వీక్షణం-6
తెలుగు అంతర్జాలం:
ఆవంత్స సోమసుందర్ రచనల గురించి నిఖిలేశ్వర్ వ్యాసం, “గురజాడను వలచి.. అంబేడ్కర్‌ను మరచి” –బొర్రా గోవర్ధన్ వ్యాసం – అంధ్రజ్యోతి వివిధ పేజీల్లో వచ్చిన వ్యాసాలు. కొత్తగా వచ్చిన పుస్తకాల గురించి ఆంధ్రజ్యోతి ఆదివారం పేజీల్లో ఇక్కడ.
“శ్రీశ్రీకి అక్షరాలే కాదు.. ముఖాలు కూడా రెండే!” అంటూ రెండువారాల నాడు వచ్చిన మణిమేఖల వ్యాసానికి స్పందనగా ఎ. రజాహుస్సేన్ వ్యాసం, “బంజార లిఖిత కథల్లో సామాజిక చిత్రణ” జె.రాజారాం వ్యాసం – ఆంధ్రభూమి పత్రికలో విశేషాలు. కొత్తగా విడుదలైన పుస్తకాల వివరాలు “అక్షర” పేజీలో ఇక్కడ చూడండి.
ఈనెల 20న టాల్‌స్టాయ్ 102వ వర్థంతి సందర్భంగా…“గోర్కీ అంతరంగంలో టాల్‌స్టాయ్” వ్యాసం, కొన్ని తెలుగు వెబ్సైట్ల గురించి “అంతర్జాలంలో తెలుగు సాహిత్యం” వ్యాసం – ప్రజాశక్తి పత్రిక విశేషాలు.
ప్రపంచ తెలుగు సభల ప్రారంభ నేపథ్యంలో “అమ్మ భాషకు ఆదరణ ఇదా?” వ్యాసం, కేంద్ర సాహిత్య అకాడమీ సారథ్యాన్ని ఒక తెలుగువాడు స్వీకరించాడంటూ ఆయన (కె. శ్రీనివాసరావు) గురించిన పరిచయ వ్యాసం, ప్రముఖ కవి కె.శివారెడ్డి కవిత్వం మూడు భాగాలుగా విడుదలైన సందర్భంగా ఆయనతో యం.కె. సుగమ్‌బాబు ఇంటర్వ్యూ, ఆ పుస్తకాల గురించి ఒక చిన్న పరిచయం, పిల్లలకోసం అమరావతి పబ్లికేషన్స్ విడుదల చేసిన రెండు పుస్తకాల గురీంచి వ్యాసం – సాక్షి పత్రిక విశేషాలు.”సింగీతం గారి శ్రీమతి ఆత్మకథ”, ఇతర కొత్త పుస్తకాల గురించి ఆదివారం సాక్షిలో ఇక్కడ.
డాక్టర్ సోమసుందర్ రాసిన ‘సీకింగ్ మై బ్రోకెన్ వింగ్’ అనే కావ్యం గురించి “దోసెడు అక్షరాలు పిడికెడు అనుభూతులు” అంటూ సాగిన రామా చంద్రమౌళి వ్యాసం, ఎన్.అరుణ కవితల పై, ఆవిడ వివిధ పుస్తకాలను ప్రస్తావిస్తూ సాగిన రాచపాళెం చంద్రశేఖరరెడ్డి వ్యాసం, “అవును, పరిమితులు ఉన్నాయి!” – గతంలో వచ్చిన కోడిహళ్ళి మురళీమోహన్ వ్యాసనికి శ్రీనివాస్ అంకే స్పందన – సూర్య పత్రిక విశేషాలు.
“సాహితీస్రష్టగా ఎదిగిన సమాజాంకిత ప్రజ్ఞాశాలి” అంటూ వట్టికోట ఆళ్వారుస్వామి గురించి మంతెన సూర్యనారాయణరాజు వ్యాసం, కాళోజీ జ్ఞాపకాల ‘గొడవ’ అంటూ కొత్తపల్లి రవిబాబు వ్యాసం – విశాలాంధ్ర పత్రికలో వచ్చాయి.
భారతీయ సిపాయి తిరుగుబాటు కాలం నాటి కథలతో పాత పుస్తకాల షాపులో కనబడ్డ పుస్తకాలలోని ఫొటోలను మాగంటి వంశి గారి బ్లాగులో ఇక్కడ చూడవచ్చు.
కాశీభట్ల వేణుగోపాల్ నికషం గురించి “తమ్మిమొగ్గలు” బ్లాగులో ఇక్కడ చూడవచ్చు.
ప్రేమ్‌చంద్ సతీమణి శ్రీమతి శివరాణీదేవి రచన : “ఇంట్లో ప్రేమ్‌చంద్” పుస్తకం తెలుగు అనువాదం గురించిన పరిచయం హై.బు.ట్ర. బ్లాగులో ఇక్కడ.
“విషాదమోహనం” కవితల గురించి బొల్లోజు బాబా గారి అభిప్రాయాలు ఇక్కడ.
ఆంగ్ల అంతర్జాలం:
తాను “పాత్ర”గా మాత్రమే ఊహించి సృష్టించిన పేరుగల వ్యక్తి నిజంగా ఒకప్పుడు ఉండేవాడని తెలిస్తే రచయితకి ఏమనిపించి ఉంటుందో అమితవ ఘోష్ తన బ్లాగులో రాసుకున్న ఈ వ్యక్తిగత అనుభవం చూస్తే తెలుస్తుంది.
మొదటి ప్రపంచ యుద్ధం కాలం నాటి భారతీయ సైనికుల అనుభవాలతో వచ్చిన పుస్తకాలను అన్వేషిస్తూ ఉండగా, దొరికిన మరాఠీ, గుజరాతీ భాషల్లోని స్వీయానుభవాల పుస్తకాల గురించి మురళి రంగనాథన్ మాటల్లో, అమితవ ఘోష్ బ్లాగులో ఇక్కడ చూడండి.
“On the physical abuse of books” – Lev Grossman వ్యాసం ఇక్కడ.
గత నెలలో రెండు పెద్ద ప్రచురణ సంస్థలు – పెంగ్విన్-ర్యాండం హౌస్ కలిసిపోతాయని వార్తల్లో చదివాము. ప్రచురణరంగం వ్యాపారంపై దీని పర్యవసానం గురించి న్యూయార్క్టైంస్ పత్రిక వ్యాసం ఇక్కడ.
పిల్లల పుస్తకాల పాత్ర “Babar, the elephant” ఆంగ్ల వర్షన్ కు 80 ఏళ్ళు నిండుతున్న సందర్భంగా మళ్ళీ చిన్నాపెద్దా అందరికీ ఆ పాత్రని పరిచయం చేయడానికి నిర్వహిస్తున్న కార్యక్రమాల గురించి వ్యాసం ఇక్కడ.
DNA స్వరూపాన్ని కనుగొన్న వాట్సన్-క్రిక్ ద్వయంలో ని James D.Watson అప్పటి తన అనుభవాలను The Double Helix అన్న పుస్తకంగా రాశారు. ఇది తొలిసారిగా 1968లో ప్రచురితమైంది. ఇప్పుడు కొన్ని చేర్పులతో కొత్త ముద్రణ వచ్చిన సందర్భంగా న్యూయార్క్ టైంస్ వ్యాసం ఇక్కడ.
పుస్తకాల గురించి పాఠకులకి ఆసక్తి కలిగించేలా పరిచయం చేయడం ఎలాగో సుసాన్ జె.మారిస్ వ్యాసం ఇదిగో.
టాగోర్ గురించి గిరీష్ కర్నాడ్ వ్యాఖ్యలకి సమాధానంగా అవుట్లుక్ పత్రికలో Ananya Mukherjee Reed వ్యాసం ఇక్కడ.
Madame Blavatsky రచనలు, జీవితం గురించి Ezra Glinter వ్యాసం ఇక్కడ.
Salvador Dali నివసించిన ఇంటి టూర్ కోసం ఇక్కడ చూడండి.
Edith Wharton గురించి “Enthusing over edith” వ్యాసం dovegreyreader బ్లాగులో ఇక్కడ చూడవచ్చు.
The Bibliomania and its cures – Times Literary Supplement వ్యాసం ఇక్కడ.
“When you get a Crumpled Press book, you can feel that it was handmade by somebody, you can feel slight irregularities in it.” – అంటూ న్యూయార్క్ కు చెందిన ఒక ప్రచురణ సంస్థ గురించి సాగిన వ్యాసం ఇదిగో.
సెకండ్ హ్యాండ్ పుస్తకాలను అమ్మే యంత్రం – Biblio-Mat గురించి ఒక కథనం ఇక్కడ.
1850 లో ప్రారంభమై ఇప్పుడు అనేక పాత గ్రంథాలకి నెలవైన Mohammedan Public Library గురించి ఒక పరిచయం ఇక్కడ.
Iceland కు చెందిన కవి Jónas Hallgrímsson పుట్టినరోజును Icelandic Language Day గా జరుపుకుంటారట. ఆ సందర్భంగా వచ్చిన ఒక వ్యాసం ఇదిగో.
స్వీడిష్ రచయిత Astrid Lindgren పేర ఏటా పిల్లల సాహిత్యానికి ఇచ్చే Astrid Lindgren Memorial Award ఈ ఏడాది Katarina Kieri అనే రచయిత్రికి లభించింది. వార్త ఇదిగో.
జాబితాలు:
2012 Best books of the year – Amazon.com వారి ఎంపికలు ఇక్కడ చూడవచ్చు. వీరివే, Best Teen Books of the year జాబితా ఇక్కడ.
The 10 Grumpiest Authors in Literary History – వ్యాసం ఇక్కడ.
Dream homes built for books and the nerds who love them.
నిజజీవితంలోని క్రైం కథలపై వచ్చిన కొన్ని పుస్తకాలపై జై అర్జున్ సింగ్ వ్యాసం ఇక్కడ.
“Women in War” శీర్షికతో యుద్ధకాలాల్లో మహిళల జీవితాల చుట్టూ వచ్చిన వాస్తవిక-కాల్పనిక సాహిత్యాల జాబితా ఒకటి తయారు చేశారు ఇటీవలే ఒక బ్లాగులో. ఆ శీర్షికలోని వ్యాసాలు, చివరగా పాఠకుల సలహాలతో రూపొందించిందిన ఒక రీడింగ్ లిస్టూ ఇక్కడ చూడండి.
ఇంటర్వ్యూలు:
అమెరికన్ నవలా రచయిత Philip Roth “రిటైర్మెంట్” ప్రకటించిన నేపథ్యంలో (ఒక వార్త ఇక్కడ) “In Which Philip Roth Gave Me Life Advice” అంటూ సాగిన Julian Tepper వ్యాసం, సంబంధిత ఇంటర్వ్యూ -ప్యారిస్ రివ్యూలో చుడవచ్చు. ఆయన గురించిన మరొక వ్యాసం ఇక్కడ.
అమెరికన్ సర్రియలిస్టు కార్టూనిస్టు Gabrielle Bell గురించీ, ఆవిడ కామిక్స్ గురించీ Tobias Carroll చేసిన ఇంటర్వ్యూ ఇక్కడ చూడవచ్చు.
మరణాలు:
T.S.Eliot సతీమణి Valerie గతవారం మరణించారు. ఈ సందర్భంలో హిందూ పత్రిక “zealous guardian of the poet’s literary legacy for almost half a century” అంటూ రాసిన వార్తాకథనం ఇక్కడ. ఆవిడ గురించి ఇతర పత్రికల్లో వచ్చిన కథనాలు – న్యూయార్క్ టైంస్, ప్యారిస్ రివ్యూ.
అమెరికన్ కవి జాక్ గిల్బర్ట్ ఈవారంలో మరణించారు. ఆయన గురించి న్యూయార్క్ టైంస్ లో వచ్చిన వ్యాసం ఇక్కడ.
మరికొన్ని పుస్తకాల పరిచయాలు:
* Every Short Story 1951-2012 by Alasdair Gray పుస్తకంపై ఒక పరిచయం ఇక్కడ.
* ఫ్రెంచి తత్వవేత్త Jacques Derrida జీవితచరిత్ర – Derrida – a biography పుస్తకం పై గార్డియన్ పత్రిక సమీక్ష ఇక్కడ.
*The Secret life of William Shakespeare – పుస్తక పరిచయం ఇక్కడ.
* Untouchable: The Strange Life and Tragic Death of Michael Jackson – పుస్తక పరిచయం ఇక్కడ.
* Srimanta Sankaradeva – Vaishnava Saint of Assam పుస్తక పరిచయం ఇక్కడ.
* Interventions: A Life in War and Peace – కోఫీ అన్నన్ అనుభవాలతో కూడిన ఈ పుస్తకం గురించి ఒక పరిచయం ఇక్కడ.
Sreenivas Paruchuri
Good to see a writeup on Crumpled Press! I became aware of its existance some 4.5 years ago when they published Prof. Grafton’s long essay: “Codex in Crisis”. It was nice to receive a “hand-made and numbered” book of the first edition, my first experience to buy such hand-made book in the West. By the way, a special edition of it was made last year to commemorate the opening of the new library at U.Chicago. (Grafton’s keynote lecture is available on YouTube. Also, his another major talk on this book is available on Google Channel @ YouTube.) I often cite what the Crumpled Press people say: “We are publishers: we edit and design the books, not you. The best thing to do to prove that you are invested in what we do is to buy a book.” As Prof. Velcheru Narayanarao often says “we have only printers and no publihers in Andhra Pradesh.” Regards, Sreenivas
సౌమ్య
ఇప్పుడే ప్రజాశక్తిలో ఆయన గురించి ఒక వ్యాసం చూశాను.
“అభినవ సత్యభామ ‘వేదాంతం'” – గుండు నారాయణ
http://www.prajasakti.com/soundofsilence/article-404645
rv
🙁 ఇటీవల మరణించిన నాట్యాచార్యులు వేదాంతం సత్యనారాయణశర్మ
(భామాకలాపం – సత్యభామ) గూర్చి మీడియా కవరేజి తగినంతగా లేదు …