ఆ అరగంట చాలు – హర్రర్ కథలు

కస్తూరి మురళి కృష్ణ రచించిన హర్రర కథల సంకలనం ఈ ఆ అరగంట చాలు.

సినిమాల్లో అయితే, స్పెషల్ ఎఫెక్టులు వాడి, రకరకాల ధ్వనులతో గూభ గుయ్ మనిపించి వర్మ లాంటి వాళ్ళు మనల్ని భయపెడ్తారు. కానీ కథల్లో భయపెట్టడం ఎలా? ఒళ్ళు జలదరింపచెయ్యడం ఎలా? అఫ్ కోర్స్ పుస్తకం కవర్ పుట భయంకరంగా వుందనుకోండి.

ఈ పుస్తకం చదవడానికి సిద్దమవుతూ, ఏదో మామూలు పుస్తకం అనుకుంటూ ఆరంభించాను. కానీ పుస్తకం చదవడం ముగిశాక నా నిర్ణయం మార్చుకున్నాను. These are good stories. Author did complete justice to genre, Telugu nativity, writing style and of course money.
కస్తూరి రచనా వేగం చూస్తుంటే నాకు భయం. అతను రాశికోసం వాసి కోల్పోతున్నాడేమో అని. కానీ ఈ పుస్తకం ఆ భయాన్ని తొలగించింది. ఒక్కొక్క కథ శ్రద్దగా, అనవసర విస్తృతి లేకుండా వ్రాశాడు. విదేశీయుల పేర్లు పెట్టేప్పుడు మూసగా జాన్, పాల్ అని చేతులు దులుపుకోకుండా మంచి పేర్లు సెలక్ట్ చేసుకున్నాడు.

కథల వివరాలు

౧. ఆ అరగంట చాలు, అద్భుతమైన కథ. ముఖ్యంగా నాకు సైన్స్ ఫిక్సన్ అంటే ఉండే మక్కువ వల్ల నాకు ఈ కథ బాగా నచ్చింది. ౯/౧౦
౨. ఫాంటమ్ లింబ్, విభిన్నమైన కథ. ఒళ్ళు జలదరింపచేస్తుంది. కథ చదివిన తరువాత చాలా సేపు వెంటాడుతుంది. ౯/౧౦
౩. కలకానిది, కూల్ హర్రర్ స్టోరీ. సెవన్ సీటర్ ఎక్కేముందు మీరు మరోసారి ఆలోచిస్తారు. ఈ కథ చదివాక స్మశానం పక్కనుండి రాత్రి వేళ వెళితే కలిగే భయం లాంటిది వెంటాడుతుంది. ౮/10
౪. సాలెగూడులో, నిఖార్సైన సినిమా ఫక్కీ హర్రర్ కథ. ౭/౧౦
౫. ప్రేయసి కౌగిలిలో, అనుకున్నది ఒక్కటి, అయినది ఒక్కటి. ఎండింగ్ ఊహించవచ్చు. ౭/౧౦
౬. ఊర్మిళ, రొటీన్ దయ్యాల కథ. ౭/౧౦
౭. ప్రతీకారం, చేతబడి కాన్సెప్టు చుట్టూ అల్లుకున్న కథ. ౭/౧౦
౮. తెల్లపొగ, చాలా బాగుంది. కొంత సైన్స్ ఫిక్సన్ కలిసింది. ౯/౧౦
౯. నమ్మలేని నిజం, ఇంటిని పట్టుకు వేలాడుతున్న ఒక ఒంటరి దయ్యం కథ. ౭/౧౦
౧౦. చిత్ర పటం, విభిన్న కథాంశం. నేటివిటీలో బాగా కలిసిపోయింది. ౮/౧౦
౧౧. నేను చచ్చిపోతానా, ఉఫ్, జలదరింపచేసే కథ. ౯/౧౦
౧౨. చీకటిలో, దయ్యాల కథ. ౭/౧౦
౧౩. ఆమె ౮/౧౦
౧౪. యమదూత పిలుపు, రైలు ప్రమాదంలో పుట్టిన దయ్యాల కథ. ౬/౧౦
౧౫. ఆవాహనం, నలుగురు దయ్యాల పిచ్చోళ్ళతో ఒక దయ్యం కలిస్తే ఈ ఆవాహన. ౭/౧౦

పుస్తకం కినిగె.కాం లంకె ఇక్కడ.

**
(ఈ పుస్తకం గురించి పుస్తకం.నెట్లో వచ్చిన మరొక వ్యాసం ఇక్కడ)

You Might Also Like

Leave a Reply