డి. కేశవ రావుగారి మృతి
వార్త పంపిన వారు: తమ్మినేని యదుకులభూషణ్
******
ప్రముఖ అనువాదకులు డి. కేశవ రావు గారు (తెల్లవారితే) మే ఆరవ తేది, కన్ను మూశారు. ఎంతో పేరుపొందిన కీలుబొమ్మలు ( జి.వి.కృష్ణారావు ) నవలను ఆయన Puppets గా అనువదించారు. ఇస్మాయిల్ కవితలకు ఆయన చేసిన అనువాదానికి (Tree,My Guru) బ్రౌన్ అవార్డు లభించింది. తెలుగులో ఎందరో ప్రముఖ కవుల కవిత్వాలను అనువదించారు. ప్రతిష్ఠాత్మకమైన ఇండియన్ లిటరేచర్ సాహిత్య పత్రికలో తరచూ ఆయన అనువాదాలు చోటు చేసుకొనేవి. ఈ పత్రికలో,తెలుగు యువకవులను పరిచయం చేస్తూ ఆయన చేసిన అనువాదాలు-చివరిసారి- 2010 మార్చి సంచికలో వెలువడ్డాయి.
Nalam Ravindranath
A void that can not be filled so easily. Translation has been made a fine art by Sri Kesavarao garu. Telugu writers lost a window to show their talents to non Telugu speaking literary lovers.
k.ravibabu
very sad news to lovers of Telugu and English literature
indrani Palaparthy
కేశవ రావు గారిని నేను కొన్ని ఏళ్ళుగా ఎరుగుదును.నా కవితలని కొన్నింటిని ఆయన అద్భుతంగా అనువదించారు,ఇంగ్లీషులోకి.ఆయన హటాన్మరణం సాహితీ జగత్తుకి తీరని లోటు.
ఆయన మరణ వార్త వినడం చాలా బాధను కలిగించింది.ఎక్కడ ఉన్నా వారి ఆత్మకి శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను.
mukunda ramarao
శ్రీ కేశవరావు గారు అనువాదకునిగా గుర్తింపు పొందినా, తెలుగు లోను, ఆంగ్లం లోను అద్భుతమైన స్వీయ కవిత్వం రాసారు. అంతర్జాతీయ అనువాదకులైన శ్రీ దిలీప్ చిత్రే గారు వీరిని గురువుగా భావించే వారు. తెలుగు కవిత్వం ఆంగ్లానువాదాల కోసం, ప్రముఖ కవి, సాహిత్య అకాడమీ లో అనేక ఉన్నత పదవుల్లో ఉన్న శ్రీ సచ్చిదానందన్ వీరినే సంప్రదించేవారు. రెండు భాషల్లోనూ సమాన ప్రతిభ కలిగిన శ్రీ కేశవరావు గారు లేని లోటు మనల్ని బాధిస్తూనే ఉంటుంది. వారి ఆత్మకు శాంతి కలగాలని మనసారా మనందరం కోరుకుందాం.
– ముకుంద రామారావు
K. Chandrahas
కేశవరావు గారు చాలా రోజులుగా అనారోగ్యంతో బాధపడ్తున్నారు. ఒక నెల కిందట ఆయన నాతో ఏదో పుస్తకం గురించి టెలిఫోన్లో మాట్లాడుతూ తన ఆరోగ్యం ఇప్పుడిప్పుడే కాస్త మెరుగౌతోందన్నారు. ఇంతలో ఈ వార్త… ఆయన మృతితో మనం ఒక మంచి అనువాదకుణ్ని కోల్పోయాం.
Vaidehi Sasidhar
కేశవరావు గారి మరణ వార్త చాలా విచారకరం. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి .