మీరేం చదువుతున్నారు?
పుస్తకాలు తరచుగా చదువుతున్నా, పేజీలకి పేజీలు సమీక్షలు రాసే ఓపికా, తీరికా లేని వారి కోసం ఈ పేజీని నిర్వహిస్తున్నాము. ఈ వారంలో మీరే పుస్తకాలు చదివారు, వాటిని గురించి ఓ రెండు ముక్కలు ఇక్కడ comments రూపంలో పంచుకోవచ్చు. ఈ నమునాలో వివరాలు చెప్తే సులువుగా ఉంటుంది.
పుస్తకం పేరు:
రచయిత:
భాష:
వెల:
అంతర్జాలంలో ఈ పుస్తక వివరాలు:
పుస్తకం పై మీ అభిప్రాయం:
Nagini
I finished reading ‘The Kite Runner’ by Khaled Hosseini..A heart touching narration that will remain in my memories forever.
పద్మవల్లి
Read Thousand Splendid Suns by the same author. Another heart touching story and the characters will have a lasting impression on the mind.
Nagini
Looking forward to read this one too..:-)
Madhu
I was able to know about many books and the people reading habits and I was able to compare my own reading habits. I wish this tribe should grow. I have read two good books JAJIMALLI By Dr K N Malleswari and Koppulavari Kathalu…. Kaburlu by Dr. koppula Hemadri. Both made me read intensely and made me suggest these books to many people. Rather I distributed these books. Many of the people also felt similarly like me. By the way the review of Koppulavari Kathalu has appeared in Pustakam.net. These books are good
Nalam Ravindranath
CSARDAS ( “Cs’ is pronounced “ch “as in church , the” s’ at the end is “sh”, as in brush ; thus phonetically it is CHARDASH)
is a wonderful novel by DIANE PEARSON on Hungary , brought out by Corgi Books in 1976 as paper back edition. Thanks to the pavement sellers of Abids, Hyderabad, I got this book for a song.
It takes you through 1939 -1945 holocaust and how the dreams of democracy and socialism were soon shattered.
It haunts the reader for quite some time.
Nalam Ravindranath
WINTER IN MADRID ( PAN MACMILLAN BOOKS) BY C J SANSOM
An excellent fiction on Spanish Civil war without rhetoric. Spain in 1940 was excellently portrayed
సౌమ్య
శివరామ కారంత్ నవలిక “చోమన డుడి” కి యు.ఆర్.కల్కుర్ ఆంగ్లానువాదం “Choma’s Drum” చదివాను ఇవ్వాళ. ఏకబిగిన చదివించింది. కారంత్ కథ చెప్పే తీరు నాకు నచ్చింది.
ఇక్కడ కొంత సొంతఘోష చెప్పక తప్పడంలేదు… గత సంవత్సరం, సంవత్సరమున్నర కాలంలో నెమ్మది నెమ్మదిగా నాకు కాల్పనిక సాహిత్యం చదివి స్పందించే శక్తి సన్నగిల్లింది అని అనిపించింది. ఎ కాస్త భావోద్వేగం గల కథాంశం అయినా సరే, తీసి పక్కన పెట్టడం అలవాటు అయిపొయింది. ఒక్కొక్కసారి జనం హాహాకారాలు వినేసాక ఏదో చదివి… అదేమిటి, నాలో ఏమీ చలనం కలగలేదు? అనిపించేది. అడపా దడపా ఒకటీ అరా ఎంతో కొంత కదిలింప జేసే గుణం ఉన్నవి చదివినా, ఆ పాత్రల గురించో, వారి పరిస్థితుల గురించో… నన్ను ఆలోచనల్లో పడవేసిన (కాల్పనిక)రచనలు వేళ్ళ మీద లెక్కపెట్టొచ్చు. కానీ, ఇలాగ వరుసగా చదువుతున్నా, ప్రతిసారి ఏదో ఒక స్థాయిలో నాలో చలనం కలిగించి, ఒక్కొక్కసారి ఆ ఫ్లోలో నన్ను పూర్తిగా పడవేసి తన చుట్టూ తిప్పుకుంటున్నాడు కారంత్. మళ్ళీ ఇలాగ ఫిక్షన్ మీద ఆసక్తి కలిగించినందుకు ఆయనకి రుణపడి ఉన్నాను అనుకుంటాను.
రవి
నేపాళ దేశ రాజుల చరిత్ర సిరీస్ కింద విశ్వనాథ సత్యనారాయణ నవలొకటి మొన్న పాత పుస్తకాల సంతలో పది రూపాయలకు దొరికింది. దిండు కింద పోకచెక్క – ఇది నవల పేరు. కాశ్మీర రాజ తరంగిణి అని కల్హణకవి వ్రాసిన పుస్తకం సంస్కృతంలో ఉంది. నేపాళ రాజచరిత్ర సంగతి తెలీదు. అంచేత తీసుకు వచ్చి చదివాను. పరమ పేలవంగా ఉంది. బుద్ధుని మీద అన్యాపదేశంగా, ఏదో విధంగా బురద చల్లాలన్న తాపత్రయం తప్ప నేపాళ దేశ రాజచరిత్ర ఊసే లేదు ఇందులో.
మూర్తి
కవి సామ్రాట్ విశ్వనాధ వారి రచనలలో కాశ్మీర రాజవంశ నవలలు, నేపాళ రాజవంశనవలలు, ఇవి కాక పురాణవైరి గ్రంధమాల అని పన్నెండు నవలు ఉన్నాయి. ఆయన రచనలలో సనాతన ధర్మ మందు విశ్వాసము, అభిమానము మనకు కనిపిస్తాయి. మన కాలాన్ని తప్పుగా చరిత్ర కెక్కించిన “ఎంగి”లీషు వారంటే ఆయనకు కిట్టకపోవడమ సహజమే కదా! కధా పరముగా కొన్ని కల్పనలుండటం సహజం. ఏమైనప్పటికీ విశ్వనాధ వారి రచనలు మనకి లభించడం మన అదృష్టం.
Purnima
అన్నట్టు, ఈ మధ్యన చదివి, చదువుతున్న పుస్తకాల్లో మరికొన్ని:
నా ఈ కామెంట్ చదివి, నాకు ఒకరు డి.జి.టెండుల్కర్ రాసిన Khan Abdul Gaffar Khan – faith is a battle అనే పుస్తకం పంపారు. సగంలో ఉన్నాను. ప్రస్తుతానికి చాలా ఆసక్తికరంగా ఉంది. తెల్సుకోవాల్సిన నాయకుల్లో గఫర్ ఖాన్ తప్పకుండా ఒకరు.
Krishan Chander రాసిన నవలకి హింది అనువాదం (మూలం: ఉర్దూ), Ek Gadhe ki Vaapsi చదివాను. చాలా నచ్చింది. మాంచి సెటైర్. నేను చదివింది దేవనాగరి లిపిలోనే అయినా, ఉర్దూ పదాలను యధాతథంగా ఉంచి, పక్కన వాటికి హింది అర్థాలు ఇచ్చారు. అందుకని సులువుగా పఠనం సాగింది.
“ఇంట్లో ప్రేమ్‍చంద్” పేరిట, ప్రముఖ సాహిత్యకారుడు ప్రేమ్‍చంద్ సతీమణి శివరాణి గారు రాసిన “ఘర్ మె ప్రేమ్‍చంద్”కు తెలుగు అనువాదం వస్తుంది, భూమిక పత్రికలో. కొంచెం తటపటాయిస్తూనే మొదలెట్టినా, అతివేగంగా పూర్తిచేశాను. అందుకు రెండు కారణాలు: ఒకటి అనువాదం బాగా ఉండడం. రెండు: వస్తువు అంత ఆసక్తికరంగా ఉండడం. ఇది చదివి, మురిసిపోయి, డి.ఎల్.ఐ నుండి మూలరచనను డౌన్‍లోడ్ చేస్తే, ఫాంట్ సరిగ్గా లేకపోవడమే కాదు, కూడుకొని కూడుకొని కూడా చదవలేని అచ్చుతప్పులు బోలెడు ఉన్నాయి. అందుకని వదిలేశాను. ప్రేమ్‍చంద్ ను ఇష్టపడేవాళ్ళు, లేక కబుర్లు వినటం బా ఇష్టమైనవాళ్ళు తప్పక చదవండి.
Purnima
ఇద్రీస్ షా (Idries Shah) రచన Thinkers of East చదివాను. వీరి రచనలన్నీ పర్సనల్ లైబ్రరీలో చేర్చాలని నిశ్చయించాను. అందులో భాగంగా ఇది చదివాను. టైటిల్ చూసి, వరుసగా పేజీకి ఒకరి పేరు హెడింగ్ పెట్టి, వారు బయోగ్రాఫికల్ బిట్స్ ఉంటాయి అనుకున్నాను. కానీ అక్కడక్కడా ఫలానా వారు అన్నారు అని ఉన్నా, అత్యధికంగా కథలే ఉన్నాయి ఇందులో. ఎక్కువగా సూఫీకి సంబంధించినవి. వాటిని చదివి, చదివాం అని అనుకోలేం. ఒక్కో కథ దానికి తోచిన రీతిలో మనతో సఖ్యత పెంచుకొని మనతో కొనసాగుతుంది అని అనిపిస్తుంది.
వీరిదే మరో రచన The Sufis చదవటం మొదలెట్టాను. అంతగా అర్థంకాకపోయినా, వదలకుండా చదవాలని పట్టుతో చదువుతున్నాను. అసలంటూ సూఫీజం అంటే ఏంటి? అని వివరించడానికి ఈ రచన అనిపించినా, ఇదిరీస్ షా ఇతర రచనలను టైం-పాస్ పుస్తకాల్లా చదివి పక్కకు పడేసేవి కావని తెల్సివస్తుందని అనిపిస్తుంది. The Tales of Dervish, The Incredible Mulla Nasruddin లాంటి పుస్తకాలు చదవగోరే వారు, ఒకసారి దీన్ని కూడా చదివితే బాగుంటుందని అని నాకు బలంగా అనిపిస్తుంది.
పద్మవల్లి
మొన్ననే Still Me by Christopher Reeve పూర్తి చేసాను. ఇప్పుడు Sense of Ending by Julian Barnes మొదలెట్టాను.
అలాగే పనిలో పనిగా పురాణం సీత ఇల్లాలి ముచ్చట్లు కూడా మధ్య మధ్యలో వింటున్నాను.
సౌమ్య
ఇవ్వాళ చాలా రోజుల (బహుసా కొన్నేళ్ళ) తరువాత సత్యజిత్ రాయ్ రాసిన కథ ఒక్కటి చదివాను…ఆంగ్లానువాదంలో. దానిపేరు “ఖగమ”. అప్పట్లో చదివిన చాలా రాయ్ కథల్లాగానే…. ఇది కూడా ఒక విధమైన థ్రిల్లర్. నాకు అయితే చాలా నచ్చింది. అనువాదంలో చదివితేనే ఇలా ఉంటే, మూలం ఎలా ఉండి ఉంటుందో! (అఫ్కోర్సు, ఎంతో కొంత ఊహాశక్తి లేకుంటే ఆ కథ మొత్తం అబ్సర్డ్ అని కొట్టిపారేసుకోవచ్చు)
అనువాదం ఆన్లైన్ లంకె ఇక్కడ ఉంది. కానీ, ఉచితంగా చదవడానికి దొరకదు. ఆసక్తి గలవారికి పీ.డీ.ఎఫ్. కావలిస్తే నేను ఇవ్వగలను.
రవి
నేనూ ఈ కథ చదివాను. ఇప్పుడు గుర్తు లేదు. బాగా గుర్తు చేశారు సత్యజిత్ రే ను పట్టించుకుని చాలా యేళ్ళయింది. ఓ మారు బయటకు తీయాలి.
సౌమ్య
శివరామ కారంత్ తో కొనసాగుతూ – ఒక చిన్న నవలిక “సరసమ్మద సమాధి” కి ఆంగ్లానువాదం “The Shrine” చదివాను. కొంచెం అక్కడక్కడా అయోమయంగా అనిపించినా, వెరైటీగా ఉంది కథ. కథనం ఎప్పట్లాగే చదివిమ్పజేసేలా ఉంది.
Purnima
మా ఊర్లో విపరీతమైన పవర్ కట్స్. అసలైతే, చాలా విసుగు, చిరాకు తెప్పిస్తాయి ఈ కట్స్ గానీ, ఈ సారి కిండిల్ (పోర్టబుల్) లైట్స్ పుణ్యమా అని, అలా డాబా మీదకెక్కి, చల్లని గాలిలో, హాయిగా పుస్తకాలు చదువుకుంటున్నాను. పైగా కిండిల్ అంటే ఒకటే పుస్తకమని కాదు కదా! మిఠాయి కొట్లోకి వెళ్ళి అన్నీ కొంచెం కొంచెం రుచి చూసినట్టు, నచ్చిన పుస్తకాల్లో ఒక్కో పేరా చదువుకుంటున్నాను. అందుకని ఇక్కడ పంచుకోడానికి కొత్తగా టైటిల్స్ ఎక్కువ లేవు.
కానీ ఈ మధ్యనే ఒక బెమ్మాండమైన ఖజానా కనుక్కున్నాను. ఆ రచయిత పేరు, హరిశంకర్ పార్‍సాయి – హింది వ్యంగ్య రచయిత. భలే రాస్తారులే ఈయన. చదవగానే ఎంత నచ్చేశారంటే, వెర్రి వేయి తలలు వేసి, ఏవో పిచ్చి ప్రయత్నాలు కూడా చేశాను.
సాంకేతిక పుస్తకాలు కొన్ని చదివాను.
Pragmatic Programmer – Must read for experienced programmers. It talks about no particular programming language or concept, but yet, it is such an important book to practice.
Learn Python the Hard Way – Good book for newbies to programming. Makes you bend your back and work your way it. But not recommended to experienced programmers. Sometimes, there is too much of beating around the bush to introduce simple terminology.
Head First Python: I absolutely love Head First series. I mean, they just work their way into your mind. And this book is no different. It takes up a challenge and goes about it, while drilling python into your head. Recommended if you’re serious about Python!
Introduction to Computing-Explorations in Language, Logic, and Machines by David Evans: Stated with this. It is a tough nut to crack. More because it talks about programming languages, so unlike the Ameerpet-institutions-way-of-teaching-languages. 😛 Kidding. It introduces computing concepts in somewhat a different way, and it is more a practice book than read-n-throw-aside book.
సౌమ్య
శివరామ కారంత్ కన్నడ నవల “మరల మన్నిగె” కి ఆంగ్లానువాదం “Return to Earth” చదివాను. ఈ మధ్యకాలంలో చదివిన కల్పిత కథ ఏదీ నన్ను ఇలా దాని కాలంలోకి తీసుకుపోయి, ఆ పాత్రలతో కలిసి ..వాటి దుఃఖాలు, సుఖాలు అనుభవించేలా చేయలేదు. కారంత్ మీద అభిమానం ప్రతి నవలకూ పెరుగుతోందే కానీ తగ్గడం లేదు. బహుసా ఇలా అయన పుస్తకాలు చదవడం కొనసాగిస్తానేమో!
పద్మవల్లి
నేను కొన్ని కారంత్ రచనలు అనువాద కధలు మాత్రమె చదివాను. చాలా నచ్చాయి నాకైతే. నవలలు ఏమీ చదివిన గుర్తు లేదు. ఈ పుస్తకం ఆన్ లైన్ లో అంటే కినిగే గానీ వేరే చోట దొరుకుతుందా? థాంక్స్.
సౌమ్య
@పద్మవల్లి: కొనుగోలుకి మరి ఇప్పుడు దొరుకుతున్నాయో లేదో తెలియదండీ…నేను మా యూనివర్సిటీ లైబ్రరీ ఖాతాలో చదువుతున్నా ఇవన్నీ 🙂
పద్మవల్లి
Ok. I will try to search for them.Thank you.
Nalam Ravindranath
మరల సేద్యానికి అనే పేరుతో వచ్చిన తెలుగు అనువాదం కూడా ఎంతో బాగుంటుంది
Nagini
First time posting in this division.Completed reading Kim by Rudyard Kipling.The book is a mixture of adventure and spirituality.It portraits colonial India.A very slow and tough read.
padma
namaste, i happened to see this page today, feeling very happy to join you all here and share my experiences and feelings reg. the books i read . now iam trying to read the noval ‘GONE WITH THE WIND ‘ about which i heard , laid basis for some characters in films and other novels. if any one of you have come across this book can help me in getting some idea about the story. thank you .
Purnima
పోయిన వారాంతం ప్రయాణం చేయడం వల్ల పుస్తకపఠనం అంతగా సాగలేదు. ప్రయాణానికి కొద్ది గంటల ముందే విశాలాంధ్రలో బోలెడు పుస్తకాలు కొన్నా, ఇంకా వాటివంక సరిగ్గా చూడనేలేదు. కానీ కొన్ని అపురూప పుస్తకాలను చూసే సౌభాగ్యం కలిగింది, నా ఫ్రెండ్ ఇంట.
రైల్ళో మాత్రం వేటూరి సుందారమ్మూర్తి గారిపై వచ్చిన ఒక పరిశోధనా గ్రంధం చదివాను. విశాలాంధ్రలో ఉందీ పుస్తకం. బాగానే చదివింపజేసింది. వేటూరిగారి ఇంటర్వ్యూ ఒకటి, ఆయనపై ప్రముఖుల అభిప్రాయాల కోసం ఈ పుస్తకం కొనదగ్గది. వేటూరి రచనాపాఠవం గురించి కూడా కొద్దో గొప్పో తెలుస్తుంది. ముఖ్యంగా ఆయన సినీరంగానికి రాకముందు చేసిన రచనల గూర్చి చెప్పుకొచ్చారిందులో.
Idries Shah “World Tales”లో కొన్ని కథలను చదివాను. మనం విని ఉన్న జానపద కథలు వివిధ సమాయాల్లో, వివిధ ప్రాంతాల్లో ఎలాంటి మార్పులతో అవే కథలు చెప్పబడ్డాయో వివరిస్తూ, ఒక్కో కథను చెప్పుకొచ్చారు. పైగా కళ్ళు తిప్పుకోనివ్వనంత అందమైన illustrationsతో. రెండొందల పేజీలున్న పుస్తకం ఒక నాలుగైదు గంటల్లో పూర్తిచేసేయ్యాలని ఉబలాటపడ్డాను కానీ… ఒక్కోదాన్ని తనివితీరా చదువుకునేసరికి చాలా తక్కువ కథలు చదివాను. అపురూపమైన పుస్తకం. కొనుక్కొని, దాచుకోవాల్సిన పుస్తకం. నేనెలాగోలా దొరకబుచ్చుకోవాలి.
రెండ్రోజుల నుండి పోతన భాగవతం చదువుతున్నాను. మెల్లిగానే అయినా బండి బాగానే నడుస్తుంది. చూడాలి, ఎంత దూరం నడుస్తుందో!
సౌమ్య
శివరామ కారంత్ కు జ్ఞానపీఠం తెచ్చిపెట్టిన “మూకజ్జియ కణసుగళు” కు టి.ఎస్.సంజీవరావు ఆంగ్లానువాదం “mookajji’s visions” చదివాను. నవల ఆపకుండా చదివించింది. ఒక్కొక్క చోట మూకజ్జి (మూగ అవ్వ) మాటలు నాకు చాలా నచ్చాయి. పుస్తకం లైబ్రరీ లో తిరిగి ఇచ్చేసే లోపు మరొకసారి చదువుదాము అనుకుంటున్నాను.
Srinivas Vuruputuri
పాత పుస్తకమే – Freedom at Midnight (Dominique Lapierre & Larry Collins). 1947 జనవరి నుంచి 1948 జనవరి దాకా – అంటే మౌంట్‌బాటెన్‌ను ఇండియాకి వైస్రాయిగా పంపాలని నిర్ణయించినప్పట్నుంచి – గాంధీ హత్య దాకా – భారత స్వాతంత్ర్యానికి కొంచెం అటూ, ఇటూ పరచుకున్న చరిత్ర.
విశ్లేషణ తక్కువ, వర్ణన ఎక్కువ. ఆనాటి సంఘటనలను మానవీయకోణంనుంచి చెబుతారు.
ఈ కథకి గాంధీయే హీరో, నిస్సందేహంగా. మౌంట్‌బాటెన్‌కి మంచిమార్కులే వేస్తారు.
గాంధీ హంతకులు కథకి విలన్‌లు. వీధుల్లో తెగబడి మారణహోమాల్లో పాల్గొన్న వాళ్ళు కూడా.
ఏ కథో నవలో చదివినంత వేగంగా చదివించారీ కథను. ఒకట్రెండు ఇనాక్యురసీలు, అప్పుడప్పుడు, “నిజంగా చూసే రాసారా?” అని వెక్కిరించాలనిపించే వర్ణనలు (లాహోర్‌లో చెరుకు బండి చక్రాల తుప్పు, చెరుకు బండి కుర్రాళ్ళ కళ్ళలో పుసి…)
పెద్ద కాన్వాసు – గాంధీగారి బ్రహ్మచర్య ప్రయోగాలు, సంస్థానాధీశుల వెర్రివేషాలు, గాడ్సే స్త్రీద్వేషం, నారాయణ్ ఆప్టే (గాంధీ హత్యలో ఉరిశిక్ష పడ్డ మరో దోషి) అమ్మాయిల పిచ్చి, దేశవిభజన ముహూర్తాన్ని దైవజ్ఞులు విశ్లేషించిన తీరు, హిందువుల కాలకృత్య సమయాల ఆచారాలు (a 21 step process, no less!)… ఒక్కటేవిటి – ఇందులో లేని triviaని ప్రయత్నించి గుర్తుకు తెచ్చుకోవాల్సిందే! ఆ, దొరికింది – దక్షిణ భారతదేశపు ప్రస్తావనలు తక్కువే! తెలుగు మాటే వినిపించదు. సుభాష్ చంద్ర బోస్, భగత్ సింగ్‌లూ కనిపించరు.
మొత్తం పుస్తకం చదివాక అనిపించిందేమిటంటే –
1. 1947 ఏప్రిల్, మే నెలలు వచ్చేసరికే, మన దేశనాయకులు విభజనకి మానసికంగా సంసిద్ధమయ్యారు. ఒక్క గాంధీగారు తప్ప.
2. అసలు విభజనపర్వం సర్వం అసంబద్ధతామయం! రెండే రెండు ఉదాహరణలు:
అ) 1948 జూన్‌కల్లా 1947 ఆగస్టుకి ఫాస్ట్‌ఫార్వర్డ్ చేయడం – ఒక విలేకరుల సమావేశంలో జరిగిందట. మౌంట్‌బాటెన్‌కి హఠాత్తుగా ఎదురైన ప్రశ్నకి సమాధానంగా క్షణాలమీద ఆలోచించి ప్రకటించిన తేదీ అట అది!
ఆ) ఇండియా పాకిస్థాన్‌కి ఎల్లలు నిర్ధారించిన సర్ రాడ్‌క్లిఫ్‌కి ఇచ్చిన గడువు ఐదు వారాలు. ఆయనకి ఈ దేశం గురించి ఏమీ తెలియకపోవడమే ఆయన ముఖ్యార్హత అట! ఆయనకి ఆధారాలు – జనాభా లెక్కలూ, మరీ కచ్చితంగా గీయబడని మాపులున్నూ అట!
ఆ రెండేళ్ళ వ్యథ, మన దేశ చరిత్రలో ఓ పెద్ద విషాదాధ్యాయం. దాన్నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలను మనమేమీ నేర్చుకోలేదనే చెప్పుకోవాలి.
lakshmi
telugu lo mahilala kosam oka website… forwomen.in. please have a look.
రవి
చాలా కాలం పుస్తకపఠనంలో వెనుకబడి, ఈ మధ్య ఒక చక్కటి పుస్తకం చదివాను. బహుశా ఆ పుస్తకం, పుస్తకం లో చాలామందికి చిరపరిచితమే కావచ్చు.
సారస్వత వివేచన – రా.రా. ఈయన గురించి విన్నాను, అక్కడక్కడా ఈయన గురించి చదివాను కానీ, ఈ పుస్తకం మాత్రం ఈ మధ్యనే చదివాను. ఇందులో విమర్శనా వ్యాసాలు చదివితే సీరియస్ నెస్ తో బాటూ తగ నవ్వూ వస్తూంది. బహుశా రారా శైలిలో ఉన్న గొప్పదనం అదేనేమో.
చాలాచోట్ల ఈయన అభిప్రాయాలు చదువుతుంటే – ఈ అభిప్రాయాలే కదా నావీనూ, నాకెందుకు ఇంత స్పష్టత రాలేదన్న ఆలోచన కలిగింది. ఈ పుస్తకం డిజిటల్ లైబ్రరీలో ’raachamallu’ అని వెతికితే కనిపిస్తుంది. ఎవరి వద్దనైనా పీడీ ఎఫ్ ఉంటే నాకు పంపగలరా?
సౌమ్య
గత పదిరోజుల్లో చదివిన పుస్తకాలు:
౧) బలిపీఠం, రంగనాయకమ్మ: ఎక్కడా ఆపకుండా చదివించింది.
(http://kinige.com/kbook.php?id=662)
౨) నైట్ వాకర్, మధుబాబు : మరీ అంత గొప్పగా లేదు కానీ, కాలక్షేపానికి బానే ఉంది.
౩) శ్రీపాద – అనుభవాలూ,జ్ఞాపకాలూనూ : ప్రతి తెలుగు వ్యక్తీ చదవాల్సిన పుస్తకం అని నా అభిప్రాయం. అందుకని నా వంతు కృషి చేసి కొందరి చేత చదివిస్తున్నా 😉
౪) ప్రస్తుతానికి శివరామ కారంత్ కన్నడ నవల ‘కుడియర కుసు’ కి హెచ్.వై.శారద ప్రసాద్ ఆంగ్లానువాదం “The headman of the little hill” చదువుతున్నాను. నవల చాల ఆసక్తి కరంగా సాగుతోంది. అనువాదం బానే ఉంది.
పద్మవల్లి
@@ శ్రీపాద – అనుభవాలూ,జ్ఞాపకాలూనూ
ఎన్నో ఏళ్లుగా ఈపుస్తకం చదవాలని కోరిక. ప్రింట్లో దొరకలేదు నేను కొనాలని చూసినప్పుడు. ఈ మధ్యనే ఒక స్నేహితురాలు పుణ్యమా అని దొరికింది. ప్రస్తుతం చదివుతున్నవి అవ్వగానే మొదలెట్టాలి.
లలిత (తెలుగు4కిడ్స్)
చదివేస్తున్నా, చదివేస్తున్నా, చదవడం మొదలు పెట్టిన పుస్తకాలన్నీ పక్కన పెట్టి శ్రీపాద వారి అనుభావాలూ, జ్ఞాపకాలూ చదివేస్తున్నాను. సౌమ్య మంత్రదండం తిప్పింది. ఎప్పటికో కానీ దొరకదనుకున్న పుస్తకం నా ముందుకు వచ్చి “ఇప్పుడెలా చదవవో చూస్తాను” అని నిలదీసేలా చేసింది. శ్రీపాద గారు మాటి మాతికీ తన “పుస్తక దారిర్యం తీరింది” అంటున్నారు రెడ్డి గారిని కలిసిన తర్వాత. నాకు తెలుగు పుస్తకాలు, నా అభిరుచికి తగ్గవి చదవాలనే కోరిక తీరబోతోందనిపిస్తోంది ఇకనుంచీ. అంతే కాదు నేను చెయ్యాలనుకుని చెయ్యని పనులు చేయగలిగే ఉత్సాహం పెరుగుతుందనీ అనిపిస్తోంది. Thanks Sowmya. Thanks pustakam.net. Thankyou internet (Telugu community on the net) that opened up the world of Telugu literature like nothing else could have, to me.
Purnima
చాన్నాళ్ళ తరువాత చకచకా పుస్తకాలు చదవటం జరిగింది, పోయినవారంలో.
గాంధీ మరణోదంతాన్ని వివరిస్తూ రాసిన పుస్తకం నుండి తేరుకోక ముందే H.Y.Prasadగారి The Book I Won’t Be Writing and Other Essays చదివాను. ఆయన మ్యూజింగ్స్ ఎంత బాగున్నాయో మాటల్లో చెప్పలేను. పైగా, ఆయన పుణ్యమా అని నా పుస్తకాల విష్‍లిస్ట్ ఇంకో పదివేల రూపాయలకు పెరిగిపోయింది. నెలకో క్రిస్మస్ చొప్పున ఒక పన్నెండు సాంటాలు వచ్చి నాకీ పుస్తకాలన్నీ బహుమతులుగా ఇచ్చేస్తే బాగుణ్ణు. 🙂
ఇహ, తనకి నచ్చిన పుస్తకాలను చదివించటంలో అందవేసిన సౌమ్య నాతో చదివించిన పుస్తకాలు:
౧. The Last Flower – James Thurber: చిట్టి పుస్తకంలే. యుద్ధాల వల్ల జరిగే అనర్థాలను బొమ్మల సాయంతో చక్కగా చెప్పారు. నాకు చాలా నచ్చింది.
౨. Addicted to War: అమెరికా యుద్ధప్రీతి గురించి ఆ జాతికి తెలపడానికి చేసిన గ్రాఫిక్ నవల. నాకు కొంచెం నచ్చింది. కానీ ఎందుకో చాలా నచ్చలేదు కూడా! ఏది ఏమైనా నేను చదివిన మొట్టమొదటి గ్రాఫిక్ నవలగా ఈ పుస్తకం చరిత్రలో మిగిలిపోతుంది. 😉
సౌమ్య శ్రీపాదవారి అనుభవాలు-జ్జాపకాలు తెగ చదివేసి, తెగ ఊరించేస్తుందన్న అక్కసుతో (నా దగ్గరా పుస్తకం లేదు మరి!) నేనూ ఏదో ఒకటి భారీ స్థాయిలో చదివేయాలని పానుగంటి వారి సాక్షి మొదలెట్టాను. మొదటి రెండు, మూడు పేజీలలోనే, I was bowled over! కానీ ఇన్నాళ్ళూ ఆ పుస్తకం కొననందుకూ, కొన్నాక మూడు నెలల వరకూ దాని వంక చూడనందుకూ మాత్రం, సింపుల్ కాచ్ వదిలేసిన ఫీల్డర్ లాగా తెగ మధనపడిపోతున్నాను. ఆ పుస్తకం సైజుకూ, పుస్తకం లోపల అరసున్నాలకూ బెదిరిపోయి, ఎంత చక్కటి తెలుగును వదులుకున్నాను ఇన్నాళ్ళూ! ప్చ్..
అనూహ్యంగా తన తాబీజు మహిమ వాడి, సౌమ్య నాకివ్వాళ శ్రీపాద వారి ఆత్మకథను డిజిటల్ లైబ్రరిలో వెతికిపెట్టి ఇచ్చింది. ఒక యాభై పేజీలు చదివాను ఇప్పటికి. ఎన్నేళ్ళగానో ఎదురుచూసిన పుస్తకం, ఇన్నాళ్ళకు దొరికింది. ఈ వారమంతా దానితో సరిపోతుందనుకుంటాను.
అవీ ఈ వారపు నా చదువు ముచ్చట్లు!
రామ
ఆ డీ ఎల్ ఐ లింకు ఏదో ఇక్కడ ఇచ్చేస్తే మరింత మంది చదివేస్తాము కదండీ? 🙂
సౌమ్య
raama gaaru: Here is the link.
మెహెర్
తమ్మినేని యదుకుల భూషణ్ “నేటికాలపు కవిత్వం – తీరు తెన్నులూ” చదివాక ముందుగా అనిపించిందేమిటంటే: only other pedants can cure you of your own pedantry! నా మనసులో యీ పుస్తకం కలిగించిన చేదు రుచి యీ రకంగా యేవన్నా వుపయోగపడితే పడవచ్చు గాక, అంతకన్నా దీనికి మరో విలువ లేదు. పుస్తకం ఆడిపోసుకోవడాలతో యెంతగా నిండినా భరించొచ్చు; పుస్తకంలో positive energy అంటూ యెక్కడా యిసుమంత కూడా కానరాకపోవడాన్ని మాత్రం భరించలేము. (కాస్తోకూస్తో పాజిటివ్ ఎనర్జీకి అవకాశం వున్న వ్యక్తుల నివాళుల్లో కూడా రచయిత స్వీయ ప్రశస్తిని దూర్చే ప్రయత్నాలూ, సొంత యెజెండాలూ కనిపించినట్టయి నా వరకూ మొత్తం అనుభవం అనుమానాలతో మలినమైంది.) సారస్వతాన్ని రచయిత యెక్కణ్ణించో యేరుకు తెచ్చుకున్న జల్లెడతో వడగడుతున్నాడని తెలుస్తోంది. కానీ ఆ జల్లెడ యెంపిక చేసుకోవటాన్ని జస్టిఫై చేసే సొంత కన్విక్షన్ యెక్కడా కానరాదు. ఆ కన్విక్షన్ కూడా అరువు తెచ్చుకున్న బాపతే అనిపించింది. రచయిత కొందరిపై ఆరోపించిన శుష్కపాండిత్యమే దీన్నిండా కూడాను. పుస్తకం మొత్తంలో యెక్కడైనా పాజిటివ్ ఎనర్జీ వుందంటే అది వేరే రచయితల నుండి తెచ్చి చేసిన అనువాదాల్లోనే — ఉదాహరణగా బోర్హెస్ వుపన్యాసానికి చేసిన అనువాదాన్ని తీసుకోవచ్చు. ఈ అనువాదం కూడా మూలంలోంచి తనకు నచ్చిన ముక్కల్ని యేరి తెచ్చి చేసినదే తప్ప పూర్తి అనువాదం కాదు. ఈ ముక్కలైనా బోర్హెస్‌ని వ్యక్తీకరించడాని కన్నా యెక్కువగా, రచయిత యెజెండాకు తగ్గట్టు ఆయన యెక్కడ కనపడ్డాడో ఆయా అంశాల్ని మాత్రమే వ్యక్తీకరించడం కనిపిస్తుంది. చాలా విలువైన విషయాల్ని వదిలేసి చేసిన యిలాంటి శకలాల అనువాదానికి కారణం బహుశా స్థలాభావం అనుకుంటే, మిగతా చెత్తంతా (నెగెటివ్ ఎనర్జీ అంతా) తీసేసి, కేవలం యిలాంటి అనువాదాలతో మొత్తాన్ని నింపినా పుస్తకం విలువ బోలెడంత పెరిగేదే.
పద్యగద్య విభజనలూ, కాంక్రీటు ఎక్సెప్రెషన్లూ అంటూ చాలాచోట్ల రచయిత cutting his “soul according to the fashions” of literary tradition కనిపిస్తుంది. You even doubt if there’s any soul left after all this self-abuse. ఈమాటలోకి వెళ్ళి యీ రచయిత కథలు కొన్ని చదివాకా వాటిలో నీరసంతో యీ సంగతి రూఢిగా తేలింది.
పుస్తకంపై ఒక్క ముక్కలో తీర్మానించమంటే: బోలెడు కాగిత నష్టం అంటాను.
అదృష్టవశాత్తూ, అరువు తెచ్చుకున్నది కనుక, నా వరకూ సమయనష్టం తప్ప మరోటి లేదు.
Purnima
Read a book called “The Men who killed Gandhi.” WHAT A BOOK! Though the title gives the lead that the book is about how the peace-lover Gandhi was assassinated, it has a lot more to it. At least, I had lot many more questions or disappointments not pertaining to just Gandhi or Godse. Though a historical account, it reads like a thriller and is a page-turner.
A line from this book: Every truth has many sides. And I’m glad to have known some more sides of not just Gandhi’s assassination, but of India’s independence and it’s leaders and it’s people!
సౌమ్య
గత నాలుగైదు రోజుల్లో చదివిన రెండు పుస్తకాలు:
౧) పునరాగమనం – స్వాతి శ్రీపాద నవల (కినిగే లంకె ఇక్కడ.):
-కథా వస్తువు చాలా బాగుంది. కథనం అంత గొప్పగా అనిపించలేదు కానీ, మధ్యలో ఆపేసెంత దారుణంగా కూడా లేదు. నవీన్ గారి ముందుమాట మాత్రం పేలవంగా ఉంది. పుస్తకంలో అచ్చుతప్పులూ అవీ ఎక్కువే.
౨) బైబిల్ కథలు – ఎమ్బీయస్ ప్రసాద్ : “ఓల్డ్ టేస్తేమేంట్” ను మామూలు భాషలో, క్లుప్తంగా కొన్ని వ్యాసాల్లో పరిచయం చేస్తారు. ప్రసాద్ గారి వ్యాసాలు మామూలుగానే తేలికగా అర్థం అవుతాయి…అలాగే ఈ పుస్తకం కూడా. ఇది చదివితే ఆ గ్రంథం గురించి, అందులోని కథల గురించి ఒక ప్రాథమిక అవగాహన వస్తుంది. దీని కినిగే లంకె ఇక్కడ.
లలిత (తెలుగు4కిడ్స్)
నేను ఇప్పుడు చదువుతున్న తెలుగు పుస్తకాలన్నీ కినిగే.కాం లో కొన్నవే. ఈ మూడు పుస్తకాలూ ప్రింటులో చదివితే బావుంటాయనిపిస్తోంది కూడా. “గోరాతో నా జీవితం” చదవడం మొదలు పెట్టాను. నిజంగానే సౌమ్య చెప్పినట్టు చదవాలి అనిపించేలా ఉంది. పూర్ణిమ సమీక్ష చూసి తను ఇచ్చిన లింకుని పట్టుకుని “Performing Without a Stage” చదువుతున్నాను. ఆ సమీక్ష చదువుతూ గుర్తు చేసుకున్న బూదరాజు రాధాకృష్ణ గారి “అనువాద పాఠాలు” కూడా చదువుతున్నాను. ఇంకా బూదరాజు రాధాకృష్ణ గారిదే “తెలుగు సంగతులు” కూడా చదువుతున్నాను. ఇలా ఇన్ని పుస్తకాలు వరస పెట్టి చదవడం ఇదే మొదటి సారి అనుకుంటాను. ఒక పుస్తకమే ఎంతో సమయం తీసుకుని చదువుతాను. ఇప్పుడు ఇవి ఎలా చదువుతానో చూడాలి. అన్నీ పూర్తిగా చదవాలి, త్వరగా చదవాలి, మళ్ళీ మళ్ళీ చదవాలి అనిపించేలా ఉన్నాయి.
సౌమ్య
తెలుగుసంగతులు – నేనూ డిసెంబర్ లో కొన్ని వ్యాసాలు చదివి ఆపాను. ఇప్పుడు మీరు చెప్పడంతో చదవాలి అనిపిస్తోంది.
మీ చదువులు బాగున్నాయి. మరి చదివాక ఏం చేయాలీ? 😉
Purnima
ఈ మధ్య చదువు బండి బొత్తిగా సాగటం లేదు. నిన్ననే అనుకోకుండా ఒక పుస్తకం గురించి తెల్సింది. అది కూడా goodreads.com వాడి రికమెండేషన్స్ లో. పుస్తకం పేరు: Alone Together. ఏదో డార్క్ రొమాంటిక్ నవల పేరులా ఉంది కదూ?! కానీ ఇది మనుషులమైన మన ఆలోచనల్ని వ్యక్తిత్వాలనీ మాట్లాడే రొబోలు, సోషల్ నెటవర్కింగ్లూ ఎలా మార్చేస్తున్నాయి అన్న అంశంతో ఒక పరిశోధకురాలు రాసిన పుస్తకం. సగం వరకూ చదివాను. బాగా నచ్చుతోంది. నవలకు ఏ మాత్రం తీసిపోకుండా సాగుతోంది కథనం.
సౌమ్య
హమ్మయ్యా! ఊపిరి కాస్త ఆడ్డం మొదలుపెట్టింది ఈ పేజీ మళ్ళీ చూశాక!!
ఇక్కడ రాయడం మానేశాక నేను చదవడం కూడా పడిపోయింది 😛
ప్రస్తుతానికి గోరాశాస్త్రి నాటకం – “ఆనంద నిలయం” చదువుతున్నాను. భలే ఉంది. ఇవ్వాళే శ్రీపాద వారి ఆత్మకథ మా యూనివర్సిటీ లైబ్రరీలో దొరకబుచ్చుకున్నా…చదువుతా భవిష్యత్తులో! 🙂
సౌమ్య
కౌముది పత్రిక చూస్తూ ఉంటే వాళ్ళ లైబ్రరీ లో కొమ్మూరి సాంబశివరావు నవల “చావు తప్పితే చాలు” కనిపించింది. అది తెలుగులో తొలి హారర్ ఫిక్షన్ నవల అని రాసి ఉంది మొదటి పేజీలో. దానితో కుతూహలం కొద్దీ చదివాను. అంతా లాజికల్ గా ఉందా? లేదా? వంటి విషయాలు పక్కన పెడితే, కాలక్షేపానికి చదువుకునేందుకు బాగుంది. ఒంటరిగా ఉన్నప్పుడు చదివితే భయపడే అవకాశాలు కూడా ఉన్నాయి. 🙂
Chowdary Jampala
@Purnima:
Even as I was writing my note, I was afraid you would say so 🙂
Purnima
I know there’s a Telugu translation. But now that I got a hint of his Hindi, I don’t think I would enjoy anything else. 🙂
సౌమ్య
AVKF link for the Translation:
http://www.avkf.org/BookLink/display_titled_book.php?book_id=1995
జంపాల చౌదరి
హరివంశ్‌రాయ్ (హర్బన్స్‌రాయ్?) బచ్చన్ ఆత్మకథను యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తెలుగులోకి అనువాదం చేశారు. ఒక దశాబ్దం క్రితం ఆంధ్రప్రభ వారపత్రికలో సీరియల్‌గా వచ్చినట్లు గుర్తు. తర్వాత పుస్తకంగా కూడా వచ్చింది.
Purnima
Twitterature అని ఒక చిట్టి పుస్తకం చదువుతున్నాను. ప్రసిద్ధికెక్కిన కొన్ని ఆంగ్ల క్లాసిక్స్ ను ప్రస్తుత సోషల్ నెట్‍వర్కింగ్ విప్లవం అయిన ’ట్విట్టర్’ పరిభాషలో చెప్తే ఎలా ఉంటుందనే ప్రయోగాత్మకమైన పుస్తకం. చాన్నాళ్ల బట్టీ చూస్తున్నా వదిలేసాను గానీ లాండ్‍మార్క్ సేల్‍లో వందకే వస్తుంటే పట్టుకొచ్చుకున్నాను.
భలే ఉందిలే పుస్తకం. విపరీతంగా నవ్విస్తోంది. నేను చదివిన పుస్తకాలు కొన్ని ఉన్నాయని తీసుకున్నాను గానీ, అసలు నేను చదవని పుస్తకాల ట్వీట్స్ కూడా నచ్చేస్తున్నాయి. ఆయా కథల్లో పాత్రలకు ఒక ట్విటర్ అకౌంట్ ఉండి, కీలక సందర్భాల్లో ఏం ట్వీట్ చేస్తారనేది ఆసక్తికరంగా కొనసాగుతుంది. కాకపోతే ’అమెరికంపు’ భాష దండిగా ఉంది. పుస్తకాల పై అభిరుచే కాక, అసభ్య భాషనూ ఒక మోతాదు దాకా భరించగలవారైతే తప్పక ప్రయత్నించండి. FUN! ఇంకో మాట.. ఆ క్లాసిక్స్ కు మీకూ గాఢానుబంధం ఉండి, దాన్ని వెకిలితనానికి, హాస్యాస్పదానికి దూరంగా ఉంచుకునేవారైతే, పుస్తకం కోపం తెప్పించచ్చు.
హరివంశ్‍రాయ్ బచ్చన్ ’మధుశాల’ చదువుతున్నాను. ఇంతకు ముందు ఒక పిడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని చదివేశాను(అని అనుకున్నాను.) మొన్న పుస్తకం తెచ్చుకున్నాను. ఎంతైనా పుస్తకం పుస్తకమే! ఇందులో పేజీకో పద్యం ఉంటుంది. దాని వల్ల ఆ ఒక్క పద్యమే దృష్టిలో ఉండి, దానిలో లోలోతులకు వెళ్ళే అవకాశం ఉంది. పుస్తకంలో బచ్చన్ కుటుంబం అరుదైన ఫోటోలు కాకుండా, అమితాబ్ అభిప్రాయం కాకుండా, హరివంశ్ గారు రాసిన పరిచయ వ్యాసం ఉంది. ఏముంది? ఏముంది? కవులు ప్రోజ్ రాస్తే నాకిందుకే మురిపెంగా కోపం వచ్చేస్తుంది. గుక్క తిప్పుకోనివ్వని ప్రోజ్.. వావ్! పైగా ఆ హిందీ నాకు బాగానే అర్థం అయ్యింది, ఎక్కువ సమస్యలు రాలేదు. For a moment, I was tempted to pick his autobio.. but then, I know my Hindi! Sigh!