పుస్తకం.నెట్ పదకొండవ వార్షికోత్సవం!
పుస్తకం.నెట్ 2009వ సంవత్సరంలో మొదలైంది. అప్పటినుండి నిరాటంకంగా కొనసాగి, నేటికి 11 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ ప్రయాణంలో కలిసి నడిచిన, నడిపించిన వారందరికి మా హృదయపూర్వక ధన్యవాదాలు!
కేవలం పుస్తకాలపై ప్రేమకే పరిమితమై, పాఠకులకు పెద్ద పీట వేసిన ఒక వెబ్‍సైటు తెలుగులో ఇన్నేళ్ళు నడవడం, ఇంత విజయవంతంగా కొనసాగడం, అటు పుస్తకపఠన తగ్గిపోతుందన్న చింతకీ, ఇటు తెలుగులో చదవడం-రాయడం అలవాటు తప్పిపోతుందన్న బెంగకీ కొంత ఊరట కలిగించి, కొత్త ఆశలు పుట్టేలా చేస్తుంది. ఇలా పుస్తకాలు చదువుతూ, చదివిన వాటిని గురించి తెలుగులో పంచుకుంటూ ఉన్న మీ అందరికి మరోసారి నమస్కారం.
పుస్తకం.నెట్ ప్రయాణం కొన్ని అంకెల్లో:
వ్యాసాలు: 2126
కామెంట్లు: 9822
హిట్లు: 1,902,370
వివిధ భాషలు: 30+
వ్యాసకర్తలు: దాదాపుగా 400
ఎప్పటిలానే ఈ ఏడాది కూడా మీ పుస్తక వ్యాసాలను మాకు పంపిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ముఖ్యంగా 2019లో చదివిన పుస్తకాల గురించి వీలైనంత త్వరగా పంపండి.
చదవండి. చదివిన విశేషాలు పంచుకోండి.
మీ అందరికి 2020కి గాను, నూతన సంవత్సర శుభాకాంక్షలు!
T Venkateshwarlu
పదకొండు సంవత్సరాలుగా, వేలాది మంది పాఠకులకు పుస్తకాలను పరిచయం చేస్తున్న మీకు అభినందనలు
ఎ.కె.ప్రభాకర్
Congratulations and keep going.
ఏల్చూరి మురళీధరరావు
ఏ విధమైన భేరీభాంకారాలు లేకుండా ఇన్నేళ్లపాటు సాహితీ తీర్థయాత్రను కొనసాగిస్తూ మేలిరచనలను ప్రోత్సహిస్తూ పాఠక జనాదరణకు నోచుకొన్న సంపాదికలకు ఈ వార్షికోత్సవ వేళ సర్వ శుభాకాంక్షలు!
cbrao
ఇన్నాళ్ళు, విజయవంతంగా నడిపినందుకు అభినందనలు.