వీక్షణం-3

తెలుగు అంతర్జాలం:

“గత సంవత్సరాంతంలో విడుదలైన చలం సమగ్ర సాహిత్యపు 20 సంపుటాలు బొమ్మయితే, ఈ సంగ్రహం దాని బొరుసు.” అంటూ సి.ధర్మారావు గారు “చలం సాహిత్య సంగ్రహం” గురించి చెప్పిన వ్యాసమూ; సామాన్య కథా సంపుటి ‘కొత్తగూడెం పోరగాడికి లవ్‌లెటర్’ కు ముందుమాటగా కె.కె.రంగనాథాచార్యులు రాసిన వ్యాసం నుండి కొన్ని భాగాలూ;మల్లికార్జున పండితారాధ్యుడి గురించి రామినేని భాస్కరేంద్రరావు వ్యాసమూ ఈవారం ఆంధ్రజ్యోతి వివిధలో వచ్చిన సాహిత్య వ్యాసాలు. మధ్యయుగాల ఆంధ్రదేశ చరిత్ర మొదలుకుని మరికొన్ని పుస్తకాల గురించిన పరిచయాలు ఈవారం ఆదివారం అనుబంధంలో ఇక్కడ చదవవచ్చు.

“స్త్రీవాదమే అనువాదమైనప్పుడు” – దేవరాజు మహారాజు వ్యాసం; “ప్రపంచ సాహిత్యంలో జీవకారుణ్యం సజీవం” అంటూ స్వరోచి చెప్పిన విశేషాలను అంధ్రభూమిలో చదవవచ్చు.

గోపరాజు గారి మాటల్లో అల్లం శేషగిరిరావు కథ “వఱడు” గురించిన పరిచయమూ; ఆశారాజు కవితల గురించి మల్లెల నరసింహమూర్తి వ్యాసమూ; హిమజ్వాల నవలలోని గీత పాత్రను విశ్లేషిస్తూ అడ్లూరి రఘురామరాజు వ్యాసమూ; ఇటీవల విడుదలైన “తెలుగు జాతీయాలు” అన్న పుస్తక పరిచయమూ – ఈ వారం సాక్షి పత్రికలో వచ్చాయి. జాక్ లండన్ గురించి, ఆయన రచనల గురించి ఆకెళ్ళ రాఘవేంద్ర వ్యాసం; కె.వి.రెడ్డిపై వచ్చిన కొత్త పుస్తకం గురించి, ఇతర కొత్త పుస్తాకల గురించీ వచ్చిన చిన్న పరిచయాలూ – సాక్షి ఆదివారం సంచికలో ఇక్కడ చూడవచ్చు.

శేషేంద్ర కవితా దృక్పథం గురించి డా. వెనిగళ్ళ రాంబాబు వ్యాసమూ, కవులూ రచయితల మధ్య ఉండే అసూయా-ద్వేషాల కథలతో ఆర్.జగదీశ్వరరావు వ్యాసమూ – సూర్య పత్రికలో చూడవచ్చు.

తెలుగు పద్యాల అందాలని వివరిస్తూ పరిచయం చేసే పాపినేని శివశంకర్ గారి “తల్లీ! నిన్ను దలంచి” పుస్తకం గురించి తృష్ణ గారి బ్లాగులో ఇక్కడ చదవండి.

తమసైటులో గల కొన్ని కథల సంకలనాలను పరిచయం చేస్తూ కినిగె.కాం వారి బ్లాగులో ఎన్నారై కథల పేరిట వచ్చిన వ్యాసం ఇదిగో.

“యువభారతి” సంస్థ గతవారం స్వర్ణోత్సవాలని జరుపుకుంది. ఈ సందర్భంగా సంస్థ ప్రధాన సంపాదకులు సుధామ గారు ఆంధ్రభూమి సం.సా.రా.లు కాలం లో రాసిన వ్యాసం ఇదిగో. బొల్లిముంత వెంకటరమణరావు ‘విభిన్న భూమికలు’, కన్నెగంటి అనసూయ ‘జీవన శిల్పం’ గురించీ సుధామ గారి అభిప్రాయాలు ఇవిగో.

వసంతం వెబ్సైటులో మూఢ-విశ్వాసాలూ సైన్సు సమాధానాలూ పేరిట వచ్చిన పుస్తక పరిచయం ఇక్కడ చదవండి. “మధ్యయుగ ఆంధ్రదేశం” గురించి వివిధ పత్రికల్లో వచ్చిన సమీక్షలని కూడా ఇక్కడ పొందుపరిచారు.

ఆంగ్ల అంతర్జాలం:

సాంకేతికంగా బలమైన అమేజాన్, ఆపిల్ వంటి కంపెనీలతో పోటీ పడుతూ సంప్రదాయ ప్రచురణ సంస్థలు నిలబడగలుతాయా? అన్న ప్రశ్న కొన్నాళ్ళుగా వివిధ రూపాల్లో కనిపిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో, రెండు పెద్ద ప్రచురణసంస్థలు Random House, Penguin లు ఒకటవబోతున్నాయంటూ వచ్చిన ఈ వార్త ఆసక్తికరం.

Kurt Vonnegut లేఖల గురించి చెబుతూనే, ఆయన గురించిన ఇతరత్రా సంగతులు కూడా చెప్పిన Kurt Andersen వ్యాసం ఇదిగో.

భయానకరసంలో రచనలు చేయడం గురించి టిప్స్ చెబుతూ సుసాన్ జె.మారిస్ వ్యాసం “Frightening Writing: Tips for Scaring off Pants” ఇక్కడ.

హాస్యాన్ని అనువదించడంలో ఉన్న సాధకబాధకాల గురించి వివరిస్తూ Jascha Hoffman న్యూయార్క్ టైంస్ పత్రికలో రాసిన వ్యాసం ఇదిగో.

చైనా రచయిత మో యాన్ నోబెల్ బహుమతి పొందాక, ఆయన స్వగ్రామం Mo Yan culture experience zone పేరిట 70 మిలియన్ పౌండ్లు ఖర్చు పెట్టి మార్చేయబోతున్నారట. దీని గురించిన టెలిగ్రాఫ్ పత్రిక వార్తా కథనం ఇదిగో.

1961లో అమెరికాలో ప్రచురితమైన వెబ్స్టర్స్ డిక్షనరీ అప్పటికాలంలో ఎన్నో విమర్శలకి గురైందట. ఆ వివరాలను చెబుతూ వచ్చిన “THE STORY OF AIN’T -America, Its Language, and the Most Controversial Dictionary Ever Published” అన్న పుస్తకం గురించి న్యూయార్క్ టైంస్ సమీక్ష ఇదిగో.

మొదటి Designers & Books Fair సందర్భంగా దాని వెనుకున్న Steven Kroeter తో న్యూయార్క్ టైంస్ ప్రతినిధి ఇంటర్వ్యూ ఇక్కడ.

“In January 2011 journalist Anna MM Vetticad undertook a mission that most reviewers would baulk at: to watch, and blog reviews of, every Hindi movie released in the NCR that year, even the almost unheard-of ones showing in nondescript halls.”
-ఈ ఆలోచన కలిగాక ఏమైందో తెలుసుకోవాలంటే, ఆ అనుభవాలతో వచ్చిన పుస్తకాన్ని గురించిన జైఅర్జున్ సింగ్ బ్లాగు టపా చదవండి.

పిల్లలకి చరిత్రను పరిచయం చేసే ఉద్దేశ్యంతో Subhadra Sen Gupta రాసిన : Lets go time traveling: life in India through the ages పుస్తకం గురించి హిందూ పత్రిక వ్యాసం ఇక్కడ.


మరణాలు:

ప్రఖ్యాతిగాంచిన బెంగాలీ రచయిత సునీల్ గంగోపాధ్యాయ ఇటీవలే మరణించారు. వారి స్మృత్యర్థం అనేక సంతాపసందేశాలు వెలువడ్డాయి. ఔట్-లుక్ లో ఇలా గుర్తుచేసుకున్నారు. ది హిందులో వచ్చిన కథనం – ఇక్కడ. Times of India కథనం. జనవరిలో జరగబోయే కోల్కత బుక్ ఫెయిర్ ను ఆయనకి అంకితం ఇస్తున్నట్లు నిర్వహకులు ప్రకటించారు.

ప్రముఖ లలిత సంగీత కళాకారులూ, గేయ రచయితా అయిన పాలగుమ్మి విశ్వనాథం గారు అక్టోబర్ 25, గురువారం నాడు కన్నుమూశారు. ఆయన గురించి పుస్తకం.నెట్లో వచ్చిన వ్యాసం ఇక్కడ, ఆయన పాటలు, పుస్తకాలు ఇత్యాది వివరాలన్నీ కల వెబ్సైటు ఇక్కడ.

ప్రముఖ చరిత్రకారులు Jacques Barzun కూడా తమ 104వ ఏట గురువారం నాడు కన్నుమూశారు. ఆయన గురీంచి న్యూయార్క్ టైంస్ పత్రికలో పరిచయంతో కూడిన నివాళి వ్యాసం ఇక్కడ.

మరి కొన్ని పుస్తకాల గురించిన సమీక్షలు, పరిచయాలు వగైరా:
* War and War – László Krasznahorkai హంగేరియన్ నవలకు ఆంగ్లానువాదం గురించి ఒక బ్లాగులో వచ్చిన వ్యాసం ఇక్కడ.
* Lightning Rods – Helen Dewitt నవల గురించిన ఒక బ్లాగు వ్యాసం ఇక్కడ.
* Adkatha – The story of Indian Advertising పుస్తకం గురించి హిందూపత్రికలో వినయ్ కామత్ వ్యాసం ఇదిగో.
* ప్రముఖ చిత్రకారుడు దేవీప్రసాద్ గురించి రాసిన “The Making of a Modern Indian artist-craftsman: Devi Prasad” పుస్తకం పై ఒక పరిచయం హిందూ పత్రికలో ఇక్కడ.
* శాస్త్రవేత్త నికోలా టెస్లా రాసిన వ్యాసాల సంకలనం My Inventions and Other Writings గురించి పి.డి.స్మిత్ రివ్యూ ఇక్కడ.
* జూలియన్ బార్నెస్ వ్యాసాల సంకలనం Through the Window గురించిన ఒక వ్యాసం ఇక్కడ.
* “a witty and graceful study of food technology” అంటూ Consider the Fork: A History of Invention in the Kitchen అన్న Bee Wilson పుస్తకం గురించి వచ్చిన ఒక వ్యాసం ఇదిగో.
* రెండు పిల్లల పుస్తకాలు Brave Squish Rabbit, Black Dog లను పరిచయం చేస్తూ న్యూయార్క్ టైంస్ పత్రికలో వచ్చిన వ్యాసం ఇదిగో.
* శ్రీలంకలోని అంతర్-యుద్ధం గురించిన నిజజీవిత కథనాలతో Harrison Frances రాసిన “Still Counting the Dead: Survivors of Srilanka’s hidden war” అన్న పుస్తకం గురించిన పరిచయం ఇక్కడ చదవండి.
* “Everest 1953: The Epic Story of the First Ascent” పుస్తకం గురించిన పరిచయం ఇక్కడ.

You Might Also Like

One Comment

  1. తృష్ణ

    నా టపా లింక్ ఇచ్చినందుకు ధన్యవాదాలు.

Leave a Reply