మీరేం చదువుతున్నారు? – 1
పుస్తకాలు తరచుగా చదువుతున్నా, పేజీలకి పేజీలు సమీక్షలు రాసే ఓపికా, తీరికా లేని వారి కోసం ఈ పేజీని నిర్వహిస్తున్నాము. ఈ వారంలో మీరే పుస్తకాలు చదివారు, వాటిని గురించి ఓ రెండు ముక్కలు ఇక్కడ కమ్మెంట్ల రూపంలో పంచుకోవచ్చు. ఈ నమునాలో వివరాలు చెప్తే సులువుగా ఉంటుంది.
పుస్తకం పేరు:
రచయిత:
భాష:
వెల:
అంతర్జాలంలో ఈ పుస్తక వివరాలు:
పుస్తకం పై మీ అభిప్రాయం:
వెంకటరమణ
హిమోహసదనం నుంచి ప్రేమతో ……. వడ్డెర చండీదాస్.
ఈ పుస్తకం లో చండీదాస్ గారు వారి మిత్రుడు రఘు గారికి 1984-2004 మధ్య కాలంలో రాసిన ఉత్తరాలు ఉన్నాయి. వీటిలో చివరిలో రాసిన ఉత్తరాలలో ఎక్కువగా చండీదాస్ గారి అభిరుచులు, అభిప్రాయాల ప్రస్తావన ఉంటుంది. హిమజ్వాల, అనుక్షణికం నవలలు చదివిన వారికి, ఆ నవలలు నచ్చినా నచ్చకపోయినా ఈ పుస్తకం ఆసక్తికరంగా అనిపిస్తుంది. ఆ నవలలు చదవని వాళ్లకు నచ్చుతుందని చెప్పలేను.
మెహెర్
ఓ నాల్రోజులు బాగా ఖాళీ దొరకడంతో ఈ రెండు పుస్తకాలు పూర్తి చేసాను.
“కోతికొమ్మచ్చి”, ముళ్లపూడి వెంకటరమణ: లేటుగా చదివాను. దీని గురించి చెప్పేదేముంది. అసలే కోతి. ఆపై చాన్నాళ్ళ తర్వాత కల్లు (కలం) తాగింది (తాకింది). అదీగాక ఈ సారి అలవాటైన చెట్టెక్కింది. సొంత కథ చెప్తోంది. గంతులే గంతులు. కొన్ని కొంతమంది చెపితేనే మనసుకు పడతాయి:
“ఆలుమగలయినా ఆప్తమిత్రులయినా అన్నదమ్ములయినా చిరకాల బాంధవ్యాన్ని నిలబెట్టి నడిపే సూత్రం — భరించడం. ఒకరి సుగుణాలు నచ్చి ప్రేమించడం సహజం, మామూలే. కాని నచ్చని గుణాలు సహించడం, భరించడం. . . అదే ప్రత్యేకత. ఇక్కడ ఒక ముఖ్య విషయం గుర్తుంచుకోవాలి. మనకి నచ్చని గుణాలన్నీ చెడ్డవి అనుకోవడం చాలా పెద్ద తప్పు. అది తెలుసుకుంటే స్నేహదీపం అఖండంగా వెలుగుతుంది.”
నన్నే నిలేసి ఇలాంటివో నాలుగు నీతులు చెప్పమంటే, నాలుగేం ఖర్మ సవాలక్ష చెప్తాను—నాలిక్కొస మీంచి. ఏం లాభం. అవేమీ ఈ బరువు తూగవు. పైకి హల్కాగా కనిపించే ఈ నాలుగు మాటలూ, ఒక జీవితకాలం నిలిచిన సారవంతమైన స్నేహబంధపు పునాదుల్లోంచి మొలకెత్తాయని స్ఫురించగానే, ఒట్టి నీతులు కాదు, నిత్య స్మరణీయార్హమైన మంత్రాలుగా మారిపోతాయి. పుస్తకం బాగుంది. చదివిన కాసేపూ — జీవితమా? అబ్బే అంత భారమేం కాదు, చూపుడువేలి మీద సాకర్బంతిని గింగిరాలు తిప్పినట్టు తిప్పి ఆడేసుకోవచ్చనిపించింది.
“విశ్వదర్శనం (పాశ్చాత్య చింతన)”, నండూరి రామమోహనరావు: నేను విల్‌డ్యురాంట్ “స్టోరీ ఆఫ్ ఫిలాసఫీ” చదివాక “అరె! తత్త్వశాస్త్ర సంక్లిష్టతల్ని అరటిపండు తొక్క వలిచి పెట్టినట్టు భలే చెప్పేయగలిగాడే” అని ఆశ్చర్యపడితే, నండూరి వారి “విశ్వదర్శనం” చదివాక “అరె! ఈయన తొక్క వలిచిపెట్టడమే కాదు, నమిలే శ్రమ కూడా లేకుండా గుజ్జు చేసి గోరు ముద్దలు తినిపించేస్తున్నాడే” అని హాశ్చర్యపడిపోయేసాను (ఈ “కోతికొమ్మచ్చి” జార్గాన్ తప్పదేమో కొన్నాళ్ళు). మా తమ్ముడు అడపాదడపా దీని గొప్ప చెప్పేవాడు. “పోరా, బోడి సెకండ్‌హాండ్ తెలుగు తాత్త్వికత ఎవడిక్కావాలి, నేను తిన్నంగా ఇంగ్లీషులోనే చదివేస్తా”ననుకునేవాణ్ణి. ఇప్పుడు లెంపలేసుకోవాల్సిందే. మామూలుగా ఎవరైనా తత్త్వశాస్త్రం మాట్లాడితే ఏదో మన నిత్య జీవితాలకు అక్కర్లేని లగ్జరీ మాట్లాడినట్టూ వుంటుంది. నండూరి అలాక్కాదు. బియ్యం ధర, బాంక్ లోనూ, రాష్ట్ర విభజన, రేషన్ కార్డూ, సినిమా, సామాజిక న్యాయం లాంటి దైనందిన రంథి మనకి ఎంత అత్యవసరమనిపిస్తాయో, అసలు మనిషికి నిర్ణయస్వేచ్ఛ (free will) ఉందా లేక అంతా పూర్వనిశ్చితమేనా (determined) అన్న మీమాంస తేలటం కూడా అంత అర్జెంటైన విషయమమే అనిపించేట్టు చెప్పగలడు. తత్త్వశాస్త్రంతో తొలి కరచాలనం కోసం చాలా పుస్తకాల్ని వెతికానా మధ్య. ఇక్కడి నండూరిని నిర్లక్ష్యం చేసి ఎక్కడో ఇంగ్లీషు దాకా పోవడం. . . . చంకలో పిల్లాణ్ణి పెట్టుకుని ఊరంతా వెతికినట్టే అయింది నా పని. ఈయన రాసింది చాలా వరకూ ఇంగ్లీషు గ్రంథాల పఠనసారమే అయినా, ఏదో పుక్కిట పట్టి ఉమిసినట్టుండదు, మొదట తాను సాంతం జీర్ణించుకున్న తర్వాతే మనకు చెప్తున్నాడని ప్రతీ వాక్యంలోనూ ద్యోతకమవుతుంది. అయితే ముందే విల్డ్యురాంట్ని చదివుండటం వల్ల, ఆ సారాన్నంతా మరొక్కసారి తెలుగు రుచితో నెమరు వేసిన ఆనందం మాత్రమే దక్కింది నాకు. ఈ పుస్తకంతోనే ప్రారంభించిన వారికి మరింత విస్తృతంగా ఉపయోగపడగలదు. లేనిపోని బడాయిల్లేని వచనం. లీనమయ్యేట్టు చేస్తుంది. లీనమవగా అవగా, అక్షరాలూ పదాలూ అంతర్థానమైపోయి, వట్టి ఆలోచనా ధారే అనుభవానికొస్తుంది. రాండమ్‌గా ఒక పేరాగ్రాఫు:
“కళా సౌందర్యాస్వాదన కూడా ఇచ్ఛ (will)ను జయించడానికి తోడ్పడుతుంది. కళాస్వాదనలో మన సొంత ఇచ్ఛ అంతరిస్తుంది. మన ఇచ్ఛ ప్రపంచపు ఇచ్ఛలో కలిసిపోతుంది. దానివల్ల మన సంకుచితావరణను దాటి విశ్వావరణలో ప్రవేశించ గలుగుతాము. అంటే, రసానుభూతి వల్ల (భారతీయ అలంకారికులు చెప్పినట్టు) “ఆవరణ భంగం” జరుగుతుంది. మన వ్యక్తిత్వపు పరిమితులను అతిక్రమించ గలుగుతాము. దీనివల్ల ఇచ్ఛ అంతరిస్తుంది. దుఃఖం ఉపశమిస్తుంది. అన్నిటిలోకి ఉత్తమ కళ సంగీతం. తక్కిన కళలు కేవలం భావాలకు ప్రతిబింబాలు కాగా, సంగీతం భావాలకు అతీతమైన ప్రపంచపు ఇచ్ఛను యథాతథంగా ప్రతిధ్వనిస్తుంది. భావాల ద్వారా కాక, సూటిగా మనలను తాకుతుంది.”
ఈ పుస్తకం చదివిన ఊపులో నిన్న పుస్తకప్రదర్శనలో “విశ్వదర్శనం (భారతీయ చింతన)” కూడా కొన్నాను. దీనికీ, గత పుస్తకానికీ మధ్య రాయటంలో పదేళ్ళ తేడా వుండటం వల్లనో ఏమో, ఇందులో విషయ వ్యక్తీకరణ మరింత చిక్కగా వుంది. ఇప్పటిదాకా “అవతారిక” మాత్రమే చదివాను. ఇందులో రచయిత చెప్పిన ఒక విషయం చదివాకా, ఒక ఆశ మినుక్కుమన్నట్టే అనిపించి అంతలోనే ఆరిపోయింది. ఇప్పటిదాకా వచ్చిన రెండు పుస్తకాల్లోనూ భారతీయ, పాశ్చాత్య చింతనల్ని ఉన్నవున్నట్టూ పరిచయం చేసాననీ, తన సొంత అభిప్రాయాలేవీ జత చేయలేదనీ, వాటిని త్వరలో రాయబోతున్న “విశ్వదర్శనం” మూడో భాగంలో వెల్లడిస్తాననీ అన్నారు నండూరి. కానీ, ప్రస్తుతం వారు అది రాయటం లేదనీ, రాసే స్థితిలో కూడా లేరనీ తెలిసాకా నిరాశ కలిగింది.
మాటొచ్చింది కాబట్టి ఇంకో విషయం. తత్త్వశాస్త్రాన్ని ఎబిసిడీల్లో గాక, అఆఇఈల్లో పరిచయం చేసుకోగోరే వారికి త్రిపురనేని గోపీచంద్ రచన “తత్త్వవేత్తలు” శుద్ధ అనవసరం అనిపించింది నాకు. అందులో సొంతంగా చెప్పిందేం కనపడలేదు. పేరాలకు పేరాలు విల్‌డ్యురాంట్ పుస్తకం నుంచి మక్కికి మక్కీ అనువాదాలే. పోనీలే అనుకుంటే, ఆ అనువాదపు తీరు కూడా, అసలే జటిలమైన విషయాన్ని మరింత ఝఠిళం చేసేలా వుంది. “స్టొరీ ఆఫ్ ఫిలాసఫీ” మీద ఇంత ఆధారపడి కూడా గోపీచంద్ ఎక్కడా ఆ పుస్తకానికి కర్టెసీ ఇవ్వకపోవడం ఆశ్చర్యమనిపించింది.
సౌమ్య
Will Durant “A case for india”, Paulo Coelho “Veronica Decides to Die”,
కోతి కొమ్మచ్చి మొదటి భాగం.
1. మొదటిది చాలా డిస్టర్బింగ్ గా ఉంది.
2. చేతన్ భగత్ ఇతని వల్ల ప్రభావితం ఐ ఉండొచ్చు. మీ ట్రైన్ నాలుగైదు గంటలు లేటైతే, దీనితో కాలక్షేపం ఐపోతుంది.
3. రమణ గారు అన్పుట్డౌనబుల్. బాపు గారు అన్దృష్టిమరల్చబుల్!
రవి
నోరి నరసింహ శాస్త్రి గారి “నారాయణ భట్టు” చారిత్రక నవల చదువుతున్నాను. కాసేపు అద్భుతంగా, కాసేపు విసుగ్గా, మళ్ళీ ఆసక్తికరంగా, ఇలా అనిపిస్తూ ఉంది, నా మూడ్ లాగానే.
అరిపిరాల
Paulo Coelho – ప్రేమకి, శృంగారానికి కొత్త అర్థాలు తెలుసుకున్న ఒక వ్యభిచారి కథ “Eleven Minutes”, Robin Sharma – భారతీయ వేదాంతాన్ని, జీవన విధానాన్ని ఆసక్తికరమైన పిట్టకథలా మార్చి, ప్రపంచానికి అర్థమయ్యే భాషలో చెప్పిన “The monk who sold his ferrari” రెండోసారి చదివాను..!!
Chetan Bhagat “Two States” మొదలు పెట్టాలి..!!
Srinivas
వాడ్రేవు చినవీరభద్రుడు గారు రాసిన “కొన్ని కలలు. కొన్ని మెలకువలు” ఎమెస్కో ప్రచురణ.
సార్వత్రిక విద్యారంగంలో వారి అనుభవాల గురించి. ఈ మధ్య కాలంలో నన్ను చాలా కదిలించిన పుస్తకం!
తమ్మినేని యదుకుల భూషణ్.
రవీంద్రుని గీతాంజలి వంగ భాషలో చదువుతున్నాను.
Purnima
నేనేం చదవటం లేదు కానీ.. ఇప్పుడే ఈ సైటు నా కళ్ళబడింది. ముళ్ళపూడి వారి కోతి కొమ్మచ్చి, బాలుగారి గళంలో వినొచ్చట! భలే ఉంది కదూ..
http://kothikommachi.com/index.php
pammi
పుస్తకం పేరు:Tanzania travologue
రచయిత:Sri Gollapudi MaruthiRao
భాష:Telugu
వెల:
అంతర్జాలంలో ఈ పుస్తక వివరాలు:Koumudi.net lo “GRANDALAYAM” sirshika lo labyam
పుస్తకం పై మీ అభిప్రాయం:Excellent,oka goppa rachana.author has touched different angles of journey.especially the way he describes the lions in sevenna grass of tanzania is wonderful.it has all elements like geography,history,life of tanzania people,little zist of telugu food many more…a great pleasure to read
సౌమ్య
@Malathi garu:
నేను Kurt Vonnegut కొన్నాళ్ళ క్రితం ఓ పత్రిక్కి రాసిన “A man without a country” కాలమ్ వ్యాసాల సంకలనం చదువుతున్నాను. వెరీ ఇంటరెస్టింగ్.
malathi
కిందటివారం హఠాత్తుగా ఓనిర్ణయానికొచ్చేను. ప్రతిరోజూ ఏదో ఒకటి చదవాలని. (అవునండీ, సౌమ్యా, కల్పనా చదువుతున్నాం అని రోజూ చెప్తుండడం మూలంగానే!) ఆఊపులో వెళ్లి లైబ్రరీలో కనిపించిన Fiction Class అన్న నవల పేరు చూసి తీసుకొచ్చేను. రచయిత్రి పేరు ఎప్పుడూ వినలేదు. కానీ, కథనం నాకు చాలా నచ్చింది. నవల ఎలా రాయాలో ప్రతివారం క్లాసులో చర్చించిన విషయాలు ఆస్పత్రిలో అంతిమదశలో వున్న తల్లితో చెపుతుంది. ఆవిధంగా అంతకు మున్నులేని సాన్నిహిత్యం ఏర్పడుతుంది వారిమధ్య. అలా కొత్తగా వచ్చిన వుత్సాహంలో తల్లి తనజీవితం కథగా రాస్తుంది. ఈపుస్తకం చదివితే నవల ఎలా రాయడమో తెలిసిపోతుంది అని చెప్పను కానీ రాసేవాళ్లలో కనీసం ఒకరు ఎలా ఆలోచిస్తారో తెలుస్తుంది.
సౌమ్య
Akira Kurosawa (One of the greatest film directors, from Japan) – ఆత్మకథ చదువుతున్నాను. కురోసవా వీరాభిమానిని అయినందువల్ల నాకీ పుస్తకం చదవడం ఓ మర్చిపోలేని అనుభవం. అలాగే, నలభై-యాభైలలో జపాన్ లో సినిమా పరిస్థితులు, సామాజికంగా ఉన్న ఆంక్షలు, వీటి మధ్య కురసావా ఎదుగుదల – ఇదంతా చదువుతూ ఉంటె, ఆసక్తికరంగా ఉంది. ఇది అనువాదమే. కానీ…నేరేషన్ నాకు చాల నచ్చింది, అది కురోసవా లోని రచయితను పరిచయం చేసింది. మరింత వివరంగా త్వరలో రాస్తాను.
పుస్తకం పేరు: Something like an autobiography
padmaja
ayya,
ilanti avakasam unnatlu ipude telisindi. eemadya ‘kotikommachi’chdivina ventane ila panchukovalanipinchindi.
padmaja
note; Sorry, I don’t know to convert the above into telugu lipi
Rakesh
ఈ మధ్యనే (పూర్తిగా) చదివిన పుస్తకాలు:
1. I WILL SURVIVE – Sunil Robert
Wonderful narration… నా ఉత్తరభారతయాత్ర (హిమాచల్, ఉత్తరాఖండ్) ఆస్వాదనకు ఏమాత్రంతీసిపోనివిధంగా, ఈ పుస్తకాన్ని enjoy చేసాను. (Shall try to write a detailed review)
2. ప్రజల మనిషి – వట్టికోట ఆళ్వారుస్వామి
నిన్ననే ముగించా.
హృదయాన్ని కదిలించేసంఘటనలు, కన్నీరుకార్పించే సంభాషణలు… తెలంగాణప్రాంతంవారైనా, కాకపోయినా – తెలంగాణచరిత్రగురించి ఆసక్తిగలవారు తప్పకచదవాల్సిన పుస్తకం…
ఇంకా ముగించనివి:
1. అంటరాని వసంతం – కళ్యాణరావు
2. STAY HUNGRY STAY FOOLISH – Rashmi Bansal
sailajamithra
Narendrapal Bhavishyathu bahuparaak chaduvuthunnanu. adi saahitya acadami award pondina novel. ee panjabi novel nu v.v.b Ramarao garu teluguloki translate chesaru. Nijanga Novel ila undali anipinchela undi. Indulo prathi paathra sajeeva chitralai ventaaduthunnayi. ee novel oka future pai raasina oka incident. Akali, Alasata, Rajakeeyalu, sthri purushulu, oka American young lady tho oka Indian prema yaathra,Aathma darshanam. Ivanni kalipi oka jeevitha anubhavam. In panjabi Baamula Hija Hoshiyaar ane novel nu Raamarao garu Bhahuparak ane perutho translate chesaru. Really wonderful book. I enjoy very much.
సౌమ్య
“ప్రేమలేఖలు” -చలం.
కొన్ని చోట్ల చాలా నచ్చింది – ప్రస్తుతం నా ఆలోచనలు కొన్ని అక్కడి ఆలోచనల దిశలో ఉన్నందుకో ఏమో మరి..
HARSHA NETHRA
Now I’am reading the letters of Gopichand, “pst cheyyani Vuttaraalu”
wchich is the comversation, argument, and opinion making exercise in philosophy.
Harshs Nethra
సౌమ్య
నేను మాలతి గారు వివిధ రచయితల తెలుగు కథలను అనువాదం చేసి వేసిన ఆంగ్ల కథల సంకలనం – From my front porch చదువుతున్నాను. రకరకాల కథలు – రకరకాల రచయితలు. కొందరు తెలుగు రచయితల గురించి ఇలా ఆంగ్లానువాదాల ద్వారా తెలుసుకుంటానని ఎప్పుడూ ఊహించలేదు…. ఒక విధంగా ఇది బాధాకరమే అయినా… ఇప్పటికన్నా తెల్సుకుంటూన్నా కదా
Interesting collection.
త్వరలో పుస్తకం.నెట్ లో రాస్తాను ఈ పుస్తకం గురించి. (నేను కూడా అరిపిరాల గారిలా పబ్లిక్ ప్రామిస్ ఇచ్చేస్తా ముందే… అప్పుడైతే తప్పక రాస్తానని)
vijayalakshmi
నెను అడవి బాపిరాజుగారి తుపాను చదువుతున్నాను . ఆ శైలి అద్భౌతం still i need to practice telugu version to communicate to pranahita.
p.bhanu
EE VAARAM NENU VAMSYKRISHNA RASINA VIDEHA ANE PREMALEKHALA SAMKALANAM
CHADIVANU. MOTHAM 35 PREMA LEKHALU VUNNAI. Premanu gurinchina sunnitha
bhavanalatho paatu gaa Telugu vallu garvinchadagina kavulu rachayithala
bhavalani anubhavalani ee pustakam lo chooda vachhu
ee pustkanni Spruha sahiti samstha Hyderabad varu Prachurinchar.
Net lo vivaraala gurinchi teleedu
అరిపిరాల
పుస్తకం పేరు: ఫైవ్ పాయింట్ సంవన్
రచయిత: చేతన్ భగత్
భాష: ఆంగ్లం
వెల: రూ 95
పుస్తకం పై నా అభిప్రాయం: బాగుంది. టీనేజ్ ఫిక్షన్. ఇలాంటి విద్యా విధానంలో చదివి వుండటం వల్ల చాలా వరకు “చూసినట్లే” అనిపించింది. మరింత వివరంగా వ్యాసం అతి త్వరలో..!!
(ఇలా కమిటైతే బద్దకించకుండా వ్యాసం వ్రాస్తానని..!!)
సౌమ్య
చలం “పురూరవ” చదివాను. రేడియో నాటకం శారదా శ్రీనివాసన్ గారి గొంతులో విన్నాక, చదవకుండా ఉండలేక, చలం అయినా భయపడకుండా చదివేశాను. డైలాగులు సూపర్బ్. త్వరలో పుస్తకం లో ఈ పుస్తకం గురించి రాయాలనుకుంటున్నాను. ఇది చదవాలనుకునేవారు ఈమాట వారి ఆర్కైవ్స్ లో ఇక్కడ చదవొచ్చు.
KN Mohan
Ivan Turgnev vrasina A Lear of the Steppes chalakalam taruvata net lo chadavanu. Andaru chadavtaga katha.
సౌమ్య
నేను Marjane Satrapi రాసిన Persepolis అన్న గ్రాఫిక్ నవల చదువుతున్నాను. నవల కాదు – ఆత్మకథ. యుద్ధకాలం నాటి ఇరాన్ జీవితాన్న గురించి చెబుతూనే, రచయిత్రి సొంత జీవితంలోని సంఘటనలు ఈ నవల కథాంశం. గ్రాఫిక్ నవల కావడం తో – ఆకర్షణీయంగా ఉన్నాయి బొమ్మలు. తప్పక చదవాల్సిన పుస్తకం. దీన్ని సినిమాగా కూడా తీసారట.
venkat
స్వాతి వార పత్రిక లో వంశీ “దిగువ గోదావరి కధలు” వారం వారం రాస్తున్నారు. అద్భుతమైన కధలు. అదే పత్రిక లో ముళ్ళపూడి “కోతికొమ్మచ్చి” కూడా బావుంది
సౌమ్య
నిన్నే Harsh Mander రాసిన “Unheard Voices” చదవడం మొదలుపెట్టాను. పేరులో చెప్పినట్లే, వివిధ సంఘటనల్లో బాధితులైన సామాన్యుల కథలు ఇవి. ఇవన్నీ బైట విన్న కథలు కావు. తన ఐఏయస్ అనుభవాల్లో భాగంగా తారసపడ్డ కేసులు కొన్ని, పత్రికలకోసం రాసిన కథనాల ద్వారా తెలిసినవి కొన్ని : ఇలాంటి కథలు. ఇంకా చదువుతూ ఉన్నాను. కొన్ని కథలు చదువుతూ ఉంటే, మనిషిలో ఉన్న పోరాట పటిమకి ముచ్చటేస్తోంది. ఓ వైపు అదే మనిషిలో ఉన్న సంకుచితత్వానికీ, ఆధిపత్య భావాలకీ – కోపం వస్తొంది.
నేనింకా సగం దాకా కూడా రాలెదు కానీ, ఈ కథలు చదివితే, కొంత ఆత్మ పరిశీలన చేస్కోడం ఖాయం అనిపిస్తోంది నాకు.
స్వాతి కుమారి
అవును, దూరదర్శన్ వెర్షన్ బావుంటుంది. అసలది ఛూశాకే నేను పుస్తకం కొని చదివాను.
౧. దీపావళి రోజున చేతన్ భగత్ 2 states పూర్తి చేశాను. ఇంతకు ముందు వాటికంటే బాగా రాశాడు. దాన్లో అతని బాంక్ ఉద్యోగం గురించి చదుతుంటే నా icici రోజులు గుర్తొచ్చాయి. చివర్లో కొంచెం సాగదీసినట్టు ఉంది.
౨. తమ్మినేని యదుకుల భూషన్ గారిది ’నేటి కాలపు కవిత్వం – తీరుతెన్నులు’ పుస్తకం మొదలెట్టాను. కొత్తగా కవితలు రాస్తున్న వారికి మంచి సూచనలూ, హెచ్చరికలూ ఉన్నాయందులో.
౩. అడవి బాపిరాజు గారి ’హిమబిందు’ కొన్ని పేజీలు తిప్పానంతే. Interesting.
౪. గుంటూరు శేషేంద్ర శర్మ గారి కవితలు కొన్ని చదివాను. చాలా ఆహ్లాదకరమైన లయబద్ధమైన శైలి ఆయనది.
సౌమ్య
గోపీచంద్ “పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా” నవలకి డి.వి.నరసరాజు గారు రాసిన స్క్రీన్ ప్లే చదివాను. దూరదర్శన్ లో వచ్చిన టెలీఫిల్మ్ కి ఇదే వాడారు అనుకుంటా. నాకు బాగా నచ్చింది.
సింధు
యండమూరి వీరేంద్రనాథ్ “ఋషి” కూడా. అమరావతి కథలు బావున్నాయి.
సింధు
శంకరమంచి సత్యం గారి “అమరావతి కథలు”
సౌమ్య
బిజీ బిజీ దీపావళి నడుమ, కంప్యూటర్ కూడా అందుబాటులో లేనప్పుడు, చేతికి దొరికిన – “Surely you’re joking, Mr Feynmann”, తీరిక దొరికినప్పుడు సగం చదివాను. నాకు చాలా నచ్చేసింది ఈ పుస్తకం. Feynmann పుస్తకాలు మరిన్ని దొరకబుచ్చుకుని చదవాలి అనిపించేలా ఉంది
Purnima
1) తల్లావజ్ఝల పతంజలి శాస్త్రి రాసిన రెండు నవలికలు – దేవర కోటేశు, హోరు. ఇప్పుడే పుస్తక పరిచయం చేశాను: http://pustakam.net/?p=2261
2) Italo Svevo రాసిన Zeno’s Conscience. ఈ పుస్తక పరిచయం ఇలా జరిగింది: “Too many gloomy Germans? This is a gloomy book too but is also hysterically funny. More intellectual version of Woody Allen perhaps.” నిజంగానే, వుడీ ని తలదన్నేవాడు జీనో! ఈ పుస్తకం గురించి త్వరలో రాస్తాను.
Meher
1) పాలగుమ్మి పద్మరాజు కథలు (మొదటి సంపుటం): కొన్ని కథలు చాలా బాగున్నాయి. మిగతా కథలు చాలా బాగుండటం కోసం చేసిన ప్రయత్నం చాలా బాగుంది.
2) The Gift, by Vladimir Nabokov
రష్యన్ నుంచి అనువాదితమైన ఆంగ్ల నవల. ధర ఏడొందల చిల్లర. ఈ పుస్తకాన్ని చదివేందుకు ప్రేరేపించే సమీక్షలేవీ అంతర్జాలంలో కనిపించలేదు గానీ, ఒకసారి పుస్తకం చదవటం మొదలు పెట్టాకా ఈ సైటు చాలా సాయపడుతుంది: http://giftconcordance.pbworks.com/
అప్పుడే రెండోసారి చదువుతున్నాను. చివరి పేజీ పూర్తి చేయగానే, ఇంకా బయటి ప్రపంచంలోకి రాబుద్ది కాక, మళ్ళీ మొదట్నించీ చదవటం మొదలు పెట్టిన పుస్తకమిది. ఇంకా మంత్రముగ్ధుణ్ణయే వున్నాను. Reading this book isn’t a usual beeline experience, with a starting point and finishing point. It’s a circular experience. A hilarious one at that! Like a merry-go-round. Just whirl around and round!
పుస్తకం చదువుతుంటే కలిగే అనుభూతిని ఇందులో కథానాయకుడు ఫియొదొర్ మాటల్లోనే చెప్పాలంటే: “How clever, how gracefully sly and how essentially good life is!”
సౌమ్య
నేను కొన్ని రోజులుగా అప్పుడో కథా, ఇప్పుడో కథా చదువుతూ – Stay Hungry, Stay foolish – అన్న పుస్తకం చదువుతున్నాను. IIM-A grads who became enterpreneurs – వీళ్ళలోని కొంతమంది జీవితచిత్రణలు. స్పూర్తివంతమైన కథలు.
RK
మంచి ఆలోచన!
అన్నపరెడ్డి వెంకటేశ్వరరెడ్డి తెనుగీకరించిన “బుద్ధుని దీర్ఘసంభాషణలు” చదువుతున్నా. దీఘ నికాయకిది తెలుగు అనువాదం. ఒరిజినల్ యొక్క పవిత్రత కు భగ్నం కల్గించకూడదనేమో ప్రయత్నించినట్టున్నారు, కొన్నిచోట్ల అనువాదం మింగుడుపడదు. కానీ బుద్ధుడి సంభాషణలు చదవడంకోసం భరించవచ్చు!