పుస్తకం
All about booksపుస్తకభాష

April 9, 2011

ఓ “33+2..pass” శాల్తీ కథ – మల్లెపందిరి

More articles by »
Written by: Purnima

ఎనబ్భైల్లో (అనుకుంటా), జంధ్యాల గారు రాసి, తీసిన తెలుగు సినిమా, మల్లెపందిరి, ఆ తర్వాత కొన్నాళ్ళకు పుస్తకరూపేణా వచ్చింది. అది ఇన్నాళ్ళకు ఒక ఫ్రెండ్ పుణ్యమా అని నాకు దొరికింది. ఆ పుస్తక విశేషాలే ఇక్కడ!

సినిమా పరిజ్ఞానం దాదాపుగా శూన్యం అయిన నాకు, ఈ పేరున ఒక సినిమా ఉందని కూడా తెలీదు. తారాగణం అంతకన్నా తెలీదు. నూతన సంవత్సరం సంధర్భంగా తీసుకున్న రెసెల్యూషన్స్ లో జంధ్యాల గారి ఏ రచనైనా చదవాలని నిర్ణయించుకోవటంతో, అనుకోకుండా ఈ పుస్తకం దొరికేసరికి, మరో ఆలోచన లేకపోయింది.

సినిమా కథ..

ఈ సినిమాలో వెత్తుక్కోనవసరం లేకుండా, కథ స్పష్టంగా తేటతెల్లంగా తెలుస్తుంది. అది ఏమనగా..

సాధారణంగా, అచ్చ తెలుగు సినిమాల్లో కనిపించే హీరో-హీరోయిన్-విలన్ త్రయం మధ్య జరిగే ప్రేమ-పగ టైపు కథ. హీరో అన్నవాడు, నూటికి తొంభై మార్కులు తెచ్చుకునే వాడే! అందంలోనూ, బలంలోనూ, శక్తిసామర్ధ్యాల్లోనూ, తెలివితేటల్లోనూ ఆహో-ఓహో అనిపించుకోవాలి. ఇట్లాంటివేవో ఇంకొన్ని ఫార్ములాలు.

అట్లాంటిది, ఈ సినిమాలో కథానాయకుడు, అతి కష్టం మీద ముప్ఫై మూడు మార్కుల వరకూ దేకీ, పాకీ వచ్చి చతికలబడిపోతే, “గ్రేస్” మార్కులు వేసేవారుంటే “పాస్”, లేకపోతే తుస్స్ అనిపించుకునే శాల్తీ! చదువుసంధ్యల్లో కాని, అందచందాల్లో కాని, బతకనేర్వడంలో కాని పూర్తిగా వెనకబడిపోయిన ఇతడు, ముప్ఫై ఐదేళ్ళు వచ్చినా పెళ్ళి కాక, నానా మంది చేత, నానా మాటలూ పడుతూ కాలం వెళ్ళదీస్తున్న వేళలో, ప్రేమ పరీక్షలో స్లిప్పులిచ్చి సాయపడింది ఎవరు? ప్రేమ పరీక్ష పాసై, వైవాహిక జీవితంలో ఫెయిల్ అవుతున్న తరుణంలో గ్రేస్ మార్కులు వేసి పాస్ చేయించింది ఎవరు? అన్నదే కథాంశం.

జంధ్యాల అంటే హాస్యానికి మారుపేరు కాబట్టి, పైగా మాటలు రాసింది వారే కాబట్టి సినిమాలో హాస్యానికి కొదవలేదు. ఒక అర్భకుడి జీవితయాత్ర ఇంత హాస్యాయమానంగా నడిపించటం ఆయనకే సాధ్యం. ఆ నవ్వు పరదాలు మాటున చూసే ధైర్యం, ఓపికా ఉంటే, సగటు తెలుగువాడి జీవితాన్ని, ముఖ్యంగా మధ్యతరగతి జీవితాలను, ఆయన అర్థం చేసుకొని, ఆవిష్కరించటంలో కనబరచిన నేర్పరితనం తెలిసొస్తుంది. అసమర్థతా, అభద్రతాభావాలతో సమతమై, పక్కనున్న వారి జీవితాన్ని నరకప్రాయం చేస్తున్నవారి జీవితాల్లో నుండి కూడా ఇంతటి హాస్యాన్ని పండించగల ఆయన హాస్యదృష్టికి జోహార్లు.

సినిమాను నేను చూడలేదుగాని, పుస్తకం రూపేణ చదువుకోవడం భలేంటి అనుభవం. సినిమాను మనకు చూపిస్తూ, మనకి ఎవరో కథ చెప్తున్నట్టు ఉంటుంది; ఇంటరాక్టివ్ నరేషన్. రాసింది ఎవరో స్పష్టంగా తెలీదు. జంధ్యాల, దివాకర్లలో ఒకరు అయ్యుంటారని నా అనుమానం. కథను రాయడంలో నేర్పును ప్రదర్శించారు. కొన్ని వాక్యాలు, కొన్ని పదబంధాలు బాగున్నాయి. ముఖ్యంగా అప్పటి సామాజిక పరిస్థితులు తెల్సుకునే ఉన్నాయి. ఉదాహరణకు, ఇద్దరు గబగబా మాట్లాడేసుకుంటున్నారని చెప్పటానికి, టైపు హైయ్యర్ భాషలో మాట్లాడేసుకుంటున్నారనడం లాంటివి. కథాపరంగా వచ్చే కొన్ని వర్ణనలు కూడా “టూ-మచ్” అనిపించేంతగా రాసారు. ఎక్ట్రీషయన్ చాలా లావుగా ఉన్నాడని చెప్పడానికి, “అతడు ఎలక్ట్రిక్ పోల్ వైపు చూడగానే, ఇతడెక్కితే కష్టం కదా అని భయపడి, పోల్ కిందకు వంగి, తీగలు అందిస్తుంది.” అన్న విధంగా చెప్తారు.

చిత్ర షూటింగ్‍లో జరిగిన వింతలూ-విశేషాలూ, నట సహాయక వర్గాలతో తీసిన ఫోటోలూ కూడా ఉన్నాయి. ఇందులో వేటూరి గారు ఒక పాత్ర వేశారంటే, నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆయన రాసిన పాటలూ ఒకట్రెండు ఇచ్చారు. బాగున్నట్టు అనిపించాయి. ఎస్పీబి కూడా ఒక ముఖ్య పాత్ర వేశారు. హీరోహీరోయిన్లు కొత్తవారు కావటంతో, ఈ సినిమా పెద్దగా పేరు తెచ్చుకోకపోవటం వల్ల అనామకులగానే ఉండిపోయారనుకుంటాను.

అప్పట్లో, మీడియా అంత బలంగా లేకపోవటం వల్లననుకుంట, ఇలాంటి సినిమా నవల్లు వచ్చేవి. ఇది ఒక సినిమా కథగా కాకున్నా, ఒక నవలికగా చదువుకున్నా బాగుంటుంది. పుస్తకాన్ని గాని, జంధ్యాల గారు రాసుంటే, సినిమా మరో మంచి రచయితను కోల్ఫోయినట్టేనని చెప్పుకోవచ్చు. కాకపోతే, ఆయన సినిమాలు లేకపోతే, మన జీవితాల్లో హాస్యం శూన్యమైయ్యుండేదేమో! పుస్తకం మాత్రం మంచి తెలుగును ఆస్వాదించే వీలు కలిపిస్తుంది.

ఎటూ తన దగ్గరకే రప్పించేసుకున్నాడు కాబట్టి, జంధ్యాల చేత కొన్ని స్ర్క్రిప్ట్లు రాయిస్తే బాగుణ్ణు దేవుడు! అలా అయినా, కొన్ని జీవితాల్లో ఆనందం తాండవిస్తుందేమో!

అలభ్యమైన ఈ పుస్తకం గురించిన వివరాలేవీ నాకు దొరికిన కాపీలో లేవు. సినిమాలంటే ప్రాణం పెట్టేవారి దగ్గర కానీ, పాత లైబ్రరీల్లో కానీ ఈ పుస్తకం దొరకవచ్చు. ప్రయత్నించండి.

(ఆ ప్రయత్నంలో, జంధ్యాల మాటలు అందించిన “సాగర సంగమం” సినిమాకు సంబంధించిన ఏ సాహిత్యాన్నైనా మీరు చూసుంటే, నాకో ముక్క చెప్పటం మర్చిపోకండి. పుణ్యం ఉంటుంది.)About the Author(s)

Purnima

Software engineer by profession, Hyderabadi at heart, laidback by choice, an introvert by default, schizophrenic at will etc. etc... so much so about her, to give you enough to guess what she might come up about the worlds of words she wanders.. keep guessing..7 Comments


 1. dr.y.divakar.

  mee article chadivaanu.aa vendithera novel raasindi nene.november nunchi http://www.chamatkaram.com lo prathi nela serial ga vasthundi.naa mail id-drwhythewalker@yahoo.com-regards,dr.divakar.


 2. ఈ పుస్తకం ఇప్పుడు ఎక్కడన్నా దొరుకుతుందా? తెలిస్తే చెప్పండి.
  నేను హైదరాబాదులో ఉంటున్నాను.


 3. sriram velamuri

  పూర్ణిమ గారూ ,ఒక మంచి సినిమా గుర్తు చేసారు,అలాగే చిమటా మ్యూజిక్ లోకి
  వెళ్లి ఈ సినిమా లో “తొలిచూపు తోరణ మాయే ,కళ్యాణ కారణ మాయే ” అన్న అద్భుతమైన పాట
  వినండి ,జానకి గారి గొంతు వింటే జన్మ ధన్యం అవుతుంది


 4. సౌమ్య

  @Purnima: My comment was a general comment on the nature of that book. In my view, its best enjoyed when read with an equally fun group.


 5. Purnima

  @సౌమ్య: Did I hint that I didn’t enjoy this book enough?

  In a world, where it is difficult to get books and read for yourself, asking for people to read it for you.. isn’t it too much of an ask? 😛


 6. సౌమ్య

  Actually, perhaps the best way to read this is to read as a group 🙂 One narrates and the others listen .. 🙂 Get a good narrator 😉


 7. Independent

  “ఎటూ తన దగ్గరకే రప్పించేసుకున్నాడు కాబట్టి, జంధ్యాల చేత కొన్ని స్ర్క్రిప్ట్లు రాయిస్తే బాగుణ్ణు దేవుడు! అలా అయినా, కొన్ని జీవితాల్లో ఆనందం తాండవిస్తుందేమో!”
  Whoaa…  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

అలుకు మొలకలు పుస్తక సమీక్ష

వ్యాసకర్త: గంభీరావుపేట యాదగిరి ******************* ఆధునిక సాహిత్యంలో సిద్ధిపేటకు ఒక ప్రత్యేక స్...
by అతిథి
0

 
 

ఒంటరి – సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి నవల

వ్యాసకర్త: శ్రీలత శ్రీరాం (ఈ వ్యాసం మొదట ఫేస్బుక్ లో వచ్చింది. పుస్తకం.నెట్ లో వేసుకు...
by అతిథి
1

 
 

శప్తభూమి నవల గురించి

వ్యాసకర్త: స్వర్ణ కిలారి (ఈ వ్యాసం మొదట ఫేస్బుక్ పోస్ట్ గా వచ్చింది. పుస్తకం.నెట్ లో వ...
by అతిథి
1

 

 

Diwali in Muzaffarnagar: Tanuj Solanki

ఇదో కథల సంపుటి. ఢిల్లీకి దగ్గర్లో ఉన్న ముజఫర్‍నగర్‌లో కొన్ని జీవితాలకు సంబంధించిన క...
by Purnima
0

 
 

సవరలు – జి.వి.రామమూర్తి

ఈమధ్య “ఫీల్డ్ లింగ్విస్టిక్స్” అన్న కోర్సులో విద్యార్థిగా చేరాక మామూలుగా ఆధుని...
by సౌమ్య
0

 
 

శప్తభూమి – బండి నారాయణస్వామి నవల

వ్యాసకర్త: శ్రీరాం కణ్ణన్ (వ్యాసం మొదట ఫేస్బుక్ పోస్ట్ గా వచ్చింది. పుస్తకం.నెట్ లో వ...
by అతిథి
0