కొకు, శ్రీశ్రీ, గోపీచంద్ శతజయంతి ఉత్సవాలు – Updates
కొకు, శ్రీశ్రీ, గోపీచంద్ – ఈ ఏడు ఈ ముగ్గురి శతజయంతి సంవత్సరం. Detroit Telugu Literary Club (DTLC) వారు ఈ ఏడు సెప్టెంబరు లో ఈ సందర్భంగా మూడురోజులపాటు సాహితీ సమావేశాలను ఏర్పరచ తలపెట్టారు అన్న సంగతి తెలిసిందే. దాని గురించిన ప్రకటన కూడా మే నెల మొదటివారంలో పుస్తకంలో ప్రకటించాము.
ఆ సాహితీ సదస్సుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ వగైరాలకు సంబంధించిన వివరాలు ఈ క్రింది ప్రకటన లో చూడవచ్చు
కొకు, శ్రీశ్రీ, గోపీచంద్ ల శతజయంతుల సందర్భంగా DTLC తలపెట్టిన ఉత్తర అమెరికా తెలుగు సాహితీ సదస్సుల ఏర్పాటు పనులు చురుగ్గా సాగుతున్నాయి. క్రిందటి సంవత్సరం మేము నిర్వహించిన దశవార్షికోత్సవాల్లో లాగానే, ఈసారి కూడా సాహితీ సదస్సులకు వచ్చే తెలుగు సాహిత్యాభిమానులందరికీ ఉచిత వసతి, భోజన సౌకర్యాలు ఏవిధమైన రిజిష్ట్రేషన్ ఫీజు లేకుండానే ఏర్పాటు చేస్తున్నాం. ఈ ఏర్పాటులో ఉదారత కంటే, సమావేశాలకు కేవలం సాహిత్యాభిమానంతో వ్యయప్రయాసలకోర్చి వచ్చే మిత్రులకు కాస్త ఖర్చు తగ్గించడమే ముఖ్యోద్దేశం. తగిన ఏర్పాట్లన్నీ వృధా ఖర్చుల్లేకుండా చెయ్యడానికి, వచ్చే మిత్రులందరినీ ముందుగా రిజిష్టరు చెయ్యమని కోరుతున్నాం. సమావేశాల వివరాలకు, రిజిష్టరు చెయ్యడానికి, వీలుగా website ఏర్పాటు చేశాం. (సైటు ఇక్కడ)
ఇంకా ఏమైనా వివరాలు కావాలంటే detroittelugu@comcast.net కు ఈమెయిల్ చెయ్యండి.
సమావేశాల తేదీలు: సెప్టెంబరు 26-27, 2009
సమావేశ స్థలం: St. Toma Church Hall, Farmington Hills, MI (suburb of Detroit, MI)ఇరవయ్యో శతాబ్దపు తెలుగు సాహిత్యాన్ని ఎంతగానో ప్రభావితం చేసిన సాహితీ మూర్తుల గురించి, వారి సాహిత్యాన్ని గురించి తెలుసుకోవడం, చర్చించడంతో పాటు, తెలుగు సాహితీ మిత్రుల్ని ముఖతః కలుసుకునే అవకాశాన్ని వదులుకోరని ఆశిస్తున్నాం.
ఈ సమావేశాల గురించిన ప్రచారం కేవలం ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మాత్రమే చెయ్యగలం. అంటే ఈ ప్రచారానికి నడుం కట్టవలసిన బాధ్యత ఇంటర్‌నెట్ లో ఈ సమాచారాన్ని చూసిన తెలుగు మిత్రులందరిదీను! మీరు రండి, మీ బంధుమిత్రులకు తెలియజెయ్యండి, వారిని సమావేశాలకు వచ్చేలా ప్రోత్సహించండి.
భవదీయుడు,
డిట్రాయిట్ తెలుగు లిటరరీ క్లబ్ తరపున,
మద్దిపాటి కృష్ణారావు
పుస్తకం » Blog Archive » బెంగళూరులో గోపీచంద్ శతజయంతి ఉత్సవాలు
[…] శతజయంతి ఉత్సవాల సంబంధిత ప్రకటన ఇక్కడ […]