బెంగళూరులో గోపీచంద్ శతజయంతి ఉత్సవాలు
ప్రఖ్యాత రచయిత త్రిపురనేని గోపీచంద్ శతజయంతి ఉత్సవ కమిటీ వారు ’త్రిపురనేని గోపీచంద్ శతాబ్ధి మహాసభలు’ జరపబోతున్నారు.
జులై 31న బెంగళూరులో ప్రారంభమయ్యే ఈ సభలు, ఆగస్టు 5న కర్నూలులో, ఆగస్టు 15న గోపీచంద్ స్వస్థలమైన కృష్ణా జిల్లా అంగలూరులో, ఆగస్టు 26న గుంటూరులో, సెప్టెంబర్ 5న చెన్నైలో జరుగుతాయి. ముగింపు ఉత్సవాలు సెప్టెంబరు ఎనిమిదిన రవీంద్ర భారతిలో జరుగుతాయి.
ఈ వివరాలతో ఉత్సవ కమిటీ వారి ప్రకటన ఇక్కడ చూడవచ్చు.
(వేగు ద్వారా వివరాలను తెలియజేసినందుకు సాయిచంద్ గారికి ధన్యవాదాలు)
అలాగే, బెంగళూరు లో జరిగే సభ వివరాలు, వక్తలు – చర్చాంశాలు, ఇతరత్రా విశేషాలు – ఇక్కడ చూడవచ్చు.
(వివరాలు అందించిన అనిల్ అట్లూరి గారికి ధన్యవాదాలు)
[శతజయంతి ఉత్సవాల ప్రారంభం సందర్భంగా పోయిన ఏడు విడుదల చేసిన ప్రకటన ఇక్కడ చూడవచ్చు. గత ఏడాదే డీటీఎల్సీ వారు నిర్వహించిన శతజయంతి ఉత్సవాల సంబంధిత ప్రకటన ఇక్కడ చూడవచ్చు.]
ఈ సందర్భంగా, గోపీచంద్ రచనలపై మీ అభిప్రాయాలు రాసే ఆసక్తి ఉంటే, వ్యాసాన్ని editor@pustakam.net కు పంపగలరు. గోపీచంద్ రచన – ’పోస్టు చేయని ఉత్తరాలు’ పై పుస్తకం.నెట్ లో వచ్చిన వ్యాసం ఇక్కడ చూడవచ్చు.
g.sreeram
this is very good
పుస్తకం » Blog Archive » గోపీచంద్ శతజయంతి ఉత్సవాలు – ముగింపు సమావేశం
[…] ప్రఖ్యాత రచయిత త్రిపురనేని గోపీచంద్ శతజయంతి ఉత్సవ కమిటీ వారు జులై 31 నుండి వివిధ ప్రాంతాల్లో ’త్రిపురనేని గోపీచంద్ శతాబ్ధి మహాసభలు’ జరపబోయేముందు పుస్తకం.నెట్ లో ప్రకటించిన విషయం గుర్తుండే ఉంటుంది. (అప్పటి ప్రకటన ఇక్కడ.) […]