పుస్తకం
All about booksవార్తలు

October 5, 2010

ఈ నెల ఫోకస్: Read it again, Sam!

కన్నుల్లో ఆనందం డిస్కో చేస్తున్న వేళ, కరుడుగట్టిన కన్నీళ్లు గుండెను బరువేక్కిస్తున్న వేళ, సమూహంలో కూడా ఏకాంతం అనుభవంలోకి వచ్చిన క్షణాల్లో, ఏకాంతమే అయినా ఆ సాంగత్యం కావాలనుకే క్షణాల్లో.. ఇదీ అని కచ్చితంగా చెప్పలేని భావాలు పరిచయమవుతునప్పుడు.. తడబడి లేచినప్పుడు, పొరపడి చేసిన తప్పు తెల్సివచ్చినప్పుడు.. ఇలా ఏ సందర్భంలోనైనా అరలో ఉన్న పుస్తకాలన్నింట్లో మీ వెళ్ళు ఒక పుస్తకాన్ని ఎన్నుకుంటాయా?

ఆవురావురుమంటూ మొదటి పేజీ నుండి, చివర దాకా, ఎన్ని సార్లైనా చదివే పుస్తకమో? మజ్జిగన్నం తిన్నాక, మాగాయి ముక్క చప్పరిస్తున్నట్టు చదివే పుస్తకమో? పాకెట్ లో చాక్లెట్ లాగా మీతో ఉండే పుస్తకమో? అర్థాకలి తో పడుకున్నాక, అర్థ రాత్రి లేచి చిరు తిండి కోసం వెతుకునే పుస్తకమో?

“రీడ్ ఇట్ అగైన్, సాం!” అని మీ మనసు మిమల్ని మాటి మాటికీ అడిగే పుస్తకాన్ని ఇక్కడ పరిచయం చెయ్యండి. సమీక్షలు అంటూ బిగుసుకుపోకుండా*.. మీ మనసుకు, మీ మాటలు అరువిచ్చి .. ఇక్కడ పంచుకోండి!

ఎదురుచూస్తూ ఉంటాం..

పుస్తకం.నెట్

* సమీక్షలు, పరిచయాలా తో పాటు, కేవలం కథ పై నో, రచనా సంవిధానం పై నో, లేక.. మీకు నచ్చిన వాక్యాల పై నో.. ఇలా మీకు ఏది నచ్చితే, దాని పై నే దృష్టి పెట్టి, వ్యాసాలను రాయవచ్చును.. పూర్తిగా పుస్తకం గురించి కాకుండా.About the Author(s)

పుస్తకం.నెట్7 Comments


 1. ఇంతకీ నేను ఒరిజినల్గా రాసిన టపాలో నా మాయదుప్పట్లేంటో చెప్పనే లేదుగదూ. ఇప్పటికి అందుబాట్లో ఉన్నవివి:
  అడవిబాపిరాజు నారాయణరావు
  శ్రీపాద కథలు అన్నీనూ
  కొకు – ప్రేమించిన మనిషి పెద్ద కథ (చిన్న నవల)
  శ్రీశ్రీ మహాప్రస్థానం
  తిలక్ అమృతం కురిసిన రాత్రి


 2. gaddeswarup

  I have not read many Telugu books but there are a few I keep rereading: Gurajada (all), Tallapaka Annamacharyulu, Rallapalli Ananathakrishna Sharma (many), Arudra (mainly cinema songs and vyasalu), Kotavatiganti Kutuma Rao (mainly science writings), P.V. Parabrahma Sastry, Gopichand (a couple of novels), Gorati Venkanna songs. These are what I can immediately recall but there may be a few more.


 3. @kalhara:
  “శ్రీ శ్రీ ఖడ్గసృష్టి – కత్తిలాంటి కవితల్తో ఎన్నిసార్లైనా గొంతు కోసుకోవాలనిపిస్తుంది.” – brilliant!!


 4. ‘అమృతం కురిసిన రాత్రీ -మళ్ళీచదివేప్పుడు కొత్తగా ఆస్వాదించడం కోసం పనిగట్టుకుని మర్చిపోయే పుస్తకం

  ‘గీతాంజలి – కవిత్వమూ, వేదాంతమూ, ప్రేమా, భక్తీ… ఈ పుస్తకాన్ని లెక్ఖలేనన్ని సార్లు చదవటానికి ఇంతకన్నా కారణాలవసర్లేదు.

  ‘కన్యాశుల్కం’ ఏ తెలుగు పండగొచ్చినా తెరవబుద్ధేసే పుస్తకం

  శ్రీ శ్రీ ఖడ్గసృష్టి – కత్తిలాంటి కవితల్తో ఎన్నిసార్లైనా గొంతు కోసుకోవాలనిపిస్తుంది.

  శ్రీరమణగారి “మిధునం” కథొకటి

  and so on..


 5. చక్కటి విషయం. మళ్ళీ వస్తాను.


 6. My List
  1. Any Madhubabu book of Shadow
  2. An autobiography of a Yogi
  3. Annamayya songs
  4. Tyagaraju keertanalu
  5. pOthana Bhaagavatam
  6. geetaaMjali


 7. good show. I hope you get a lot of responses 🙂  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

నేనూ-నా పుస్తకాలూ అను ఫోకస్

చాన్నాళ్ళయ్యిందిగా ఫోకస్ పెట్టుకొని, అందుకని మాట. ఈ నెల ఫోకస్ “నేనూ-నా పుస్తకాలూ!”...
by పుస్తకం.నెట్
6

 
 

ఈనెల ఫోకస్ వృత్తి పరంగా మీకు నచ్చిన పుస్తకాలు

నమస్కారం! ఈ నెల ఫోకస్: వివిధ వృత్తులకు సంబంధించిన సాంకేతిక పుస్తకాలు. పుస్తకం.నెట్ మొ...
by పుస్తకం.నెట్
1

 
 

ఫోకస్ : పద్య సాహిత్యం

పుస్తకం.నెట్ లో ఈ నెల ఫోకస్ ” తెలుగు పద్య సాహిత్యం” . ఈ ఫోకస్ లో –  పద్య సాహిత్య ప్ర...
by పుస్తకం.నెట్
0

 

 
ఈ నెల ఫోకస్: బాల సాహిత్యం

ఈ నెల ఫోకస్: బాల సాహిత్యం

Telugu4kids లలితగారి సూచన మేరకు ఈ నెల ఫోకస్‍గా అన్ని భాషలకు చెందిన “బాల సాహిత్యాన్ని” ఎన...
by పుస్తకం.నెట్
3

 
 

ఈ నెల ఫోకస్: 2009లో పుస్తకాలతో మీరు

ఓ ఏడాది వెళ్లిపోయి మరో ఏడాదిని స్వాగతిస్తున్న తరుణంలో వద్దనకున్నా వెనక్కి తిరిగి చ...
by పుస్తకం.నెట్
1

 
 

ఈ నెల ఫోకస్: తెలుగు కవిత్వం

గత నెల “తెలుగు కవిత్వం” ఫోకస్‍ను ఈ నెల కూడా కొనసాగిస్తున్నాం. ఈ అంశం పై మీ వ్యాసాల...
by పుస్తకం.నెట్
1