తెలుగు ప్రాజెక్ట్ గుటెన్‍బర్గ్ – ఒక అభ్యర్థన

ఆంగ్ల ఈ-పుస్తకాలకు నెలవైన ప్రాజెక్ట్ గుటెన్‍బర్గ్ లో తెలుగు పుస్తకాలను కూడా చేర్చాలని  సంకల్పించి కొందరు ఔత్సాహికులు పనిజేస్తున్నారు. ఇందులో భాగంగా కాపీరైట్ వర్తించని పుస్తకాలను యునికోడులో టైపు చేసి, ఆ సైటులో అందరికి అందుబాటులో పెడతారు.

ప్రస్తుతం మహీధర రామ్మోహన రావుగారి ’శుభలేఖ’ రచనను యూనికోడులో టైపు చేస్తున్నారు. అలానే వారి ఇతర రచనలనూ చేయాలని లక్ష్యం. ఇందుకు సాహిత్యాభిమానుల నుండి, ఈ కింది విషయాల్లో, సహాయసహకారాలు కోరుతున్నారు.
౧. తెలుగు పుస్తకాలను టైపు చేయడానికి, ప్రూఫ్ రీడ్ చేయడానికి ఆసక్తిగల ఔత్సాహికులు కావాలి. ఇప్పటికే గుర్తించిన కొన్ని రచనలను తెలుగు ప్రొజాక్ట్ గుటెన్‍బర్గ్  గ్రూపు వారు అందిస్తారు.
౨. కాపీరైట్ వర్తించని పుస్తకాలను గుర్తించ టంలోనూ, దుర్లభమైన  పుస్తకాలను సంపాదించడంలోనూ సహాయం కావాలి.
౩. తెలుగులో scanning / OCR softwareకు సంబంధించిన విషయాల్లో సాంకేతిక సహాయం కావాలి.
వీటిపై ఆసక్తి ఉన్నవారు,  gutenberg_te@googlegroups.com కు ఈ-మెయిల్ పంపగలరు.
అరుదైన తెలుగు సాహిత్యాన్ని అందరికి అందేలా పది కాలాల పాటు నిలిచేలా చేసే ప్రయత్నం ఇది. పుస్తకాలను ఈ గూటికి చేరిస్తే, మనం ఉన్నా లేకున్నా, అవుంటాయి.

You Might Also Like

7 Comments

  1. Shubhalekha becomes the first Telugu book on Project Gutenberg | Crossroads

    […] Pustakam.net had requested for help to add Telugu books to the Project Gutenberg. As part of that initiative, volunteers of Pustakam.net digitized Shubhalekha, a Telugu story by Mahidhara Ramamohan Rao and made it available on the Project Gutenberg website. […]

  2. dasthagiri

    నే్ను ప్రూఫ్ రీడింగు చేయగలను.

    _దస్తగిరి

  3. veeresh

    నేను తెలుగులో టైపు చేయగలను.

  4. Sivaraamaprasaadu Kappagamtu

    ప్రూఫ్ రీడ్ చేసి పెట్టగలను

  5. Sattar Saheb

    నేను తెలుగు బాగా స్పీడ్ గా టైపు చేస్తాను వీలఐతే….

    సత్తార్

  6. leo

    Please access the following link to register yourself to the group. Once your membership is approved, you’d be able to send emails to the id given above.

    http://groups.google.com/group/gutenberg_te

  7. dvenkat

    ఈ మెయిల్ ఐడి పని చెయ్యట్లేదు.సరైన మెయిల్ ఐడి ఇవ్వగలరు.

Leave a Reply