సినిమా ఒక ఆల్కెమీ – వెంకట్ శిద్దారెడ్డి
వ్యాసకర్త: శ్రీ అట్లూరి
********
సినిమా ఒక వ్యసనం.
సినిమా ఒక కళ.
సినిమా ఒక కల.
సినిమా తీయడం ఒక కళ.
సినిమా చూడటం ఒక కల.
చూసిన సినిమా అలాగే చెప్పడం ఒక కళ.
చూసిన సినిమా ఇంకోలా కూడా చెప్పడం గొప్ప కళ.
ఇవన్నీ కలిసిన కాక్టెయిల్ వెంకట శిద్దారెడ్డి.
తాగిన కొద్దీ కిక్ ఎక్కించేది కాక్టెయిల్.
చదివిన కొద్దీ బుర్ర కి కిక్ ఇచ్చేది sid బుక్.
కురుసోవా సెవెన్ సమురాయ్ 20 వ సారి చూస్తుంటే రూమ్ మాటే కి చిరాకు వచ్చి చూసిన సినిమా నే ఆలా ఎన్ని సార్లు చూస్తావు అంటే మొన్న చూసింది unedited వెర్షన్. నిన్న చూసింది కురుసోవా కామెంటరీ తో .. ఈ రోజు స్పీల్బర్గ్ కామెంటరీ తో. ఫస్ట్ 10 సార్లు షాట్ డివిజన్ కోసం గట్రా అంటే నాకు పిచ్చి ఎక్కింది అనుకున్నాడు. నాలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు. అలాంటివి వాళ్ళల్లో ప్రథముడు ఈ Sid .
ఒక సినిమా చూడటం వేరు
ఆ సినిమా ని చర్చిండం వేరు
ఆ సినిమా ని కథ గా చెప్పడం వేరు
అదే సినిమా ని అంతే అందంగా కాగితం మీద పెట్టడం వేరు. Sid ఈవన్నీ ఈ పుస్తకంలో హృద్యంగా రాసారు. అది ఒక కళ. అందరికి పట్టుపడని కళ, సినిమా అంటే అత్యంత ప్రేమ ఉన్నవాళ్లు, శ్రద్ద ఉన్నవాళ్లు కూడా చాలా మంచి చెయ్యలేని పని. ఇవి చదువుతుంటే ఒకో సినిమా మీద ఎంత ప్రేమ ఉందో ఎంత పట్టు ఉందో మనకి అర్ధం అవుతుంటుంది.
జపాన్ దర్శకుడు కురుసోవా గురించి తప్ప కేంజి మిజొగుచి గురించి ఎంతమందికి తెలుసు? అల్లాంటి వాళ్ళ కోసం శంషో దయూ సినిమా. బైసికల్ థీవ్స్ గురించి చదువుతుంటే కళ్ళముందు బ్రూనో కనపడి మనకి తెలీకుండానే పుస్తకం మసక బారితే అది మన తప్పు కాదు. (ఈ సినిమా ఆధారం గా తీసిన ధో బీఘా జమీన్ కూడా అంతే గొప్ప సినిమా. ఆ సినిమా లో బాలరాజ్ సహానీ నటన అపూర్వం.) ఫిడ్జి కరాల్డో సినిమా లో ఓడని కొండ ఎక్కించే దృశ్యం (దాని మీద తీసిన డాక్యూమెంటరి తప్పక చూడండి) ఆ దర్శకుడి తపన మనని ఒక రకంగా ఉత్తేజితుల్ని చేస్తుంది అంటే తప్పు కాదేమో.
అంత మంది జనాల మధ్యన
గుంపులో ఒంటరిగా నేను – ఎటర్నల్ సన్ షైన్ అఫ్ ది స్పాట్ లెస్ మైండ్.
ఎంత నిజం అది. ఎన్ని సార్లు ఆలా ఫీల్ అయ్యి ఉంటాం?! ప్రతి పార్టీలో అలాగే ఫీల్ అయ్యిఉండొచ్చు కూడా.
పుస్తకం రాయడం ఒక ఎత్తు అయితే దాన్ని అంత అందం గా ప్రచురించడం ఒక ఎత్తు. ఈ పుస్తకం ఆ రెండు విషయాలలో ఎక్కడా రాజీ పడలేదు అని ఘంటాపదం గా చెప్పగలను. ప్రపంచ సినిమా ప్రేమికులకు అందరికి నచ్చే పుస్తకం ఇది.
కినిగె మరియు అమెజాన్ లలో ఆన్లైన్ లో లభ్యం, అలాగే నవోదయ లో కూడా దొరుకుతుంది.
Leave a Reply