“ఆకులో ఆకునై….”

వ్యాసం రాసిపంపిన వారు: తృష్ణ

ఆంధ్రప్రభదినపత్రికను మా ఇంట్లో చాలా ఏళ్ళు తెప్పించారు. వార్తలే కాక వీక్లీ కాలమ్స్ , డైలీ సీరియల్స్, పిల్లలకు బొమ్మల సీరియల్స్ ఇలా చాలా ఉంటూండేవి పేపర్లో. కుప్పిలి పద్మగారి రచనలు కూడా ఆంధ్రప్రభలోనే మొదటిసారి చదివాను.ఇవి కాక 13-12-98 నుండి 16-7-99 వరకూ, అంటే మొత్తం ఎనిమిది నెలలపాటు, మేము ప్రతి శుక్రవారం పేపర్ కోసం ఎదురు చూసే వాళ్ళం. వాడ్రేవు వీరలక్ష్మిగారి కాలమ్స్కోసం ! పేపర్ కట్టింగ్స్ అన్నీ దాచేవాళ్ళం. 2001లో కాలమ్స్ అన్నీ ఒక పుస్తక రూపంలో అచ్చయ్యాయి. పుస్తకమే ఆకులో ఆకునై….”

అప్పట్లో బుక్ ఫెస్టివల్లో కనిపించగానే వెంటనే కొనేసాం.

పుస్తకంలో మొత్తం ముప్పైనాలుగు వ్యాసాలు. ప్రేమ, ప్రకృతి, చెట్లు, స్వేచ్ఛ, పువ్వులూ, ఋతువులూ, పెళ్ళిళ్ళూ, పిల్లలూ, సంగీతంఆఖరుకుజ్వరంకూడా, భావుకత నిండిన వ్యాసాల్లో అందమైన అంశాలు. సాంప్రదాయం పట్ల, సంస్కృతి పట్ల, పురాణాల పట్లా వీరలక్ష్మిగారికున్న ఇష్టం అడుగడుగునా మనక్కనపడుతూనే ఉంటుంది వ్యాసాల్లో. రచయిత్రి వేరే పుస్తకాలేమన్నా రాసారో లేదో తెలియదు కానీ ఒక్క పుస్తకం చాలు ఆవిడ సాహిత్య పరిజ్ఞానం లోతెంతో తెలుసుకోవటానికి.(లక్ష్మిగారు కాలేజీలో లెక్చరర్ అని కొన్ని వ్యాసాల్లో తెలుపుతారు.)

కృష్ణ శాస్త్రి, కాళిదాసు, శ్రీ శ్రీ, మధురాంతకం, ఇస్మాయిల్‌, త్రిపుర, చలం, బుచ్చిబాబు, ఆంగ్ల కవుల మాటలూఇలా ఒకరా,ఇద్దరా..ఎందరో కవులు ఆవిడ వ్యాసాలన్నింటిలోంచీ తొంగి చూస్తూ ఉంటారు. ఈవిడ చదవని పుస్తకం ఉందా?తెలియని రచయిత , కవి ఉన్నారా? అని ఆశ్చర్యం వేస్తుంది. పాతపాటల గురించిన ప్రస్థావన కూడా ఆవిడ సంగీత పరిజ్ఞానాన్ని తెలియజేస్తుంది.(ఆవిడగాయనికూడానని ఒకచోట చదివిన గుర్తు.)

ఆకులో ఆకునై..” లో కొన్ని వ్యాసాల వివరాలు:

* “సేవా సౌందర్యంలో తన దయాపుర్ణ వ్యక్తిత్వ పరిమళంతో రచయిత్రి మనసు దోచిన అందాలషెహానా” గురించి హృద్యంగా రాస్తారు.

* “గేయమెంత మధురం గానమంత మధురంలో గజల్ గాయకులు పంకజ్ ఉధాస్,సాధనా సర్గమ్ గజల్స్ ఇచ్చిన తన్మయత్వాన్ని మనకూ అందిస్తారు.

* “విశాలమైన బంధనంలో స్వేచ్చ గురించిన లక్ష్మిగారి భావాలు మనలను ఆలోచింపజేస్తాయి.

* “కొత్త పెత్తందారులో పిల్లలు పుడుతునే ఇంటిని వాళ్ళ చేతుల్లోకి తీసుకుని, పెరిగే కొద్దీ తమ పెత్తనాన్ని ఎలా చూపిస్తారో సరదాగా చెప్తారు.మన ఉద్రేకాలూ,స్పందనలూ మన సంగీతంలో ఎలా పలుకుతాయో,మనల్నెలా కదుపుతాయో కూడా వివరిస్తారు వ్యాసంలో.

* “పాట పాడుమా కృష్ణా..మనసు తీరగా..”లో ఒక మధ్యాహ్నం రోడ్దు మీద పాతపాటలు వినబడగానే ఆగిపోయిన ఆమె ఇలా రాస్తారుమిట్టమధ్యాహ్నం బధ్ధకంగా వార్తల కోసం రేడియోఆన్చేసిన పుణ్యాత్ములకి నేను అయాచితంగా లభించిన పాటల వెంట మనసు పారేసుకున్నానని ఎన్నటికి తెలిదు కదా!” .

* “ఉపేక్షనెరుగని దక్షుడులోధురాంతకంగారి గురించి చెప్తూ, సకాలంలో ఆయనకు జవాబు రాయలేకపోయినందులకు చింతిస్తూ లక్ష్మిగారు అంటారుఎక్కడికి రాయను? ఆయన నా జవాబు అందని లోకాలకు వెళ్ళిపోయారు.ఇన్నిన్ని తెలుగు పుస్తకాలు పుట్టడానికి కారణమైన కవులతో,రచయితలతో,ప్రకాశకులతొ ముచ్చటిస్తూ ఉండి ఉంటారు.ఆయనకేం లోటు?జవాబు సకాలంలో ఇవ్వలేని నాలాంటి వాళ్ళకే లోటుఅని. “రెక్కలున్న మనసువ్యాసంలో అనుభూతి అన్నది ఎంత విలువైనదో చెప్తూ ఆమె అంటారుఆకుపచ్చదనంతో మెరిసిపొయే గడ్డిపొచలమైనా సరే జీవనమెంత ధన్యం!!!” అని.

* “వ్యక్తిత్వం కోసం..” లో శరత్ నవలశ్రీకాంత్నాయిక రాజ్యలక్ష్మి వ్యక్తిత్వం గురించి రాస్తూ, స్త్రీలు ఎలాంటివారిని ప్రేమిస్తారో శరత్చంద్రగారి ఉద్దేశంతో లక్ష్మిగారు తెలుపుతారు.దీనినిబట్టి ఆవిడ శరత్ సాహిత్యాన్ని ఎంతగా ఆకళింపు చేసుకున్నారో మనకు అర్ధమౌతుంది.

వీరలక్ష్మిగారి వ్యాసాల్లో నాకు నచ్చిన కొన్ని వాక్యాలు :

* ” ..మనుషులతో మనకీ అంతే. వదలలేము.భరించలేము. బాధలోనే సంతోషం. అయితే దానికి అర్ధాలు చెప్పగలవారే కవులు, రచయితలు.”

* “పుస్తకాలు చదివేవాళ్ళకి పుస్తకం మంచి మిత్రుడే కాదు ప్రియుడు,ప్రియురాలూ కూడా.కాదనండి,చూద్దాం!!”

* “భరించలేమనుకున్న మనుషులే కొన్నాళ్ళకి చేరువవుతారు.మైమరపిస్తారు.స్నేహపు వెచ్చదనాన్ని పెంచుతారు.జీవితంలో ఆనంద వసంతాలు చిగురింప చెయ్యగలరనుకున్నవాళ్ళు గ్రీష్మతాపాన్నే మిగులుస్తారు.”

* “మనిషి ఎదుటి మనిషిని రాగద్వేషమిశ్రితమైన మనిషిగా అంగీకరించగలగటం ఎంతో గొప్ప సంగతి.అదే జరిగితే వాదాలేవి అక్కర్లేదు. అర్ధం చేసుకోలేకపోవడాల దగ్గరే మానవ దు:ఖమంతా ఉంది.”

* “ఒక పాటని, ఒ కవితని వింటే, ఒ పచ్చని చెట్టుని, ఒ తెల్లని పువ్వుని చూస్తే మనసుకి తెలియని ఆనందం కలగాలి. విధంగా ఆనందించగల స్థితిని మనసుకి అలవాటు చెయ్యటమే జీవితంలోకెల్లా పెద్ద సాధన.ఇది అలవడిన రోజు ఎదుటి మనిషికి కలిగిన సంతోషం మన సంతోషమౌతుంది. సంతోషపు రుచి తెలిస్తే ఎదుటి మనిషిని సంతోషపెట్టడానికి పని అయినా చెయ్యాలనిపిస్తుంది.ఇదే కదా ప్రేమంటే.”

* “చిన్న చిన్న సరదాలకి జీవితాన్ని ఏదో మూల నించి అంటించి తగలెట్టుకుంటూ ఉంటారు.ఎప్పుడు జీవితం ఒక మూల నుంచి మండుతూనే ఉంటుంది. వేడి మిగిలిన భాగమంతా సోకి, ఎప్పుడూ, ఎక్కడా చల్లదనమనేది లేకుండా పోతూ ఉంటుంది.మంట ఎక్కడ మొదలైందో ఎలా మొదలైందో తెలుసుకునే సరికీ జీవితాలు గడిచిపోతాయి.”

* “ఎన్ని దు: వర్షాలు మనలోంచి మనమీంచి కురిసినా మనని స్వచ్చపరచాలే తప్ప మలిన పరచగూడదు.దు:ఖం నిలవనీటి గుంట అయిందో మన జీవితం మురికి ఓడుతుంది.శుభ్ర జలదంలాగ కన్నీటి వర్షాన్ని వర్షించి మనం తేలిక పడాలని వర్షాకాలం ప్రతి వర్షం ద్వారా గుర్తు చేస్తూ బోధపరుస్తూనే ఉంటుంది.”

ఇలాఎన్నో సున్నితమైన భావాలతో,అందమైన ఉపమానాలతో,అంతకంటే అపురూపమైన అనుభవజ్ఞులందించిన ఆణిముత్యాలవంటి వాక్యాలతో నిండిన పుస్తకం నాకెంతో ఇష్టమైనదీమనసున్న ప్రతి మనిషి చదవాల్సినది !!

You Might Also Like

15 Comments

  1. భారతీయ నవల | పుస్తకం

    […] ఇతర రచనల గురించి నేను రాసిన టపాలు ‘ఆకులో ఆకునై‘ ‘కొండఫలం‘ ‘మా ఊళ్ళో కురిసిన […]

  2. Nagini

    పరిచయం చాలా బాగుంది తృష్ణా జీ….:-)

  3. తెలుగు సాహిత్యంలో మళ్ళీ మునకలేయాలనుకుంటున్నారా? | పుస్తకం

    […] వాక్యాలను ఇక్కడ పొందుపరిచారు. చూడండి. నాకు నచ్చిన రచనల్లో […]

  4. G

    I donno about the book. Looks interesting. But the intro is good. Have to read it soon

  5. ramani

    మాములుగా మనం మాట్లాడుకొనే చిన్న చిన్నా మాటలే “అవునుకదా ” అనిపించేంతగా అద్భుతంగా రాశారు ఈ కథలని. ఎంత చదువుతున్నా మళ్ళీ ఇంకోసారి చదవాలి అనిపించెట్లుగా ఉన్నాయి లక్ష్మిగారి కథలు.

    ఈ పుస్తకం కోసం మేము రచయిత్రిగారిని పరిచయం చేసుకోడం ఎప్పటికి మరిచిపోలేని విషయం.

  6. Prasuna

    Trushna garu…
    Chakkati telugu saili. Inka yenno rayalani asisthunamu….

  7. Purnima

    అన్నట్టు.. వాడ్రేవు గారిది ఒక కథల సంకలనం ఈ మధ్యనే ప్రచురితమైంది. పేరు: కొండఫలం! వె: రూ. 90/-

    ఆసక్తి గల వారి కోసం ఈ సమాచారం! 🙂

  8. కొత్తపాళీ

    Excellent book and well written intro.
    I was told that this book will see re-print soon. So, keep an eye out.

  9. parimalam

    తృష్ణగారు,మీ పుస్తక పరిచయం బాగుంది.

  10. rajarao

    Very lively introduction & discussion.
    Plz keep it up.

  11. Bhaavana

    పైన రాసిన భావాలన్ని నావే తృష్ణ… చాలా మంచి పరిచయం. లక్ష్మి గారి మనసును మీరు బాగా అర్ధం చేసుకున్నారు. 🙂

  12. మేధ

    @తృష్ణ garu: Nice Intro.. good job..

    @Purnima: I too felt the same 🙂

  13. Kiran

    తృష్ణగారు! మీ వ్యాసం చాలా బాగుంది. పుస్తకం చదవక పోయినా పూర్తిగా చదివినంత అనుభూతి కలిగింది. రచయిత్రి లక్ష్మి గారి రచనా శైలి కళ్ళకు కట్టినట్టు అర్ధమయ్యేలా వ్రాసారు. వెంటనే ఈ పుస్తకం సంపాదించి చదువుతాను

  14. Purnima

    బాగుందండీ మీ పరిచయం! ఈ పుస్తకం గురించి నేనెప్పుడు రాద్దామనుకున్నా, మరోసారి పుస్తకం చదువుతాను కానీ, ఏమీ రాయలేను. “ఆకులో ఆకునై” అనేది ఈ పుస్తకానికి సరైన పేరు. ఈ పుస్తకం ఇక్కడ దొరకటం లేదని, వాడ్రేవు గారినే సంప్రదించి, పుస్తకం తెప్పించుకున్నాం నేనూ, కొందరు బ్లాగ్మిత్రులు!

    మీరు మరిన్ని మంచి పుస్తకాలను పరిచయం చేస్తారని ఆశిస్తున్నాను!

Leave a Reply