మీరేం చదువుతున్నారు? – 2

పుస్తకాలు తరచుగా చదువుతున్నా, పేజీలకి పేజీలు సమీక్షలు రాసే ఓపికా, తీరికా లేని వారి కోసం ఈ పేజీని నిర్వహిస్తున్నాము. ఈ వారంలో మీరే పుస్తకాలు చదివారు, వాటిని గురించి ఓ రెండు ముక్కలు ఇక్కడ కమ్మెంట్ల రూపంలో పంచుకోవచ్చు.   ఈ నమునాలో వివరాలు చెప్తే సులువుగా ఉంటుంది.

పుస్తకం పేరు:
రచయిత:
భాష:
వెల:
అంతర్జాలంలో ఈ పుస్తక వివరాలు:
పుస్తకం పై మీ అభిప్రాయం:

  1. Purnima

    ఎటూ బుద్ధిమంతుడు సినిమా గురించి మాట వచ్చింది కాబట్టి, ఈ సినిమాకు మూలమైన giovanni guareschi పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయో తెల్సిన వారు తెలియజేయగలరు.

    నేను చదివిన పుస్తకాలు:
    ౧. ఇస్మాయిల్ హైకూలు: వీటి గురించి ఎంత ఎక్కువ చెప్పుకుంటే, అంత తక్కువ!
    ౨. నక్షత్రదర్శనం: తనికెళ్ళ భరణి నటుడిగా నాకు చాలా ఇష్టం. ఆయన రచనలు, మరింత బాగుండేట్టు ఉన్నాయి. ప్రముఖల గురించి కవితలూ, వ్యాసాలు ఉన్న ఈ పుస్తకం దాచుకోదగ్గ పుస్తకం.
    ౩. Flight Club – Chuck Palahnuik: ఏడాది కాలంపైగా దీన్ని చదవాలా? వద్దా? అన్న సంశయంలో గడిపి, ఎట్టకేలకు మొన్న చదివాను. “వావ్!” అనిపించింది. But again, it’s challenging on one’s digestive system. Tough read, in ways!
    4. శీతవేళ రానీయకు.. కుప్పిలి పద్మ! టైటిల్ రొమాంటిక్, ఎందుకివి రాశానన్న కారణం రొమాంటిక్.. ఇందులో ఉన్న కొన్ని వాక్యాలు భలే రొమాంటిక్.. కానీ నాకు దీంట్లో పేజి పేజితోనూ పేచీ!రచయితల అవగాహన ఏపాటిదో పాఠకుడికి ఇట్టే తెల్సిపోతుంది, ఎంతటి చక్కటి వచనాన్ని ముసుగేసినా! అలాంటప్పుడు, ఆయా రచయితలు నాకు హాస్యాస్పదం అనిపిస్తారు. దీని గురించి పుస్తకం.నెట్‍లో కాదు గాని, నా బ్లాగులో రాసుకుంటాను.

  2. కామేశ్వర రావు

    “బుద్ధిమంతుడు” సినిమా స్క్రీన్ ప్లే అంటే ఒక విషయం గుర్తుకువచ్చింది. అందులో ఒక సన్నివేశం నాకు బాగా గుర్తుండిపోయింది. చిన్న నాగేశ్వరరావు ప్రేమ విషయం తెలిసి తల్లీ అన్నా ఒప్పుకోరు. ఆ తర్వాత ఓ కొలను ఒడ్డున నాగాశ్వరరావు విజయనిర్మల కూర్చుని ఉంటారు. నాగేశ్వరరావు కొన్ని రాళ్ళు తీసుకొని కోపంగా ఆ కొలనులోకి విసురుతూ ఉంటాడు. “కులము-మతము” అని ఓ రెండు రాళ్ళు వేస్తాడు. “ఆస్తి-అంతస్తు” అని మరో రెండు రాళ్ళు వేస్తాడు. అప్పుడు వెనకనుంచి విజయనిర్మల “అమ్మగారు-అన్నగారు” అని అంటుంది. దానితో నాగేశ్వరరావు ఆగిపోయి, స్వరం మార్చి, “అవును అమ్మగారు-అన్నగారు” అని చేతులో ఉన్న మిగిలిన రెండు రాళ్ళు ఆ గట్టు మీద పెట్టి వెళిపోతాడు. ఇలాంటి సన్నివేశాలు రాయాలన్నా తీయాలన్నా ఎంతగా ఆలోచించి ఉండాలి అనిపిస్తుంది.

  3. సౌమ్య

    @Purnima: Its ‘Sri Padarchana’ 🙂

    Read “Tell me your dreams” and “The other side of midnight” by Sidney Sheldon. Good timepass reads.

    Read ‘Buddhimantudu’ movie’s screenplay, by Mullapudi Venkata Ramana…for the Nth time. I enjoyed it as much as I did when I read it first 🙂

  4. Purnima

    బెంగళూరు వెళ్ళిన ప్రతిసారి సంచులకొద్దీ పుస్తకాలు తెచ్చుకోవడం బా అలవాటయ్యింది నాకు. అవ్వాక్కవ్వాల్సిన విషయమేమిటంటే, ఈ పుస్తకాల్లో తెలుగు పుస్తకాలూ ఉండడం. రాజాజీనగర్ లో సుధా బుక్ హౌస్‍లో పాత పుస్తకాలూ, అరుదైన పుస్తకాలూ, దుర్లభమైన పుస్తకాలూ ఉంటాయి. పుస్తక ప్రియులు తప్పక వెళ్ళాల్సిన అంగడి. ఆ షాపు ఓనర్, గోపీనాథ్ గారు కూడా స్నేహశీలి. చక్కగా మన వెంటే ఉండే పుస్తకాలు పరిచయం చేస్తూ ఉంటారు. ఈ అనుభవాల గురించి త్వరలో రాయాలని ప్లాన్!

    ఇంతకీ నేను చదివిన పుస్తకాలు:

    ౧. నార్ల వారి ఉత్తరాలు: ఇది చాలా ఆసక్తికరమైన పుస్తకం. అరచేయికి మించి ఉండదు. హరిహరప్రియ అని ఒక కన్నడ రచయిత, కొన్ని తెలుగు రచనలను కన్నడంలోకి అనువదించారు. వారికీ, నార్ల వారికీ మధ్య జరిగిన ఉత్తరప్రత్యుత్తరాలు!

    ౨. అన్నమయ్య జీవితం ఆధారంగా రాయబడ్డ నవల, “పదార్చన” – ముదిగొండ శివప్రసాద్ రచన. బాగుంది.

    ౩. యుగకవి శేషేంద్ర: చర్చలు లేఖలు. అరుదైన పుస్తకం! శేషెన్ గురించి కబుర్లు – తెలుగు, ఇంగ్లీషు, హిందీ, ఉర్దూ, జర్మెన్ భాషల్లో. అరుదైన ఫోటోలతో సహా! ఇది దొరకడం అదృష్టమే!

  5. budugoy

    మూర్తిగారు, దైవంతో సహజీవనం (ఆయన శిష్యుల షార్ట్ బయోస్)- రామక్రిష్ణ మఠం వారి చాలా ప్రచురణలు అన్నీ దాదాపుగా అదేకోవలోకి వస్తాయి. అలాగే స్వామి రామ రాసిన – హిమాలయ యోగులతో నా అనుభవాలు (ఇదైతే మాంచి ఫిక్షన్‌లా ఉంటుంది.) బాగుంటాయి. ఇవన్నీ చక్కగా ఇంగ్లీషు ఒరిజినల్స్ లో కూడా ఉన్నాయి.. పాల్ బ్రంటన్ – a search in secret india ఇంచుమించు ఇలాంటి టైటిల్.
    ముందు జాగర్తగా చెప్పేదేంటంటే ఇవన్నీ ఒకరకమైన డిటాచ్‌మెంట్ తో చదవాలి 🙂
    -బు

  6. s.n.murthy M

    i like Hindu religious books very much. i read some books like an autobiography of a yogi, Ramakrishna kadhamrutham etc.. please refer that type of books to me. pustakam.net lo chusi chadivina book “changhigkhan” parvaledu bagane undi.. nenu emdhya chadivina manchi pustakam PILAKA GANAPATHI SASTRY Gari “VISALA NETRALU” exlent prati okka Pustaka mitrulu chavadavalsina pustakam.. thank u to pustakam.net

  7. Srinivas Vuruputuri

    ఇటీవల చదివినవీ, చదువుతున్నవీ:

    1. మన వేమన (ఆరుద్ర)
    2. వేమన వేదం (ఆరుద్ర),
    3. వేమన (రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ)
    4. వేమన్న వాదం (డా.గోపి)

    రాళ్ళపల్లి వారి ఉపన్యాసాలు చాలా నచ్చాయి – వాటిల్లో కనబడే నిర్భీతీ, స్పష్టతా, తర్క నైశిత్యం కారణంగా.
    ఆరుద్ర ఉపన్యాసాలలో వ్యాసాలలో వేమన పైన లోకాయత దర్శనాల ప్రభావం ఉన్నదనీ, వేమనకి జైన సాహిత్యం కరతలామలకమనీ, వేమన సంస్కృత కావ్యాలూ, మత గ్రంథాలూ చాలా చదివే ఉంటారనీ రుజువు చేయటానికి ప్రయత్నించారు. మరీ కన్విన్సింగ్ గా అనిపించలేదు.

    వేమన్న వాదం – ముందుమాటల్లోనే ఉన్నాను.

  8. Purnima

    Have been reading well these days. Somehow updating this page wasn’t happening! 🙁

    Just completed with “The Devadasi and the Saint” – an biographical account of Vidya Sundari, Bangalore Nagarathnamma.. amazing book! Too well written and the contents can get overwhelming! Though Sowmya had already introduced it, I’d still write about it.

    Thanks to Sowmya, who makes sure that I don’t miss any good reads that she had read, I’m re-visiting a forgotten book, “To Sir with Love”! Trust me, its been eons that I’ve read such a prose. The beauty of British english oozes out of every line.

    Two books of Groucho – one his letters and an autobiographical account – have me flat on the ground. He ROCKS!

    Having got to know that this play is one of the favourites of one of favourite authors, read it. And liked it!

    http://www.online-literature.com/ibsen/dolls-house/

    There are few other books I’m reading in parallel..will talk about them later!

  9. సౌమ్య

    Read: ‘The world according to Groucho Marx’ by David Brown
    Reading:
    1) Memoirs of a Mangy lover – Groucho Marx
    2)In to the passionate soul of subcontinental cricket – Emma Levine
    -Both are very good reads.

  10. సౌమ్య

    ఇప్పుడే నాన్న-నేను చదవడం పూర్తి చేసాను. బుజ్జాయి గారు స్వతహాగా రచయిత కాకపోవడం ఈ పుస్తకం నడిచిన తీరుకి బాగా నప్పింది. ఆపకుండా చదివించింది. త్వరలో ఒక చిన్న పరిచయం రాసేందుకు ప్రయత్నిస్తాను.

  11. మల్లిన నరసింహారావు

    శాంతి పర్వం 4 అశ్వాసాలు పూర్తయినాయి.డిశంబరు చివరికన్నా భారత పఠనాన్ని పూర్తి చేయగలిగితే బాగుణ్ణు.

  12. Purnima

    నిద్ర రాకపోవటం కూడా మంచిదే! కృష్ణ శాస్త్రి గారి అబ్బాయి బుజ్జాయి రాసిన “నాన్న-నేను” పుస్తకం పూర్తి చేసాను.

    బా రాసినా పుస్తకాలేమో గాని, బాగా చదివించే పుస్తకాలు అరుదు. అందులో ఇది కచ్చితంగా ఇది ఒకటి.

    http://www.eveninghour.com/books/Naanna%20Nenu/6962.html

  13. సౌమ్య

    @Vijayavardhan: పేరు నాకు గుర్తులేదు కానీ, మీరన్న పుస్తకమే కావొచ్చు. పుస్తకమంతా ఆర్ట్ వర్క్ తోనే నిండి ఉంది. అదంతా సినిమాకోసమే కనుక నేను మేకింగ్ అని అన్నాను.

  14. విజయవర్ధన్

    @సౌమ్య:
    >> డ్రీం వర్క్స్ వారు ‘హౌ టు ట్రెయిన్ యువర్ డ్రాగన్’ చిత్రం మేకింగ్ గురించి వేసిన పుస్తకం కాసేపు తిరగేశాను.

    అది మేకింగ్ పుస్తకమాండి లేక Art of How To Train your Dragon పుస్తకమా? Amazon లేదా flipkart link ఇవ్వగలరా?

  15. సౌమ్య

    నేను తప్పిస్తే ఎవరూ ఇక్కడ రాస్తున్నట్లు లేరే! 🙂

    బెంగళూరు నాగరత్నమ్మ జీవిత చరిత్ర చదువుతున్నాను. ప్రస్తుతానికి వి.శ్రీరాం ఆంగ్ల మూలానికి టి.పద్మిని తెలుగు అనువాదం (హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వారి ప్రచురణ) చదువుతున్నాను. ఆంగ్ల మూలం – ఆన్ ది వే!

    నిన్న డ్రీం వర్క్స్ వారు ‘హౌ టు ట్రెయిన్ యువర్ డ్రాగన్’ చిత్రం మేకింగ్ గురించి వేసిన పుస్తకం కాసేపు తిరగేశాను. అద్భుతమైన అనుభవం! అద్భుతమైన బొమ్మలు, దానికి తగ్గ వ్యాఖ్యానమూ! ఎప్పుడో ఈ పుస్తకం చదవాలి!

    పైన చెప్పిన – గ్రోనింగ్ షెల్ఫ్ చదవడం మొదలుపెట్టాను – పుస్తక ప్రపంచం పై ఎంతో ప్రేమతో రాసిన వ్యాసాలు – అలాగే, ఎంతో సమాచారం ఉంది వీటిలో.

    కోతికొమ్మచ్చి మొదటిభాగం – రోజూ కాసేపు చదువుతున్నాను. ఆడియో కూడా మొదలుపెట్టాను 🙂

  16. సౌమ్య

    చదవాలనుకుంటున్న పుస్తకం ఇది : 🙂
    Pradeep Sebastian వ్యాసాల సంకలనం ‘The Groaning Shelf’. ఎన్నాళ్ళుగానో, హిందూ ‘End Paper’ శీర్షిక పుస్తకంగా వస్తే బాగుంటుంది అనుకుంటూ ఉన్నాను. ఈ సంకలనం లో ఆ శీర్షిక రచనలు ఉన్నాయని ఇవాళ్టి హిందూ మెట్రోప్లస్ (బెంగళూరు ఎడిషన్) లో చదివాను.

    కొనాలనుకుంటే, లంకె ఇక్కడ..

  17. సౌమ్య

    Asimov కథలు, వ్యాసాలు అప్పుడోటీ, ఇప్పుడోటీ చదువుతూ ఉన్నాను. నాకు తెగ నచ్చేస్తున్నాయ్!

  18. సౌమ్య

    ‘To Sir with love’ మరోసారి చదివాను.

    అద్భుతమైన పుస్తకం. త్వరలో ఈ పుస్తకం గురించి ఇక్కడే పరిచయం చేస్తాను.

  19. sriram velamuri

    ద్వానాశాస్త్రి గారి మా నాన్న గారు,ప్రతి ఒక్కరు చదివి తీరాల్సిన పుస్తకం
    దాదాపు అరవయ్ మంది మహానుభావుల పిల్లలు ,వాళ్ళ తండ్రుల తో వాళ్ళకున్న
    అనుబంధాలు ,అనుభవాలు, రాసారు,అందరూ చదవండి

  20. సౌమ్య

    Reading ‘The Rozabal Line’ by Ashwin Sanghi.
    -Completed only around 20% of the book since Y’day night. Super Interesting. Ofcourse, my history knowledge is very poor…but that does not make the reading experience daunting, in any way! It only encourages me to read some history sometime! 🙂
    [Writing from a now alien computer, which does not know Telugu]

  21. నరసింహా రావు mallina

    టి టి డి వాళ్ళ శ్రీమదాంధ్ర మహా భారతం అర్థ తాత్పర్య సహితంగా వున్నది మొదటినుండి చదవటం మొదలెట్టి
    ప్రస్తుతం ద్రోణ పర్వం ద్వితీయాశ్వాసం వరకూ వచ్చాను
    పద్మవ్యూహం పూర్తైనది.

  22. seshagirisrishti

    lalithagaru meeru na pustakalu chadivara? na kotha pusthakam Dabbhu sampadinchadam o kala. chavandi. apai me abhi prayani naku telupadi.

  23. seshagirisrishti

    soumya me taste chala bagundhi

  24. సౌమ్య

    భమిడిపాటి కామేశ్వర రావు – ‘మన తెలుగూ చదువుతున్నాను.
    వ్యంగ్యం చాలా బాగుంది!
    భాష -శుద్ధ తెలుగులా ఉంది. కొన్ని పదాలు ఇదే తొలిసారి చూడ్డం! అన్నట్లు, ఇందులో ఎక్కడ అంకెలు వచ్చినా, తెలుగులోనె ఉన్నవి 🙂

  25. Murali Mohan Mallareddy

    Just completed ‘Alexander’ by Peter S Tsouras. ‘Invincible’ is the word kept on invading my mind ever since I started reading about this magnanimous macedonian king. Still in the hangover of Alexander’s glory. Though the book is mainly a military biography, it gives insights into his life and persona.

    In his own words he can not be counted on the years he lived but on the victories he commanded. Good read.

  26. లలిత

    Eat Pray Love చదువుతున్నాను.
    ఒక (I don’t mean typical) ఆధునిక అమెరికా మహిళ మనసు చదివినట్లు ఉంది.
    కొన్ని విషయాలు ఇక్కడ పెరగడం మూలంగా విరుద్ధం, accept చెయ్యాలనిపించదు, accept చెయ్యనవసరం లేదు. కానీ అవి పై పై విషయాలు మాత్రమే.
    కానీ లోతుగా చూస్తే, అసలు విషయానికి వస్తే మాత్రం ఆమె స్వగతం మనకు ఏ సంస్కృతిలోనైనా పరిచయం అయ్యే అనుభవాలూ, మనస్తత్వాలకి ఏమీ దూరంగా లేదు.
    ఒక మానసిక సంఘర్షణను అక్షరాలలో చూస్తాము. మనమూ ఆలోచించుకుంటాము (నా లాంటి వారు).
    ఈమే Committed కూడా రాశారు.
    మొదటి పుస్తకం self discovery అయితే రెండోది సంఘంతో రాజీ పడడం.
    తను తన ప్రేమికుడినుంచి ఏమి ఆశిస్తోందో, అవి దొరకకపోవడం ఎలా బాధిస్తోందో చెప్పినప్పుడు, ఆమె తల్లి (happily married) “నేను కూడా అవి కావాలనుకున్నాను” అని చెప్పడం విస్తు పరుస్తుంది. “ఐతే నేను ఏదైనా పొందవచ్చును అనే విషయ జ్ఞానంతో పెరిగిన సమయం కాదది.” (నా అనువాదం పూర్తి న్యాయం చెయ్యక పోవచ్చు అసలు మాటలకి), అని తల్లి చెప్తే రచయిత్రి ఆలోచనలో పడుతుంది. ఇలాంటి ఉదాహరణలు (పరస్పర విరుద్ధాలు) అక్కడక్కడా రెండు పుస్తకాలలోనూ కనిపిస్తాయి, బాగా ఆలోచింపచేస్తాయి .
    ఆధునిక వాదులైనా, సాంప్రదాయ వాదులైనా చదవ వలసిన పుస్తకం ఇది. స్వేఛ్ఛకీ ఒక ఖరీదు ఉంది అని తెలిసి ఆ ఖరీదుతో సహా ఆ స్వేఛ్ఛను ఆహ్వానించి, సంఘర్షణ తర్వాత ఒక సంతృప్తికరమైన సమాధానం, లేదా, సాధన మార్గం తెలుసుకో గలిగే ప్రయత్నం అర్థం అవుతుంది.
    స్వేఛ్ఛనీ, ఆధునిక మహిళ మనఃస్థితినీ కొంచెం tolerate చేసే స్థాయికి ఎదగ వచ్చు, ఆధునిక మహిళ “సుఖ పడదు” పైగా బోలెడంత సంఘర్షణను ఎదుర్కొంటూ తన మార్గాన్ని అన్వేషించుకుంటుంది, అటువంటి ఆకాంక్ష ప్రతి తరంలోనూ స్త్రీలకీ ఉన్నా, ఈ తరం వారికి అవకాశం కూడా ఉందనీ, అది ఎలా వినియోగించుకోవాలి అన్నది ఎవరికి వారు నిర్ణయించుకోవలసినదేననీ ఇలా చాలా అర్థం చేసుకోగలరు, అర్థం చేసుకోదల్చుకుంటే. ఈ ఆధునిక స్త్రీలందరూ కూడా ఒకే రకం వారు కాదు అనీ తెలుస్తుంది.
    ఒక సంవత్సరం పాటు celibacy అవలంబించి తనను తాను తెలుసుకునే ప్రయత్నం చేస్తూ మూడు దేశాలు తిరిగి pleasure, ఆధ్యాత్మికత, ఈ రెండిటి మధ్య balance పట్ల తన దృక్పథాన్ని తాను తెలుసుకునే ప్రయత్నం ఈ పుస్తకం ఇతివృత్తం.
    Again, it is not about a typical lady of any generation. It is about a particular woman in search of her true self, who also, luckily, has the opportunity to actually take up that search, by virtue of being born in modern times.

  27. Purnima

    Beautiful Testing – A book usefully beautiful. Loved reading it! Contains 23 articles on Software Testing and each one of them, is worth a read.

    Flipkart link

  28. గిరీష్ కె.

    తెన్నేటి సూరి గారి “చంఘిజ్ ఖాన్” చదవడం ఇప్పుడే పూర్తి చేసాను. A gripping story and wonderful narration. ఏకబిగిన చదివించింది! Thanks to Just Books! They have a nice collection of Telugu Books! City of Joy మొదలు పెట్టాను. కాస్త heavy గా ఉన్నట్లుంది. పూర్తి చెయ్యగలనా….?

  29. Purnima

    Catch 22.. చదువుతూనే ఉన్నా..

    A mathematician’s apology – Hardy.. కాస్త తల పై నుండి పోయినా, చదవటం మంచి అనుభూతిని ఇచ్చింది.. మళ్ళీ చదవాలనిపిస్తుంది.

    Small Memories – Jose Saramago — ఇది సరమగో చిట్టి జ్ఞాపకాల చిట్టా.. స-ర-మ-గో.. సరమగో! అని పాటలు పాడుకుంటూ చదువుతున్నా.. “ఆహా!” అనిపించే పుస్తకం.

    Passions and Impressions – Pablo Neruda.. కవన్న వాడు వచనం రాయకూడదని ఒక నియమం పెట్టాలి, నన్నడిగితే. ఏదో కవితంటే, కొన్ని అక్షరాలు, మరికొన్ని పంక్తులు కాబట్టి, చదువుకున్నా, చదువుతూనే ఉన్నా … అదో అందం. వీళ్ళు వచనం రాస్తారా? అందులోనూ కవిత్వం అలా పొంగుంటుంది. పేజీల నిండా.. అడ్డగీతలూ, నిలువు గీతలూ.. చుక్కలు, వావ్ లూ, స్మైలీలు, నోట్స్.. పుస్తకం ఎవ్వరికైనా అరువివ్వాలంటే.. అమ్మో!

    The Illustrated History of Indian Cricket (Hardcover) by Boria Majumdar – టైం పాస్ కి చదవచ్చు.. అంతే!

    బాల పత్రిక కలెక్టర్ ఎడిషన్ తెప్పించుకున్నాం.. నేనూ, సౌమ్య! సందడంటే సందడీ!

    కాఫ్కా ఉత్తరాలు మళ్ళీ చదువుకున్నా.. హమ్మ్.. మళ్ళీ నచ్చేశాడు కాఫ్కా! http://pustakam.net/?p=1312

    Software Related:

    Facts and Fallacies of Software Engineering.. One heck of a book! MUST READ if you wanna know some myths about SE. Glass is wow!

    The Design of Design (Paperback) by Frederick P. Brooks – Read this book, with half heart and mind elsewhere.. but still made a good read. I’ve decided to revisit with undivided attention to it.

    Close to the Machine: Technophilia and Its Discontents: Kinda autobio of a Software Engineer. Lady is too good at writing and she writes stuff to my liking, but I get so greedy that I can’t stand her deviating from topics I like. But it’s her life.. her book.. whom am I to complain? 🙂

  30. Murali Mohan Mallareddy

    ప్రస్తుతం సత్యజిత్ రే గారి బెంగాలీ కథల ఆంగ్లానువాదం చదువుతున్నాను. పుస్తకం పేరు ‘Stranger’ and other stories’.టైటిల్ కథనే ‘రే’, ‘ఆగంతుక్’ అనే సినిమా గా చిత్రీకరించారు. కొన్ని కథలు సాధారణంగానే ఉన్నా కొన్ని మాత్రం చిరస్మరణీయంగా ఉన్నాయి. సబ్జెక్ట్ పరంగా ఏ కథ కి ఆ కథే చాలా వైవిధ్యభరితంగా ఉంది. పాపులర్ సైన్స్ పై ‘రే’ కి గల మక్కువ చాలా కథల్లో ద్యోతకమవుతుంది. ‘రే’ ఊహాశక్తి కి ఈ కథలు మచ్చు తునకలు.
    ‘సందేశ్’ అనే బెంగాలీ బాలల పత్రిక కోసం ఆయన రాసిన ‘The Emperor’s ring’, ‘The Unicorn expedition’ వంటి చిన్న పిల్లల నవలలు పెద్దలకు కూడా ఎంతో పఠనాసక్తిని కలిగిస్తాయి.

  31. murali mohan mallareddy

    ఈ మధ్యనే ‘The Penguin book of Indian Ghost stories’ చదివాను. రస్కిన్ బాండ్ సంకలన కర్త. చాలా మటుకు కథలు బ్రిటిష్ రాజ్ కాలానికి చెందినవి. Some of the stories really haunt you…not only because of their genre but for the dexterity of the master story tellers.

  32. సౌమ్య

    ‘The boy who harnessed the wind’ చదివాను. చాలా స్పూర్తిదాయాకమైన కథ.
    ఆన్లైన్ కొనుగోలు లంకె ఇక్కడ.

    Jayaprakash Narayan ఎమర్జెన్సీ కాలం నాటి జైలు జీవితంలో రాసిన Prison diary మొదలుపెట్టాను. బహుశా ఇది ఇప్పుడు దొరకదేమో. రచనా శైలి అంత ఆకట్టుకునే లా లేదు కానీ, జేపీ ఆలోచనల గురించి తెలుసుకోవడానికి ఈ పుస్తకం ఉపకరిస్తుంది.

  33. venkat

    Bharishter parvatheesam

  34. venkat

    Barshter parvatheesam chadivanu…
    chala bagundi…
    modati bhagamu antha hasya tho nindi untundi..tharuvatha rendu bhagalu konchem appati kala mana paristitulu kuda kalipi unnayi..
    modati bhagamantha hasyamu ga migatha rendu bhagalu lekapoina naku pustakanni vadalabuddi kaledu..
    moththam mudu bhagalu kalipi Vishalandhra varu oka book ga ichcharu

  35. లలిత (తెలుగు4కిడ్స్)

    కందుకూరి వీరేశలింగం గారి స్వీయచరిత్ర.
    ఈయన రాసిన భాష ఇప్పటికి అలవాటు తప్పిన తెలుగే ఐనా, మరీ కష్టంగా లేదు.
    నాకైతే అది ఆయన రాసిన విధానం వల్లనే అనిపిస్తోంది.
    చదవడానికి ఆసక్తి కరంగా ఉంది.
    చదువుతుంటే ప్రవాహంలా సాగిపోతూ ఉంది.
    మొత్తానికి చదవగలుగుతున్నందుకు సంతోషంగా ఉంది.
    (teluguthesis.com లో దొరికింది.)
    ఈయన ఎక్కువ విశ్లేషణ, ఏ మాత్రం ఆవేశం, లేకుండా, సమాజ పరిస్థితులను చెప్పి వాటిని తను ఎదుర్కున్న విధానం గురించి చెప్పుకుంటూ వెళ్ళారు.
    మంచి పని చెయ్యడానికి మంచి స్ఫూర్తినివ్వగలదు ఈ పుస్తకం.