What you can change and what you can’t

What You Can Change and What You Can’t: The Complete Guide to Successful Self-Improvement -Martin Seligman

సాధారణంగా వ్యక్తిత్వ వికాసం, self-help ఇలాంటి టైటిల్స్ చూస్తే నేను వాటిని చిన్న కథలని చదివినట్లే చదువుతూ ఉంటాను – వాటిలో anecdotes అనబడేవి ఎక్కువ కనుక. ఇది కూడా అలాంటిదే అనుకున్నాను గీతా రామస్వామి గారు (హై. బుక్ ట్రస్ట్) ఈ పుస్తకం గురించి చెప్పినపుడు. కానీ, మొదట్లోనే “What you can change… is my attempt to review with unflinching candor the effectiveness of most of the different kinds of treatment for the major psychological disorders” అని రాసి నా అభిప్రాయాన్ని సరిచేసారు రచయిత.

పుస్తక రచయిత Martin Seligman అమెరికాలో పేరెన్నికగన్న మానసికశాస్త్ర నిపుణుడు. Positive Psychology అన్న అంశంపై విస్తృత పరిశోధనలు చేసారు, పుస్తకాలు రాశారు. ఈ ప్రస్తుత పుస్తకం లో పైన చెప్పినట్లు ఇప్పటిదాకా (నేను చదివినది 2007 ప్రాంతంలో వచ్చిన ఎడిషన్) వివిధ మానసిక సమస్యలకు చికిత్సగా వాడుతున్న – మందులు గాని, ఇతరత్రా వైద్య, మానసిక చికిత్సా విధానాలను పరిశీలించి, వాటివల్ల గల ఉపయోగం ఎంతా? అన్న ప్రశ్నకు సమాధానం శాస్త్రీయ పరిశోధనల ఆధారంగా ఇవ్వడానికి ప్రయత్నించారు. పుస్తకంలో చర్చించిన మానసిక సమస్యలు: Anxiety, Panic, Phobias, Obsessions, Depression, Anger, Post-traumatic stress, Sex, Dieting, Alcohol (ఈ పదాలని పుస్తకంలో వైద్య పరిభాషలో వాడారని, దైనందిన వ్యవహారంలో మనం వాడేలాగ కదనీ గమనించగలరు).

“making up your mind about self-improvement courses, psychotherapy and medications for you and your family is difficult because the industries that champion them are enormous and profitable and try to sell themselves with highly persuasive means: testimonials, case histories, word of mouth, endorsements (“My doctor is the best specialist on X in the East”), all slick forms of advertising. Just as this is no way to pick a vaccine or decide on whether to have chemotherapy versus radiation for cancer, this is no way to decide whether to try a particular diet, or whether to send your father to a particular alcohol-treatment center, or whether to take a particular drug for depression or to have a psychotherapy. Much better evidence -outcome studies- is now often available”

-పుస్తకం వీటి గురించే. ఈ అధ్యయనాలు ఏమి చెబుతున్నాయి? అని. దాన్ని బట్టి నిర్ణయం తీసుకోండి కానీ, మీ అభిమాన నటుడు ఫలానా పేస్టు వాడుతున్నాడు, వి.ఎల్.సీ.సీ బొమ్మలో ఆవిడెవరో పాతిక్కిలోలు తగ్గినట్లు చూపించారు – ఇలాంటివి చూసి కాదు అని.

ఈయన ప్రాథమిక సిద్ధాంతం ఏమిటంటే – కొన్ని సమస్యల విషయంలో మనం థెరపీ వల్లనో, మందుల వల్లనో మార్చుకోగలము, కొన్నింటికి మూలం మన జన్యువుల్లో ఉంటుంది – అవి మారవు అని. కనుక, ఒక్కో సమస్యనీ తీసుకుని అందులోని ఏ అంశాలు మార్చుకోగలం, ఏవి మార్చుకోలేము – అన్నది చెబుతారన్నమాట. ప్రతి అధ్యాయానికి చివర్లో ఓ టేబుల్ కూడా ఉంటుంది – ఏ ఏ ట్రీట్మెంట్ ఎంతెంత వరకూ పనిచేస్తుంది తరహాలో. పై సమస్యల్లో వేటితో అన్నా బాధపడేవారు గాని, అలా బాధపడేవారి సన్నిహితులు గానీ ఈ పుస్తకం చదివితే, ఏ మందులు, ఎలాంటి సైకోథెరపీ పనిచేస్తాయి? అన్న విషయం గురించిన సూచనలు పొందవచ్చని రచయిత అభిప్రాయం. Informed decision తీసుకోవడానికి పనికివస్తాయి అని ఆయన అభిప్రాయం కావొచ్చు. పుస్తకాన్నే డాక్టరుగా తీసుకోమని కాదు.

రచయిత మొదటి అధ్యాయంలోనే స్పష్టంగా అతని stance ఏమిటి? అతని పక్షపాతం ఎటువైపు – రెండూ స్పష్టంగా చెప్పడం, అలాగే పుస్తకంలోని అధ్యాయాలకు ఒకట్రెండు వాక్యాల్లో సమ్మరీ రాయడం నాకు పుస్తకం లో అన్నింటికంటే నచ్చిన అంశం. అలాగే రాసిన విధానం కూడా స్పష్టంగా ఉంది. ఎక్కడా అనవసర విషయాలు చెప్పకుండా, సూటిగా రాశారని నా అభిప్రాయం. మొదటి మూడు నాలుగు అధ్యాయాల్లో ఆ శాస్త్ర రంగం గురించి, దానికి సంబంధించిన సామాజిక-రాజకీయ అంశాలను గురించి క్లుప్తంగా చరిత్ర చెప్పడం కూడా నాకు చాలా ఉపయోగపడింది.

ఇకపోతే, రచయిత చివర్లో తన థియరీ అంటూ చెప్పుకొచ్చిన అంశాలే ఈ పుస్తకంలో నాకోపట్టాన మింగుడుపడని అంశం. అలాంటి థియరీలనే కదా ఆయన మొదట్లో కొట్టిపడేసింది? అనిపించింది. Anecdotal evidence మీద ఆధారపడ్డ సిద్ధాంతాలవి అని ఆయన అన్నారు. ఈయన కూడా పరిశోధనా ఫలితాల ఆధారంగా ఏర్పరుచుకున్న సొంత అభిప్రాయాలనే కదా థియరీ అంటున్నారు? దీన్ని మట్టుకు ఎలా నిరూపిస్తారు? అన్న సందేహం కలిగింది నాకు. అయితే, పుస్తకాన్ని చదవగోరే వారు ఈ చివర్లో ఆయన రాసే థియరీ అంశం కోసం చదవరు కనుక, ఇది ఉపయోగకరమైన పుస్తకమే అని చెప్పాలి.

నా మట్టుకు నాకైతే కనీసం పుస్తకంలో ప్రస్తావించిన కొన్ని మానసిక-శారీరిక సమస్యల గురించి కొంత అవగాహన ఏర్పడిందని నమ్ముతున్నాను. నేను ఏ ట్రీట్మెంట్ ఉత్తమమో కనుక్కోడానికి చదవలేదు కనుక – ఆ విషయమై మట్టుకు వ్యాఖ్యానించలేను. పుస్తకాన్ని గురించి చెప్పినందుకు గీత గారికి ధన్యవాదాలు.

You Might Also Like

Leave a Reply