ఫోకస్ – 2011లో మీ పుస్తక పఠనం
ఓ ఏడాది పోతూ పోతూ మరో ఏడాదికి గడియ తీసి వెళ్ళే ఘడియల్లో, వీడ్కోలు-స్వాగతాల ద్వంద్వంలో గడిచిన కాలానికి గుర్తుగా మిగిలిపోయినవాటికి నెమరువేసుకోవటం పరిపాటి.
2012 స్వాగతోత్సవాల్లో భాగంగా, 2011 మీకు పుస్తకపరంగా ఎలాంటి అనుభవాలను, అనుభూతులనూ మిగిల్చిందో అందరితో పంచుకునే వీలుగా ఈ నెలలో ఫోకస్ అంశం: 2011లో మీ పుస్తకం పుఠనం గా నిర్ణయించాం.
ఇందులో భాగంగా మీరు పోయిన ఏడాది చదివిన పుస్తకాల జాబితా గానీ, లేక మిమల్ని విశేషంగా ఆకట్టుకున్న పుస్తకాల గురించి విశేషాలు గానీ, లేక కారణాంతరాల వల్ల పుస్తకాలు చదవడం కుదరకపోతే మీరెంత నిరుత్సాహపడ్డారో లాంటి విషయాలు గానీ రాయవచ్చు. మీ పుస్తక పఠనంలో చేరిన కొత్త అలవాట్లు, మారిపోయిన అభిరుచులు లాంటి వేటిని గురించైనా రాయవచ్చు.
వ్యాస నిడివి పై ఎలాంటి ఆంక్షలూ లేవు. వ్యాసాలు తెలుగు, ఆంగ్ల భాషల్లో ఉండవచ్చు.
మీ వ్యాసాలను పంపవలసిన చిరునామా: editor@pustakam.net
ఈ ఫోకస్‍ను ప్రకటిస్తుంది ఈ నెలలోనే అయినా, వచ్చే వ్యాసాల సంఖ్యను బట్టి, మరో నెలకూ పొడిగించవచ్చు. అందుకని మీరు మీ వ్యాసాలను ఎప్పుడు పూర్తి అయితే అప్పుడే పంపండి, “జనవరి 31లోగానే..” అన్నది ఏమీ లేదు.
rosey
i love reading books
C V R Mohan
best wishes on the 4th birth day