2010 బ్రౌన్ పురస్కారం, ఇస్మాయిల్ అవార్డు – ప్రకటన

(వివరాలు తెలిపిన వారు: తమ్మినేని యదుకుల భూషణ్)

దీవి సుబ్బారావు గారికి బ్రౌన్ పురస్కారం

మౌనంగా తన పని తాను చేసుకు పోవడం పండిత లక్షణం. దీవి సుబ్బారావు గారు ఆ కోవకు చెందుతారు. కన్నడ వచనాలను తెలుగు చేసినందుకు గాను ఈ ఏడాది బ్రౌన్ పండిత
పురస్కారాన్ని వీరికి ప్రకటిస్తున్నాము. వీరు పారశీక కవిత్వాన్ని కూడా అనువాదం చేశారు సాంగ్ అఫ్ సాంగ్స్ ను కూడా సమర్థంగా తెనిగించారు. అనువాదాలతో పాటు లోగడ వీరి
కథలు ,కవిత్వాలు పత్రికల్లో వచ్చాయి.పుస్తకాలూ దొరుకుతున్నాయి. తెలుగు అకాడెమీ సంచాలకులుగా ఎన్నో ఉపయోగ కరమైన పనులు చేసారు. ప్రస్తుత నివాసం హైదరాబాద్.
వీరి అనువాద పుస్తక సమీక్ష ఈమాటలో ఇక్కడ చదవవచ్చు.

గండేపల్లి శ్రీనివాసరావు కు ఇస్మాయిల్ అవార్డు

రాసిన పది కవితలతో తనదైన శైలిని ఏర్పరచుకోవడం, పాఠకుల మీద బలమైన ముద్ర వేయగలగడం అంత సులభం కాదు. కవి అన్నవాడు తన జీవిత కాలంలో నిర్దుష్టంగా ఒక కవిత రాసి ఉండాలి-అనగా అయోమయానికి తావు లేకుండా, గందరగోళానికి లోను కాకుండా స్ఫుటంగా, బలంగా తనదైన భావనా శక్తితో ఒక వర్ణమయ ప్రపంచాన్ని కల్పించగలిగి ఉండాలి. లేదా పాఠకులకు మిగిలేది గాడిద మోతే. దీర్ఘ కవితలతో, తీవ్ర వాదులతో విసిగి పోయి ఉన్న పాఠక ప్రపంచాన్ని ఇతని కవిత్వం కమ్మ తెమ్మెరలా లలితంగా తాకుతుంది అనడంలో సందేహం లేదు.కావున, వికృతి నామ సంవత్సరానికి గాను ఇస్మాయిల్ అవార్డు కు గండేపల్లి శ్రీనివాస రావును ఎంపిక చేశాము. ఇతని కవితలు మచ్చుకు కొన్ని ఈమాటలో ఇక్కడ చదవవచ్చు.

You Might Also Like

4 Comments

  1. 2011 బ్రౌన్ పురస్కారం, ఇస్మాయిల్ అవార్డు | పుస్తకం

    […] గురించి పుస్తకం.నెట్లో వచ్చిన వార్త ఇక్కడ […]

  2. తమ్మినేని యదుకుల భూషణ్

    నవంబర్ 10, 1798 బ్రౌన్ పుట్టిన రోజు , కాబట్టి ప్రతి సంవత్సరం ఆయన పేరున అనువాదం / నిఘంటు నిర్మాణం / పరిశోధనా రంగాల్లో కృషి చేసిన పండితుణ్ణి గుర్తించి గౌరవించడం సంప్రదాయం.

    నవంబర్ 24, 2003 ఇస్మాయిల్ పరమపదించిన దినం. ఆయన స్మృతిని గౌరవిస్తూ , ఒక యువ కవికి ఆయన పేరు మీద అవార్డు ప్రదానం చేయడం ఆనవాయితీ .

    సూర్యుడు అస్తమించినా మనం అనుభవించిన వెలుతురూ వెచ్చదనం మదిని వీడవు.చంద్రుడు మాయమయినా ఆహ్లాదం కలిగించే వెన్నెల మనసులో గూడు కట్టుకొనే ఉంటుంది.ఏడాది కొక సారి సూర్యునికి ఒక నమస్కారం ,చంద్రునికో నూలు పోగు ఈ సన్మానం/పురస్కారం.

  3. గరికపాటి పవన్ కుమార్

    కొంత కథ ఇక్కడ:

    ఇస్మాయిల్ అవార్డు

    http://te.wikipedia.org/wiki/%E0%B0%87%E0%B0%B8%E0%B1%8D%E0%B0%AE%E0%B0%BE%E0%B0%AF%E0%B0%BF%E0%B0%B2%E0%B1%8D_%E0%B0%85%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A1%E0%B1%81

    బ్రౌన్ పురస్కారం

    http://te.wikipedia.org/wiki/%E0%B0%B8%E0%B0%BF_%E0%B0%AA%E0%B0%BF_%E0%B0%AC%E0%B1%8D%E0%B0%B0%E0%B1%8C%E0%B0%A8%E0%B1%8D_%E0%B0%AA%E0%B1%81%E0%B0%B0%E0%B0%B8%E0%B1%8D%E0%B0%95%E0%B0%BE%E0%B0%B0%E0%B0%82

    దీవి సుబ్బారావు గారికి, గండేపల్లి శ్రీనివాస రావుకు హృదయపూర్వక అభినందనలు.

    గరికపాటి పవన్ కుమార్

  4. సౌమ్య

    ఈ అవార్డుల కథా కమామిషూ ఏమిటి?

Leave a Reply