ఒక కన్నడ పుస్తకాల ఆవిష్కరణ సభ -ఆహ్వానం, కథాకమామిషూ

కన్నడ పుస్తక ప్రపంచంలో విశిష్టమైన ఉదంతంగా వర్ణిస్తున్న – సంధ్యా పాయ్ గారి పదిహేను పుస్తకాల ఆవిష్కరణ తాలూకా ఆహ్వాన పత్రం ఈ టపాతో జతచేస్తున్నాము. ఆహ్వానం అంతా కన్నడలో ఉంది…. కనుక, అసలు విషయం ఏమిటంటే –

’స్నేహా బుక్ హౌస్’, బెంగళూరు వారు ప్రచురించిన 15 పుస్తకాల ఆవిష్కరణ సభ రవీంద్ర కళాక్షేత్ర లో రాబోయే శుక్రవారం (సెప్టెంబర్ మూడు, 2010) న సాయంత్రం ఆరు నుండి ఎనిమిది గంటల మధ్య జరగనుంది. ఈ పుస్తకాలను రాసినది సంధ్యా పాయ్ (ప్రముఖ కన్నడ వారపత్రిక ’తరంగ’ నిర్వాహకురాలు, మణిపాల్ గ్రూపు యజమానురాలు) . కర్ణాటక రాష్ట్ర హోం మంత్రి – డాక్టర్ వి.ఎస్.ఆచార్య సభకు అధ్యక్షత వహిస్తారు.

ఇక – ఈ ఇన్విటేషన్ ఇక్కడ వేయడం వెనుక కథ:

ఒక వర్షాకాలపు సాయంత్రం బెంగళూరులోని శ్రీనగర్ ఫిఫ్టీ ఫీట్ రోడ్డుపై వెళుతూంటే, ’స్నేహా బుక్ హౌజ్’ అన్న బోర్డు కనబడ్డది. ’ఏదో ఒక బుక్షాపు లే… సప్నా బుక్ హౌసు లా ఇది స్నేహా బుక్ హౌసు కాబోలు’ అనుకుని ముందుకు కదిలా (సప్నా బుక్ హౌసు బెంగళూరులో ఒక గొలుసు). ఎందుకో గానీ, మళ్ళీ తరువాతి రోజు, అలాగే వర్షంలో నడుచుకుంటూ వెళ్ళి మరీ ’స్నేహ బుక్ హౌస్’ కి వెళ్ళాలనిపించింది. షాపు ఎంట్రన్సులో ఒక నిముషం నిలబడి చూస్తే, అన్నీ కన్నడ పుస్తకాలు, వాటి తాలూకా అడ్వర్టైజ్మెంట్లూ – కనిపించాయి అద్దాల వెనుక. సరే, చూద్దాంలే అని లోపలికెళ్ళాను. ఐదు నిముషాల్లో ఆశ్చర్యం, ఆనందం కలిగాయి. కారణం –
* షాపులో ఒక తొంభై ఐదు శాతం పుస్తకాలు కన్నడ పుస్తకాలే.
*వర్గాల వారీగా అన్నీ పొందిగ్గా అమర్చారు. కొన్ని పుస్తకాలు – కువెంపు, మాస్తి వెంకటేశ అయ్యంగార్ ఇలా రచయితలను బట్టి అమర్చారు కూడానూ.
* చూడబోతే – యూత్ వింగ్ షాపులా ఉంది…అదే, ఇరవై-ముప్పైలలో ఉన్న వాళ్ళే కనబడ్డారు.
* లోపలికి రాగానే – వీరికి గల భాషాభిమానం, సాహిత్యాభిమానం బాగా తెలుస్తోంది.
* ఇలాంటి ఏరియాలో (అది కమర్షియల్ ఏరియా కాదు. ఇప్పుడు ఉన్న షాపింగ్ కల్చర్లో, ఎక్కడో మామూలు ఏరియాలో ఉన్న ఈ షాపుకి ఎవరన్నా వస్తారో రారో మనకు తెలీదు. అయినా, పెద్ద పెద్ద బ్రాండులు కాకున్నా కూడా – కన్నడ పుస్తకాలను మెజారిటీగా పెట్టే షాపు కనబడ్డం నాకు ఆశ్చర్యం కలిగించింది. (మన విశాలాంధ్ర అంతటి ఎస్టాబ్లిష్డ్ షాపులోనే బోలెడు ఆంగ్ల పుస్తకాలు ఉంటాయి కదా. సిటీల్లో అలా కన్నడం మాత్రమే అన్న మోటో తో ఉంటే ఎలా బ్రతుకుతారో! అన్న సందేహం కలిగింది.)
-అదిగో ఆ సందేహం తోటే మళ్ళీ మూడోసారి ఆ షాపుకి కన్నడం బాగా తెలిసిన నా కజిన్ సింధు తో కలిసి వెళ్ళాను. ఈసారి షాపు ప్రొప్రయిటర్ పరశివప్ప గారు అక్కడే ఉన్నారు. ఆయనతో కాసేపు ముచ్చటించాము (ఆ సంగతులు త్వరలో!!). అప్పుడు ఈ ఇన్విటేషన్ ఇచ్చారు.

కన్నడ,తెలుగు తెలిసిన పుస్తకం.నెట్ చదువరులు, బెంగళూరు వాసులెవరన్నా ఉంటే, తప్పక ఈ ప్రోగ్రాంకి వెళ్ళి, విశేషాలు రాయండి!

You Might Also Like

4 Comments

  1. పుస్తకం » Blog Archive » స్నేహ బుక్ హౌస్ – బెంగళూరు వారితో

    […] తో మా సంభాషణ.  (ఈ సంభాషణ వెనుక కథ ఇక్కడ […]

  2. sUryuDU

    @సౌమ్య:

    Thanks for the info, must be a new one, I don’t remember seeing this shop.

    ~sUryuDu

  3. సౌమ్య

    @sUryUDu:
    Its in Srinagar 50ft road. After crossing Nagendra Block bus stop, walk around 300 meters or so – and you can find the shop to your right.

  4. sUryuDU

    I don’t remember seeing this shop on 50′ road, is it near Nirmala bust stop?

    If you are interested in Kannada literature, you may want to visit Ankitha book store in Gandhi Bazar.

    ~sUryuDu

Leave a Reply