We’re back! (అని అనుకుంటున్నాం :) )

అందరికీ నమస్కారం.

గడిచిన కొద్ది రోజులుగా పుస్తకం.నెట్ పనిజేయటం లేదన్న సంగతి, దాదాపుగా అందరికి తెల్సిన విషయమే! ఊహించినవే కొన్ని, అంచనా చేయలేకపోయిన కొన్ని సాంకేతిక సమస్యల వల్ల పుస్తకం.నెట్ తిరిగి పనిజేయటానికి ఇంత వ్యవధి పట్టింది. ఆ వ్యవధిలో పుస్తకం బాగోగులను గురించి చింతిస్తూ మాకు మెయిల్స్, ఫోన్ కాల్స్ చేసినవారికి ధన్యవాదాలు. ఓ పక్క సైటు డౌన్ ఉన్నా, వ్యాసాలను పంపుతూనే ఉన్నవారికి, వారి వారి వ్యాసాలు పుస్తకం.నెట్ లో చిక్కుపడిపోయిన ఓపిగ్గా వేచి చూసినవారికి, మాకు సాంకేతిక సాయం అందించినవారికి, అందిస్తామని ముందుకు వచ్చినవారికి – అందరికీ పేరు పేరున ధన్యవాదాలు!

కొన్ని ముఖ్యగమనికలు:

  1. పుస్తకం.నెట్ కు access, వచ్చే 48 గంటల్లో అప్పుడప్పుడూ , కొద్దిగా మందకోడిగా ఉండచ్చు. మీకు ఈ సైటు తెరుచుకొనకపోతే ఒకటికి రెండు సార్లు ప్రయత్నించమని మనవి.
  2. పుస్తకం.నెట్ ను వాడ్డంలో ఎలాంటి ఇబ్బందులు కలిగినా, ఏదైనా మునుపటిలా పనిజేయకపోయినా వెంటనే మాకు తెలుపగలరు.
  3. ప్రస్తుతం editor@pustakam.net పనిజేయటం లేదు. దాని బదులు pustakam.net@gmail.com కు మీ అభిప్రాయాలను గానీ, వ్యాసాలను గానీ పంపమని అభ్యర్థన.

Our sincere apologies for any inconvenience caused to anybody during the past weeks. We’re grateful to everybody who stood by us, during the tough times.

రానున్న రోజుల్లో పుస్తకం నిరాటంకంగా కొనసాగుతుందని, దానికి మీ ఆదరాభిమానాలు ఉంటాయని ఆశిస్తూ –

పుస్తకం.నెట్

You Might Also Like

3 Comments

  1. పుస్తకం.నెట్ నాలుగో వార్షికోత్సవం | పుస్తకం

    […] ను దాదాపుగా ఓ పదిహేను రోజులు ఆఫ్-లైన్ ఉంచాల్సి వచ్చింది. తిరిగొచ్చాక మాత్రం, వ్యాసపరంపర […]

  2. రామ

    ఫర్బిడెన్ చూడగానే నీరసం వచ్చింది కాని, మీరు మళ్ళీ వచ్చేస్తారని తెలుసు. పునః స్వాగతం.

  3. శ్రీనిక

    Congrats…You are back again.

Leave a Reply