చరిత్రకారుల చరిత్ర..
పుస్తకం పేరు: Eminent Historians, their technology, their line, their fraud
రచయిత: అరుణ్ శౌరీ.
పుస్తకాన్ని చూడగానే అనుమానం వచ్చింది…ఆ బొమ్మెంటి? అని. చదువుతూ ఉంటేగానీ అర్థం కాలేదు విషయమేమిటీ అన్నది. బొమ్మను బట్టి ఇది కమ్యూనిస్టులపై విమర్శనాస్త్రమని ఊహించగలిగారంటే, కొంతవరకూ మీరు సఫలీకృతులైనట్లే.
ఈ పుస్తకం అప్పట్లో 1998 ప్రాంతంలో మన పాఠ్య పుస్తకాలను, ప్రధానంగా చరిత్ర రచననూ కాషాయమయం చేస్తున్నారన్న వివాదం వచ్చిందే – దాని నేపథ్యంలో రాయబడిన పుస్తకం. శౌరీ బీజేపీ నేత కనుక పుస్తకంలోని కంటెంట్ గురించి కాస్త ఊహించవచ్చు కానీ,ఆ స్థాయి జర్నలిస్టు ఈ సమస్యలో ఎలా వాదిస్తాడో అన్న కుతూహలం నన్నీ పుస్తకం చదివేలా చేసింది. పుస్తకం చదివాక ఎంత మాత్రం నిరాశ చెందలేదని ఖచ్చితంగా చెప్పగలను. చివరికొచ్చేసరికి కాస్త అసంతృప్తి మిగిలిందనుకోండి, అది వేరే విషయం.
ఈ పుస్తకంలో ప్రధానంగా మూడు భాగాలున్నాయి.
1. The historians: ఈ విభాగంలో ప్రముఖ చరిత్రకారులపై విమర్శలు ఉంటాయి. విమర్శలంటే అట్లాంటిట్లాంటివి కావు. ఖచ్చితంగా రుజువులతో విమర్శిస్తాడన్నమాట. ఏ ప్రాజెక్టని మొదలుపెట్టి, ఎంత నిధులు పొంది, ఎంత పని చూపారు, ఇలా ఎన్నాళ్ళు చేసి ఎంత నష్టం కలిగించారు? వారిలో వారు ఒకర్నొకరు ఎలా సమర్థించుకుంటారు? విమర్శకులని వారు ఎలా ఎదుర్కుంటారు? – ఇలా రకరకాల కథనాలతో నిండి ఉంటుంది ఈ భాగం. నిజం చెప్పొద్దూ, ఆ గణాంకాలున్నాయి కనుక తప్పక వణికిపోవాల్సి వస్తోంది కానీ, నమ్మలేకపోయాను ఇదంతా చదువుతూ ఉంటే. ఏమిటీ, ఇంత పేరున్న వీరు ఈ పనులన్నీ చేసారా? అని.
2. Their Line: ఈ విభాగమంతా మన చరిత్రకారులు చరిత్ర రచన చేసిన విధానం గురించి చాలా వివరంగా, బోలెడన్ని ఉదాహరణలతో చర్చిస్తుంది. ఇతరుల్ని చరిత్ర రచనల్లో విమర్శించే పద్ధతి ఎలా ఉంటుంది? అదే సమయంలో విమర్శించే వారి పద్ధతిలోని లోపాలేమిటి? అసలు మన చరిత్ర రచనలో ఉన్న పొరపాట్లేమిటి? మెగా సైజు తప్పులేమన్నా ఉన్నాయా? పాఠ్య పుస్తకాల్లో చరిత్ర పాఠాల సిలబస్ మార్చాలన్న ఆలోచనలు ఎందుకు బయలుదేరాయి? ఎవరు చరిత్రను వక్రీకరిస్తున్నారు? – ఈ ప్రశ్నలన్నింటికి అరుణ్ శౌరీ తన పరిశోధనలో తెలుసుకున్న జవాబులు ఈ విభాగంలో ఉంటాయి. ఇంత పకడ్బందీగా ఉదాహరణలిచ్చాక, మరింత వణకడం తప్ప ఏమీ చేయలేకపోయాను – భయంతోనా, ఆవేశంతోనా, ఆలోచనతోనా? అంటే…ఏమో, మూడింటితోనేమో.
3. Context and Consequences: ఏళ్ళ తరబడి ఈ సంస్కృతి ఎలా వేళ్ళూనుకుని అలా స్థిరపడిపోయిందో, ఎక్కడెక్కడికి వ్యాపించగలదో, దీని పర్యవసానాలేమిటో, దీని బారిన పడి దేశమేమైపోయిందో – ఈ ధోరణిలో సాగుతుంది ఈ విభాగం.
నేను ఈ విభాగానికి వచ్చేసరికి నిజం చెప్పాలంటే కొంత చిరాకు కలగడం మొదలైంది. నేను అతి పొగడ్తలనీ, అతి విమర్శలనీ రెంటినీ భరించలేకపోవడం దీనికి ఓ కారణం కావొచ్చు. ఒకరేదో అనడం, రెండో వాళ్ళు కౌంటరేయడం, మళ్ళి మొదటి వారు ఏదో అనడం, ఇంతలో ఇదంతా రెండోవారు పుస్తకం రాయడం, మళ్ళీ మొదటివారు పుస్తకాన్ని ఏదో అనడం, దాన్ని ఈ రెండోవారు ఇంకో పుస్తకంలో ప్రస్తావించడం – అబ్బబ్బ! బోరు కొట్టేసింది.
అయితే, చివరిమాటగా చెప్పాలంటే, కొన్ని విషయాల గురించి అవగాహన ఏర్పడడానికి ఈ పుస్తకం చాలా ఉపకరిస్తుంది. ఆ తరువాత ఆ ప్రవాహంలో కొట్టుకోకుండా ఉండటం మన బాధ్యత. శౌరీని కేవలం ఓ బీజేపీ నేతగా మాత్రమే చూస్తే ఈ పుస్తకంలో కమ్యూనిస్టులని తిట్టడం తప్ప మరింకేమీ కనిపించకపోవచ్చు. అదే అతన్ని ఓ జర్నలిస్టుగా, ఓ ఆలోచనాపరుడిగా చూస్తే, ఈ పుస్తకం నుండి చాలా విషయాలు తెలుసుకోవచ్చు. బాగా పరిశోధించి రాసిన పుస్తకం అని తెలుస్తూనే ఉంది – దానికి కారణమేదైనా కూడా.
పుస్తకం వివరాలు:
Eminent Historians: Their Technology, Their Line, Their Fraud
by Arun Shourie.
Rupa & Co publishers
Rs 295/-
Decline and fall of historians | తుమ్మెద
[…] http://pustakam.net/?p=1067 […]
పుస్తకం » Blog Archive » India After Gandhi – Ramachandra Guha
[…] అరుణ్ శౌరీ చెప్పిన కథ విన్నాక, భారతీయ చరిత్రకారులు రాసిన చరిత్ర పుస్తకాలు చదవాలంటే భయం పట్టుకుంది, వాళ్ళు ఏం వక్రీకరిస్తారో..నేనేం తప్పుగా అర్థం చేసుకుంటానో అని. ఆయనకీ ఒక కథ ఉన్నది – ఆయన చెప్పినవి విని భయము వలదు – అనవచ్చు మీరు…కానీ, నా భయాలు నావి. […]
HalleY
@sri:
Madhavan’s role for all that i know was modelled on S.Gurumurthy and not Arun Shourie.
sri
మీ రివ్యు చదివి నేను పుస్తకం కొని చదివాను. మంచి పుస్తకం ఇటువంటివి అరుణ్ శౌరి ఒక్కడే రాయ గలడు. మీకు తెలిసే ఉంట్టుంది మణిరత్నం తీసిన గురు సినిమా లో మాధవన్ పాత్ర అరుణ్ శౌరిదే. మరి ఆసినేమాలో విద్యా బాలన్ లాంటి అవిటితనం గల భార్య నిజజీవితం లో అరుణ్ శౌరి గారి కి లేదు కాని అటువంటి అవిటితనం కల ఒక కొడుకు ఉన్నాడు.
http://www.indiastar.com/wallia19.html
Recently, Sita Ram Goel challenged the dean of the Marxist Indian “historians,” Romila Thapar, to produce evidence to substantiate her assertion about the violence Hindus perpetrated on the Buddhists, supposedly destroying Buddhist viharas and constructing Hindu temples on the ruins. None. Shourie observes: “They traduce, they abuse, they denounce, they spit and run, but if you so much as ask them to substantiate what they are saying, they are deeply offended. A highly personalised attack, they scream.”
sri
ప్రస్తుతం వారేమి చేస్తున్నారో ఒకసారి ఈ లింక్ చూడండి.
Donnish Hauteur?
Top JNU professors oppose quotas in academic posts to “maintain quality”
Anuradha Raman
http://www.outlookindia.com/article.aspx?263782