అంపశయ్య మీద ఉన్న బాలసాహిత్యాన్ని రక్షించుకుందామా?

అంపశయ్య మీద ఉన్న బాలసాహిత్యాన్ని రక్షించుకుందామా?

మీకు భుజాన భేతాళుడిని చురకత్తిలాంటి చూపులతో మెలితిరిగిన కోరమీసంతో గంభీరంగా స్మశానంలోనుండి నడిచివెళ్తున్న విక్రమార్కుడు గుర్తున్నాడా?

మీకు ఒంటికన్ను రాక్షసుడు, అతనితో సాహసోపేతంగా యుద్ధం చేసి రాజకుమారిని ఆమె రాజ్యానికి తీసుకుని వస్తున్న సాహస వీరుడు గుర్తున్నాడా?

పోనీ మీకు మెలితిరిగిన తోకతో చూడగానే భయపెట్టేలా కాక ముద్దుగ అనిపిస్తూ, చెడ్డ అత్తగారి భరతం పట్టి మంచి కోడలికి సహాయం చేసిన అందమైన దెయ్యాలు గుర్తున్నాయా?

ఇప్పటి తరానికి ఆ లోటు ని పూడ్చటానికీ, ఆనాటి రుచులని అందించటానికి మొక్కవోని దీక్షతో నడుము కట్టారు రచన పత్రిక యాజమాన్యులైన శాయి గారు. ఈ బృహత్కార్యంలో భాగం గా దాసరి సుబ్రమణ్యంగారు ఒకప్పుడు యువ, బొమ్మరిల్లు, ప్రమోద వంటి బాలల మాసపత్రికలకోసం రచించిన “అగ్ని మాల”, “మృత్యులోయ” సీరియల్స్ ను సంపుటిగా పోయిన యేడాది మన ముందుకు తెచ్చారు. ఈ సారి “కపాల దుర్గం” తో పాటు మరొక ఇరవై సీరియల్స్ ను మన ముందుకు తెచ్చే మెగా ప్రాజెక్టు కు సిద్ధ పడ్డారు. ఈ బృహత్కార్యం లో ఆయనకు తెలుగు భాష మీద బాల సాహిత్యం మీద మక్కువ ఉన్న అభిమానుల అండదండల అవసరం చాలా ఉంది. మనం చేసే ఏ చిన్న సహాయమైనా చాలా విలువైనదే.

ఆసక్తి ఉన్నవారు వాహిని బుక్ ట్రస్ట్ (vahini book trust)పేరిట చెక్ పంపించగలరు.

Vahini book trust, payable at hyderabad
address: 1-9-286/3, vidya nagar, hyderabad-500044

You Might Also Like

Leave a Reply