‘పత్రిక’ – పరిచయం
మామూలుగా అందరికీ తెలిసిన పత్రికలు, మ్యాగజీన్లు కాక కొన్ని ఎక్కువమందికి దృష్టిలో పడకుండానే తమ పని తాము చేసుకుపోతుంటాయి. అలాంటి కోవకు చెందిన
‘కవితా!’ అనే మ్యాగజీన్ గురించి ఇదివరకు పరిచయం చేశాను. ఇప్పుడు పరిచయం చేయబోతున్న ‘పత్రిక’ కూడా ఆ తరహాలో వస్తున్నదే. నెలకోసారి వెలువడే ‘పత్రిక’లో చదివించే కథలు, కవితలు, సాహిత్యవ్యాసాలు, పుస్తక సమీక్షలు ఉంటాయి. ప్రముఖ సీనియర్ పాత్రికేయులు ఇనగంటి వెంకట్రావు, వారి స్నేహితుల ఆలోచనల ఫలితంగా రూపుదిద్దుకున్న ‘పత్రిక’హైదరాబాద్ నుంచి ప్రచురితమవుతోంది. దీనికి గౌరవ సంపాదకులుగా శ్రీరమణగారు వ్యవహరిస్తున్నారు. ఎంతో ఆకర్షణీయంగా వెలువడే ఈ మ్యాగజీన్ ను అతి తక్కువ ధరకే అందించేందుకు ప్రయత్నించడం విశేషం. 65 పేజీలుండే ‘పత్రిక’ వెల అయిదంటే అయిదు రూపాయలు! ఏడాది చందా 60 రూపాయలను మనియార్డర్ చేయడానికి, కథలు, కవితలు పంపడానికి చిరునామా :
‘పత్రిక’
మోనిక పబ్లికేషన్స్
103, నవనిర్మాణ్ నగర్, రోడ్ నెంబరు 71, జుబ్లీహిల్స్, హైదరాబాద్ 500 033
patrika@hotmail.com
Bhamidipati Phani Babu
ఇక్కద పుణే లో మాఇంట్లో పాత పుస్తకాలు వెతుకుతూంటే జూన్ 2008 సంచిక కనిపించింది. ఏడాది పాటు ఎలా మిస్ అయేమొ అర్ధం అవలెదు.ఈ ఏడాదంతా రాజమండ్రి లో ఉన్నాము. అక్కడ ఎప్పుడూ చూడలేదు. అదొక కారణం అయుండవచ్చు. ఇంక ఊరుకోను , సంవత్సర చందా కట్టేస్తాను. “స్వప్న” అని ఒక పత్రిక ( మాస) వస్తోంది. చూశారా? అలాగే ” నది ” కూడా చాలా బాగుంది. మికు తెలిసే ఉంటుంది.
పుస్తకం » Blog Archive » పుస్తకాలు-మానవసంబంధాలు
[…] మానవసంబంధాలు’ అన్నది శ్రీరమణగారు ‘పత్రిక’ జూన్ నెల సంచిక కోసం రాసిన వ్యాసం. […]
అనిలు
“పత్రిక” అనగానే ఆంధ్రపత్రిక గురించేమో అని పరిగెత్తుకుంటూ వచ్చాను. దానితో పాటు భారతి విషయాలు ఏమైనా తెలుస్తాయేమోనని. పాత్రికేయ మిత్రుల “పత్రిక”! ఇక చందా కట్టాలన్నమాట!
meher
మంచి పని చేసారు