పుస్తకం
All about booksపుస్తకలోకం

November 15, 2010

Bangalore book fair – Random notes and a request

More articles by »
Written by: అతిథి
Tags:

రాసినవారు: సిద్దార్థ గౌతం

* Airport కు వెళ్ళే దారిలో ఉన్న ‘ప్యాలెస్ గ్రౌండ్స్ లో జరుగుతోంది పుస్తక ప్రదర్శన. శనివారం మధ్యాహ్నం 1.30 కి చేరుకున్నాము. ప్రవేశించిన కొద్దిసేపటికే తెలుగు స్టాల్ కనబడింది. ‘Tagore Publications’ వాళ్ళది. విశాలాంధ్ర వాళ్ళ స్టాల్ ఎక్కడుంది?..అసలు ఉందా? అని అక్కడి in-charge ను అడిగాము. “మాకెవ్వరికీ layout ఇవ్వలేదండీ” అన్నారాయన. 45 నిముషాల సేపు ఉన్నాము అక్కడ. ఫరవాలేదు అనిపించుకునే కలెక్షన్. కానీ, ఉన్న పుస్తకాల గురించి చక్కటి అవగాహన ఉంది అక్కడ ఉన్నవారికి.

* “విశాలాంధ్ర వాళ్ళు ఈ సారి స్టాల్ పెట్టినట్టు లేరు” అని ఇక బయటపడుతున్న సమయంలో..చిట్ట చివరి వరుసలో కనబడింది. ఇక్కడ కూడా స్టాల్ in-charge తప్ప ఇంకెవ్వరూ లేరు. ఇంకా పుస్తకాలు సర్దుతున్నారు. మొదటి 10 నిముషాల browsing తోనే అర్థమయ్యింది. చాల మంచి కలెక్షన్. పుస్తకాల పేర్లన్నీ చెప్పలేను కాని, తెలుగు సాహిత్యం లో చెప్పుకోదగ్గ రచయితలందరి పుస్తకాలు కనబడ్డాయి నాకు.

* విశ్వనాథ, చిలకమర్తి, ముళ్ళపూడి, కోకు, శ్రీశ్రీ, భరాగో, గురజాడ, మొక్కపాటి, భానుమతి, బాపు (బొమ్మలు) గారల రచనల నుంచి, మధురాంతకం రాజారాం, శ్రీపాద, మల్లాది, తిలక్, నామిని, బుచ్చిబాబు గార్ల కథా సంకలనాలు, గొల్లపూడి, మాలతి చందూర్, వంశి, రంగనాయకమ్మ రచనలు, AVKF వారి పబ్లికేషన్స్ (చిట్టెన్రాజు గారి కథలతో పాటు, తెలుగు సాహిత్యం మీద commentaries గా వచ్చిన పుస్తకాలు), మల్లిక్, యెర్రంశెట్టిశాయి హాస్య రచనలు, యండమూరి, యద్దనపూడి, మధుబాబు నవలలు, సాక్షి వ్యాసాల compilation, తెలుగు కథకి జేజే, తెలుగు కథ, వందేళ్ళ తెలుగు కథ, మా మంచి తెలుగు కథ లాంటి తెలుగు కథల సంకలనాల దాక అన్నీ కనబడ్డాయి. ఒక్క శ్రీరమణ గారి పుస్తకాలు మాత్రం పెద్దగా కనబడలేదు. అదే మాట వారితో అంటే, “రేపో ఎల్లుండో వచ్చే స్టాక్ లో వస్తాయి” అన్నారు. నాకు గుర్తున్న పేర్లు ఇవి. ఇంకా బోలెడు ఉన్నాయి.

* TTD వాళ్ళ శ్రీమదాంధ్ర మహాభారతం (15 పుస్తకాల set – హార్డ్ బౌండ్) కూడా ఉన్నాయి. ఆ పుస్తకాల గురించి చెబుతూ – “చూడండి – వీటి వెల 2,200 రూపాయలు. మాకు మిగిలే లాభం కన్నా, అయ్యే రవాణా ఖర్చు ఎక్కువ” అన్నారు. కానీ, ఆదివారం మళ్ళీ వెళ్ళినప్పుడు – “పది సెట్లు అమ్ముడయ్యాయి” అని చెప్పారు. “రోజుకి 10,000 అద్దె కట్టాలి ఈ స్టాల్ తీసుకున్నందుకు. జనం బాగా పుస్తకాలు కొంటే తప్ప, మేము ఇక్కడికి రావటానికి అయ్యిన ఖర్చు రాబట్టు కోవటం కూడా కష్టం” అని శనివారం అన్న ఆయన, ఆదివారం చాలా ఉత్సాహంగా కనబడ్డారు. ఆదివారం రోజు వెళ్ళినప్పుడు literal గా ఉన్న చోటి నుంచి కదలలేనంత జనం. చూస్తుండగానే విపరీతంగా అమ్ముడయ్యాయి పుస్తకాలు.

* ఉన్న రెండు గంటల్లో ‘తెలుగు – ఇంగ్లీషు నిఘంటువు ‘ కావాలని నలుగురు అడిగారు.

* తమిళ పుస్తాకాల స్టాళ్ళు 8 చూసాను.

*పుస్తకాల మీద 10% రాయితీ ఇచ్చారు. మంచి నీళ్ళు ఫ్రీ గా ఇచ్చారు.

* బిల్లు కట్టేటప్పుడు “సోమవారమో, మంగళవారమో మళ్ళీ రండి. కొత్త స్టాక్ వస్తుంది” అన్నారు.

Request – ఈ పుస్తక ప్రదర్శన నవంబరు 21 (వచ్చే ఆదివారం) దాకా ఉంటుంది. విశాలంధ్ర స్టాల్ లో చాలా మంచి పుస్తకాలు ఉన్నాయి అన్నది ఖచ్చితంగా చెప్పగలను. ఈ వారం లో వీలున్నప్పుడు వెళ్ళి చూడండి. బెంగళూరు లో నివాసముండి, కేవలం తెలుగు పుస్తకాలు కొనటం కోసం హైదరాబాదు, విజయవాడ వెళ్ళే నాలాంటివాళ్ళకి ఈసారి జరుగుతున్న పుస్తక ప్రదర్శన గొప్ప వరం. I assure you it is time and money well spent.

__________________________________________________________________________

ఇదే పుస్తక ప్రదర్శన గురించి వేణూ శ్రీకాంత్ గారి బ్లాగును చూడండి..  తెలుగు స్టాల్ల వివరాలు ఉన్నాయి.

The book festival is open to the public from 11 a.m. to 9 p.m. and the entry fee is Rs 20.

Follow the link for further details. – పుస్తకం.నెట్About the Author(s)

అతిథి

పుస్తకం.నెట్ కు సభ్యులు కాని వారు పంపే వ్యాసాలు అతిథి గా ప్రచురింపబడతాయి.2 Comments


  1. మనమెందుకో 60 70 దశకాల దగ్గరే మన తెలుగు సాహిత్యాన్ని నిలబెట్టామనిపిస్తుంది.ఇప్పుడు కూడా చాలా మంచి సాహిత్యం వస్తున్నదండి! సరయిన విమర్సా వేదిక ,చక్కని నిష్పాక్షిక విశ్లేషణ తగినంత లేక, వున్న వాటికి సరయిన సహకారం కరువయ్ నేటి చదువరులకు మంచి వర్తమాన సాహిత్యం అందుబాటులోకి రాకుండా వుంది! ఇంకా ఆరుద్ర గారి కాలం దగ్గరే మంచి సాహిత్యం కోసం తడువుకునే పరిస్థితి మనకు వుందంటే మరి ఇంకేమనుకోవాలి!  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

విశ్వనాథునకు వివిధ కవి నాథుల పద్య నివాళి

వ్యాసకర్తలు: రవి భూషణ్ శర్మ కొండూరు, ఇందు కిరణ్ కొండూరు ****************** ముందు మాట ఈ నెల (అక్టోబ...
by అతిథి
0

 
 

ఆడెనమ్మా! శివుఁడు!!! పాడెనమ్మా! భవుఁడు!!!

వ్యాసకర్తలు: రవి భూషణ్ శర్మ కొండూరు, ఇందు కిరణ్ కొండూరు ****************** షుమారు 103 సంవత్సరాల క్ర...
by అతిథి
1

 
 

ఆచార్య ఆత్రేయ

వ్యాసకర్తలు: రవి భూషణ్ శర్మ కొండూరు మరియు ఇందు కిరణ్ కొండూరు (మే ఏడవ తేదీ ఆత్రేయ జయంత...
by అతిథి
0

 

 

పుట్టపర్తి నారాయణాచార్యులు

అది 1989 అనుకుంటాను సరిగ్గా గుర్తు లేదు. నా కాలేజీ మొదటి రోజులు. మా అప్పకు పుట్లూరి శ్రీ...
by రవి
2

 
 

(శవ) సాహిత్యం మీదకి నా దండయాత్ర

అను MY EXPLORATIONS TO THE WONDROUS WORLD OF BOOKS వ్యాసకర్త: సాయి పి.వి.యస్. ********************* ఈ వ్యాస ముఖ్యోద్దేశ్యం సౌమ్య ...
by అతిథి
0

 
 

జోలెపాళెం మంగమ్మగారితో పుస్తకం.నెట్

పరిచయం: జోలెపాళెం మంగమ్మ గారి పేరు వింటే ఒకతరం వారు  “ఆలిండియా రేడియో తొలి తెలుగు మహ...
by పుస్తకం.నెట్
5