సంతాపం

తరాల అంతరం లేకుండా, ప్రతి తెలుగు సాహిత్యాభిమానీ, సినిమా ప్రియుడు అభిమానించే ముళ్ళపూడి వెంకటరమణ గారు చెన్నైలో నేడు కన్నుమూశారు.

వారి కుటుంబానికి, బాపు గారి కుటుంబానికి పుస్తకం.నెట్ సంతాపం తెలియజేస్తోంది.

మరో విషాద వార్త:
“అమర్ చిత్ర కథ”, “టింకిల్” వంటి భారతీయ కామిక్స్ సృష్టికర్త, అంకుల్ పాయ్ గా ప్రసిద్ధులైన అనంత్ పాయ్ సైతం నిన్న కన్నుమూశారు. వారి కుటుంబానికి, వారి అభిమానులకూ పుస్తకం.నెట్ సంతాపం తెలియజేస్తోంది.

You Might Also Like

7 Comments

  1. Gks Raja

    ముళ్ళపూడి వారి అస్తమయం తెలుగు సాహిత్య ప్రియులకు అశనిపతమే! ముఖ్యంగా హాస్య, చమత్కార, వ్యంగ్య రచనలు ఆస్వాదించేవారికి తీరని లోటే! నాకు వ్యక్తిగతంగా ఆయన రచనలతో ఏర్పడిన అనుబంధం అనుపమానమైనది. ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. బాపు రమణల మీద ఉన్న అపారమైన అభిమానంతో ఒక స్నెహితుని సహయంతో 2006 లో చెన్నై లోని వారింటికి వెళ్ళాను. ఉదయమే 8 గంటల వేళ బాపు గారి సతీమణి తలుపు తీసి కూర్చోమని మాకు మంచి నీళ్ళిచ్చి, బాపు గారిని పిలిచారు. నకు మాటలకందని ఉద్వేగభరితమయిన ఆ క్షణాల్ని వివరించలేను. మమ్మల్ని పరిచయం చెసుకొని, ఉదయాన్నే వారికి అసౌకర్యం కలిగించానేమో అని మొక్కుబడిగా అనబోయేంతలోనే ఆయన ఆ మాటను తుంచేసి, మేము అంత (హైదరాబాదు) దూరంనుండి రావడాన్ని లోతుగా ప్రస్తావించి, హైదరాబాదులోనె  వారిని ఎప్పుడైనా కలవవొచ్చని చనువిచ్చారు. వెంఠనే నేను చంక ఎక్కేసి హైదరాబాదు వచ్చినప్పుడు మా ఇంటికి రావాలని ఆహ్వానించేశాను. ఆయన అంత సులువుగానే అంగీకరించేశారు–
    ఇంతలో రమణ గారు చెయ్యి తుడుచుకుంటూ వచ్చారు. ఉదయాన్నే భోజనం కానిస్తున్నాని, మేము వేచి ఉన్నందుకు సంజాయిషీగా ఏదో చెప్పబోయారు– అంతలోనే నేను నాలుగు పళ్ళు వారిద్దరి చెతుల్లో పెట్టి వంగి కాళ్ళకు దణ్ణం పెట్టాను– వారిద్దరూ వారించినా! నాకు గుర్తుండి అంతకు మునుపు ఎవరికీ కాళ్ళకి దణ్ణం పెట్టలేదు- మా నాన్నగారు చిన్నప్పట్నుండీ నూరిపొసిన ఆత్మగౌరవ సిధ్ధాంత ఫలితంగా! బాపు రమణ గార్ల విషయంలో ఆ సిధ్ధాంతానికి మినహాయింపు ఇచ్చేశాను. భాషాపరంగా ఇద్దరి పేర్ల మధ్య కామా వాడడం అవసరం. కాని వారిద్దరి మధ్య కామా కాదు కదా — చిన్న ఆణువుని కూడా దూర్చె సాహసం ఎంతటి భాషా పందితుడూ చెయ్యలేడు.            
     రమణ గారు ఉత్సాహంగా కబుర్లు చెప్పారు. బాపు గారు ఎక్కువసేపు మౌనంగా వింటూ మధ్య మధ్యలో మితంగా మాట కలుపుతున్నారు. మాటల్లో రమణగారు తను ఇప్పుడు బాపు ఇంట్లోనే ఉంటున్నానని, ఆర్ధిక ఇబ్బందుల వల్ల సొంత ఇంటిని పోగొట్టుకున్నానని చెప్పారు. చాల బాధ అనిపించినా, దేవుడున్నాడో లేడో తెలియని అయోమయం గాణ్ణి, నాకు మొదటగా ఉన్నాడేమో అని సందేహం లాంటిది కలిగింది. అందుకే వారిద్దరూ కలిసే ఉండాలని రమణ గారి ఇల్లు పోగొట్టి ఉంటాడు. నాలాంటి సామాన్యుడి ఉహకి  కూడా అందని  సంగతి– ఎంత స్నేహితులయితే మాత్రం ఇంత విద్దురమా?    
    Raja
       

  2. g b sastry

    aandhrula anaikyata ni andang chamatkarinch andarimadini dochina mullapudi manakika leeru unnadi maatram atuvanti vaani ki padma award ippinchukoleni mana aandhrula anaikyata maatrame jai telangaana/jai andhra/ jai raayalaseema verasi jai mana asamardhata anaikyata

  3. విష్ణుభొట్ల లక్ష్మన్న

    నాకు ఇప్పుడే తెలిసిన వార్త ముళ్ళపూడి వారి హటాత్మరణం. ముళ్ళపూడివారి అస్తమయం సాహిత్యాభిమానులకు తీరని లోటే! వారి కొత్త పదప్రయోగాలు (“బ్రిలియంట్ల వెధవ” లాంటివి)ఎప్పటికీ మరువలేము.

    వారికి నా శ్రద్దాంజలి. బాపుగారికి ఇది తీరని లోటే!

    విష్ణుభొట్ల లక్ష్మన్న

  4. parimalam

    ముళ్ళపూడి వెంకట రమణ గారికి శ్రద్ధాంజలి

  5. వంగూరి చిట్టెన్ రాజు

    ఆత్మీయులు, నా ఆరాధ్య దైవం, నా అమెరికామెడీ కథల పుస్తకానికి అధ్భుతమైన ముందు మాట వ్రాసి, ఆ పుస్తకాన్ని బాపు గారితో సంయుక్తంగా అంకితం అందుకున్న ముళ్ళపూడి గారితో ఆ మధ్య మాట్లాడినప్పుడు “ఎలా ఉన్నారు గురువు గారూ?” అని అడిగాను. “దానికేం, మైండ్ గొప్పగానే ఉంది కానీ బాడీ రిపేరులో ఉంది” అని చమత్కరించారు. ఆయన ఎక్కడికీ పోలేదు. మనతోనే కలకాలం ఉంటారు…తెలుగు భాష ఉన్నంత కాలం ఆయనా ఉంటారు. తెలుగు వాడు నవ్వుకున్నప్పుడల్లా ఆయన ఎక్కడున్నా సంతోషిస్తారు, ఈ సమయంలో ఎవరికి సంతాపం తెలపాలి? ఎలా తెలపాలి?

    వంగూరి చిట్టెన్ రాజు
    వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా..
    హ్యూస్టన్, హైదరాబాద్

  6. prasanth

    sad news to all telugu literary lovers.a great chapter of comic literature ended today.

  7. ఉష

    అయం బన్ధురయం నేతి గణనా క్షుద్రచేతసామ్। ఉదారచరితానాం తు వసుధైవ కుటుమ్బకమ్।।

    – అల్పమైన ఆలోచనలు కలవాళ్లకి వీడు చుట్టం వీడు చుట్టం కాదు అన్న పట్టింపులు ఉంటాయి. అదే గొప్ప నడువడి కలవారికి ప్రపంచమంతా తన కుటుంబమే.
    *****

    ఆ విధంగానే ముళ్ళపూడి వెంకటరమణ గారు ఏ అంతరం లేకుండా, వ్యత్యాసాలు ఎన్నకుండా మెసిలిన మహనీయుడు. తెలుగు సాహితీ ప్రపంచబంధువు. ఆయనకిదే నా నివాళి.

Leave a Reply