీవితాల్లో అంతులేని అలజడి రేపిన సంఘటన. ఆ చనిపోయిన కుర్రాడికి అప్పుడు వయస్సు 18 లేక 19 ఏళ్ళు ఉంటాయేమో! ఆ దంపతుల జీవితంలో తేరుకోలేని పెద్ద దెబ్బ ఇది. ఆ దంపతులిద్దరూ వారి వారి వృత్తుల్లో అత్యున్నత శిఖరాలను చేరిన వారే! కాలం తెచ్చే మార్పుల వల్ల కొంత ఉపశమనం పొందిన తరవాత నెమ్మదిగా ఇతర వ్యాపకాలు ఆ దంపతులిద్దరూ చేసుకోటం మొదలు పెట్టారు. యోగా క్లాసుల్లో చేరటం, జీవన గమనం ఆధ్యాత్మిక పరంగా మళ్ళించటం, భారత దేశంలో అతి ప్రాచీనమైన విలువైన నాణాలని సేకరించటం లాంటి కొత్త అభిరుచులు పెంచుకోటం మొదలెట్టారు. ఖాళీగా ఉంటే పాత స్మృతులు జ్ఞాపకం వచ్చి బాధించకుండా వాళ్ళ జీవితాలకి కొత్త అర్ధం కల్పించుకొనేందుకు ప్రయత్నించారు.

ఈ రెండు కుటుంబాల కథలు తలచుకున్నప్పుడల్లా నాకు మిథునం కథ గుర్తుకు వచ్చేది. నాకో అమాయకమైన ఆలోచన ఉండేది. భారతీయ సంస్కృతి వయస్సు మళ్ళిన వారిని గౌరవిస్తుంది. పైగా మన సంస్కృతిలో ఉన్న ఆధ్యాత్మిక దృక్పధం వల్ల వయస్సు మీరిన వారు తమ ఆత్మలను అంతర్ముఖం చేసుకొని వృద్ధాప్యంలో ప్రశాంతమైన జీవితం గడుపుతారు. ఇటువంటి వెసులుబాటు పాశ్చాత్య దేశస్తులకి ఉండదు అనుకొనే వాణ్ణి.

ఈ విషయాల్లో నాదెంత అమాయకత్వమో మిథునం కథ చదివిన తరవాత తెలియటం మొదలైంది. ఎంతో మంది వయసు మీరిన అమెరికన్ దంపతులు తమ కాలాన్ని ఎంత అర్ధవంతంగా గడుపుతారో ప్రత్యకంగా నేను చూసాను. పైన చెప్పిన మొదటి కుటుంబం అన్నీ చక్కగా ఉన్న పరిస్థితుల్లో తమ జీవితాలని ఎంత నిస్తేజంగా గడుపుతున్నారో దానికి విరుద్ధంగా మేము చూసిన రెండవ కుటుంబం ఎన్నో అవాంతరాల మధ్య జీవితానికి ఒక అర్ధం కల్పించుకోవటం మొచ్చుకోతగ్గది. విభిన్న సంస్కృతుల్లోని ఎవరికైనా మిథునం కథలోని పాత్రలు అప్పదాసు, బుచ్చిలక్ష్మి దంపతుల అనురాగం ఆదర్శప్రాయమే!

You Might Also Like

17 Comments

  1. పుస్తకం » Blog Archive » Mithunam and Other Stories

    […] పూర్తిగా లేదు. “ఈ మధ్య శ్రీరమణగారు మిథునం అని ఒక చక్కని కథ వ్రాశారు. కథ నాకు […]

  2. డా. మూర్తి రేమిళ్ళ

    “మిధునం కథల సంపుటి”

    మిధునం అభిమానులందరికీ సుభవార్త … నిన్ననే (Aug 19, 2011)హైదరాబాద్ వెళ్ళినప్పుడు విశాలాంధ్ర మరియు ఇతర షాపులు అన్నీ వెతికి వెతికి చివరికి కాచిగూడా లో వున్న నవోదయ పబ్లిషర్స్ వారి షాపుకి వెళ్లి మొన్న జూలై లో రిలీజ్ అయిన మిధునం కథల సంపుటి కొన్నాను.. చూడగానే ఆనందం వేసేసి ఎవరికయినా ఇవ్వడానికి ఉంటుందని రెండు కాపీలు కొన్నాను. సరిపోవని ఇంకో కాపీ కొన్నాను. ఇంకా కొనబోయి ఇతర అభిమానులకి కూడా దొరకాలి కదా అని ఆగిపోయేను. మూడు గంటలకి కొన్నాను.. నిన్న సాయంత్రం ఇంటికి (బెంగుళూరుకి) వచ్చేలోగా సగం, ఇంటికి రాగానే పడుక్కునే లోగానే మిగిలినదంతా చదివేసేను కరువు తీరా ! ఒకదాన్ని మించిన కథ ఒకటి. కాపీ రైట్ ప్రొబ్లెమ్స్ వస్తాయేమో అని కానీ స్కాన్ చేసి అన్ని కథలనీ నెట్ లో పెట్టి ప్రపంచం లోని తెలుగు కథల, శ్రీ రమణ గారి అభిమానులు అందరికీ అందించాలని వుంది. కానీ ..చెప్పేను కదా.. !!

  3. Dr.Murthy Remilla

    Dear Lakshmanna garu,

    i requested sree Jampala chowdary garu to send me the hand written scriot by Sri Bapu of Mithunam story. 1997 communications chusi 3,4 mails chadivi chowdary gaariki mail pampenu. But just noe half an hour back reply vachindi “andarikee ichenu but unable to locate my own copy now” ani.

    also Mithunam is reprinted in July 2011 it seems. I will immediately buy the new release book but hand scrip is a class in itself. seeing your message that you have a copy given by sri Chowdary, i am requesting you to please spare the scan copy.

    Requesting any one else also to help me getting this master piece in bapu’s script. thanks in advance. (murthyremilla@antrix.gov.in)

  4. S.Nagamani

    I Read “MIDHUNAM” nearly 4 years back, but still it is in my memory. Whever i try to buy or search in on-line for a book,i’ll check for “MIDHUNAM” book.It is one of my favourite story.All the stories in Midhunam are very good.Thanks to Sri Ramana sir.

  5. sriram velamuri

    .నిజమే ,ఈ శతాబ్దపు అత్త్యుత్తమ కధలలో ఇది ఒకటి.మలయాళం లో సినిమాగా వచ్చింది .నాకు నచ్చలేదు

    1. BASHA

      నిజాం చెప్పారు SIR

  6. వెన్నెల

    ఒక గొప్ప అనుభూతిని మెగిల్చింది….
    మనసుకు హత్తుకుంది.

    నేను ఇంతకు పుర్వం ఈ కథ గుర్చి విన్నాను గాని ఎపుడూ చదవలేదు .ఈ సమీక్ష నాకు ఆ అవకాశం కల్పించింది

  7. తృష్ణ

    10ఏళ్ల క్రితం బాపూగారి చేతి రాతతొ పత్రికలో ప్రచురితమైన ఈ కధ..ఇంకా గుర్తు ఉంది..మేమూ అలానే చదవటం అలవాటు ఉన్న ప్రతివారికీ జిరాక్సు చేసి మరీ పంపించాము ఆ కధ… ఆ దంపతుల అన్యోన్యత అపూర్వం.

  8. భావకుడన్

    కథ “బావుంది” అని మాత్రమె అనిపించింది నాకు. కారణం ఇంతకు ముందు ఇలాటి కాన్సెప్ట్ లోనే ఇంకో రెండు కథలు నా గుండెలకు హత్తుకుపోవటం మూలాన కావచ్చు, పరిచయం లేని ఆ వాతావరణం కావచ్చు. ఈ కథను సినిమా నిడివికి ఎలా పెంచారో అని మాత్రం చాలా కుతూహలంగా ఉంది…నెట్ లో దొరుకుతుందేమో చూడాలి.

    దాదాపు ఇలాటి కాన్సెప్టే అనిపించిన ఆ రెండు కథలు

    ౧. jeffrey archer quiver full of arrows లోని the old love story అన్నది,
    ౨. భమిడిపాటి వారి “ఇట్లు మీ విధేయుడు” లోని “క్షణభంగురం” అన్నది

    మొదట చదివానేమో, the old love story is my favourite 🙂

  9. nagamurali

    నేనింతవరకు చదివిన అత్యుత్తమ కథల్లో ఇది ఒకటి. మొదటిసారి ఈ కథ చదివిన అనుభూతి ఇప్పటికీ గుండెల్లో భద్రంగా ఉంది. చదివిన వెంటనే అమ్మా, నాన్నల చేత చదివిస్తే వాళ్ళెంత ఆనందపడిపోయారో! ఎంతమందికి చెప్పి చదివించారో! ఆత్మీయ స్నేహితుడికి ఈ కథ మెయిల్ చేస్తే చదివి అతను ఏడిచేశాడు – వాళ్ళ తాతగారూ, బామ్మగారూ గుర్తు వచ్చి.

    శల్యపరిక్ష చేస్తూ చదివాను ఈ కథని అనేకసార్లు. బుర్ర ఎక్కువ పెట్టి చదివితే అక్కడక్కడా కొంచం ‘అతి’ అనిపించింది కానీ ఈ కథ చదివితే ఆనందం-విచారం-నోస్టాల్జియా అన్నీ కలగలిపిన గొప్ప అనుభూతిలో నాకు కన్నీళ్ళు రాకుండా ఉండవు.

    1. praveen

      naga murali garu
      mee daggara soft copy untey pampincha galarani asisthunnam….
      verey emaina manchi telugu pusthakalu kuda…..

      my id: praveennitc@hotmail.com

  10. కత్తి మహేష్ కుమార్

    కథ బాగానే ఉందిగానీ, ఏమిటో అది నాకు తెలీని లోకం కాబట్టి connect కాలేకపోయాను. బహుశా ఇన్ని “గొప్పగొప్ప” సమీక్షలు చదివి నా expectataions కూడా పెరిగిందేమో. అందుకే చాలా నిరాశ పడ్డాను.

  11. lalithasravanthi

    మిథునం కథ చదివాక నేను ఒక 3 రోజులు నిద్ర పోలేదు
    అంతగా కదిలి పొయా

  12. సుజాత

    “మిథునం కథ మీకెందుకు నచ్చింది?” అనే అంశం మీద ఒక పది మంది అభిప్రాయాలను సేకరిస్తే వెయ్యి పేజీల గ్రంథమవుతుంది.
    “సహజీవనం” అంటే ఏమిటో మనసుకు అంటేలా నిర్వచించిన కథ! ఈ శతాబ్దపు అత్యుత్తమ కథ! ఫణి బాబు గారు చెప్పినట్లు ఎంత చెప్పినా ఎంత రాసినా ఇంకా ఏదో మనసులో మిగిలే ఉంటుంది ఈ కథ గురించి!

  13. పుస్తకం.నెట్

    @Ramana garu:
    The link is now working. Thanks for pointing out.

  14. BPhaniBabu

    బాగుంది.మిథునం మీద ఏం వ్రాసినా సరిపోదు.

  15. రమణ

    ఈ లింక్ : “http://www.telugupeople.com/ShortStories/content.asp?ContentID=6180uid=20090328112934Page=1” సరిగ్గా పనిచేస్తున్నట్టులేదు.

Leave a Reply