పుస్తకావిష్కరణ – ఆహ్వానం
సాహిత్యాభిమానులకు అభివందనాలు. ‘లేఖిని’ మహిళా చైతన్య సాహితీ సాంస్కృతిక సంస్థ – తరఫున అందరికీ ఇదే మా ఆహ్వానము. ప్రముఖ రచయిత్రి శ్రీమతి శారద అశోకవర్ధన్ సాహితీలోకానికి సుపరిచితమైన పేరు.వీరు ఎన్నో నాటకాలు, నాటికలు, సంగీత రూపకాలు, పాటలు రాశారు. వీరి నవలలు, కథలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. ”సంచలన రచయిత్రి”గా సత్కారాన్నీ, ఖ్యాతినీ పొందారు. వీరు రాసిన “కుంతీపుత్రిక” చాల ప్రసిద్ధిగాంచిన నవల.
వీరి కలం నుండి జాలువారిన మరో సాహితీ గుళిక “నా సిరి చుక్క సికింద్రాబాద్(నివాసి కధనం) ఆవిష్కరణ సభ.
ఈ నెల 23వ తేదిన శనివారం శ్రీ త్యాగరాయగాన సభ కళాసుబ్బారావు కళా వేదికలో సాయంత్రం 6 గంటలకు జరుపబడుతుంది.
అందరు తప్పక విచ్చేయవలసినదిగా గా కోరుతున్నాము.
తేదీ: 23.04.2016 శనివారం
సమయం: 6.00 PM
వేదిక: కళా సుబ్బారావు వేదిక, శ్రీ త్యాగరాయ గానసభ,
చిక్కడపల్లి, హైదరాబాద్.
(వివరాలు పంపిన వారు: మణి వడ్లమాని)
P.RAMAKRISHNA REDDY
శారద గారికి అభినందనలు. మీరు ఇలాంటి సంకలనాలు అనేకం వ్రాయాలని కోరుకుంటూ…
పి. రామకృష్ణారెడ్డి,
తెలుగు పండిట్,
నంది అకాడమి,
నంద్యాల.