ఫ్రాంక్ఫర్ట్ బుక్ ఫెయిర్ 2012 – కొన్ని ఫొటోలు
ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఫ్రాంక్ఫర్ట్ పుస్తక ప్రదర్శన అక్టోబర్ 10-14 మధ్య ఫ్రాంక్ఫర్ట్ పట్టణంలో జరిగింది. చివరి రెండ్రోజులూ జనరల్ పబ్లిక్ కి ప్రవేశం ఉంది. ప్రపంచంలో వంద పైచిలుకు దేశాల నుండి ఎందరో ప్రచురణ సంస్థలు ఇక్కడికి ఏటేటా వచ్చి తమ స్టాల్స్ ద్వారా తమ దేశాల్లో ప్రచురించే పుస్తకాల గురించి సమాచార మార్పిడి చేసుకుంటారిక్కడ. ఈ ఏడు నేను అక్కడికి వెళ్ళగలిగాను. అప్పటి ఫొటోలు కొన్ని ఈ టపా ద్వారా అందరితో పంచుకుంటున్నాను.
****
జన సందోహం:
ముద్రణ రంగానికి సంబంధించి ప్రపంచంలోనే అతి పాత వస్తుసంగ్రహశాలల్లో ఒకటైన గుటెంబర్గ్ మ్యూజియం వారి స్టాల్ లో పిల్లలకి ముద్రణా పరికరాలు వాడడం ఎలాగో చూపిస్తూ వారిని అలరించారు.
ఇక్కడ స్టాల్స్ ఉన్న వివిధ దేశాల్లో కొన్ని:
(బొమ్మని విడిగా వేరే టాబ్లో తెరిచి జూం చేసి చూస్తే, దేశాల జాబితా కొంచెం క్లియర్గా కనిపిస్తుంది)
Frankfurt Antiquarian Book Fair, 2012:
Leave a Reply