మీరేం చదువుతున్నారు? – 2

పుస్తకాలు తరచుగా చదువుతున్నా, పేజీలకి పేజీలు సమీక్షలు రాసే ఓపికా, తీరికా లేని వారి కోసం ఈ పేజీని నిర్వహిస్తున్నాము. ఈ వారంలో మీరే పుస్తకాలు చదివారు, వాటిని గురించి ఓ రెండు ముక్కలు ఇక్కడ కమ్మెంట్ల రూపంలో పంచుకోవచ్చు.   ఈ నమునాలో వివరాలు చెప్తే సులువుగా ఉంటుంది.

పుస్తకం పేరు:
రచయిత:
భాష:
వెల:
అంతర్జాలంలో ఈ పుస్తక వివరాలు:
పుస్తకం పై మీ అభిప్రాయం:

  1. budugoy

    ప్రస్తుతం చదువుతున్నవి
    కాఫ్కా ఆన్ ది బీచ్ – హరూకి మురకమి. ఇప్పుడే మొదలెట్టాను. love what i read so far..
    కంప్లీట్ వర్క్స్ ఆఫ్ వివేకానంద మొదటి భాగం చదువుతున్నాను. అంతా ఒకటే సారి చదవడం కరెంటు ప్లగ్గులో వేలు పెట్టడం లాంటిది. నెమ్మది నెమ్మదిగా చదవాల్సొస్తుంది.
    చినరావూరులోని గయ్యాళులు – కన్నడ అనువాదాల కలెక్షను. కేవలం టైటిల్ కథ కోసం ఈ పుస్తకం కొనుక్కోవచ్చు. రచయిత పూర్ణ చంద్ర తేజస్వి అని కువెంపు కొడుకు. బ్రిలియంట్ రైటింగ్. కృష్ణా రెడ్డి గారి ఏనుగు, ఈ రావూరు గయ్యాళులు రెండు కథలు చాలు ఈయన సత్తా తెలుసుకోడానికి. ఈయనవి ఇంకేవైనా అనువాదాలున్నాయా?

    చదివినవి : ద స్టీవె జాబ్స్ వే : ఈ పుస్తకం నచ్చాలంటే మీరు ఆపిల్ ప్రాడక్ట్స్ కు అభిమాని అయి ఉండాలి. మిగతా కంపనీ ప్రాడక్ట్స్ కీ ఆపిల్ కి అంత తేడా ఎందుకుంది? అనేది స్పష్టంగా తెలుస్తుంది. క్విక్ అండ్ ఇంటరెస్టింఘ్ రీడ్.
    Dont ask an old bloke for directions : ఇరవయ్ మూడేళ్ళకు ఐ.ఏ.ఎస్ లో జాయినయిన ఒక సిక్కిం నివాసి ఇరవయ్యేళ్ళు కేరలలో పని చేసి ఒకరోజు చక్కగా రిజైన్ చేసి ఒక్ థండర్ బర్డ్ కొనుక్కొని దేశమంతా రెండు తిరిగాడు. సుమారుగా ఇరవై ఐదు వెల మైళ్ళు. సరే ఇంటరెస్టింగ్ గా ఉందాని కొని చదివితే..తలా తోకా లేని మిడ్ లైఫ్ క్రైసిస్ పుస్తకం. అనవసరమైన ప్రొఫేనిటీ. wont recommend to any one.

  2. సౌమ్య

    ఈ వారం లో మ.వె.కృ. నవల్లు మూడు చదివాను. (కినిగె.కాం పుణ్యమా అని)

    1. పరంజ్యోతి
    2. ది ఎండ్
    3. అందమైన జీవితం

    -కాలక్షేపానికి అన్నీ పర్వాలేదనిపించేలానే ఉన్నాయి. రెండు విషయాలు గమనించాను –

    1. ఈయన రకరకాల విషయాల గురించి తెలుసుకుంటూ ఉంటాడు. (ఏమాటకామాటే చెప్పాలి – చాలా కబుర్లు చెప్పాడు ఇలా, ఈ మూడు నవలల్లో!)
    2. కథ ఏదైనా, ఇలాంటి విషయాలు ఏదో ఒకలా ఆ కథనంలో భాగమౌతాయి. అసలీ విషయాలు చెప్పేందుకే కథలు తయారు చేస్తున్నాడా? అని కూడా అనుమానం వచ్చింది – ముఖ్యంగా పరంజ్యోతి నవల చదివాక!

  3. M.V.Ramanarao

    I AMreading books by JamesHerriot.aveterinary surgeon depicting his experiences in rural England as small stories.He was a very popular writer.Animal and nature lovers should read them.Names of some of his books are given below ;=1.Allcreatures great and small.2.All things wise and wonderful 3.Vet in harness 4.Dog’s tales.5.Lord God made them all.the stories are full of warmth,wisdom and wit.They show love and understanding of animals,birds and ruralfolk.==ramanarao.muddu

  4. సౌమ్య

    నేను గత రెండు నెల్లలో అడపా దడపా ఇంటర్నెట్ లో చదివిన వ్యాసాలు కాక, మొదలుపెట్టి పూర్తి చేయగలిగిన పుస్తకాలు ఇవీ:

    1. ప్రఖ్యాత జర్మన్ వ్యంగ్యకారుడు Kurt Tucholsky వ్యాసాలు (ఆంగ్లానువాదం). – అద్భుతంగా ఉన్నాయి. తప్పకుండా చదవాల్సినవి.

    2. The Book Thief – Marcus Zusak నవల. గొప్ప ఆంచనాలు కలిగించింది కానీ, వాటిని నిలుపుకోలేకపోయింది. అయితే, చదివేందుకు బోరు కొట్టదు.

    3. Leaving Home – Art Buchwald జ్ఞాపకాలు. బుక్వాల్డ్ అంటే నాకు ఉండే అమితమైన గౌరవం ఈ పుస్తకం చదివాక రెట్టింపైంది.

    -రాబోయే రోజుల్లో ఈ పుస్తకాలను పుస్తకం.నెట్ ద్వారా పరిచయం చేసేందుకు ప్రయత్నిస్తాను.

  5. murty

    ఇది వరకూ ఎక్కువగా పుస్తకాలు గురించి పరిచయాలు కలిగేవి (మీరేం చదువుతున్నారు లో)ఈ మద్య కొంచెం తగ్గాయి నన్ను నిరుత్సాహపరుస్తూ. నేను రోజూ మా ఆఫీస్ కి రాగానే నెట్ కనెక్ట్ చేసి ఒపెన్ చేసే మెదటి సైట్ పుస్తకం.నెట్ :)నాకు మామూలు పుస్తకాలగురించి అంతగా తేలీదు. ఆధ్యాత్మిక పుస్తకాల లైబ్రరీ నాకు ఉంది. నాకు తెలిసిన ప్రతీ పుస్తకం కొని చదవడం + దాచుకోవడం ఇష్టం.
    పుస్తకం.నెట్ లో చూసి చదివిన పుస్తకాలు చాలా ఉన్నాయి. (లిస్ట్ పెద్దది కాబట్టి చెప్పడం లేదు).

    నేను రమారమి 15 సార్లు చదివిన పుస్తకం ప్రతీ ఒక్కరూ చదివి ఆనందించ తగిన పుస్తకం (ఈ పుస్తకానికి నిజానికి పరిచయం అవసరం లేదు కానీ…) రామకృష్ణ కధామృతం ఇంగ్లీష్ లొ (గో స్పెల్ ఆఫ్ శ్రీ రామక్రిష్ణ) మనం ఆపుస్తకాన్ని చదవడమే కాకుండా పుస్తక కాలం నాటి దృశ్యాలను చూడగలం కూడా.పుస్తక రచయిత అయిన శ్రీ మహేంద్రనాధ్ గుప్త (ఆయనకు తన పేరు చెప్పుకోవడం ఇష్టం ఉండేది కాదు అందుకే ఆయన పుస్తకాలమీద ఉత్తి యం అని ఉంటుంది)ఈ పుస్తకం చదివేసి ఉంటే సరే లేని వారు ఈ శ్రీ రామక్రిష్ణ కధామృతాన్ని చదివి కాదు,కాదు తాగి ఆనందిస్తారు కదూ! రామక్రిష్ణ మఠం లో ఈపుస్తకం దొరుకుతుంది. ఈ పుస్తకం దొరకని వారు చిన్న మెయిలిస్తే ఆనందంగా పంపగలను. (రేపు 23/05/11 వేసవి యాత్రకి పోతున్నాం వెస్ట్ బెంగాల్ కి శ్రీ రామక్రిష్ణ పరమహంస సొంత ఊరు తిరిగిన ప్రదేశాలు కూడా ఉన్నాయి ట్రిప్ లో)
    కావసిన పుస్తకప్రియులు దయచేసి మెయిల్ చేస్తారు గదూ. chinni_murty@yahoo.com
    thanks a lot to pustakam.net

  6. M.V.Ramanarao

    నెను ఈ మధ్య చదివిన పుస్తకం —
    1.పుస్తకం పెరు =కథ 2009
    2.రచయితపెరు =13రచయితలకథా సంకలనం
    3.వెల =రూ50 అంతర్జాలంలొపుస్తకం వివరాలు=తెలియదు
    4.ఎడిటర్లు=వాసిరెడ్డినవీన్,పాపినేని సివశంకర్. ప్రచురణ = కథాసాహితి
    5.నా అభిప్రాయం =ఇందులొ పెరున్న కథకుల తొబాటు కొత్తవారి కథలు కూడా ఉన్నవి. ఎన్నొ వందల కథలనుంచి కేవలం 13మంచికథలను ఏరుకొడం కష్టమే.భిన్నాభిప్రాయాలు కూడా ఉంటాయి.ఎక్కువ కథలు గ్రామీణ జీవితాలలొ ,ముఖ్యంగా రైతులకష్టాలు, సమస్యలగురించి రాసినవి.నాలుగుకథలు వివిధ తరగతుల స్త్రీల బాధలు,సమస్యలు ప్రధానాంశంగా ఉన్నవి.ఒకకథ మాత్రం సైన్సు ఫిక్షన్ .వేగంగా విస్తరిస్తున్న నగరాలనేపధ్యంలొ ఇంకా కథలు రావాలనుకొంటున్నాను.ప్రసిద్ధ సినిమా దర్శకుడు వంశీ రాసిన కథ ఒక ప్రత్యేకత. ==== రమణారావు .ముద్దు

  7. M.V.Ramanarao

    నేను చదువుతున్న పుస్తకాలు.1ఎవెరీ లివింగ్ థింగ్ -పుస్తకం పేరు
    రచయిత-జేంస్ హెరియట్ భాష –ఇంగ్లీషు వెల -రూ.100
    అంతర్జాలంలొ పుస్తకం వివరాలు -తెలియదు
    నా అభిప్రాయం –50సం;క్రితం ఇంగ్లాండుగ్రామీణ ప్రాంతాల్లొ ప్రాక్తీసు లొ తన
    అ నుభవాలను ఆసక్తికరంగా చిన్నచిన్న కథలుగా వెటెరినరీ సర్జంగా
    పని చెసిన హెరియట్ రాసిన పుస్తకం. ఇంకా ఇలాంటివి మరి కొన్ని రాసాడు.
    పెంపుడుజంతువుల్ని ,పశు పక్ష్యాదుల్ని ప్రెమించేవారు తప్పక చదవవలసింది.
    .రమణారావు .ముద్దు

  8. murty

    తెలుగు లో ప్రఖ్యాతి గాంచిన రామారావుగారి సుందరకాండ వినని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మనం కూడా పాడుకోవటానికి పుస్తకరూపం లో ఉంటే బాగుండునని చాలాసార్లు అనుకొన్నాను. ఈ మధ్య ఒక పుస్తకాల కొట్లో ఆ పుస్తకం దొరికడం అదృషం.
    పుస్తకం: శ్రీ సీతారామకధ సుందరకాండము
    రచయిత: సుందరదాసు ఎమ్మెస్ రామారావు గారు
    ప్రాప్తిస్దానం:
    సుందర నిలయం
    ఎమ్మెస్ రామారావు గారి వీధి,
    ఇంటి నెం. 1-1-336/123,
    వివేక్ నగర్
    చిక్కడపల్లి
    హైదరాబాద్ – 500 020
    దూరవాణి: 040-27622369
    చరవాణి:9849940745

  9. murty

    పుస్తకం: అమ్మ ఒడిలోకి పయనం [ఒక అమెరికా స్వామి ఆత్మకధ] (ఇంగ్లీషులో ది జర్నీ హొమ్)
    రచయిత:అనువాదం శ్రీ యుగళ్ కిశోర్ దాస్ గారు (ఇంగ్లీష్ లో శ్రీ రాధానాద్ స్వామి)
    పుస్తక ప్రియులు తప్పకుండా చదివవలసిన పుస్తకం. రాధానాధ్ స్వామి గారు ఆకట్టుకునే కధనం తో తన ఆత్మకధను వెల్లడి చేసారు. తెలుగు వెర్షన్ చదువుతున్నపుడు అనువాదం లా కాకుండా తెలుగు పుస్తకం చదువుతున్న అనుభూతి కలుగుతుంది. ఇంగ్లీష్ వెర్షన్ బుక్ ఓపెనింగ్ హైదరాబాదు శిల్పకళావేదిక లో 28/03/11 తేదీ న జరిగింది.దానికి నేను వెళ్ళడం పుస్తకం మీద శ్రీ రాధానాధ్ స్వామీజీ వారి ఆటోగ్రాఫ్ తీసుకోవడం నా మహద్భాగ్యం, అదృష్టం.

    పుస్తకం వెల: 150/ తెలుగు లొ (ఇంగ్లీష్ లో $16.95)

    చదివిన వారి యొక్క అమూల్య అభిప్రాయాలు కోరుతూ.

  10. murty

    @సౌమ్య: నేను ఈమధ్య చూస్తున్నపుడు పెద్దగా ఎవరూ పుస్తక సమీక్షలు చేయడం లేదు అందుకే పుస్తకప్రియులు కనపడటం లేదు. అని అన్నాను. అంతేనండి. చిన్నపుడు తెలుగు నేర్చుకున్నపుడు కన్నా ఇపుడే చాలా బాగుంది. నేర్పినందుకు ధన్యవాదాలు.

  11. anil sarma

    sir ! kowmudhi pustakam dorakatam ledu .
    dorukutunda ? yekkada ?
    dayachesi cheppandi

  12. murty

    kanapadatam ledu: pustakam.net lo puskatapriyulu kanapadatam ledu. meeku evarikaina kanapadite cheppandi pustakam. kutumbam wait chestondani marchiporu gadu. thanks,

    ikkada telugu lo elarayaaloo cheppagalaru, thanks once again.

    1. సౌమ్య

      Murty garu: You can type Telugu using lekhini.org.
      Can you be more elaborate on “pustakam.net lo puskatapriyulu kanapadatam ledu”?

  13. murty

    pustakam.net lo chusi chadivina book “Kalaprapoorna DUVVURI VENKATARAMA SASTRY sweeya charitra. exlent, book ni introduce chesina variki dhanyavadamulu.

  14. Madhu

    Of all the books I read the best book is ” creating good life” by James O Toole. This is based on the principles of Aristocrat. It is must read for any body, who would like to know how to live life you want.

  15. gks raja

    గాయం చేయనివాడు గాయకుడే కాదు
    మనల్ని వెంటాడి వేధించడం చేతకానిది ఒక పాటా కాదు
    అంటూ మొదలుపెట్టిన వెనుక పేజీవ్యాఖ్య (పబ్లిషరు చే) ఈ పుస్తకానికి అతికినట్టు సరిపోయింది. “మన్ చాహే గీత్” … మహమ్మద్ ఖదీర్ బాబు వ్రాసిన హిందీ పాటలు-పరిచయాలు చాలా సరళంగాను, మనసుకు హత్తుకునేలా ఉన్నాయి.. సురయ్యా, షంషాద్ బేగం ,తలత్ మహమూద్, మన్నాడే నుండి రఫీ, లతా, కిశోర్ ల వరకు అందరి గాయకుల్ని గొప్ప గొప్ప సంగీతదర్శకుల్ని పరిచయం చేసిన తీరు అద్భుతం గా వుంది. అంతటి గొప్ప కళాకారులకి కేవలం రెండేసి పేజీలు ఎలా సరిపోతాయన్న సందేహాన్ని పుస్తకంలోకి ప్రవేశించగానే పటాపంచలు చేసేశాడు ఖదీర్ బాబు. సంగీతం గురించి చాలా సూటిగా చెబుతూనే అందరి సంగీతకారుల జీవిత కోణాల్ని స్పృశించిన పద్ధతి చాలా బావుంది. పాటల రికార్డింగు సందర్భాలలో తీసిన అలనాటి మేటి సంగీతకారుల ఫోటోలు గొప్ప అనుభూతినిస్తున్నాయి. అవే పాటలు ఈ పుస్తకం చదవకముండు ఒకరకమయిన ఆనందాన్ని ఇస్తే, చదివిన తరువాత ఆ యా సంగితకారులతో, గాయని గాయకులతో ఎంతో సాన్నిహిత్యం ఉన్నట్టు అవే పాటలు మనకు బాగా తెలిసున్న వాళ్ళు మనకోసమే కంపోజ్ చేసినట్టు పాడినట్టు అనిపిస్తాయి. పరిచయ వ్యాసాలు ఇంత బావుండడం వల్ల సమయం తీసుకోని మళ్ళి ఆ పాత పాటల కలెక్షను బయటకు తీసి వింటున్నానంటే పుస్తకం ఎంత ప్రభావవంతంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. సంగీతప్రియులు తప్పక షెల్ఫు లో ఉంచుకోవాల్సిన పుస్తకం.
    *మన్ చాహే గీత్- పాటలు ప్రసిద్దుల పరిచయాలు.
    *రచన: మమ్మాద్ ఖదీర్ బాబు.
    *ప్రచరణ: కావలి ప్రచురణలు. అన్ని ప్రముఖ పుస్తకాల షాపుల్లోనూ లభ్యం.
    *వెల: రూ:95/-

  16. prasanth

    kanchana dwipam
    r.l.steven son translation-nanduri ram mohan rao
    abinandana publishrs,vizayawada.
    price-60
    very good translation of the original.treasuresland is one of fsvorite adventure stories.this translation has really increased the charm of original.

  17. dvrao

    KIERAN LEVIS రాసిన WINNERS & LOSERS అనే పుస్తకం చదువుతున్నా. ఇంటర్నెట్ ఏజ్ లో పుట్టిన కంపెనీల వుత్దాన పతనాలు,స్ట్రాటజీలు మొదలైన వాటి గురించి బాగా రాసాడు. ముఖ్యం గా బిజినెస్ మానేజ్మెంట్ మీద ఆసక్తి వున్నవాళ్ళకు ఈ పుస్తకం ఎంతో ఇంటరెస్టింగ్ గా వుంటుంది. దీన్లో కవరైన కొన్ని కంపెనీలు: IBM,APPLE,GOOGLE,NOKIA, NETSCAPE, EBAY.SONY,AOL.