Exotic Engineer Entrepreneur

రాసిన వారు: మేధ
***********
పుస్తకం చేతిలోకి తీసుకోగానే, కవర్ పేజీ మీద ఆకర్షించేది, C Program.. ఈ Code కి పుస్తకానికి సంబంధం ఏంటా అనుకుంటూ వెనక్కి తిప్పగానే కట్టె-కొట్టె-తెచ్చె పధ్దతిలో అక్కడున్న బొమ్మలు అసలు విషయాన్ని చెప్పేస్తాయి..

కధ విషయానికి వస్తే, సాఫ్ట్ వేర్ ఇంజనీర్‍గా ఉద్యోగం చేస్తున్న వ్యక్తి వ్యాపారవేత్తగా ఎదిగిన పరిణామాలు, క్రమాలూనూ…

మొదట్లో( రెండు/మూడు అధ్యాయాలు ) నెమ్మదిగా సాగినా, తరువాత వేగం పుంజుకుంటుంది.. పుస్తకంలో వాడిన భాష చాలా తేలికైనది..

Tag line(A novel based on real life incidents) లో చెప్పినట్లు, సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు తమ జీవితంతో చాలా విషయాలు అన్వయించుకోగలరు.. ఈ రంగంతో సంబంధం లేని వారికి కొంచెం బోర్ కొట్టచ్చు (అంటే మరీ ఇంత స్టుపిడ్ గా ఉంటారా అని సందేహాలు కూడా రావచ్చు :P)

పుస్తకంలో ఉన్న చాలా విషయాలు రోజువారీ జీవితంలో చూస్తూ ఉండేవే.. వాటిల్లో కొన్ని..

మనిషి వ్యక్తిగత జీవితంలో నాలుగు దశలు (బ్రహ్మచారి, గృహస్ఠు, వానప్రస్ఠం, సన్యాసి) ఉన్నట్లే, సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఉద్యోగంలో కూడా నాలుగు దశలు:
మొ: ఏ పని ఇచ్చినా గడువుకి ముందే పూర్తి చేయడం, క్రొత్త పని అడిగి మరీ తీసుకోవడం
రెం: పని ముగించినా, చివరి నిమిషంలో ఏం మార్పులు వస్తాయో అని ఎదురుచూస్తూ ఉండడం
మూ: గడువు కంటే ముందే పని ముగించి, మేనేజర్ కి మాత్రం చివరి నిమిషంలో అయిపోయింది అని చెప్పడం
నా: ఆ కంపెనీ కి రాంరాం చెప్పేసి, వేరే పని చూసుకోవడం 🙂

మన ఇంట్లో ఏ రిలయన్స్ ఫోనో (Low Call Rates) ఉంటే, మన నుండి కాల్ రాగానే ఇంట్లో వాళ్ళు కట్ చేసి, ఆ ఫోన్ నుండి చేయడం…

మనకి వేటి గురించైనా సందేహాలు వస్తే ( ఏ టాక్స్ గురించో, బ్యాంక్ అక్కౌంట్ల గురించో) నాన్నగారిని అడిగితే, ఆయన ఒక పది ఉదాహరణలు తీసుకుని చెప్పడం…

ముగింపు విషయానికి వస్తే చాలా సినిమాటిక్ గా ఉంది.. ఈ పుస్తకాన్ని సినిమాగా తీస్తే వంద రోజులు గ్యారంటీ 🙂

చదువుతున్నప్పుడు ఏమీ అనిపించకపోయినా, పుస్తకం మూసేసిన తరువాత బాగుందనిపిస్తుంది..

అన్నట్లు, పుస్తకం కవర్ పేజీ మీద ఇచ్చిన Program Output కూడా ఇచ్చారు చివరలో.. దాన్ని Run చేస్తే “12 verses of christmas” print అవుతుందట..

Exotic Engineer Entrepreneur
రచయిత: Jayanth Gurijala
పబ్లిషర్స్: Rainbow
పేజీలు: 195
ధర: 125/-

You Might Also Like

2 Comments

  1. రామ

    ఇంకొంచెం విపులంగా రాయల్సిందేమో (“అదేదో మీరే ఈ పుస్తకం చదివి రాసెయ్యండి” అనకండి 🙂 ).

  2. cbrao

    “ఈ పుస్తకాన్ని సినిమాగా తీస్తే వంద రోజులు గ్యారంటీ :)” – ఈ పుస్తకంలోని సినిమా కు కావలసిన మసాలా గురించి మీరు ప్రస్తావించలేదే?

Leave a Reply