రవీంద్రుడు, ఐన్ స్టీన్.
Space is finite, but boundless. – ఐన్ స్టీన్
That which ends in exhaustion is death,
but the perfect ending is in the endless. – రవీంద్రనాథ్ ఠాగూర్
ఒకాయన ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త. ఇంకొకాయన విశ్వకవి.
ఇద్దరి మధ్య ఏ సారూప్యత ఉందో? సారూప్యత అంటూ ఆ ఇద్దరినీ పోల్చవచ్చా? అలా పోల్చటం సబబేనా?
ఉహూ..ఇక్కడ పోల్చటానికి అర్థం వారిద్దరి భావనల లోనూ ఏదో తెలియని ఓ అనిర్వచనీయమైన సౌందర్యాన్ని అన్వేషించే ప్రయత్నం మాత్రమే.
నిజానికిది సౌందర్యానికంటే ఓ మెట్టు ఎక్కువే.
మార్మికత (Mysticism)?
**************************************************************************************************
ఐన్ స్టీన్, సైన్స్ లో సౌందర్యాన్ని సందర్శించిన ఋషి. ఈ మహానుభావుడిది అంతా ఓ విచిత్రం. ప్రయోగశాలలో కూర్చుని పరీక్షనాళికలో అవీ ఇవీ పోసుకుంటూ, తిప్పేస్తూ, ఏవేవో విషయాలు నమోదు చేస్తూ, మధ్యలో ఏదో ఆలోచిస్తూ…ఉహూ…ఆయన అలాంటి శాస్త్రవేత్త కారు. ఈయన ప్రతిపాదించే సూత్రాలకు ఋజువులన్నీ శూన్యంలో వేగంగా పడిపోతున్న, లేదా పైకి వెళుతున్న ఎలివేటర్లు, సమాంతరంగా ప్రయాణిస్తున్న రైళ్ళు,గజం బద్దలు …వీటితో చెబుతాడాయన. మానవ ఊహాశక్తికి, మేధకు, కల్పనకు పరాకాష్ట ఈయన మెదడు. తన సిద్ధాంతాలలో, ఓ అనూహ్యమైన సౌందర్యం. ద్రవ్యానికి, శక్తికీ లంకె పెట్టటం ఓ వింతయితే, కాంతి వేగం కన్నా ఎక్కువ వేగంతో ప్రయాణిస్తే, “ఈ రోజు” నుంచి “నిన్న” కు ప్రయాణించవచ్చునని ఐన్ స్టీన్ మరొక సూత్రం. దీని మీద ఎంత అందమైన కల్పనలు (టైమ్ మిషన్ వగైరా) వచ్చాయి మనకు తెలుసు.
**************************************************************************************************
కవిత్వం అందరూ రాస్తారు. మంచి కవులూ, అద్భుతమైన కవులూ ఉంటారు. అయితే, చదివిన ప్రతి సారి ఓ కొత్త కోణాన్ని ఆవిష్కరించే రచన అన్నది అనితర సాధ్యం. విశ్వకవి రవీంద్రుడిది అంతః సౌందర్యం. అనుభూతికి భాష లేదు. అంతః సౌందర్యానికి నిర్వచనం లేదు.
“సూర్యుడు కాంతిని దాచుకున్న దుస్తుల అలమారా.
వాటిని సింగారించుకున్నవి మేఘాలు.”
“ఈ గుట్టలు – చేతులు చాచి, తారలను అందుకోవాలని ప్రయత్నించే పిల్లల కేరింతలు.”
(స్ట్రే బర్డ్స్ – 112, 113)
రోజూ చూస్తున్న సూర్యుడు, మేఘాలు, కొండలు, కవి కలం ద్వారా ప్రాణం పోసుకుంటే, ఆ అనుభూతికి అక్షర రూపాలవి.
అద్వైతం అయిన పరబ్రహ్మ, పారభౌతిక జగత్తులో ద్వైతంగా పరిణమించినట్టుగా, అద్వైతం లాంటి ఓ అపూర్వ సూత్రానికి, సైన్స్, కళ – రెండు రూపాలుగా పరిఢవిల్లాయేమో. ఆ రెంటికీ మూర్తిమంతంగా ఓ ఐన్ స్టీన్, ఠాగూర్ లు అవతరించారేమో?
వీరిద్దరు సమకాలికులవటం ఓ అపురూపం .
ఈ ఇద్దరు కలుసుకోవడం సంభవిస్తే, ఇద్దరు ఏం మాట్లాడుతుంటారు? వారిద్దరి మధ్య ఏ విషయం మధ్య చర్చ జరుగుతుంది?
(అణువుల/పరమాణువుల మధ్య స్వేచ్ఛాపరత్వం, ఆ అణువుల అమరిక తాలూకు ద్రవ్యం యొక్క స్థిరత్వానికి దోహదం చేయడం అనే విషయం దగ్గరనుండి, సంగీతంలో, ఓ గీత సృష్టికర్త మొట్టమొదటి సారి గానం చేసేప్పుడు సూచించిన పద్దతి (order) ని అవలంబిస్తూనే, సృజనాత్మకతను వ్యక్తపర్చటం వరకు…)
ఈ ప్రశ్నకు సమాధానం “Rabindranath Tagore – Sobriquet Gurudev” అన్న ఓ పుస్తకంలో దొరుకుతుంది. ఇందులో వీరిద్దరి మధ్య జరిగిన ఓ (4,5 పేజీ ల) చర్చ తో పాటు, ఠాగూర్ మరో పాశ్చాత్య ప్రముఖుడు H.G. Wells తో సాగించిన మరో మాటా మంతీ, ఠాగూర్ పరిచయం, క్లుప్తంగా జీవిత విశేషాలు, స్వయంగా తన అక్షరాలతో వ్రాసిన 2 పేజీల కవితలు (బంగ్లా, ఆంగ్లం రెంటిలోనూ), ఠాగూర్ చిత్రించిన చిత్రాలు కొన్ని, ఓ అమర్త్య సేన్ వ్యాసం, శాంతినికేతనం మీద వ్యాసం, ఇంకా మరెన్నో ముచ్చట్లు ఉన్నాయి.
విజయ్ గోయల్ పబ్లిషర్స్ వారి పుస్తకం.
VIJAY GOEL,
s-16, Naveen Shahdara,
Delhi – 110032 Ph : 22324833
(goelbooks@rediffmail.com)
ఈ పుస్తకం నాకు బెంగళూరు సప్న బుక్ హవుస్ లో దొరికింది. ఖరీదు 75 రుపాయలు – విషయాన్ని బట్టి చూస్తే తక్కువే.
**************************************************************************************************
(పై వ్యాసానికి ఉపకరించిన పుస్తకం నండూరి రామమోహనరావు గారి విశ్వరూపం. స్ట్రే బర్డ్స్ స్వేచ్చానువాదాలు వ్యాసకర్తవి)
Srinivas Nagulapalli
ఆలోచింపజేసే పరిచయం అందించినందుకు కృతజ్ఞతలు.
న్యూటన్ తరువాత ఒక్క చేతితో సైన్సును అంతగా ప్రభావితం చేసిన మేధావి ఐన్‌స్టీన్. బానిస బంధాలలో నలుగుతూ గాఢాంధకారంలో నడుస్తూన్న దేశ పరిస్థితుల్లో వెన్నెలకు మించిన వెలుగుల్ని కురిపిస్తూ కవితలల్లిన కవీంద్రుడు రవీంద్రుడు. ఇద్దరు దర్శించిన సౌందర్యం ఒక్కటే అయినా పద్దతుల్లో తేడాలు. కవి ఇట్లాఉంది అని మాత్రమే చెప్పగలడు, గొప్పగా. ఇట్లా చేస్తే అట్లా అవుతుంది అని చెప్పగలిగేది శాస్త్రవేత్తే. ఇంతైనా ఎంతైనా ఐన్ స్టీన్ (తాను) సైతం పొరపాట్లు చేసార(న)ని గుర్తించడం సత్యమూ,సహజమూనూ. కవి తాను రాసినదాంట్లో పొరపాట్ల స్పృహ గుర్తించడం ఎందుకో చాలా అరుదుగా సత్యమూ, ఇంకా అరుదుగా సహజమూనూ.
—–
విధేయుడు
శ్రీనివాస్
హెచ్చార్కె
చాల మంచి వ్యాసం. ఫూర్ణిమ గారి ప్రశ్నే నాది కూడా. మొన్న సాక్షిలో రవీంద్రుని మిణుగురులు, ఇప్పుడు స్ట్రే బర్డ్స్. అసలు రవీంద్రుని కవిత్వం ఎంత దొరికితే అంత చదవాలని ఉంది (ఇంగ్లిష్ లో). ఆన్ లైన్ ఆర్డర్ పంపి తెప్పించుకునే వీలుంటే, ఈ సంగతులు తెలిసిన వారు, తెలియజేయాలని మనవి.
achalla srinivasarao
einstein , tagore , mahatma gandhi mugguruu ii visvaaniki muDu axes laa kanipistaaru naaku . oka daaniki okaTi perpenducualr gaa kanipistayi kaani mottam visvanni paTTi vumcha gala sutraalu viiri lo kanipistaayi. viiri mugguruu kalsina photo eppuDo hindu paper lo chusaanu evari vaddanayinaa vumTE upload cheya galara pl.
much thanks and best regards
R.Shekar
This is very very interesting and lot’s of useful in our life.Intradution very good.I like the Ravindranath Tagore.This is providing for Baba sir very very thanks.
rayraj
ఇద్దరు థింకర్స్ (తెలుగులో ఏమనాలో!) ఓ చోట తెచ్చి చూపిన పుస్తకం అన్నమాట!మంచి విషయం.ఇలాంటి పుస్తకాలని చదివిన వాళ్ళు కూడా, రెండిట్లో ఉన్న లక్ష్యంలోని ఏకత్వాన్ని, ఫైనలిటీ దొరకకు పడుతున్న తాపత్రయాన్ని, ఎందుకని మనం చూడలేకపోతున్నాం? ఎందుకు మనకి ఫైనలిటీ తెలుసునన్న భ్రమలో ఒకరినొకరు నిందించుకుంటున్నాం!నింద కూడా ఆలోచనేనా! లేక నింద కూడా ఆలోచింప జేస్తుందా!నాకేమనిపిస్తుంది అంటే – నమ్మకం చెదరిని మనస్సు, ఎదుటి మనిషిని నిందిస్తుంది; నమ్మకం తిరిగి తెచ్చుకున్నప్పుడు తన ప్రయాణం సాగిస్తుంది;మరి “నింద”కి ఏమిటి లక్ష్యం!ఉత్తగా ఏదీ ఉండదుగా!హా!బహుశా “నింద” ఎవరినో ఒకరినైనా ఆలోచింప జేస్తుంది; బహుశా ఆత్మ పరిశీలనకు దారి తీస్తుంది.నమ్మకాన్ని బలపెట్టి, ప్రయాణాన్ని, ఆలోచనని ముందుకు తీసుకెళ్తుంది.
రవి
బాబా గారు, సవరణకు ధన్యవాదాలు.ఎన్నో యేళ్ళ క్రితం రాసిపెట్టుకున్న అనువాదం అది. అందుకనే పొరబాటు.
పూర్ణిమ గారు, ఆ పుస్తకంలో మరిన్ని డీటయిల్స్ ఉంటే చూసి వ్యాసంలో పెడతాను.
బొల్లోజు బాబా
పరిచయం చాలా బాగుంది.
అద్వైతం అయిన పరబ్రహ్మ, పారభౌతిక జగత్తులో ద్వైతంగా పరిణమించినట్టుగా, అద్వైతం లాంటి ఓ అపూర్వ సూత్రానికి, సైన్స్, కళ – రెండు రూపాలుగా పరిఢవిల్లాయేమో. ఆ రెంటికీ మూర్తిమంతంగా ఓ ఐన్ స్టీన్, ఠాగూర్ లు అవతరించారేమో?
చాలా బాగా చెప్పారు.
అందుకే
టాగోర్ మృత్యువుని ఒక అల్లాటప్పా చావులాగ ఎక్కడా చూడడు.
నేను మృత్యువుని, నీ తల్లిని, నీకు నూతనోదయాన్నీయబోతున్నాను” 119 అంటాడు.
అందుకనే కవిత్వమైనా, ఆవిష్కరణలైనా మానవజాతికి నిత్య నూతనోదయాలే.
ఇకపోతే మీ అనువాదం మూలానికి కొంచెం దూరంగా జరిగినట్లనిపిస్తుంది ఒకసారి గమనించండి. అన్యధాభావించరనే….
“సూర్యుడు కాంతిని దాచుకున్న దుస్తుల అలమారా.
వాటిని సింగారించుకున్నవి మేఘాలు.”
112
The sun has his simple robe of light. The clouds are decked with gorgeousness.
సూర్యుడు ఉత్త వెలుగు దుస్తులనే
ధరించి ఉన్నాడు.
మేఘాలు మాత్రం మెరుపుల
పటాటోపం ప్రదర్శిస్తున్నాయి.
బొల్లోజు బాబా
Purnima
Very interesting! But how to grab a copy? Mail to that id?