వీక్షణం-5

తెలుగు అంతర్జాలం:

ఇటీవలి కాలంలో విడుదలైన కొత్త తెలుగు పుస్తకాల గురించి; దాట్లదేవదానం రాజు “యానాం కథలు” సంపుటికి శివారెడ్డి ముందుమాట, “కొన్ని అవాస్తవాలు మరికొన్ని అపోహలు” పేరిట కన్యాశుల్కం నాటకం గురించి చలసాని ప్రసాద్ వ్యాసం; పి.సత్యవతి గారి కథ “దమయంతి కూతురు” గురించి డా. వై.కామేశ్వరి అభిప్రాయాలు, “పాల్కురికి ఆదికవి – ప్రజాకవి” – మాగుమూడి లక్ష్మీరాఘవరావు వ్యాసం :ఆంధ్రజ్యోతి పత్రికలో విశేషాలు. ఇటీవలికాలంలో విడుదలైన కొండేపూడి నిర్మల కవిత్వం, ఆదాబ్ హైదరాబాదు ఇత్యాది పుస్తకాల పరిచయం ఆదివారం అనుబంధంలో ఇక్కడ చూడవచ్చు.

“ప్రశ్నించని సాహిత్యమెందుకు?” – సి.హెచ్.మధు వ్యాసం, తెలుగులోకి అనువాదం చేయబడ్డ దళిత సాహిత్యం గురించి దేవరాజు మహారాజు వ్యాసం, “సమకాలీన సాహిత్యానికి దిశా నిర్దేశమేది?” – ద్వా.నా.శాస్త్రి వ్యాసం :ఆంధ్రభూమి పత్రికలో విశేషాలు. అలాగే, ఇటీవలే విడుదలైన పుస్తకాల గురించిన చిన్న పరిచయాలు “అక్షర” పేజీల్లో ఇక్కడ చూడవచ్చు.

“నిర్జన వారధి” పై తెలకపల్లి రవి వ్యాసం, హిందీ కవి సుదామా పాండే ధూమిల్‌ గురించి వేదుల రామకృష్ణ వ్యాసం, ‘ఉమన్‌ ఇన్‌ బ్రాహ్మణిజం’ సినిమా నేపథ్యంలో చలం “బ్రాహ్మణీకం” గురించి కె.ఆనందాచారి పరిచయం :ప్రజాశక్తి పత్రిక విశేషాలు.

ఇటీవలి కాలంలో వచ్చిన పుస్తకాల గురించి ఇక్కడా, ఇక్కడా; శీలావీర్రాజు గారి నవల “మైనా” గురించి విహారి వ్యాసం; మన తొలి రైతు కథ ‘ఎవరికి?’ డా. పి.వి.సుబ్బారావు వ్యాసం; “ఉక్కుపాదం” కథ ఎందుకు రాశాను – డా. శాంతినారాయణ వ్యాసం – సాక్షి పత్రిక విశేషాలు. “గెలిచిన పాఠం” నవల పరిచయం, ఇటీవల వచ్చిన కొన్ని ఇతర పుస్తకాల గురించిన వివరాలు ఆదివారం అనుబంధంలో ఇక్కడ చూడవచ్చు.

“ముగురమ్మలు..పది కథలు” – బి.వి.ఎన్.స్వామి వ్యాసం, కేరళ రచయిత్రి కె.ఆర్.మీరా గురించిన పరిచయం :సూర్యపత్రిక విశేషాలు.

జాక్ లండన్ నవల “ఉక్కుపాదం” (Iron Heel) గురించి ఎన్‌.వి.ఎస్‌.నాగభూషణ్‌ వ్యాసం విశాలాంధ్ర పత్రికలో వచ్చింది.

“గీతల్లో ఒదిగిన హైదరాబాద్” అంటూ “ఆదాబ్ హైదరాబాద్” పుస్తకం గురించి సుధామ గారి పరిచయం ఇక్కడ.

ఏకవ్యక్తి అకాడెమీలు అంటూ మంచిపుస్తకం, పీకాక్స్ క్లాసిక్స్, పాలపిట్ట బుక్స్, వేదగిరి కమ్యూనికేషన్స్ సంస్థల గురించి, వాటి నిర్వహకుల గురించి ఇండియాటుడే వ్యాసం, వసంతం.నెట్ వెబ్సైటులో ఇక్కడ.

“మా ఊళ్లో కురిసిన వాన” -వాడ్రేవు వీరలక్ష్మీదేవి గారి వ్యాస సంపుటి గురించి అంపశయ్య నవీన్ వ్యాసం, “దేవుడు-దయ్యం” అన్న ఓషో పుస్తకం తెలుగు అనువాదం గురించి వివిధ పత్రికల్లో వచ్చిన వ్యాసాలూ , “మహిళా దృక్కోణంలో కులం – లింగ వివక్ష” వ్యాస సంపుటి గురించి ఇండియాటుడే వ్యాసం, “నామక్కల్ రామలింగ పిళ్ళై” తమిళ పుస్తకం తెలుగు అనువాదం గురించి ఇండియాటుడే వ్యాసం – వసంతం వెబ్సైటులో చూడవచ్చు.

ఆంగ్ల అంతర్జాలం:

చర్చిల్ జీవితచరిత్రను Last Lion పేరిట మూడు భాగాలుగా రాస్తూ, మూడో భాగంలో ఉండగా రచయిత William Manchester మరణిస్తూ, తన స్నేహితుడైన Paul Reid కు పుస్తకం పూర్తిచేసే బాధ్యత అప్పజెప్పాడు. ఆ పుస్తకం ఇప్పుడు విడులవబోతోంది. ఈ సందర్భంగా న్యూయార్క్ టైంస్ పత్రిక వ్యాసం ఇక్కడ.

తన అభిమాన పుస్తక విమర్శకుడు, తన దృష్టిలో “Best-read man in America” అయిన మనిషితో కలిసి పుస్తకాల షాపింగ్ చేసే అవకాశం వస్తే ఎలా ఉంటుందో జాన్ లింగన్ మాటల్లో ప్యారిస్ రివ్యూలో ఇక్కడ చూడవచ్చు. రచయిత Raold Dahl గురించిన కొన్ని ఆసక్తికరమైన సంగతులు ఇక్కడ చదవవచ్చు. ప్రముఖ రచయిత రిచర్డ్ యేట్స్ జ్ఞాపకాలతో fictionwritersreviewలో వచ్చిన వ్యాసం ఇదిగో.

The world in our time – Tapan Raychaudhuri పుస్తకం గురించి “personal memoir as social history” అని వర్ణిస్తూ సాగిన పరిచయ వ్యాసం, ఇటీవలి కాలంలో తరుచుగా పత్రికల్లో కనిపిస్తున్న భరద్వాజ్ రంగన్ పుస్తకం “conversations with Maniratnam” గురించి మరొక పరిచయ వ్యాసం, రుచిర్ శర్మ Tata Literature Live! first book award గెలుచుకున్న సందర్భంగా అతను రాసిన Breakout nations: in pursuit of the next economic miracles పుస్తకం గురించిన ఒక పరిచయం ఇక్కడ.

తన చిన్నతనంనాటి పుస్తకాల షాపుల గురించి జై అర్జునసింగ్ చెప్పిన కబుర్లు ఇక్కడ. ప్రముఖ సౌండ్ మిక్సర్ రసూల్ పూక్కుట్టి అనుభవాలతో విడుదలైన పుస్తకం Sounding off గురించి ఇదే బ్లాగులో ఒక పరిచయం ఇక్కడ.

త్వరలో రాబోతున్న ఈరీడర్ – Beagle (ఎనిమిది పౌండ్లేనట ఖరీదు!!) పనితీరు గురించి గార్డియన్ పత్రికలో ఒక రివ్యూ ఇక్కడ.

కొన్ని జాబితాలు: పూర్తిచేయడం కష్టమైన పది పుస్తకాలు అంటూ Robert McCrum గార్డియన్ పత్రికలో రాసిన వ్యాసం ఇక్కడ. “5 Books dictated from the grave” అంటూ రచయితలు “మరణానంతరం” రాసిన కొన్ని పుస్తకాల గురించిన పరిచయం ఇక్కడ. “Eight famous author editor pairings” -ఈ జాబితా ఇక్కడ. 2012 అమెరికా అధ్యక్ష ఎన్నికలు ముగిసిన సందర్భంగా – వివిధ అమెరికా అధ్యక్షులు రాసిన పుస్తకాల గురించి చిన్న పరిచయం ఇక్కడ. అబ్రహాం లింకన్ గురించి వచ్చిన వివిధ పుస్తకాల గురించి లింకన్ చరిత్రకారుల మధ్య ఒక చర్చ ఆడియో, ట్రాన్స్క్రిప్ట్ ఇక్కడ.

New York Times Best Illustrated Children’s Books of 2012 పది పుస్తకాల నుండీ కొన్ని చిత్రాలు ఇక్కడ.

Writers Block ను ఎదుర్కోవడం గురించి సుసాన్ జె.మారిస్ సూచనలు ఇక్కడ.

వివిధ తమిళ పత్రికల దీపావళి ప్రత్యేక సంచికల గురించి హిందూ పత్రిక చెన్నై ఎడిషన్ వ్యాసం ఇక్కడ.

జేంస్ బాండ్ నవలల్లో విలన్ పాత్రల గురించి Karin Slaughter వ్యాసం ఇక్కడ.

“Six writers, a nomadic library, 200km by train” అని చెప్పుకునే The Bookwallah వారి గురించి హిందుపత్రిక కథనం ఇక్కడ.

ఇంటర్వ్యూలు:

ప్రముఖ న్యూరాలజిస్టు, పాపులర్ రచయితా అయిన Olivar Sacks కొత్త పుస్తకం Hallucinations విడుదల సందర్భంగా ఆయనతో ఒక ఇంటర్వ్యూ ఇక్కడ. ఈ పుస్తకం గురించి గార్డియన్ పత్రికలో ఇటీవలే వచ్చిన రివ్యూ ఇక్కడ.

Robin ‘Einstein’ Verghese అనే పాత్ర ప్రధాన పాత్రగా సాగే Dork నవలల్లో రెండవది Who let the dork out? త్వరలో విడుదల కాబోతున్న సందర్భంలో రచయిత Sidin Vadukut తో హిందూ పత్రిక ఇంటర్వ్యూ ఇక్కడ. ఈ పుస్తకం గురించే రచయితతో మరొక సంభాషణ – Inside the Dork’s head ఇక్కడ.

Kondapalli Koteswaramma గారితో The Hans India ఇంటర్వ్యూ ఇక్కడ.

Orhan Pamuk తో న్యూయార్క్ టైంస్ వారి ఇంటర్వ్యూ ఇక్కడ.

హాలీవుడ్ దర్శకుడు గ్యారీ రాస్ రాసిన పిల్లల పుస్తకం “Bartholomew Biddle and the Very Big Wind” విడుదలై, అమేజాన్ వారి జాబితా లో Best book of november గా ఎంపికైన సందర్భంలో అమేజాన్ వారి విడియో ఇంటర్వ్యూ.

మరణాలు

ఇటీవలే మరణించిన రచయిత్రి Han Suyin గురించి “she had the singular task, during the 1950s and afterward, of simultaneously explaining China to the West and the West to China.” అంటూ సాగిన న్యూయార్క్ టైంస్ వ్యాసం ఇక్కడ.

మరికొన్ని పుస్తకాల పరిచయాలు:

* V.S.Naipaul – The Enigma of Arrival గురించి ఒక వ్యాసం ఇక్కడ.
* China Mountain Zhang -Maureen F McHugh నవల గురించి ఒక వ్యాసం ఇక్కడ.
* Polio eradication and its discontents – A Historian’s Journey Through an International Public Health (Un)Civil War: William Muraskin పుస్తకం గురించిన ఒక వ్యాసం ఇక్కడ.
* Peter Ames Carlin రాసిన పాప్ గాయకుడు Bruce Springsteen జీవితచరిత్ర గురించి న్యూయార్క్ టైంస్ వ్యాసం ఇక్కడ.
* నలభైల నాటి నుండీ నేటిదాకా వచ్చిన బ్రిటీష్ క్రైం సినిమాల గురించి వచ్చిన British Crime Film: Subverting the Social Order (Crime Files) పుస్తకం గురించి గార్డియన్ పత్రికలో ఒక చిన్న పరిచయం ఇక్కడ.
* Rediff.com – Ajit Balakrishnan తన స్వీయానుభవాలను చెప్పుకున్న The Wave Rider పుస్తకం గురించి ఒక రివ్యూ ఇక్కడ.
* Dear Life – Alice Munro కథల సంపుటి గురించిన పరిచయం ఇక్కడ.
* Candace Fleming, Eric Rohmann రాసిన పిల్లల పుస్తకం “Oh, No!” గురించి న్యూయార్క్ టైంస్ పత్రికలో ఒక పరిచయం ఇక్కడ.
* Life Saving: Why We Need Poetry – Josephine Hart పుస్తకం గురించిన పరిచయం ఇక్కడ.

You Might Also Like

One Comment

  1. వీక్షణం-8 | పుస్తకం

    […] గార్డియన్ పత్రిక ఇంటర్వ్యూ గురించి ఈ వీక్షణంలో చూడండి. మరొక రివ్యూ ఇక్కడ. * Housefull: The Golden age of […]

Leave a Reply