నా రేడియో అనుభవాలు జ్ఞాపకాలు – శారద శ్రీనివాసన్
వ్యాసకర్త: శ్రీ అట్లూరి
*******
రోహిణి కార్తి ఎండా కాలం. మధ్యానం ఒంటి గంట రేడియో లో వార్తలు అవ్వగానే కార్మికుల కార్యక్రమం మొదలు అయ్యేది. అప్పుడే భోజనం ముగించి దాని దగ్గర చేరేవారు మా అమ్మ నాన్నలు. సీతక్క, ఏకాంబరం, రాంబాబు -వీళ్ళు చెప్పే కబుర్లు వినడానికి. అప్పుడు నా వయసు మూడో నాలుగో అదిగో అప్పటి నుంచి శారద గారు పరిచయం నాకు, నాలాంటి లక్షల మందికి. ఒక పురూరవుడు లో ఊర్వశి, లేదా సేక్ట్రటరీ లో నాయక, కన్యాశుల్కం లో మధురవాణి, ఒక పన్నా, ఇలా ఒకటా రెండా ఆవిడా లేని కార్యక్రమం లేదు అంటే అతిశయోక్తి కాదేమో.
నాకు ఆవిడతో నిజంగా పరిచయం ఎలా జరిగిందో అన్నది ఇంకో ఎపిసోడ్. నాకు మూడో ఏట ఆవిడతో పరిచయం అయింది అని చెప్పా కదా. దాదాపు ఇంకో ఆరు ఏళ్ళ తరవాత నాకు ఆంధ్ర బాలానంద సంఘంతో పరిచయం అయ్యింది. అప్పటికే రేడియో అన్నయ్యగా పేరు పొందిన న్యాయపతి రాఘవరావ్ గారి కంట్లో పడ్డాను (అప్పటికే అయన రిటైర్ అయ్యి చాల కాలం అయింది ). ఇంకేం నా రొట్టె విరిగి నేతి లో పడింది. అయన, వారి శ్రీమతి కామేశ్వరమ్మ గారు మమ్మల్ని (నేను, శ్రీధర్, శేఖర్) చాల బాగా చూసేవారు. ముగ్గురం రోజు సాయంకాలాలు ఇంక నారాయణగూడ లో బాలానందం లో పాటలో, నాటకాలో ఏదో ప్రాక్టిస్ చేస్తూ ఉండేవాళ్ళం. ఇంకా ఒక శనివారమో ఆదివారమో మమ్మల్ని తీసుకుని వారి కార్లో ఆకాశవాణికి తీసుకెళ్ళేవాళ్ళు అక్కడ మాకు ఒకరకంగా రాజభోగాలు జరిగేవి అని చెప్పొచ్చు.
వెళ్ళగానే మాకు కాంటీన్లో టిఫిన్ హార్లిక్స్ ఇచ్చేవారు. దాని తరవాత శనివారం అయితే శారద గారు ఆదివారం అయితే రావూరి భరద్వాజ గారు మేము చెప్పేది విని ఎమన్నా కరెక్ట్ చెయ్యలిసి వస్తే చేసి రికార్డింగ్ కి తీసుకుని వెళ్ళేవారు. అక్కడే మొదటి సారి నేను దేవులపల్లి గారిని, సీత, అనసూయ గార్లని చూసింది. అప్పటికి మాకు తెలీదు మేము పాడే జయ జయ ప్రియ భారత జనయిత్రి పాట అయన రాసిందే అని. అక్కడే మేము మహామహులయిన రజనీకాంత్ గారిని, పాలగుమ్మి వారిని చూసింది. పాలగుమ్మి వారి పాటలని నేర్చుకున్నది.
– అంతా ఒక్కటే మనమంతా ఒక్కటే ఆంధ్రులమైన అరవలమైన …
– దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా
– రారండో రారండో పిల్లల రా రారండోయి …
– అమ్మ నొప్పులే అమ్మమ్మ నొప్పులే
ఇలా ఒకటా రెండా ఎన్ని పాటలు ఎన్ని నాటికలు, నాన్న పులి, పడక కుర్చీ, శ్రవణ భద్రపదాలు, బూరెల మూకుడు ఇలా ఎన్ని నాటకాలు వేశామో గుర్తులేదు. అన్నయ్యగారు పోయినతరువాత అటు వైపు వెళితే ఆ గుర్తులే ఉండేవి.. ఆక్కడే మొదటి సరి బాల పుస్తకం చదివింది. (తరవాత దాంట్లో నే నా మొదటి కథ పడింది ). అక్కడే థామస్ ఆల్వా ఎడిసన్ గురించి, లింకన్ గురించి చదివింది. రావూరి గారి కథ పుస్తకం నాకు బహుమతి గా వచ్చిఅప్పుడు అది ఒక తీయని జ్ఞాపకం.
శారద గారి పుస్తకం చదువుతుంటే ఆ జ్ఞాపకాలు అన్ని సినిమాలో ఫ్లాష్ బ్యాక్ లాగ రీల్ వెంట రీల్ అలా తిర్గుతూ ఉంటాయి. రేడియో తో పరిచయం అనుబంధం ఉన్నవాళ్లు అందరు తప్పకుండ చదవలసిన పుస్తకం ఇది. కినిగే.కాం లో లభ్యం అవుతుంది.
****
ఈ పుస్తకం గురించి గతంలో పుస్తకం.నెట్ లో వచ్చిన చర్చ ఇక్కడ.
ఈ పుస్తకం గురించి బ్లాగుల్లో వచ్చిన వ్యాసాలు కొన్ని – మనసులో మాట బ్లాగు, నెమలికన్ను బ్లాగు
chuckareddy komatireddy
Me and my wife Anasuya visited Smt.Sharada Srinivasan in 1967 at Akashavani studios.We were her fans.We went all the way from Karimnagar to meet her.She recieved us with love and affection and introduced so many persons to us.When I came to know about her autobiography I called her to ask her to send the book to Karimnagar.Regularly I was calling Vishalandhra people to know whether they recieved it or not.Atlast I could get it.Still I want to keep the CDs of her plays to listen.What a voice.! If any one know about her CDs please inform me.I want to purchase them at any cost.-chuckareddy@hotmail.com