ఈ నెల ఫోకస్: 2009లో పుస్తకాలతో మీరు

ఓ ఏడాది వెళ్లిపోయి మరో ఏడాదిని స్వాగతిస్తున్న తరుణంలో వద్దనకున్నా వెనక్కి తిరిగి చూసుకుంటాం. ఏం చేశాం? ఎలా చేసుకొచ్చాం? ఎందుకు చెయ్యలేకపోయాం? లాంటివన్నీ నెమరువేసుకోటానికి ఇదే మంచి సమయం. మరింకేం?! గత ఏడాది మీ పుస్తక పఠనానుభవాలని పుస్తకం.నెట్ వేదికగా అందరితో పంచుకోండి.

పన్నెండు నెలల్లో చదివినవన్నీ ఇప్పటికిప్పుడు రాయాలంటే?! అవును, కాస్త కష్టమే.. అందుకే ఈ కింది విధాలుగా ఆలోచించండి.

  • ఏడాది పాటు మీరు చదివినవి – నచ్చని వాటితో సహా – ఓ చిట్టా చేసి, ప్రతీ పుస్తకాన్ని గురించి ఓ రెండు మూడు వాక్యాల్లో మీ అనుభవం రాయండి.
  • ఏడాదిలో మీకు నచ్చిన పుస్తకాల “టాప్- టెన్” లిస్ట్ తయారు చేసి పంపిండి.
  • ఈ ఏడాది మిమల్ని అత్యధికంగా ప్రభావితం చేసిన పుస్తకాలూ లేదా రచయితల మీద వ్యాసాలు పంపండి.
  • ప్రతీ ఏడాదిలా కాక,  పుస్తకపఠనంలో ఈ సారి మీరేమన్నా కొత్తగా ప్రయత్నించారా? ఉదా: ఎప్పుడూ తెలుగు నవలలు, కథలూ చదివే మీరు, ఈ సారి కొత్తగా కావ్యాలవీ చదవటం. లేదా, ఏదైనా సబ్జెక్ట్ కి (సైకాలజీ, మాథ్స్) సంబంధించిన పుస్తకాలు ప్రయత్నించటం లాంటివి.

(చదవటం అస్సలు కుదరలేదా? అయితే పుస్తకాలను మీరెంతగా మిస్స్ అయ్యారో విరహపూరిత కవిత్వం ప్రయత్నించకూడదూ?!. 😛 )

పై విభాగాలనే కాదు, మీ పుస్తకాలకి ఏ తీరు సరిపోతుందో మీకు నచ్చిన విధానంలో రాయచ్చు.

మీ పఠనానుభవాలు మరికొందర్ని ఉత్తేజితులని చేయడానికి, తెలీని పుస్తకాల గురించి తెల్సుకునే వీలు కల్సిస్తుందని గమనించి (అందుకు అనుగుణంగా, పుస్తక వివరాలూ, లింకు అవీ ఉండేట్టు చూడండి), కాస్త శ్రమకోర్చి 2009లో మీ పుస్తకాల విశేషాలు పంచుకోండి.

గమనిక: ఫోకస్ కు సంబంధించని వ్యాసాలను కూడా పుస్తకం.నెట్ లో ఈ నెల యధావిధిగా ప్రచురిస్తాం.

You Might Also Like

One Comment

  1. జాన్ హైడ్ కనుమూరి

    bale baaguMdE!!

Leave a Reply