బ్రౌన్ పురస్కారం – 2015

ఖరగపూర్ లో జననం (1946), తెలుగు లో ప్రాథమిక విద్యాభ్యాసం , సాగర్ యూనివర్సిటి , ఖరగ పూర్ ఐఐటిలలో గణితంలో ఉన్నత విద్య . బహుకాలం రైల్వేలో ఉద్యోగం ,  HP కంపెనీలో మేనేజర్ గా పదవీ విరమణ .

ముకుంద రామారావు గారు ‘వలస పోయిన మందహాసం’ మొదలు అనేక కవితా సంకలనాలు వెలువరించారు. వీరి కవిత్వానికి  పలుభాషల్లో అనువాదాలు వచ్చాయి  కేవలం కవిత్వానికే పరిమితం కాకుండా వచనంలో కూడా కృషి చేశారు . ముఖ్యంగా గత దశాబ్ద  కాలంగా వీరు  బృహత్తర ప్రణాళిక తో  దేశ దేశాల కవిత్వాన్ని తమదైన శైలిలో అనువాదం చేసి -అదే ఆకాశం ,సూఫీ కవిత్వం  నోబెల్ కవిత్వం, అదే గాలి ,  -అన్న పుస్తకాలుగా  వెలయించారు. టాగోర్ అంతిమ కాలంలో రచించిన ‘నమ్హార రేఖా పథ్ బెయె’ అన్న చిత్ర కవిత్వాన్ని తెనిగించారు. అంతేగాక,  మరో ఐదు భారత కవుల అనువాద పుస్తకాలు రానున్నాయి .
 అనువాదంలో  అవిరళ  కృషికి గుర్తింపుగా మన్మధ  నామ సంవత్సరానికి గాను బ్రౌన్ పండిత పురస్కారాన్ని వీరికి ప్రకటిస్తున్నాము.
(వార్త పంపినవారు: తమ్మినేని యదుకులభూషణ్)

You Might Also Like

2 Comments

  1. Kalasagar

    గుడ్ సెలక్షన్. అనువాద కవిత్వాన్ని మనకందిస్తూ, ఎందఱో విదేశీ కవులను పరిచయం చెస్తున్నారు. అభినందనీయులు.

  2. pavan santhosh surampudi

    పురస్కారం అనగానే ఎవరా అని చూశాను – ముకుంద రామారావు గారు. అర్హులైనవారికే ఇచ్చారని సంతోషం. నాకీయనతో వ్యక్తిగతంగా పరిచయం ఏమీ లేదు, కానీ ఈయన అనువదించిన నోబెల్ కవిత్వం పుస్తకం చదివాను. కవిత్వానువాదం చాలా కష్టమైన ప్రక్రియ, కానీ చాలా అవసరమైన పని. ఎందరెందరో విదేశీ కవుల గురించి తెలుగు వారికి తెలియజేసే చక్కని పని పెట్టుకున్నారీయన.

Leave a Reply to Kalasagar Cancel