వీక్షణం-8
తెలుగు అంతర్జాలం:
“కాలాన్ని శుద్ధిచేసే శేఫాలికా పరిమళాలు” వాడ్రేవు వీరలక్ష్మీదేవి గారి కాలం వ్యాసాలపై నండూరి రాజగోపాల్ వ్యాసం, “పాల్కురికిపై వితండవాదం” ముత్తేవి రవీంద్రనాథ్ వ్యాసం – ఆంధ్రజ్యోతి వివిధలో విశేషాలు. ఇటీవల వచ్చిన పుస్తకాల సమీక్షలను ఆదివారం పేజీల్లో ఇక్కడ చూడవచ్చు.
“పుస్తక సమీక్షలు ఎలా ఉంటున్నాయంటే…” ఎనుగంటి వేణుగోపాల్ వ్యాసం, “మహాకవి త్రికాలాబాధితుడు” ముదిగొండ శివప్రసాద్ వ్యాసం, ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ముకుంద రామారావు రాసిన “జీవితం నిలపడానికి కవిత్వం ఓ అవసరం” వ్యాసం, “అంతర్జాలంలో అష్టావధానం” జ్యోతి వలబోజు వ్యాసం, “మనసైన పుస్తకం” మంత్రి కృష్ణమోహన్ కవిత, ఇటీవల విడుదలైన పుస్తకాల గురించి ‘అక్షర’ పేజీల్లో సమీక్షలు– ఆంధ్రభూమిలో విశేషాలు.
కుప్రిన్ మలిచిన ప్రేమ కథ ‘రాళ్ల వంకీ’ గురించి ఎన్‌విఎస్ నాగభూషణ్ వ్యాసం, అనుభవం చెక్కిన ‘జీవన సందర్భాలు’ –ఎం.నారాయణ శర్మ వ్యాసం, “పాలనలో తెలగు తప్పనిసరి కావాలి”-ఒ.వెంకటేశ్వరరావు వ్యాసం – ప్రజాశక్తి పత్రికలో విశేషాలు.
“మన్ననలేని మధుర భాష” డాక్టర్ పి.వి.సుబ్బారావు వ్యాసం, “రవళించే జ్ఞాపకం” – వేదాంతం సత్యనారాయణ శర్మ గారి గురించి గబ్బిట కృష్ణమోహన్ వ్యాసం, “ఆదాబ్ హైదరబాద్” కార్టూనిస్టు సుభాని “cartoons, caricatures, sketches” గురించి పన్యాల జగన్నాథదాసు పరిచయం, “ఎందుకు రాశాను” శీర్షికలో “మొలకల పున్నమి” గురించి డాక్టర్ వేంపల్లి గంగాధర్ వ్యాసం, “అభౌతిక స్వరం” పుస్తకం గురించి డాక్టర్ గోపరాజు నారాయణరావు వ్యాసం – సాక్షి సాహిత్యం పేజీల్లో విశేషాలు. కొన్ని కొత్తపుస్తకాల గురించిన వివరాలను ఆదివారం సంచికలో ఇక్కడ చూడవచ్చు.
“జంట వర్ధంతులు” ఫూలే, అంబేడ్కర్ వర్ధంతి సభలను గురించి డాక్టర్ ఎం.ఎఫ్.గోపీనాథ్ వ్యాసం, “సంస్థానాల సాహితీ సంపుటి తూమాటి” వ్యాసం, “తెలుగుజాతి గుండెల్లో నిండిన కూచిపూడి ఉషస్సు” వేదాంతం సత్యనారాయణశర్మ గారి గురించి నివాళి వ్యాసం – సూర్య పత్రిక విశేషాలు.
“అతి ముఖ్యమైనదాన్ని ఆయన ఏకాంతంలో పరిశీలిస్తాడు” ఎన్.వి.ఎస్.నాగభూషణ్ వ్యాసం, “కులవృత్తులకు దక్కని సామాజిక గౌరవం!” డాక్టర్ రాధేయ వ్యాసం, “దళిత కవితా రణ దుందుభి” – ఆవంత్స సోమసుందర్ వ్యాసం, నిర్జనవారధి పుస్తకంపై చెరుకూరి సత్యనారాయణ వ్యాసం – విశాలాంధ్ర పత్రికలో వచ్చిన వ్యాసాలు.
ప్రెస్ అకాడమీ వెబ్సైటులోని పత్రికల ఇండెక్సును రూపొందించడంతో కొనసాగుతున్నారు మాగంటి వంశీగారు. ఈ వారం అప్డేట్స్ ఇక్కడ చూడండి.
“‘వనితాజ్యోతి’ని వెలిగించిన బాపు బొమ్మ … ఆ తొలి సంచిక ఆచూకీ తెలుసా?” – వేణువు బ్లాగులో ఒక టపా ఇక్కడ.
కౌముది పత్రిక డిసెంబర్ సంచిక విడుదలైంది. “కవికి విమర్శకుడూ కావాలి” – కర్లపాలెం హనుమంతరావు వ్యాసం, వేదుల సుభద్ర-అగ్రహారం కథలు, నిప్పుల తుఫాన్-ఎస్.గణపతిరావు కథలు – పుస్తకాల గురించి పరిచయం – ఈ సంచికలో విశేషాలు. ఇతర వివరాలకి పత్రిక వెబ్సైటులో చూడండి.
“నిర్జన వారధి” గురించి మల్లీశ్వరి గారి వ్యాసం, “అరుణ కవితలలో తాత్త్వికత” – ఓల్గా వ్యాసం, “గురజాడ సాహిత్య స్త్రీ ప్రస్థానం-జాతీయ సదస్సు” గురించి డా. సూరి సువర్ణలక్ష్మి గారి నివేదికా, “గురజాడ వారి బుచ్చమ్మ” – అయ్యగారి సీతారత్నం వ్యాసం, “నెల్లుట్ల రమాదేవి కథల్లో స్త్రీలు” – టి.అన్నపూర్ణ వ్యాసం – భూమిక పత్రిక డిసెంబర్ సంచికలో విశేషాలు. మరిన్ని వివరాలకి పత్రిక వెబ్సైటు చూడండి.
“గడసరి ‘అత్తగారి కథలు’ – భానుమతిరామకృష్ణ”- ‘అరసి’ వ్యాసం – విహంగ పత్రికలో చూడవచ్చు.
తెలుగు కథ ప్ర’యానాం’ వ్యాసం నవ్య వారపత్రికలో ఇక్కడ.
ఆంగ్ల అంతర్జాలం:
” It’s a book everyone should read and, although everyone won’t (at a hefty 700 pages of text, with more than 100 pages of notes, it’s no pocket guide), there’s no one who wouldn’t be a more imaginative and understanding parent — or human being — for having done so.” – అంటూ “Far from the tree: Parents, Children, and the Search for Identity” పుస్తకం గురించి సాగిన పరిచయం ఇక్కడ.
“Young people continue to be enamoured of books, especially fiction, reveals a survey on reading habits in the north eastern region” – వ్యాసం ఇక్కడ.
“A significant intervention in the historiography of ancient India for which students of history will be grateful to the authors.” – అంటూ Atlas of Ancient Indian History పుస్తకం గురించి ఒక వ్యాసం ఇక్కడ.
“Burma and India: Some aspects of Intellectual Life under Colonialism” Aung San Suu Kyi పుస్తకం విడుదల సందర్భంగా ఒక వార్తా కథనం ఇక్కడ.
“How to Talk About Your Book” రచయితలకోసం వ్యాసం ఇక్కడ.
“It’s a book about the extraordinariness of an ordinary life, a story of the 20 century through the journey of one individual”. – తొంభై మూడేళ్ళ తాతగారు ఆంథ్రపాలజీ ప్రొఫెసర్ అయిన మనవడితో తన అనుభవాలసారాన్ని చెప్పిన “Mitcham Meedhi: Oru Anubava Kanakku (What Still Remains: A Ledger of Experience)” పుస్తక పరిచయం ఇక్కడ.
“Scientific Amusements” 1890 నాటి పుస్తకం గురించి Public Domain Review లో ఒక పరిచయం ఇక్కడ.
Mo Yan రచనల గురించి “The Diseased language of Mo Yan” అంటూ విమర్శతో సాగిన ఒక వ్యాసం ఇక్కడ.
Bangalore Literature Festival డిసెంబర్ 7-9 మధ్యలో జరుగనుంది. దాని గురించి హిందూ పత్రిక కథనం ఇక్కడ.
“Leslie Stephen is best known today as the father of Virginia Woolf and Vanessa Bell. But in his day, Stephen was a distinguished critic and author in his own right. ” – అంటూ సాగిన అలెక్స్ సిస్కిన్ వ్యాసం “Peaks and Valleys: Leslie Stephen, Mountaineer” వ్యాసం ఇక్కడ.
లాటిన్ అమెరికా దేశాల్లో అతి పెద్ద పుస్తక ప్రదర్శన అయిన The Guadalajara International Book Fair ఈవారంలో జరిగింది. అక్కడి అనుభవాలతో కూడిన కొన్ని ఫొటోలు ఈబ్లాగులో.
చైనీస్ రచనను ఆంగ్లంలోకి అనువదించడంలో ఎదురైన అనుభవాల గురించి ఒక వ్యాసం ఇక్కడ.
” So whether you are a reader, or a writer/reader, here are some posts on the state of reading.” అంటూ Ploughshares Literary Magazine వారు తమ బ్లాగులో గత కొన్నేళ్ళలో పఠనం వచ్చిన టపాల నుండి ఎంపిక చేసిన కొన్నింటికి ఇచ్చిన లంకెలని ఇక్కడ చూడండి.
3:10 to Yuma, Wanted వంటి సినిమాలకి రచన చేసిన Derek Haas “3 Things You Can Do in a Novel But Not Onscreen” అంటూ చెప్పిన సంగతులు ఇక్కడ.
“The Art of The Book” ప్రదర్శన గురించి వ్యాసం ఇక్కడ.
“One man many shelves” – 91 ఏళ్ళ ప్రొఫెసర్ శివ్ కె.కుమార్ గురించి హిందు పత్రిక వ్యాసం ఇక్కడ.
Goodreads వెబ్సైటులో 2013: The Year of Reading Proust అని ఒక పబ్లిక్ గుంపును ఏర్పరుచుకున్నారు. ఆసక్తిగల వారు ఇక్కడికి వెళ్ళి, చూడ్డం, చేరడం ఏది కావాలంటే అది చేయవచ్చు.
“In the darkest Africa” పేరిట 1890లో వచ్చిన పుస్తకం గురించి ఒక వ్యాసం ఇక్కడ.
“Chinese Writing, Banned and Otherwise” – wordswithoutborders లో ఒక వ్యాసం ఇక్కడ.
Kurt Vonnegut ఒకసారి Form of Fiction అన్న కోర్సులో విద్యార్థులకి (1965లో) ఉత్తరం రూపంలో పంపిన అసైన్మెంట్ ఇదిగో.
స్పానిష్ రచయితలకి ఇచ్చే ప్రతిష్టాత్మకమైన Cervantes Prize ఈ ఏడు స్పెయిన్ కు చెందిన Jose Manuel Caballero Bonald కు లభించింది. వార్త ఇక్కడ.
Suficomics వెబ్సైటు వారిపై, వారి పుస్తకాలపై ఒక వార్తాకథనం ఇక్కడ.
“You don’t need a book deal or a big publisher’s contract. All you need is a manuscript and some money. A look at the self-publishing phenomenon.” – అంటూ స్వంతంగా పుస్తకాలు అచ్చేసుకోవడం గురించి ఒక వార్తా కథనం ఇక్కడ.
“What should Poetry Do?”, ఒక రష్యన్ fairy tale కు ఆంగ్లానువాదం అయిన The Snow Child గురించి పరిచయం, Stoning the glass palace – Akshay Pathak వ్యాసం, Cut Like Wound – అనితా నాయర్ నవల గురించి వ్యాసం, Paris కు చెందిన Shakespeare & Co bookshop గురించి ఒక వ్యాసం, Maximum city పుస్తకం రాసిన సుకేతు మెహతాతో ఇంటర్వ్యూ, “Breaking the bow” పుస్తకం గురించి పరిచయం, Historical Fiction రచనల గురించి ఒక వ్యాసం – ఈ నెల హిందూ పత్రిక లీతరరీ రివ్యూ లో వచ్చినవాటిలో కొన్ని. తక్కిన వివరాలు పత్రిక పేజీల్లో చూడవచ్చు.
“Endless River” -Felix Riesenberg పుస్తకం గురించి Neglectedbooks.com వెబ్సైటులో ఒక వ్యాసం ఇక్కడ.
జాబితాలు:
“Here is my listing of works of fiction and poetry published during the year 2005 which contain embedded photographs as part of the textual matter.” – అంటూ సాగిన ఒక జాబితా ఇక్కడ.
Early Female authors of hard-boiled fiction -ఒక జాబితా ఇక్కడ.
“New Interactive and Pop-Up Books” కొత్త పిల్లల పుస్తకాల గురించి ఇక్కడ.
డిసెంబర్ వస్తూండటంతో చాలా చోట్ల వివిధ best books జాబితాలు సిద్ధమవుతున్నాయి. అలాంటివి కొన్ని:
గార్డియన్ పత్రికలో best of 2012 పేరిట Nicolas Lezard ఇచ్చిన పుస్తకాల జాబితా ఇదిగో.
మరిన్ని గార్డియన్ పత్రిక జాబితాలు – The best science books, మరొక best science books of 2012 జాబితా, the best stocking-filler books, the best sport books, the best science fiction , best music books, the best fiction, the best history books, best biographies, best art books, best poetry books, best food books, best graphic novels, best childrens books. అలా ఎడతెగని ప్రవాహంలా వాళ్ళ జాబితాలు వస్తూనే ఉన్నాయి. మొత్తం అన్నీ ఇక్కడ చూడవచ్చు.
100 Notable books of 2012 – న్యూయార్క్ టైంస్ జాబితా ఇక్కడ. వీరిదే 10 best books of 2012 జాబితా ఇక్కడ.
TLS Books of the year 2012 జాబితా ఇక్కడ.
Five good books I read in 2012 – ఒక బ్లాగు వ్యాసం ఇక్కడ.
2012లో వచ్చిన పిల్లల పుస్తకాలలో ముఖ్యమైన వాటి జాబితా ఇక్కడ.
A Look at Slate’s year end book review – ఒక టపా ఇక్కడ.
బాల సాహిత్యం
“Indian literature for kids is still in its nascent stage” – పిల్లల సాహిత్యం గురించి జరిగిన ఈవెంట్ – Bookaroo 2012 గురించి ఒక రిపోర్టు తెహెల్కా.కాంలో ఇక్కడ.
జర్మనీకి చెందిన ఇలస్ట్రేటర్, పిల్లల బొమ్మల పుస్తకాల రచయిత్రి అయిన Nadia Budde హిందూ పత్రికవారితో చెప్పిన కొన్ని కబుర్లు ఇక్కడ.
పిల్లలకోసం రచనలు చేయడంలో ఉన్న సాధకబాధకాల గురించి ప్రముఖ బ్రిటీష్ రచయిత్రి పెన్నీ డోలన్ అభిప్రాయాలు హిందూ పత్రికలో ఇక్కడ చూడవచ్చు.
ఇంటర్వ్యూలు
మొక్కపాటి నరసింహశాస్త్రి గారితో ఆకాశవాణి వారు చేసిన ఒకప్పటి ఇంటర్వ్యూ ఆడియోను సాహిత్య అభిమాని బ్లాగులో పొందుపరిచారు. లంకె ఇక్కడ.
రచయిత్రి జంధ్యాల మాలతి గారితో ఒక మాటామంతీ – ఈ వారం నవ్య నీరాజనంలో ఇక్కడ చూడవచ్చు.
Lemony Snicket కలం పేరుతో రచనలు చేసే అమెరికన్ రచయిత Daniel Handler తో ఒక మాటామంతీ ఇక్కడ.
అమెరికన్ రచయిత్రి Anne Lamott తో న్యూయార్క్ టైంస్ పత్రిక ఇంటర్వ్యూ ఇక్కడ.
J.R.R.Tolkien మనవడు, స్వయానా రచయితా అయిన Simon Tolkien తో గార్డియన్ పత్రిక మాటామంతీ ఇక్కడ.
ఈ ఏడాదే మరణించిన పిల్లల పుస్తకాల రచయిత Maurice Sendak తో The Believer పత్రిక వారు ఒకప్పుడు జరిపిన మాటామంతీ వాళ్ళ లేటెస్ట్ సంచికలో ప్రచురించారు. లంకె ఇక్కడ.
అనువాదం చేయడంలో అనుభవాల గురించి ప్రముఖ స్పానిష్ అనువాదకురాలు కేథరిన్ సిల్వర్ తో Words without borders వారు చేసిన ఇంటర్వ్యూ ఇక్కడ.
రచయిత్రి Elena Passarello తో పారిస్ రివ్యూ వారి ఇంటర్వ్యూ ఇక్కడ.
మరణాలు:
ఇటీవలే మరణించిన తమిళ రచయిత్రి కమల శఠగోపన్ గురించి, ఆవిడ రచనల గురించి “human psychology was her forte” అంటూ సాగిన ఒక వ్యాసం ఇక్కడ చదవండి.
మరికొన్ని పుస్తకాల పరిచయాలు:
* The Book of Kells, by Bernard Meehan గురించి ఒక పరిచయం.
* Oliver Sachs పుస్తకం Hallucinations ఇటీవలే విడుదలైంది. ఒక పరిచయం ఇక్కడ. రెండుమూడు వారాల క్రితం ఈ పుస్తకం విడుదల సందర్భంగా రచయితతో గార్డియన్ పత్రిక ఇంటర్వ్యూ గురించి ఈ వీక్షణంలో చూడండి. మరొక రివ్యూ ఇక్కడ.
* Housefull: The Golden age of Hindi Cinema పుస్తకం గురించి ఇక్కడ.
* Courtly Encounters: Translating courtliness and violence in Early Modern Eurasia – పుస్తకం గురించి ఇక్కడ.
* Madurai Malligai—Madurai and Its Jasmine, A Celebration – పుస్తకం విడుదల సందర్భంగా ఒక వ్యాసం ఇక్కడ.
* సంగీత దర్శకుడు ఇళయరాజా కవితల పుస్తకం గురించి ఒక వ్యాసం ఇక్కడ.
* “మన సంగీత శిఖరాలు” పేరిట చాగంటి కపాలేశ్వరరావు ఆంధ్రదేశంలోని ప్రముఖ సంగీతజ్ఞుల జీవిత చిత్రాలతో రాసిన పుస్తకం గురించి హిందూ పత్రిక వ్యాసం ఇక్కడ.
* The Richard Burton Diaries, edited by Chris Williams – పుస్తకం గురించి ఇక్కడ.
* Subways are for sleeping – పుస్తకం గురించి ఒక వ్యాసం ఇక్కడ.
* “The Weekenders, Adventures In Calcutta” పుస్తకం గురించి ఇక్కడ.
“‘Fairy Tales From the Brothers Grimm’ – A new English version” by Philip Pullman – ఒక పరిచయం ఇక్కడ.
*”The Innocence of Objects” – Orhan Pamuk పుస్తకం గురించి పరిచయం ఇక్కడ.
* The Canvas – Amnon Zichroni నవల గురించి ఒక పరిచయం ఇక్కడ.
* Redeeming Calcutta – పుస్తకం గురించి ఒక వ్యాసం ఇక్కడ.
* గాడ్ ఫాదర్ పుస్తకం గురించి నవ్య వారపత్రికలో ఒక వ్యాసం ఇక్కడ.
* Poverty amidst prosperity: Essays on the trajectory of development in Gujarat – పుస్తకం పై ఒక వ్యాసం ఇక్కడ.
* Dalit art and a visual imagery – పుస్తకం గురించి ఒక వ్యాసం ఇక్కడ.
* “The C.E.O. Who Shocked Japan Inc.” అంటూ Michael Woodford పుస్తకాన్ని గురించి పరిచయం చేసిన వ్యాసం ఇక్కడ.
ఏల్చూరి మురళీధరరావు
ప్రఖ్యాత స్వాతంత్ర్యసమరయోధులు శ్రీ ఆర్.ఆర్. దివాకర్ గారి Glimpses of Gandhi గ్రంథానికి తెలుగులో మా తండ్రిగారు ఏల్చూరి సుబ్రహ్మణ్యం గారు చేసిన అనువాదం “సంస్మరణ” కోసం గాలిస్తున్నాము.
మీకెక్కడైనా కనుపిస్తే దయచేసి ఆ వివరాన్ని పుస్తకం.నెట్ సంపాదకముఖంగా తెలియచేయగలరని ప్రార్థిస్తున్నాను. .
Srinivas Vuruputuri
త్రికాలాబాధితుడిలో దీర్ఘం మిస్సయి అర్థాన్ని మార్చేసింది. 🙂
సౌమ్య
Thanks. Corrected it now.