అజో-విభొ-కందాళం ఫౌండేషన్ (AVKF) వారితో…


ఇదివరలో పాఠకులు తమకు నచ్చిన పుస్తకం గురించి మీకు రాసి పంపే అవకాశం ఉండేది. దాదాపు మూడేళ్ళ క్రితం ఇది చూసినట్లు గుర్తు. మరిప్పుడు లేనట్లుందే?
దానికి స్పందన సరిగా రాలేదు. తగినన్ని వ్యాసాలు రాలేదు. వచ్చిన వాటిలో బాగున్నవి ఎంచడం, ఆపై నిర్వహణలో ఉండే సమస్యలూ చూశాక, చివరకి ఆపేశాము.

మీ సంస్థకి ప్రచార మార్గాలేమిటి?
భవిషత్తు ప్రణాళికలు. మామూలుగా మాకు గల ప్రచారమంతా మా సైటు ఉపయోగించిన వారి ద్వారానే. ప్రస్తుతానికి లాభాలేమీ రాకపోయినా కూడా మేము వెనుదిరగదలుచుకోలేదు. కాలక్రమంలో ఆఫ్లైన్ ప్రచారం సాగించే అవకాశం ఉంటే చూస్తాము.

నివాసాంధ్రులకి చాలా మందికి మీ సైటు గురించి తెలియదు. ఇదివరలో బెంగళూరు బుక్ ఫెస్ట్ లో – ఫ్లిప్ కార్ట్, లైబ్రరీవాలా, పోతీ.కాం – వంటి సైటులు కూడా తమ స్టాల్స్ పెట్టాయి. మీకు అటువంటి ఆలోచన రాలేదా?

ముందు సైటుని యూనీకోడీకరించడం, భారతీయ కరెన్సీలో కొనుగోలుకు అనుమతి ఇవ్వడం – ఇలాంటి పనులు పూర్తి చేస్తే, అప్పుడు అవి ఆలోచిస్తాము.

మీ జాబితాలో లేని పుస్తకాలు కావాలని రిక్వెస్టు చేయొచ్చా?
తప్పకుండానూ. మాకు కూడా కొన్ని పుస్తకాల గురించి తెలిసేది ఆ విధంగానే.

మీరు స్వయంగా పుస్తకాలు ముద్రిస్తారు కదా. ఎటువంటి పుస్తకాలకి మీ ప్రాధాన్యం? ఎవరన్నా పుస్తకాలు అందజేస్తే…ప్రచురిస్తారా?
చెయొచ్చు, చేయకపోవచ్చు. అవును,ఏదన్నా పుస్తకం ముద్ర్రణలో లేదు, కానీ, జనం నోళ్లలో నానుతోంది అనుకున్నప్పుడు కొన్ని పుస్తకాలు ముద్రించాము. సాధారణంగా ఒక పుస్తకం గురించి అనుకున్నప్పుడు, ఒక్కోసారి అవసరమైతే ఒక కమిటీ లాంటిది పెట్టి, చర్చించి నిర్ణయం తీసుకుంటాము. ఒక పుస్తకం ప్రచురణార్హమా కాదా? అన్నది ఎలా నిర్ణయిస్తాము? కొన్ని పుస్తకాలు కాలానికి నిలవవు. అంతరిస్తాయి. ’అయ్యో! ఈ పుస్తకం చచ్చిపోతోందే!’ అని బాధపడనక్కర్లేదు నా అభిప్రాయంలో. నిలవగలిగితే, ఎలాగోలా నిలుస్తాయి. ఇన్నేళ్ళ తెలుగు సాహిత్యంలో తిక్కన, పోతన -ఇటువంటి వారంతా ఎలా నిలిచారు? అసలు కొన్ని పుస్తకాలు వాటి తరాలను దాటి నిలబడ్డానికి కారణం ఎంతో ప్రేమతో వాటిని కాపాడుకున్న కొంతమంది సాహిత్యాభిమానులే అనిపిస్తుంది.

ఈ సైటు నిర్వహణకు నిధులు, ఇటువంటి సైటు నిర్వహణలో సాధకబాధకాలు ఏమిటి?
నిధులు – ఏవీకే ఫౌండేషన్ ద్వారానే వస్తున్నాయి. నిర్వహణలో సాధకబాధకాలంటే – ఇది ప్రధానంగా లాభాపేక్ష లేని సాహితీసేవే లక్ష్యంగా నడుస్తున్న సైటు. కనుక, లాభనష్టాల బేరీజుల గురించి ఆలోచించము. ఇక, నేను ప్రతిరోజూ ఈసైటు నిర్వహణపై మూడు గంటలన్నా వెచ్చిస్తాను. కనుక, నిర్వహణా భారం మరీ తీవ్రమైనదనిపించదు.

(రోజులో కాసేపు పుస్తకం పనులు చేయాలంటేనే ఒక్కోరోజు ఊసురోమనిపిస్తుంది! ఆయన అలా చెబుతూ ఉంటే, నిజం చెప్పొద్దూ – సిగ్గేసింది!!)

సైటులో కొనుగోలుకి ఉంచడానికి పుస్తకాలు ఎలా ఎంపిక చేస్తారు?
రచయితలు, ప్రచురణకర్తలు – తమతమ పుస్తకాలను ఏవీకేఎఫ్ బుక్ లింక్ ద్వారా నేరుగా ప్రకటించుకోవచ్చు. ఇందుకుగాను ఏవీకేఎఫ్ వారిసైటులోని ఫారం నింపి, పుస్తకం ఐదు కాపీలు పంపి, పుస్తకం గురించి ఒక చిన్న పరిచయం కూడా ఇస్తే – ఆ పుస్తకం బుక్ లింక్ లో కనబడతుంది. అమ్మకాల డబ్బు రచయితకి అందే పద్ధతి వగైరా వివరాలు ఇక్కడ చూడవచ్చు.

(అలాగే, వీరి వద్ద దొరికే పుస్తకాలన్నింటిలోకీ – అన్ని వర్గాల్లోనూ అత్యుత్తమ పుస్తకాల జాబితా కూడా తయారుచేశారు (వివిధ సాహితీవేత్తల సహాయంతో) . అది ఇక్కడ చూడవచ్చు.)

– ఇదండీ అప్పాజోస్యుల సత్యనాయణ గారితో ఏవీకే ఫౌండేషన్ గురించి దాదాపు నెలన్నర క్రితం జరిపిన సంభాషణ వివరాలు.
అడగ్గానే వారి సమయం వెచ్చించి మాతో ఓపిగ్గా సంభాషించినందుకు సత్యనారాయణగారికి ధన్యవాదాలు! – సౌమ్య,పూర్ణిమ.

You Might Also Like

7 Comments

  1. విజయవర్ధన్

    >> త్వరలోనే రుపీ ప్రాసెసింగ్ గేట్వే కూడా ఎనేబుల్ చేసి, భారతీయ కరెన్సీలో కూడా కొనుగోళ్ళు చేయనివ్వాలన్న ఆలోచన ఉంది.

    చాలా మంచి ఆలోచన. నాకు తెలిసి చాలా మంది ఎదురుచూస్తున్నారు దీని కోసం.

  2. మెహెర్

    interesting!

    >>> భారతీయ కరెన్సీలో కొనుగోలుకు అనుమతి ఇవ్వడం

    waiting for that.

  3. Vaidehi Sasidhar

    1998 లో మేము అమెరికా వచ్చిన కొత్తల్లో మొదటసారి ఒక సాహిత్యసదస్సులో అప్పాజోస్యుల వారిని కలిసాము. దాదాపు నెలరోజుల తర్వాత ఆయన ఫోన్ చేసి వారింట్లో ఏర్పాటుచేసిన సద స్సుకు రమ్మని ఆహ్వానించటం నాకు ఇంకా గుర్తుంది.అప్పటినుండి వారింట్లో జరిగిన సదస్సులకు,నాటక ప్రదర్శనలకు,ఇండియా నుంచి వచ్చే ప్రముఖ రచయితలు,కళాకారుల తో భేటీ లకు ప్రతిసారీ మాకు ఆహ్వానం అందుతూనే ఉండేది.:-)

    ఎవికేఎఫ్ బుక్ లింక్ వచ్చాక ఇండియాలో పుస్తకాలు కొనడం దాదాపు మానేశాననే చెప్పాలి.పుస్తకాలు ఆర్డర్ చేసిన పదిరోజులలోపు వచ్చేసేవి.నిజంగా ఏమాత్రం లాభాపేక్ష లేని సంస్థ. ఈ బుక్ లింక్ వెనక సత్యనారాయణ గారికి పుస్తకాలపై ఉన్న అమితమైన ప్రేమ, తెలుగు సాహిత్యం ప్రవాసాంధ్రులకు అందుబాటులోకి రావాలనే ఆశయం స్పష్టంగా కనబడుతూ వుంటుంది . అన్నిటి కంటే ముఖ్యంగా ప్రతి సంవత్సరం ‘ప్రతిభామూర్తి పురస్కారం ‘,” విశిష్ట సాహితీ పురస్కారం” “రంగస్థల సేవా మూర్తి పురస్కారం ” తెలుగునాట వివిధ రంగాలలోని కళాకారులకు అందజేసి కళను ,సాహిత్యాన్ని ప్రోత్సహించి,గౌరవించాలనే ఉన్నత ఆశయంతో ఎవికేఎఫ్ చేస్తున్న సేవ తప్పక చెప్పుకోవాలి. కళ పట్ల,సాహిత్యం పట్ల వారికున్న గౌరవం ,అభిమానం మాత్రమే కాదు, వాటిని పునరుద్ధరించాలనే వారి తపన ,దానిని ఓ యజ్ఞంలా నిర్వహించే స్పూర్తి ,కృషి ఎంతైనా గౌరవనీయాలు.
    ఏవికేఎఫ్ గురించి సత్యనారాయణ గారితో చక్కటి ఇంటర్వ్యూ చేసిన సౌమ్య ,పూర్ణిమలకు అభినందనలు.

  4. కొత్తపాళీ

    Yes, their work is an inspiration to all.

  5. మాలతి

    నాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఈ సంస్థని పుస్తకంలో పరిచయం చెయ్యడం. ఇంత నిస్వార్థంగా సాహిత్యసేవ చేసేవారు అరుదు. అప్పాజోస్యుల సత్యనారాయణగారికీ, పరిచయం చేసిన మీ ఇద్దరికీ అభినందనలు.

  6. సౌమ్య

    రావు గారికి: ఛాయాచిత్రాలు – ఉంటే ప్రచురించేవాళ్ళం 🙂 We did not do a conventional Interview sort of thing. We did not expect that we will meet Satyagaru over that place either.

  7. cbrao

    పరిచయం చెయ్యదగ్గ సంస్థ avkf.org వారి వెబ్సైట్ యునికోడ్ లో లేకపోవటం పెద్ద లోటు. వారికి కావలసిన సాంకేతిక సహాయం అందించటానికి etelugu.org సిద్ధంగా ఉంది. సమావేశ, సత్య అప్పాజోస్యుల గారి ఛాయాచిత్రాలు కూడా ప్రచురిస్తే మరింత బాగుండేది.
    cbrao
    Vice President, e-telugu.org

Leave a Reply